శ్రీ‌నాథుని కావ్యాల్లో కాశీఖండం, భీమేశ్వర పురాణం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు శివభక్తి పారమ్యాలు. ‘శివరాత్రి మాహాత్మ్యం’ కావ్యాన్ని పరిశీలించటమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం.

శ్రీ‌నాథుడు వార్థక్య దశలో క్రీ.శ.1440 ప్రాంతంలో ఈ కావ్యాన్ని రచించాడు. దీనికి ‘సుకుమార చరిత్ర’ అనే నామాంతరం ఉంది. అవసాన దశలో శ్రీశైలంసందర్శించిన శ్రీనాథుడు ఈ కావ్యాన్ని అక్కడి శాంత భిక్షావృత్తి మఠాధిపతికి మూలభృత్యుడైన ‘ముమ్మడి శాంతయ్య’కు అంకితమిచ్చాడు.
శివరాత్రి మాహాత్మ్యం కావ్యానికి మూలం స్కాంద పురాణాంతర్గ•తమైన ఈశాన సంహిత మూలంలో 326 అనుష్టుప్పుల్లో మూడు అధ్యాయాల్లో ఉన్న ఈ కథను శ్రీనాథుడు అయిదు ఆశ్వాసాల ప్రబంధంగా రచించాడు. ఈ కథను మొదట బ్రహ్మ, విష్ణులకు శివుడే చెప్పాడు. కాని దాన్ని అన్ని పురాణాల మాదిరిగా సూతుడే నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పినట్లు మార్చాడు.
ఈ కథలో నాయకుడు ‘సుకుమారుడు’ అనే బ్రాహ్మణ యువకుడు. అతడు పరమ భ్రష్టుడై కన్నకూతురితో కూడా కామకలాపాలు సాగించిన దుర్మార్గుడు. అయినా శివరాత్రి రోజున శివదర్శనంతో శివలోకం చేరుకున్నాడు. శ్రీనాథుడే రచించిన కాశీఖండంలో గుణనిధి కథ కూడా ఇటువంటిదే.
ఈ కావ్యంలోని మొదటి ఆశ్వాసం ప్రధాన ఇతివృత్తం కథా కథనానికి ప్రస్తావనాప్రాయంగా ఉంది. అయిదో ఆశ్వాసంలో శివరాత్రి మాహాత్మ్యం, శివభక్తుల లక్షణాలను వివరించాడు.
ప్రత్యేకించి రెండో అశ్వాసంలో 15,17,96,97,98 పద్యాలకు మూలాలు కాదంబరిలో ఉన్నాయి. వర్ణనలను కూడా కాదంబరి నుంచి గ్రహించాడు.
ఈ కావ్యంలో శ్రీనాథుడు భట్టబాణుని కాదంబరిలోని రసవత్తరమైన భాగాలు పెక్కింటిని స్వీకరించాడు. అందుకే పూర్వకవిస్తుతిలో శ్రీనాథుడు మొదట ‘బాణునద్భుత శాస్త్ర బహుకళాపారీణు’ అని ప్రశంసించాడు.
శృంగార నైషధంలోని కొన్ని వర్ణనలను రసవత్తరంగా విస్తరించి రాశాడు. అందులోని…
‘‘వాని కలలోన కానని వనజ,
ముఖియు, వాని నూర్పున పేర్కొని మానవతయు,
వానినాత్మ భావించి వరుని గరయనప్పళంపనిసతయున్‌
‌లేదయ్యెనచట’’ (శృ.నైషధం 1-62)
అనే పద్యాన్ని రసవత్తరంగా విస్తరించి రాశాడు.
‘‘హృదయమువ్విళ్లూరనేకాంతమున నుండి వాని
చింతింపని వనజముఖియు / నొకమారతని చూచి
యెండొక్క మరి చూడనభిలషింపని
విద్రుమాదరయును / కలలోనవాని జక్కగ కౌగిటను
జేర్చి ముకుళితేక్షణనానిముద్దియయాను
నతని రూపంబు కుడ్యముల యుందు లిఖింప
యందంబు జూడని యంగనయును / చెలుల చేతను
బ్రోది రాచిలుక చేత వాని గుణంబు విని
కుచద్వంద్వ సీమ జాద కొన పులకింపని పైదలయును
పన్నిదము వేసినను లేదు పట్టణమున’
అతని రూపురేఖావిలాసాలను చక్కగా వర్ణించాడు.
కాశీఖండం గుణనిధి కథలోని పద్యాన్ని ఎట్టి మార్పు లేకుండా శివరాత్రి మాహాత్మ్యంలో యథాతథంగా స్వీకరించాడు.
‘‘అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలోఁ
బెరుగును వంటకంబు వడ పిండియలుం గుడువబెట్టని
ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే
హరహర! యెవ్వరింక కడు పారగ బెట్టెదరీప్సితాన్నముల్‌!! (‌శివరాత్రి మాహాత్మ్యం 3-19)
కన్నతల్లి ప్రాణ సమానంగా అభిమానించి సూర్యోదయానికే తనకు ఇష్టమైన వంటకాలతో పెరుగు అన్నం తినిపించేది. ఇప్పుడు తన ఆకలి తీర్చేవారెవరు? అని ఆవేదనతో అలమటించాడు.
శివరాత్రి రోజున శివాలయంలో నైవేద్యాన్ని అపహరించేందుకు వెళ్లి దీపపు వెలుగులో అభిషేకితమైన శివలింగాన్ని దర్శించాడు. అతడు ఆలయంలో దొంగతనానికి వచ్చాడని కొట్టి చంపారు. అతడి మరణానంతరం అతడి కోసం యమభటులు, శివభటులు వచ్చారు. ఇటువంటి దుర్మార్గుడి కోసం మీరు రావటం సరైది కాదని యమ భటులు శివభటులతో వాదించారు.
అతడెంత దుర్మార్గుడైనా శివరాత్రి రోజున అభిషేకించిన శివలింగాన్ని దర్శించినందున ‘పుణ్యాలోకప్రాప్తికి అర్హుడ’ని చెప్పారు. శివుడు భక్తసులభుడని, భక్తులను కరుణించి ‘సులువుగా వరాలిచ్చే దైవమని’ చెప్పటమే ఈ కథ ఉద్దేశ్యం.

డా।।పి.వి.సుబ్బారావు
9849177594,
విశ్రాంత అధ్యాపకుడు

About Author

By editor

Twitter
YOUTUBE