హిందూ ఐక్యతామంత్రంలోని ప్రచండ శక్తిని
ప్రపంచానికి తిరుగులేకుండా చాటుకున్నాం!
నీవు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందన్న
స్మృతివాక్యాన్ని నమ్ముకుంటూ నడిచాం!
ఇది నా మాతృభూమి అన్న పవిత్రభావనను గుడిలో దీపం వలె
ప్రతి భారతీయుడి గుండెలోను నిలిపాం!
దేశభక్తి ప్రపూరితులైన సాటి భారతీయులతో కలసి
జన్మభూమిలో ఆవిష్కృతమైన విజయాలలో భాగస్వాముల మయ్యాం!
సేవా తత్పరతతో, ధర్మ స్థాపన, దేశ రక్షణా ధ్యేయాలతో
శత వసంతాల ప్రస్థానాన్ని చరిత్రాత్మకం చేసుకున్నాం!
ఆత్మ విస్మృతి నుంచి విముక్తమవుతూ మనదైన చరిత్రకు, వారసత్వ సంపదకు, సాంస్కృతిక వైభవానికి, మట్టి వాసన వేసే విలువలకు చేరువవుతున్నాం!
సంఘం వందేళ్ల పాటు అప్రతిహతంగా సాగడానికి తమ జీవితాలనే అంకితం చేసి శక్తిని కూర్చిన నిన్నటి తరం వారందరికీ అంజలి ఘటిద్దాం!
విశ్వగురు స్థానంలో భారత్‌ను నిలపాలన్న అకుంఠిత దీక్షకు పునరంకితమవుతున్న సంఘ శతాబ్ది వేళ…లక్షలాది మంది స్వయంసేవకులకూ, యావన్మంది హిందూ బంధువులకూ, భూగోళమంతటా ఉన్న భారతీయ సోదరసోదరీమణులకూ జాగృతి శుభాభినందనలు.
సంఘ పోరాటాలు, విజయాలు, అనుభవాలు, చారిత్రక సన్నివేశాలు, ఈ దీపావళి ప్రత్యేక సంచికలోను, ఆపై ఏడాది పాటు సాధారణ సంచికల ద్వారాను తెలుసుకుందాం.
భారత్‌మాతాకీ జై!