సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులే  మీపట్ల కఠినంగా వ్యవహరిస్తార ్నఆలోచనలు . స్థిరంగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. కళాకారులు, రచయితలకు కొంత నిరుత్సాహం. 24,25తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చర్చలు సఫలమవుతాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. రియల్టర్లకు అనుకూల సమయం. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది.  పారిశ్రామిక, రాజకీయవర్గాలు, కళాకారులకు మరింత అనుకూల వాతావరణం. ్న తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, ఇంటికొనుగోలు యత్నాలు సానుకూలం. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కృషి ఫలిస్తుంది.  21,22తేదీల్లో అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

చిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని ఖర్చులు అదుపు చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు కొంత తీరతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారుల విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్లు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊహించని అభివృద్ధి ఉంటుంది. 23,24 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు అనుకూలించగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. మీఖ్యాతి మరింత పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు,రచయితలు మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తారు. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

వీరికి అన్నింటా విజయాలే. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరపతి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి.  22,23తేదీల్లో దుబారా ఖర్చులు. దూరప్రయాణాలు.

తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగి ఊరట చెందుతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు పురస్కారాలు. 21,22 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మొదట్లో ఏర్పడిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొని మీ సేవానిరతిని చాటుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి, మంచి పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కాలభైరావష్టకం పఠించండి.

ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. రియల్టర్లకు సంతోషకరమైన సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గతానుభవాల రీత్యా నిర్ణయాలలోఆచితూచి వ్యవహరిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవేత్తలు, రచయితలు, పరిశోధకులకు విదేశీ  పర్యటనలు.   26,27తేదీల్లో బంధువిరోధాలు. స్వల్ప అస్వస్థత.  దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో  పురోగతి కనిపిస్తుంది.అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం.వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రచయితలు, కళాకారులకు సన్మానాలు, అవార్డులు రాగలవు.  22,23తేదీల్లో వివాదాలు. ఆరోగ్య సమస్యలు.  శివాష్టకం పఠించండి

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో  వివాదాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు సంతోషకరమైన సమాచారం.  తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు.22,23 వృథా ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

.మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పట్టింది బంగారమే.25,26 తేదీల్లో వృథా ఖర్చులు, అనుకోని ప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి..

 

About Author

By editor

Twitter
YOUTUBE