పూర్వం ధౌమ్యుడు అనే ఒక మహర్షి గురుకు లాన్ని ఏర్పాటు చేసుకొని, తన వద్దకు వచ్చిన అనేక మందిని శాస్త్ర పారంగతులను చేసి పంపేవాడు. అలా ఆ గురుకులంలో ఉన్న శిష్యులలో ఉపమన్యుడు అనే శిష్యుడు ఒకడు. ఉపమన్యునకు గురు సంపద కాపాడే పని అప్పగించారు గురుకులంలో. ఆ రోజు లలో సంపద అంటే గోసంపద మాత్రమే. విద్యార్థు లలో సోమరితనం పోయి శ్రమానుభవం పొందడం కోసం, చురుకుగా ఉండటం కోసం కాలానుగు ణంగా పనులు చేయిస్తుండేవారు. అలాగే సామాజిక బాధ్యత పెరగడానికి, సమాజం పట్ల కృతజ్ఞతాభావం పెంపొందడానికి భిక్షాటన ద్వారా జీవించాలనే నియమం గురుకులాలలో ఉండేది. ఉపమన్యుడు ఆ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు గురువుకు నమస్కరించి ఆశీస్సులు పొందుతుండేవాడు. ఒకరోజు అలా నమస్కరిస్తున్న ఉపమన్యుని పరీక్షగా చూసిన గురువు శిష్యుడు ధృఢకాయుడవటం గమనించాడు. వెంటనే ఉపమన్యూ! నీవు ఏ ఆహారం తీసుకుంటున్నావు? అనడిగాడు. భిక్షా పదార్థాన్ని మాత్రమే భుజిస్తున్నానని చెప్పాడు. ఓహో! అలాగా! నీకు వచ్చిన భిక్షాన్నమును పూర్తిగా గురువుకు సమర్పించి తర్వాత గురువు అనుమతించిన భాగాన్ని మాత్రమే ఆరగించు అని ఆదేశించాడు. ఉపమన్యుడు స్వీకరించాడు.

రోజలు గడుస్తున్నా ఉపమన్యుడు అలాగే ధృఢంగా ఉన్నాడు. గురువు పిలిచి ఏం భుజిస్తున్నావు అనడిగాడు. అప్పుడతడు మీరు పెట్టిన ఆహారం సరిపోవడం లేదు. మళ్లీ భిక్షాటన వెళ్లి ఆహారం తెచ్చు కొని భుజిస్తున్నానని చెప్పాడు. అలా అన్నిసార్లు భిక్షకు వెళ్లడం వల్ల గృహస్థులకు అసౌకర్యాన్ని కలిగించిన వాళ్లమవుతాము అంటూ రెండోపారి భిక్షాటన నిషే ధించాడు. సంతోషంగా స్వీకరించాడు ఉపమన్యుడు.

మళ్లీ రోజులు గడుస్తున్నాయి. నియమాన్ని పాటి స్తున్నా ఉపమన్యుడలాగే బలిష్ఠుడుగా ఉంటున్నాడు. ధౌమ్యులవారు చెంతకు పిలిచి ఆహారంగా ఏ పదా ర్థాలు తీసుకుంటున్నావు? అని అడిగారు. సత్యవచను డైన ఉపమన్యుడు గురువర్యా! పశువులను మేపేట ప్పుడు మధ్యాహ్న సమయంలో ఆవుపాలను తీసి తాగుతున్నానని చెప్పాడు. అప్పుడు గురువు శిష్యా! మధ్యాహ్న సమయంలో ఆవు పాలు పితకడం ధర్మం కాదు దాని వలన ఆవుదూడలకు, ఆశ్రమంలో జరిగే పూజలకు కావలసినన్ని పాలు లభించవు. కాబట్టి అలా పాలుతాగడం మానేసెయ్యి అని చెప్పాడు. చిత్తమని అంగీకరించాడు శిష్యుడు. అలాగే రోజులు గడిచాయి. శిష్యుని దారుఢ్యంలో మార్పు లేదు. రహస్యమేమిటని అడిగాడు ధౌమ్యుడు. దూడలు పాలు తాగు తున్నప్పుడు, పాలు పితుకుతున్న ప్పుడు సమీపానికి వెళ్లి కూర్చుం టున్నాను. గాలివాటున వస్తున్న పాల బిందువులను, నురగను తాగుతున్నానని వినయపూర్వ కంగా చెప్పాడు. అప్పుడు ధౌమ్యుడు శిష్యా! గాలిలోనూ, భూమిమీద కూడా కంటికి కని పించని అనేక జీవరాసులుం టాయి. అవి వాటికాహారం. నీవు ఆ విధంగా చేయడం వలన వాటికి అన్యాయం చేసిన వాడ వవుతావు. కాబట్టి వాటిని కూడా తాగవద్దని చెప్పాడు. గుర్వాజ్ఞను మనఃపూర్వకంగా అంగీకరించాడు ఉపమన్యుడు.

అలా ఉపమన్యుడు ఆహారం తీసుకోవడంలో అడుగడుగునా అనేక నియమాలు, నిషేధాలు అడ్డు తగిలాయి. అయితే అతడు మాత్రం ఆకలి బాధకు తట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు ఆకలితో నకనక లాడుతున్న ఉపమన్యుడు నీరస పడిపోయాడు. లేవడానికి కూడా ఓపిక లేదు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయే స్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో

ఆ అడవిలో తన చేతికి అందిన చెట్ల ఆకులు భక్షించాడు. అవి దళసరిగా ఉన్నాయి. పాలు చిమ్ము తున్నాయి. అవి చేదుగా, వగరుగా ఉన్నాయి. ఆకలి రుచి యెరుగదంటారు గదా! అవి తిన్న కొంతసేపటికి ఉపమన్యుడికి కంటిచూపు పూర్తిగా క్షీణించింది. చాలా ఆందోళన చెందాడు ఉపమన్యుడు.

ఆకలి బాధతో ఏమేమో తినేశాను, ఎంతటి ప్రమాదం తెచ్చుకున్నానో అని బాధపడ్డాడు. అలా కలవరపాటుతో చేతులతో, కాళ్లతో తడుముకుంటూ వెళుతూ అక్కడున్న ఒక పాడుపడిన బావిలో పడ్డాడు. అందులో నీళ్లు లేవు. శరీరమంతా దెబ్బలు తగిలి గాయాలై, రక్తం కారుతోంది. మరోవైపు కంటిచూపు లేదు. అటువంటి పరిస్థితుల్లో గురువు గారూ!

గురువు గారూ! అంటూ గురుస్మరణం చేయడం మొదలుపెట్టాడు.

అక్కడ ఆశ్రమంలో కూడా ప్రతి రోజు సాయంత్రం గురువుకు నమస్కరించి వెళ్లే ఉప మన్యుడు రాకపోయేసరికి గురువైన ధౌమ్యులవారు చింతించడం మొదలుపెట్టాడు. శిష్యవాత్సల్యం పొంగి పొరలింది. మనస్సు కీడును శంకించింది. వెంటనే శిష్యునికోసం అడవికి బయలుదేరిన గురువు ధౌమ్యుడు ఉపమన్యూ! అంటూ కేకలు పెడుతు న్నాడు. నూతిలో పడివున్న ఉపమన్యుడు కూడా బదులు పలికాడు. ఆ కేకను విని ఉపమన్యుని దగ్గరకు వచ్చాడు ధౌమ్యుడు. వెంటనే ఉపమన్యుడు జరిగిన విషయమంతా చెప్పాడు. ధౌమ్యుడు జరిగిన దానికి బాధపడుతూ, శిష్యుని నియమపాలనను లోలోన మెచ్చుకుంటూ శిష్యునికి కలిగిన కష్టాన్ని తొలగించడం కోసం శిష్యవాత్సల్యంతో ఉపమన్యుడికి అశ్వినీ దేవతలను స్తుతించే సూక్తులను ఉపదేశిం చాడు. అశ్వినులను గురూపదేశాన్ని శిరసావహించి స్తోత్రం చేశాడు. అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై ఒక అపురూప పదార్థం ఇచ్చి దీనిని భక్షిస్తే నీకు దృష్టి కలుగుతుందని చెప్పారు. అప్పుడు ఉపమన్యుడు గుర్వాజ్ఞ లేనిదే భక్షించనని చెప్పాడు. అయినా అశ్వినీ దేవతలు గతంలో నీ గురువునకట్టి సంకటమే వచ్చి నప్పుడు అతడు ఇలాగే దాని నుండి విముక్తుడైనాడు. అప్పుడతను గురువు అనుమతి తీసుకోకుండానే తిన్నాడు. నీకు ఏదోషం కలగదు. కాబట్టి నీవు భక్షించ వచ్చు అని చెప్పారు. ఏమైనప్పటికి గురువు అనుమతి లేనిదే భక్షించనని నిష్కర్షగా చెప్పాడు ఉపమన్యుడు.

ఉపమన్యుని అచంచలమైన గురుభక్తిని మెచ్చు కొని, అశ్వినీ దేవతలు దృష్టిని ప్రసాదించారు. ఉపమన్యుడు నూతి నుండి బయటకు వచ్చి గురువు నకు నమస్కరించారు. ధౌమ్యుల వారు ఉపమన్యుని గురుభక్తిని, నియమపాలనను మెచ్చుకొని అతడు కోరకుండానే వేద విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఉపమన్యుడికి జీవితంలో ఎన్ని కష్టాలు సంభవించినా అసత్యం పలకలేదు. గురు భక్తిని విడువలేదు. అశ్వినీదేవతలు ఎన్ని ఆశలు చూపినా ప్రలోభపడలేదు.

About Author

By editor

Twitter
Instagram