వాటి గురించి ఎవరికి వారు తలుచుకోవడం కాదు, మొత్తం తెలుగువారికి కూడా తెలిసేటట్టు చేయడం మనందరి విధి. మీ ప్రాంతాలలో జరిగిన జాతీయోద్యమం గురించి రాసి పంపించండి. ఘటనలు, దేశభక్తుల గురించి రాయవచ్చు. ఏ పంథాలోని వారైనా చరిత్రలో ఎక్కవలసిన వారే. ఆ మహోద్యమంలో అన్నీ త్యాగం చేసినా వెలుగు చూడలేకపోయిన మహనీయుల గురించీ, వారి ఘనత గురించీ ఈ దీపావళి సందర్భంగా తీసుకువస్తున్న ప్రత్యేక సంచికలో పరిచయం చేయండి! చరిత్రకు సమగ్రతను తెచ్చే కృషిలో పాల్గొనండి!

నిబంధనలు

కచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఫోటోలు ముఖ్యమే. ఏ ఉద్యమం, జైలు జీవితం ఎక్కడ, 1947 తరువాతి జీవితం వ్యాసాలలో స్పష్టంగా ఉండాలి. వ్యక్తిగత వివరాలకు తక్కువ చోటే ఇవ్వండి. వీటి గురించి నమోదైన పుస్తకాల పేర్లూ ఉంటే మంచిది. ఏదో సందర్భంలో వచ్చిన వార్తా కథనమైనా పరవాలేదు. ఆత్మకథలు ఉంటే (ముద్రితం/ అముద్రితం) తప్పక ప్రస్తావించండి. అతిశయోక్తులకు చోటు ఇవ్వవద్దు. చరిత్ర రచన మీద అశ్రద్ధ, అవగాహన లోపం ఇప్పటికే చాలా నష్టం చేసింది. ఇప్పుడు అలాంటి లోపం జరగరాదు. ఆ మహనీయులను మళ్లీ అవమానించరాదు.
వ్యాసం డీటీపీ ఏ4లో ఒక పేజీ, చేతివ్రాతలో రెండు పేజీలకు మించరాదు. మెయిల్‌ ‌సబ్జెక్ట్‌లో దీపావళి ప్రత్యేక సంచిక కోసం అని రాసి చక్కగా స్కాన్‌ ‌చేసి [email protected] కి పంపాలి. పోస్ట్ ‌ద్వారా అయితే- ఇంటి నెం. 3-4-228/4/1, జాగృతి భవన్‌, ‌కాచిగూడ, 500027కి పంపండి. కరోనా దృష్ట్యా తప్పనిసరి అయితేనే ఈ పద్ధతి వాడుకోగలరు. వ్యాసకర్త చిరునామా, ఫోన్‌ ‌నెంబర్‌ ‌మర్చిపోవద్దు.

రచనలు చేరాల్సిన చివరి తేదీ సెప్టెంబర్‌ 10.

About Author

By editor

Twitter
Instagram