ఒక బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడవడం, బావి దగ్గర గంటల తరబడి వరుసలో నిరీక్షించడం.. ఇది కొన్ని తరాల గ్రామీణ భారత స్త్రీల నిత్య అనుభవం. ఆరేళ్ల క్రితం వరకూ దేశంలోని 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో కేవలం 3.23 కోట్ల మందికి, అంటే 17శాతానికి మాత్రమే, ఇంటి వద్ద కుళాయి కనెక్షన్ ఉండేది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ ఈ చిత్రాన్ని సవ•లంగా మార్చింది. 2026 నాటికి దేశ వ్యాప్తంగా 15.80 కోట్ల కుటుంబాలకు (81.6%) కుళాయి నీరు చేరింది. ప్రతి వ్యక్తికీ రోజూ 55 లీటర్ల సురక్షిత నీటిని ఇంటి వద్దే అందించడం ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ సంకల్పం – జాతీయ స్థాయి జల యజ్ఞం
ఈ పరివర్తన వెనుక కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన దార్శనికత, సుస్థిర నిబద్ధత ఉన్నాయి. ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని ప్రకటించిన ‘హర్ ఘర్ జల్’ (ప్రతి ఇంటికీ కుళాయి నీరు) అనే లక్ష్యం ఒక పథకం స్థాయిని దాటి జాతీయ ప్రాధాన్యాంశంగా మారింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుధ్య విభాగం (ణణఔ•) దీన్ని అమలు చేస్తోంది. ప్రతి గ్రామీణ ఇంటికీ క్రియాశీల గృహ కుళాయి కనెక్షన్ (ఖీ•) ద్వారా రోజుకు తలసరి కనీసం 55 లీటర్ల సురక్షిత నీరు అందించ డమే ప్రామాణిక లక్ష్యం. ఆరేళ్లలోనే దేశంలో కవరేజ్ 17 శాతం నుంచి 81 శాతానికి చేరడం, సుమారు 12 కోట్లకు పైగా కొత్త కుటుంబాలకు నీరు చేరడం అన్నది బలమైన రాజకీయ సంకల్పం, నిరంతర నిధుల ప్రవాహం లేకుండా సాధ్యమయ్యేది కాదు.
ఈ లక్ష్యం వెనుక గణనీయమైన ఆర్థిక నిబద్ధత ఉంది. 2019లో సుమారు రూ. 3.60 లక్షల కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభమైన ఈ మిషన్లో నిధుల భాగస్వామ్యం స్పష్టమైన నవ•నాలో సాగుతుంది. సాధారణ రాష్ట్రాలకు కేంద్ర-రాష్ట్ర వాటా 50:50, హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలకు 90:10, కేంద్రపాలిత ప్రాంతాలకు పూర్తిగా కేంద్రమే (100%) నిధులు సమకూరుస్తుంది. మిగిలిన కుటుంబాలను చేర్చడంతో పాటు సరఫరా నాణ్యత, నిర్వహణపై దృష్టి సారిస్తూ 2025-26 కేంద్ర బడ్జెట్లో దీనిని 2028 డిసెంబర్ వరకు పొడిగించి, ఏడాదికి రూ. 67,000 కోట్లు కేటాయించారు; మొత్తం వ్యయ అంచనాతో పాటు కేంద్ర వాటానూ గణనీయంగా పెంచారు.
మిషన్ ఎలా అమలులో ప్రజల భాగస్వామ్యమే పునాది
జల్ జీవన్ మిషన్ కేవలం పైపులు, ట్యాంకుల నిర్మాణం కాదు. ఇది ‘కింది నుంచి పైకి’ సాగే డిమాండ్ ఆధారిత నవ•నా. గ్రామ స్థాయిలో పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసే బాధ్యత గ్రామ పంచాయతీ లేదా గ్రామ నీరు-పారిశుధ్య కమిటీ (నీటి సమితి)దే. ఈ కమిటీలో కనీసం సగం మంది మహిళలు ఉండటం తప్పనిసరి. చాలా గ్రామాల్లో మౌలిక నిర్మాణ వ•లధన వ్యయంలో 10శాతాన్ని (గిరిజన, ఎస్సీ/ఎస్టీ జనాభా ఎక్కువున్న గ్రామాల్లో 5శాతం) స్థానిక సమాజమే నగదు లేదా శ్రమరూపంలో భరిస్తుంది. తద్వారా నిర్మించిన సదుపాయంపై గ్రామస్థులకే యాజమాన్య భావన, బాధ్యత కలుగుతాయి.
నీటి నాణ్యత పర్యవేక్షణకు మిషన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. క్షేత్రస్థాయి పరీక్షా కిట్ల (ఖీ•ఖ) వినియోగంలో దేశవ్యాప్తంగా లక్షలమంది గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి, నీటి నవ•నాలను ప్రయోగ శాలల్లో పరీక్షించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. అయితే కుళాయి కనెక్షన్ ఇవ్వడం ఒక మెట్టు మాత్రమే; నీరు క్రమం తప్పకుండా, తగినంత పీడనంతో, సురక్షితంగా అందడమే అసలు పరీక్ష. ప్రభుత్వ సర్వేల ప్రకారం కనెక్షన్లు దాదాపు అందరికీ చేరినా, నిత్యం నమ్మదగిన సరఫరా పొందుతున్నది వ•డొంతుల వరకే. అందుకే మిషన్ ఇప్పుడు కనెక్షన్ల సంఖ్య నుంచి క్రియాశీలత, దీర్ఘకాలిక నిర్వహణ (వీ), జల వనరుల సుస్థిరత, ప్రజా భాగస్వామ్యం (జన్ భాగీదారీ) వైపు దృష్టి మళ్లిస్తోంది.
మిషన్ ఆవశ్యకత, గొప్పతనం
నీరు అందుబాటులో లేకపోవడం కేవలం అసౌకర్యం కాదు, అది ఒక సామాజిక, ఆర్థిక భారం. ఇంటి అవసరాల కోసం నీరు మోసుకురావడంలో దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజూ ఖర్చు చేసే సమయం 5.5 కోట్ల గంటలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా; ఇందులో వ•డొంతుల భారం మహిళలదే. ఈ శ్రమ నుంచి విముక్తి కల్పించడమే మిషన్ గొప్పతనం.
సురక్షిత నీరు దేశంలో దాదాపు 4 లక్షల అతిసార మరణాలను నివారించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మైకేల్ క్రెమర్ పరిశోధన ప్రకారం, సురక్షిత నీటి విస్తరణ ఐదేళ్లలోపు పిల్లల మరణాలను దాదాపు 30 శాతం తగ్గించగలదు. ఐఐఎం బెంగళూరు, అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం, ఈ మిషన్ 59.9 లక్షల ప్రత్యక్ష ఉపాధి వ్యక్తి-సంవత్సరాలను సృష్టిస్తుంది. ఆరోగ్యం, లింగ సమానత్వం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి కలిసిన ఒక సమగ్ర సామాజిక పెట్టుబడి ఇది.
నూరు శాతం సాధించిన తెలంగాణ
దేశంలో నూరు శాతం గ్రామీణ కుళాయి కనెక్షన్లు సాధించిన తొలి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని మొత్తం 53.98 లక్షల గ్రామీణ కుటుంబాలకూ కుళాయి నీరు చేరింది. 2019 ఆగస్టు నాటికి కేవలం 15.68 లక్షల ఇళ్లకు (29.05%) మాత్రమే కనెక్షన్ ఉండగా, మిషన్ ద్వారా అదనంగా 38.29లక్షల ఇళ్లకు నీరు అందింది. రెండేళ్లలోపే ఈ లక్ష్యాన్ని చేరడం విశేషం.
2016లో రాష్ట్రం చేపట్టిన ‘మిషన్ భగీరథ’తో జల్‌జీవన్ మిషన్ సమన్వయం ద్వారా గోదావరి, కృష్ణా నదుల ఉపరితల జలాలను శుద్ధి చేసి, భారీ నీటి నిల్వ ట్యాంకుల (•=) ద్వారా 23,930 గ్రామాలకు పంపిణీ చేసే ఈ గ్రిడ్ నవ•నా, కేంద్ర ప్రమాణం తలసరి 55 లీటర్లకు బదులు దాదాపు 100 లీటర్ల నీటిని అందిస్తోంది. తద్వారా బోరుబావుల ఆధారిత అస్థిరత తొలగి, స్థిరమైన ఉపరితల జల సరఫరా అందుబాటులోకి వచ్చింది.
ఇళ్లతో పాటు సంస్థాగత కవరేజ్‌లోనూ తెలంగాణ ముందంజలో నిలిచింది. 22,832 పాఠ శాలలు (99%), 27,248 అంగన్వాడీ కేంద్రాలు (99%), 13,281 గ్రామ పంచాయతీలు/ఆరోగ్య కేంద్రాలు (100%) కుళాయి నీటిని పొందాయి. రాష్ట్ర పథకం, కేంద్ర మిషన్ కలిసి పనిచేస్తే ఒక రాష్ట్రాన్ని ఎలా సంతృప్తపరచవచ్చో తెలంగాణ ఒక నవ•నాగా నిలిచింది.
ఆంధప్రదేశ్
ఆంధప్రదేశ్ సైతం ఈ మిషన్లో గణనీయ ప్రగతి సాధించింది. 2019 ఆగస్టు నాటికి 30.74 లక్షల ఇళ్లకు (32.18%) ఉన్న కవరేజ్, 2025 మార్చి నాటికి 70.51 లక్షల ఇళ్లకు (73.81%) చేరింది. అంటే మిషన్ ద్వారా కొత్తగా 39.77 లక్షల కుటుంబాలకు కుళాయి నీరు అందింది.
2026 మార్చిలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం జల్‌శక్తి మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం (వీశీ•) కుదుర్చుకుని, 2028 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి కనెక్షన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిరంతర నీటి సరఫరా కోసం 2025 సెప్టెంబర్లో సమగ్ర నిర్వహణ (వీ) విధానాన్ని ప్రవేశపెట్టడం, నీటి నాణ్యత పరీక్షల్లో డ్వాక్రా మహిళా బృందాలను భాగస్వాములను చేయాలన్న ప్రతిపాదన, సుస్థిర సరఫరా, మహిళా సాధికారతపై దృష్టి సారించింది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 3,65,655 ఇళ్లకుగాను 3,07,183 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్ అందగా, మిగిలిన 58,472 ఇళ్లకు 147 పనుల ద్వారా (సుమారు రూ. 29.36 కోట్ల అంచనా వ్యయంతో) చేరే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఆరు నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. గుంటూరులోని పల్నాడు ప్రాంతానికి బహుళ-గ్రామ పథకం (వీ••) వంటి పెద్ద ప్రాజెక్టులూ అమలవుతున్నాయి. మిగిలిన కుటుంబాలను 2028 నాటికి సంతృప్తపరచడమే రాష్ట్ర లక్ష్యం.
తెలుగు రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ అమలు
2019 ఆగస్టు నాటికి రెండు తెలుగు రాష్ట్రాలూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో 15.68 లక్షల ఇళ్లకు (29.05%), ఆంధప్రదేశ్‌లో 30.74 లక్షల ఇళ్లకు (32.18%) మాత్రమే కుళాయి నీరు ఉండేది. మిషన్ అమలులో తెలంగాణ అదనంగా 38.29 లక్షల కుటుంబాలను చేర్చి 53.98 లక్షల ఇళ్లకు (100%) చేరగా, ఆంధప్రదేశ్ 39.77 లక్షల కొత్త కనెక్షన్లతో 70.51 లక్షల ఇళ్లకు (73.81%) (2025 మార్చి నాటికి) చేరింది. తెలంగాణ తన మిషన్ భగీరథ గ్రిడ్‌తో సమన్వయం చేసుకుని నూరు శాతం సంతృప్తిని సాధించగా, ఆంధప్రదేశ్ జల్‌జీవన్ మిషన్ 2.0 ఒప్పందం, నిర్వహణ (వీ) విధానం ద్వారా 2028 నాటికి నూరు శాతం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
దేశవ్యాప్త పురోగతి, జల్ జీవన్ మిషన్ 2.0
తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే నూరు శాతం లక్ష్యాన్ని సాధించాయి. గోవా తొలి రాష్ట్రంగా నిలవగా, తెలంగాణ, హరియాణా, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ తదితరాలు ‘హర్ ఘర్ జల్’ సాధించాయి. 2026 ఆరంభం నాటికి దేశంలో 2.7 లక్షలకు పైగా గ్రామాలు, అన్ని ఇళ్లకూ, ప్రభుత్వ సంస్థలకూ కుళాయి నీరు చేరి, ‘హర్ ఘర్ జల్’ గ్రామాలుగా ధ్రువీకృతమయ్యాయి. అయితే మిగిలిన కుటుంబాల్లో ఎక్కువ భాగం కష్టతరమైన భౌగోళిక ప్రాంతాలు, భూగర్భ జల ఒత్తిడి, వనరుల కొరత ఉన్న చోట్ల ఉండటంతో చివరి మైలు ఒక సవాలుగా మిగిలింది.
ఈ నేపథ్యంలో మిషన్ రెండో దశ కేవలం కనెక్షన్ల లెక్క నుంచి క్రియాశీల జలభద్రత వైపు మళ్లుతోంది. ప్రతి ఇంటికీ నిత్యం, నాణ్యమైన, తగినంత నీరు అందేలా చూడటం; జల వనరులను సుస్థిరంగా కాపాడటం; నిర్మించిన వ్యవస్థల దీర్ఘకాలిక నిర్వహణకు రాష్ట్రాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవడం దీని కేంద్రబిందువులు. 2028 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే తుది లక్ష్యం.
నీరు అంటే కేవలం దాహం తీర్చే ద్రవం కాదు. అది గౌరవం, ఆరోగ్యం, సమానత్వం, జీవించే హక్కు. జల్ జీవన్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ తాగునీటి కార్యక్రమాల్లో ఒకటి. లక్షలమంది మహిళల శ్రమను తగ్గించి, వేల ప్రాణాలను కాపాడగల సత్తా దానిది. తెలుగు నేలపై దీని ప్రయాణం ఆశాజనకంగా సాగుతోంది. తెలంగాణ మిషన్ భగీరథతో సమన్వయం చేసుకుని నూరు శాతం సంతృప్తిని సాధించి చూపగా, ఆంధప్రదేశ్ జల్ జీవన్-2.0 ద్వారా 2028 కల్లా 100 శాతం లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలూ ‘హర్ ఘర్ జల్’ను పేపర్ మీద నుంచి ప్రతి కుళాయికి చేర్చే దిశగా సాగుతున్నాయి. ప్రతి కుటుంబానికి ప్రాణజలం అనేది నినాదం కాదు, ప్రతి ఇంటి హక్కు.
డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ
సీనియర్ జర్నలిస్ట్