విశ్వంలో అద్భుతమైన సృష్టి ‘భూమి’ అయితే, ఆ సృష్టిలో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ‘మానవ శరీరం’. పచ్చని ప్రకృతి ఒక మహా కావ్యం అయితే, మనిషి అందులో ఒక అక్షరం. భూమికి, శరీరానికి ఉన్న సంబంధం కేవలం నివాసానికి సంబంధించింది కాదు. ఇది తల్లికి, బిడ్డకు మధ్య ఉండే నాభి బంధం వంటిది.

విశ్వం ఒక మహా సముద్రం అయితే, భూమి అందులో ఒక ద్వీపం. ఆ ద్వీపంలోని మట్టి, నీరు, గాలి, అగ్ని తత్వాల కలయికతో తయారైన ఒక అద్భుత యంత్రమే మానవ శరీరం. మనం భూమి మీద నివసించడం లేదు, నిజానికి మనం ఈ భూమిలో ఒక భాగమై జీవిస్తున్నాం. మన దేహం భూమి సజీవ ప్రతిరూపం. ఆధునిక ఖగోళ భౌతిక శాస్త్రం ప్రకారం, కోట్లాది ఏళ్ల క్రితం నక్షత్రాల విస్ఫోటనం ద్వారా విడుదలైన మూలకాలే భూమిగా మారాయి. మన శరీరంలోని 97% మూలకాలు (కార్బన్‌, ‌నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ‌కాల్షియం, ఇనుము) అచ్చం భూమి పొరల్లో ఉన్నవే. మన రక్తంలో ప్రవహించే ఇనుము, ఎముకల్లోని కాల్షియం మట్టి నుండి వచ్చినవే. అందుకే మనిషిని ‘‘నడిచే మట్టి’’ అని పిలవడం శాస్త్రీయంగా నూటికి నూరు పాళ్లు నిజం.
దేహం ఒక దేవాలయం అయితే, భూమి ఆ దేవాలయానికి పునాది. పునాది బలహీనపడితే కట్టడం కూలిపోతుంది. అందుకే భూమిని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ప్రకృతితో కలిసి జీవించడమే నిజమైన ఆరోగ్యం.
మన శరీరంలోని ఏడు చక్రాలలో మొదటిది ‘మూలాధార చక్రం’. ఇది ‘పృథ్వీ తత్వానికి’ సంబంధించింది. భూమి మనకు ఎలాగైతే ఆధారాన్ని ఇస్తుందో, మూలాధార చక్రం శరీరానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. యోగాలో శరీరాన్ని ఐదు పొరలుగా (కోశాలు) చూస్తారు. అందులో మొదటిది ‘అన్నమయ కోశం’. ఇది పూర్తిగా భూమి నుండి వచ్చే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అంటే మన భౌతిక శరీరం కేవలం ‘‘రూపాంతరం చెందిన మట్టి’’ మాత్రమే.విశ్వంలో నిండి ఉన్న ప్రాణశక్తి మనలో శ్వాస రూపంలో ప్రవహిస్తుంది. భగవత్‌ ‌చింతన ద్వారా మనం ప్రకృతిలోని శక్తితో అనుసంధానం అవుతాము. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా భూమికి, శరీరానికి మధ్య ఉన్న పరమాణు స్థాయి బంధాన్ని ధృవీకరిస్తోంది. పురాణాల ప్రకారం మన శరీరం ‘‘పంచభూతాల’’ (పృథ్వి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం) కలయిక. శాస్త్రీయంగా చూసినా భూమిలో ఉండే మూలకాలే మన శరీరంలోనూ ఉన్నాయి.
స్టార్‌ ‌డస్ట్ (‌నక్షత్ర ధూళి) సైన్స్ ‌ప్రకారం, భూమి ఏర్పడటానికి కారణమైన అదే మూలకాలు (కార్బన్‌, ‌నైట్రోజన్‌, ఆక్సిజన్‌) ‌మన శరీర నిర్మాణంలోనూ ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు మనల్ని ‘‘నక్షత్రాల బిడ్డలు’’ అని పిలుస్తారు. ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ‌ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రం) భూమికి ఒక ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నట్టే, మానవ శరీరానికి కూడా సూక్ష్మమైన విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది.
భూమి ఒక భారీ విద్యుత్‌ ‌క్షేత్రం. మన హృదయం, మెదడు కూడా విద్యుత్‌ ‌సంకేతాల (దీఱశీ-వశ్రీవమీ•తీఱమీఱ••) ద్వారానే పనిచేస్తాయి. మనం చెప్పులు లేకుండా భూమిపై నడిచినప్పుడు, భూమిలోని ‘నెగటివ్‌ ఎలక్ట్రాన్లు’ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేసి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఆధునిక ‘ఎర్థింగ్‌ ‌సైన్స్’ ‌నిరూపిస్తోంది. మనం భూమితో అనుసంధానమై ఉన్న ప్పుడే మన శరీరం గరిష్ట ఆరోగ్యంతో ఉంటుంది. మనం భూమిపై నగ్న పాదాలతో నడిచినప్పుడు భూమిలోని ఎలక్ట్రాన్లు మన శరీరంలోకి ప్రవేశించి వాపులు తగ్గడానికి, ఒత్తిడి తగ్గడానికి సహాయ పడతాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.
భూమిలోని మట్టిలో కోట్లాది సూక్ష్మజీవులు ఉండి మట్టిని సారవంతం చేస్తాయి. అలాగే మన పేగుల్లో కూడా కోట్లాది బ్యాక్టీరియాలు ఉండి జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని కాపాడతాయి. మట్టిలోని జీవవైవిధ్యానికి, మన శరీరంలోని జీవవైవిధ్యానికి పోలిక ఉంది.
నదులు కలుషితమైతే భూమి నిస్సారమవుతుంది. రక్తం అశుద్ధమైతే శరీరం రోగగ్రస్తమవుతుంది. భూమిపై నీటి లభ్యత శరీరంలో నీటి శాతం (దాదాపు 70%) సరిగ్గా ఒకేలా ఉండటం ప్రకృతి వైచిత్రి.
‘‘యథా పిండే తథా బ్రహ్మాండే’’ – అంటే ఈ విశ్వంలో ఏముందో, అది మన శరీరంలోనూ ఉంది అని అర్థం. ప్రకృతి, మానవ శరీరం వేర్వేరు కావు. భూమి ఒక పెద్ద జీవ వ్యవస్థ అయితే, మన శరీరం దానిలోని ఒక సూక్ష్మ రూపం. భూమిని ‘ధరణీ మాత’ అని పిలవడంలో ఉన్న పరమార్థం ఏమిటంటే, మనల్ని నిర్మించే ప్రతి అణువు ఆ భూమి నుండి వచ్చినదే. భూమికి అడవులు ఊపిరితిత్తుల వంటివి. అవి గాలిని శుద్ధి చేసి జీవరాశికి ప్రాణవాయు వును అందిస్తాయి. మన శరీరంలో ఊపిరితిత్తులు కూడా అదే పనిని చేస్తాయి. అడవులను నరికివేయడం అంటే భూమి శ్వాసను అడ్డుకోవడమే, అది పరోక్షంగా మనిషి శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
మట్టిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలే మన ఎముకల బలానికి, గుండె పనితీరుకు మూలం. మనం తీసుకునే ఆహారం భూమి నుండి వస్తుంది. భూమి రసాయనాలతో నిండిపోతే, ఆ విషం ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవే శిస్తుంది. అంటే ‘‘మట్టి ఆరోగ్యం – మనిషి ఆరోగ్యం’’ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే, భూమి పొరలలో ఉండే ఇనుము, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి మూలకాలే మన రక్తంలోనూ, ఎముకల్లోనూ ఉన్నాయి. మనం భూమి నుండి పండిన ఆహారాన్ని తిన్నప్పుడు, ఆ మట్టిలోని సత్తువ మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. మరణించిన తర్వాత శరీరం తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ రుతువులను, పగలు రాత్రిని ఎలా మారుస్తుందో, మన శరీరం కూడా అలాగే స్పందిస్తుంది. సూర్యోదయంతో శరీరంలోని హార్మోన్లు ఉత్తేజితం కావడం, రాత్రి కాగానే నిద్రకు ఉపక్రమించడం వంటివన్నీ భూమి గమనంతో ముడిపడి ఉన్నాయి.
భూమి మనకు ఆహారాన్ని, నీటిని, నివాసాన్ని ఇస్తుంది. మన శరీరం ఆ పోషణను గ్రహించి అభివృద్ధి చెందుతుంది. భూమిపై చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేసి కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. మన శరీరం దానికి విరుద్ధంగా ఆక్సిజన్‌ను పీల్చి కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ను వదులుతుంది. ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన పరస్పర ఆధారిత బంధం ఉంది. భూమి•,• మానవ శరీరానికి మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది.
మట్టిలో తిరిగే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మట్టిలోని ‘మైకోబాక్టీరియం వాక్కే’ (వీ•మీశీ•మీ•వతీఱబఎ ఙ•మీమీ•వ) వంటి సూక్ష్మజీవులు మానవ మెదడులో సెరోటోనిన్‌ అం‌టే ఆనందాన్ని ఇచ్చే హార్మోన్‌ ‌విడుదలకు దోహదపడతాయని నిరూపితమైంది.
భూమి కలుషితమైతే మానవ ఆరోగ్యమూ దెబ్బతింటుంది అనడానికి ఇదే నిదర్శనం. మట్టితో సంబంధం కోల్పోయిన మనిషి తన రోగనిరోధక శక్తిని కోల్పోతాడని ‘హైజీన్‌ ‌హైపోథెసిస్‌’ ‌చెబుతోంది. మన శరీరం లోపల కూడా ఒక చిన్న ‘పర్యావరణ వ్యవస్థ’ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
భూమి మన భారాలను మోస్తూ, విచక్షణా రహితంగా మనం చేసే గాయాలను భరిస్తూ తిరిగి మనకు ఫలాలను ఇస్తుంది. శరీరం కూడా మనం చేసే తప్పులను (చెడు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం) భరిస్తూ నిరంతరం మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ రెండింటికీ ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటినప్పుడు విపత్తులు సంభవిస్తాయి. నేడు మనం భూమిని ఒక వస్తువులా చూస్తున్నాం, కానీ అది మన శరీరంలో ఒక భాగమని గుర్తించాలి. భూమికి రసాయనాలు దూరంగా ఉంచితే, మన శరీరానికి వ్యాధులు దూరంగా ఉంటాయి. మనల్ని పోషిస్తున్న మట్టిని, నీటిని గౌరవించడం నేర్చుకోవాలి. మన సనాతనాచారాలు మనల్ని ‘అంతర్ముఖంగా’ ప్రకృతితో కలుపుతుంటే, విజ్ఞాన శాస్త్రం ‘బాహ్యంగా’ మన మధ్య ఉన్న భౌతిక బంధాన్ని నిరూపిస్తోంది. భూమిని తల్లిగా భావించినా లేదా ఒక జీవ వ్యవస్థగా చూసినా.. దాని ఆరోగ్యం పైనే మన మనుగడ ఆధారపడి ఉందనేది అక్షర సత్యం.
2017లో వైద్య శాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి పొందిన పరిశోధన ప్రకారం.. భూమి వెలుతురు, చీకటి చక్రాలకు అనుగుణంగా మన శరీరంలోని జన్యువులు పనిచేస్తాయి. భూభ్రమణానికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు (నిద్ర లేకపోవడం, సరైన సమయానికి తినకపోవడం), అది క్యాన్సర్‌, ‌మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది. అంటే మన ఆరోగ్యం భూమి గమనంతో ముడిపడి ఉంది.
శాస్త్రవేత్త జేమ్స్ ‌లవ్‌లాక్‌ ‌ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం, భూమి అనేది ఒక నిర్జీవమైన రాయి కాదు, అది ఒక ‘‘సెల్ఫ్-‌రెగ్యులేటింగ్‌ ఆర్గనిజం’’ (తనను తాను నియంత్రించుకునే ఒక జీవి). భూమి తన ఉష్ణోగ్రతను, సముద్రాల ఉప్పదనాన్ని ఎలాగైతే స్థిరంగా ఉంచుకుంటుందో మానవ శరీరం కూడా తన ఉష్ణోగ్రతను, రక్తంలోని జూ స్థాయిని అలాగే స్థిరంగా ఉంచుకుంటుంది. భూమి ఉపరితలంపై ప్రవహించే నీరు, మన రక్త ప్రసరణ వ్యవస్థకు అద్దం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ వెలుతురును, చీకటిని మారుస్తుంది. దీనికి అనుగుణంగానే మన శరీరంలో ఒక ‘‘జీవ గడియారం’’ పని చేస్తుంది. భూమిపై సూర్యరశ్మి మారినప్పుడు, మన శరీరంలో మెలటోనిన్‌, ‌కార్టిసాల్‌ ‌వంటి హార్మోన్లు విడుదలవు తాయి. భూభ్రమణ వేగంతో మన శరీర జీవక్రియలు ముడిపడి ఉండటం ఒక అద్భుతమైన శాస్త్రీయ అనుబంధం.
విజ్ఞాన శాస్త్రం ప్రకారం, భూమి ఒక ‘సూపర్‌ ఆర్గానిజం’. అందులో మానవ శరీరం ఒక చిన్న కణం వంటిది. భూమి పర్యావరణం దెబ్బతింటే, మన శరీరంలోని రసాయన సమతుల్యత కూడా దెబ్బతింటుంది. అందుకే భూమిని కాపాడుకోవడం అంటే మన జన్యువులను (ణచీ) కాపాడుకోవడమే.
భూమికి, శరీరానికి మధ్య ఉన్నది కేవలం భౌతిక సంబంధం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ బంధం. భూమిని మనం గౌరవించడం అంటే మన శరీరాన్ని మనం గౌరవించుకోవడమే. భూమికి చేసే ఏ హానీ అయినా, అది నేరుగా మన శరీర కణజాలానికి చేసుకునే ‘గ్లానీ’ అని సైన్స్ ‌కూడా హెచ్చరిస్తోంది. ప్రకృతిని కలుషితం చేయడం అంటే మనల్ని మనమే విషతుల్యం చేసుకోవడమే. అందుకే ‘‘ప్రకృతిని రక్షించండి – అది మిమ్మల్ని రక్షిస్తుంది’’.
భూమి ఉపరితలంపై 70% నీరు ఉన్నట్టే, మానవ శరీరంలో కూడా సుమారు 70% నీరు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సముద్రపు నీటిలోని లవణీయత, మన రక్తంలోని ప్లాస్మాలో ఉండే లవణాల శాతం దాదాపు ఒకేలా ఉంటాయి. భూమిపై నదులు ఎలాగైతే భూభాగానికి ప్రాణాన్ని ఇస్తాయో, మన రక్తనాళాలు శరీరంలోని ప్రతి కణానికి అలా ప్రాణవాయువును చేరవేస్తాయి.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ పగలు, రాత్రిని ఏర్పరుస్తుంది. మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ‘జీవ గడియారం’ ఉంటుంది, ఇది భూమి భ్రమణానికి అనుగుణంగా పనిచేస్తుంది. సూర్యోదయంతో మన జీవక్రియలు మొదలవ్వడం, సూర్యాస్తమయంతో శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం ప్రకృతితో మనకున్న విడదీయలేని బంధానికి నిదర్శనం. భూమి లయ తప్పితే, మన ఆరోగ్యం కూడా తప్పుతుంది. భూమికి గాయమైతే అది మన శరీరానికి తగిలిన గాయం లాంటిదే. భూమిలోని నీరు కలుషితమైతే మన రక్తం అశుద్ధమవుతుంది, భూమిపై అడవులు అంతరిస్తే మన శ్వాస భారమవు తుంది. మన శరీరం భూమి నుండి విడివడిన ముక్క కాదు, భూమి విస్తరణ మాత్రమే. అందుకే భూమిని ప్రేమించడం అంటే మనల్ని మనం ప్రేమించు కోవడమే. ప్రకృతితో మమేకమై జీవించడమే నిజమైన విజ్ఞానం, ఆరోగ్యం… ఆహ్లాదం.

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE