వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌జీవితం నిస్సందేహంగా ఇస్తుంది. ఆయనను మొదట ‘‘జీ’’ అని పిలిచిన శాఖ నుండి, సంఘ్‌ ‌మొదటి సిక్కు ప్రచారక్‌గా ఎదిగే వరకు సాగిన ఆయన ప్రస్థానం, భారత్‌ ‌బలం విచ్ఛిన్నంలో కాకుండా నాగరిక ఐక్యతలోనే ఉందని గుర్తుచేస్తుంది.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో సిక్కు-హిందూ సంబంధాల సుదీర్ఘమైన, తరచుగా అపార్థం చేసుకున్న చరిత్రలో, నాగరిక ఐక్యతను ఇంత సహజ సిద్ధంగా మూర్తీభవించిన వ్యక్తులు చాలా తక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌మొదటి సిక్కు ప్రచారక్‌ ‌సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌.
‌పంత్‌ను దేశం నుండి విడగొట్టాలని చూసిన వలసవాద చరిత్ర రచన, వేర్పాటువాద ప్రచారం, సైద్ధాంతిక వక్రీకరణల ద్వారా రుద్దిన కృత్రిమ ద్వంద్వాలకు ఆయన జీవితం ఒక సజీవ ప్రతిస్పందనగా నిలుస్తుంది.
ఒక ప్రచారక్‌గా మాత్రమే కాకుండా, ఒక నాగరికతా వారధిగా, సిక్కు అస్తిత్వం, భారతీయ నాగరిక చైతన్యం పరస్పర విరుద్ధం కాదని, ఒకదాని కొకటి పూరకమని సహజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆయన జీవితకాల కృషి ఈ దృఢ విశ్వాసం లోనే పాతుకుపోయింది.
దీర్ఘాయువును ప్రసాదించే నామం, వేలాది మందిని ఆశీర్వదించిన జీవితం
సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌రైతు హర్కరన్‌ ‌దాస్‌ (‌తర్లోచన్‌ ‌సింగ్‌), ‌ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు రాలు ద్వారకా దేవి (జోగిందర్‌ ‌కౌర్‌) ‌దంపతులకు జన్మించారు. ఆ దంపతులకు ఆయనకు ముందు ఇద్దరు కుమారులు జన్మించారు కానీ వారు విగతజీవులైనారు. ఆయన తల్లి తీవ్ర దుఃఖంతో, ఆశతో, తన బిడ్డ దీర్ఘాయువు కోసం దైవ ఆశీర్వాదం కోరుతూ గురుద్వారాలలోనే కాకుండా దేవాల యాలలో కూడా ప్రార్థించారు. అందువల్ల, ‘‘దీర్ఘాయువు కలవాడు’’ అని అర్థం వచ్చే చిరంజీవ్‌ అనే పేరును ఎంచుకున్నారు. తన కుమారుడు దీర్ఘకాలం జీవించడమే కాకుండా, దేశసేవ, క్రమశిక్షణ, ఐక్యత మార్గాన్ని లెక్కలేనంత మందికి చూపించడానికి తన జీవితమంతా అంకితం చేస్తాడని ఆమె ఊహించి ఉండరు.
ఆయన జీవితాన్ని మార్చిన ‘జీ’
1944లో ఏడవ తరగతి చదువుతున్నప్పుడు, బాల చిరంజీవ్‌ ‌తన స్నేహితుడు రవితో కలిసి మొదటి సారిగా ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖకు వెళ్లారు. అక్కడి ఆటలు, క్రమశిక్షణ, ప్రార్థనలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ ఆయనపై చెరగని ముద్ర వేసింది మాత్రం, పైకి చాలా సరళంగా కనిపించే ఒక విషయం. అదే అందరూ ఆయనను ‘‘చిరంజీవ్‌ ‌జీ’’ అని పిలవడం. ఆయన వయస్సు,మతం, నేపథ్యం పరస్పర గౌరవంలో లీనమైపోయిన వైనాన్ని తొలిసారిగా అనుభూతించారు. ‘జీ’ అనే పదాన్ని అందరూ వాడటం సమతావాద భారతీయ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఆ శాఖలో ఆయనే ఏకైక సిక్కు అయినప్పటికీ ఆయనకు ఎన్నడూ తాను బయటి వాడినని అనిపించలేదు.ఆ రోజు నుండి, ఆ శాఖ ఆయనకు రెండవ ఇల్లుగా మారింది. 1946 నాటికి, ఆయన ప్రాథమిక శిక్షా వర్గకి హాజరయ్యారు. ఆ తర్వాత 1952 నాటికి మూడు ప్రధాన సంఘశిక్షా వర్గలను పూర్తి చేసి, ప్రచారక్‌ ‌జీవితానికి అర్హత సాధించారు.
దేశం కోసం ఖైదు
ఆయన తన ప్రాథమిక శిక్షణ పూర్తి చేసిన కొద్ది కాలానికే, మహాత్మాగాంధీ హత్య ఆర్‌ఎస్‌ఎస్‌పై దేశవ్యాప్త నిషేధానికి దారితీసింది. వేలాది మంది స్వయంసేవకుల వలె, సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ఈ అన్యాయమైన నిషేధానికి వ్యతిరేకంగా సత్యా గ్రహంలో పాల్గొన్నారు. ఆయన రెండు నెలల పాటు జైలులో ఉన్నారు. ఇది వ్యక్తిగత త్యాగం అసాధారణం కాకుండా సర్వసాధారణమైన జీవితానికి నాంది పలికింది. ఆయన వేరే మార్గాన్ని ఎంచుకుని ఉంటే, పాఠశాల ఉపాధ్యాయుడు అయ్యేవారు. కానీ, బాబు శ్రీచంద్‌ ‌జీ వంటి జ్యేష్ఠ ప్రచారక్‌ల స్ఫూర్తితో, ఆయన 1953లో ప్రచారక్‌ అయ్యారు.
పంజాబ్‌ ‌పర్యాటక ప్రచారక్‌
‌దశాబ్దాలుగా సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌మలేర్‌కోట్ల, సంగ్రూర్‌, అం‌తటా సేవలందించారు. పాటియాలా, రోపర్‌, ‌లూథియానా-తహసీల్‌, ‌జిల్లా, విభాగ్‌, ‌సహ్‌-‌సంభాగ్‌ ‌ప్రచారక్‌గా వ్యవహరించారు. 21 సంవత్సరాల పాటు లూథియానాను తన కర్మభూమిగా చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు శిక్షావర్గలకు బోధకుడిగా సేవలందించారు. నాలుగు సార్లు ముఖ్య శిక్షక్‌గా పనిచేశారు.
1984లో, పంజాబ్‌లో ఉగ్రవాదం అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో, ఆయనకు పంజాబ్‌ ‌విశ్వహిందూపరిషత్‌ ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. ఆయన 1990 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఇదే విషయమై వీహెచ్‌పీ ప్రస్తుత వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అలోక్‌కుమార్‌ ‌మాట్లాడుతూ ఆ హింసాత్మక సంవత్సరాలలో, తీవ్రవాదుల నేరాలకు సిక్కు సమాజాన్ని నిందించవద్దని స్వయంసేవకులకు బోధించింది సంఘ్‌, ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌వంటి నాయకులేనని గుర్తుచేసుకున్నారు. ద్వేషాన్ని పెంచుకోవడం సులభమైన ఆ రోజుల్లో, వారు సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేశారు.
విభజన రాజకీయాల నుండి
పంజాబీని కాపాడటం
సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ అత్యంత దూరదృష్టి గల చర్యలలో ఒకటి 1961 జనాభా లెక్కలకు ముందు తలెత్తిన భాషాపరమైన ఉద్రిక్తతల సమయంలో జరిగింది. ఆర్యసమాజ్‌ ‌నాయకులలోని కొన్ని వర్గాలు పంజాబీ హిందువులను హిందీని తమ మాతృభాషగా ప్రకటించుకోవాలని ఒత్తిడి చేస్తూ, పంజాబీ సుబా ఉద్యమ సమయంలో సామాజిక విద్వేషాన్ని తీవ్రతరం చేశాయి.ఈ ప్రమాదాన్ని గుర్తించిన చిరంజీవ్‌ ‌సింగ్‌, ‌పరమపూజనీయ గురూజీ (ఎం.ఎస్‌. ‌గోల్వాల్కర్‌)‌ను సంప్రదించారు. గురూజీ పంజాబ్‌కు వెళ్లారు. పంజాబ్‌లోని నివాసులందరూ సిక్కులు, హిందువులు, ముస్లింలు పంజాబీని తమ మాతృభాషగా ప్రకటించుకోవాలని ఒక స్పష్టమైన పిలుపును ఇచ్చారు.
గురూజీ పిలుపును అనుసరించి, పంజాబ్‌లోని విద్యాభారతి పాఠశాలలు పంజాబీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. ఈ మార్గదర్శకాలను అనుసరించి, పంజాబ్‌లోని విద్యా భారతి పాఠశాలలు పంజాబీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారం భించాయి. సామాజిక ఐక్యతను పెంపొందించడానికి పంజాబ్‌ ‌కళ్యాణ్‌ ‌ఫోరమ్‌ ‌వంటి వేదికలను ఏర్పాటు చేశారు.
జాతీయ సిక్కు సంగత్‌
1984 ‌నాటి క్రూరమైన సిక్కు వ్యతిరేక మారణ కాండలు దేశ మనస్సాక్షిని కుదిపేశాయి. ధర్మానికి చారిత్రక రక్షకులైన సిక్కుల ఊచకోత చాలా మంది జాతీయవాదులకు భరించరానిదిగా మిగిలింది. ఈ నైతిక సంక్షోభంలోనే ఒక బలమైన, జాతీయవాద సిక్కు వేదిక ఆవశ్యకత ఏర్పడింది. తీవ్రమైన చర్చల అనంతరం, 1986లో గురు నానక్‌దేవ్‌జీ ప్రకాష్‌ ‌పురబ్‌ ‌రోజున, అమృత్‌సర్‌ ‌పవిత్ర భూమిపై రాష్ట్రీయ (జాతీయ) సిక్కు సంగత్‌ ‌స్థాపితమైంది. ప్రఖ్యాత పండితుడు సర్దార్‌ ‌షంషేర్‌ ‌సింగ్‌ ‌దాని మొదటి అధ్యక్షుడిగా, చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1990లో షంషేర్‌ ‌సింగ్‌ ‌మరణానంతరం, చిరంజీవ్‌ ‌సింగ్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయన నాయ కత్వంలో, సిక్కు-హిందూ నాగరికతా ఐక్యత విషయంలో ఏమాత్రం వెనుకాడని, ఆత్మవిశ్వాసంతో కూడిన జాతీయవాద వేదికగా సిక్కు సంగత్‌ ఆవిర్భవించింది.
సిక్కు-హిందూ ఐక్యతకు ప్రపంచవ్యాప్త గళం
చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌భారత్‌ అం‌తటా, ఇంగ్లాండ్‌, ‌కెనడా, జర్మనీ, అమెరికాలో విస్తృతంగా పర్యటించి సిక్కు, హిందూ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిం చారు.
ఖల్సా సిర్జన యాత్ర (పాట్నా, 1999) వంటి కార్యక్రమాలు, న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ధార్మిక సదస్సు (2000)లో పాల్గొనడం వంటివి ప్రపంచవ్యాప్తంగా సంగత్‌ ‌పరిధిని విస్తరించాయి. మాననీయ పూర్వ సర్‌ ‌సంఘచాలక్‌ ‌కె.ఎస్‌. ‌సుదర్శన్‌ ఈ ‌ప్రయత్నానికి సైద్ధాంతిక స్పష్టతను అందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఒక పరిశోధనా వారసత్వంగా
పుట్టినరోజు కానుక
2015లో, ఆయన 85వ జన్మదినాన్ని పురస్క రించుకొని ‘‘ఇహి జనమ్‌ ‌తుమ్హారే లేఖే’’ పేరిట ఆయన ఆత్మకథను ఢిల్లీలో పరమపూజనీయ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌భాగవత్‌ ‌విడుదల చేశారు. అనంతరం, మోహన్‌ ‌భాగవత్‌ ఆయనకు ఒక సంచిని అందిస్తూ, ఇది సంఘ్‌ ‌తరఫున ఒక చిన్న బహుమతి అని చెప్పారు. దానిలో రూ.85 లక్షల నగదు ఉంది. దీనికి చలించి పోయిన చిరంజీవ్‌ ‌సింగ్‌, ఆ ‌మొత్తాన్ని సిక్కు చరిత్రపై పరిశోధన కోసం వినియోగిస్తామని వెంటనే ప్రకటించారు. ఆ నిధులను కేశవ్‌ ‌స్మారక్‌ ‌సమితి ద్వారా మళ్లించి, ఆ తర్వాత భాయ్‌ ‌మణి సింగ్‌ ‌గుర్మత్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌స్టడీస్‌ ‌ట్రస్ట్‌కు అప్పగించారు. ఇది పాండిత్యం పట్ల, సత్యం పట్ల ఆయన జీవితకాల నిబద్ధతకు చివరి నిదర్శనం.
మార్గదర్శిగా ప్రచారక్‌
‌నవంబర్‌ 20, 2023‌న ఆయన కన్నుమూసి నప్పుడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వారిలో అప్పటి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌ ‌కూడా ఉన్నారు. ఆయన చిరంజీవ్‌ ‌సింగ్‌ను తన గురువుగా బహిరంగంగా అంగీక రించారు. నిజానికి, ఆయన మార్గదర్శకత్వంతోనే తరతరాల ప్రచారక్‌లు, స్వయంసేవకులు రూపుదిద్దు కున్నారు. పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌, ‌సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జారీ చేసిన అసాధారణంగా సుదీర్ఘమైన నివాళి సందేశాలు ఆయన చేసిన సేవను లోతును ప్రతిబింబించాయి.
తప్పుడు ద్వంద్వాలకు అతీతమైన వారసత్వం
రాష్ట్రీయ సిక్కు సంగత్‌ ‌నేడు తమ హిందూ నాగరికతా మూలాల పట్ల అవమానంగా కాకుండా, గర్వంగా భావించే జాతీయవాద సిక్కుల వేదికగా నిలుస్తోంది. జఫర్‌నామాపై సెమినార్లు, సిక్కు అమరవీరుల ప్రదర్శనలు, గురు గోవింద్‌ ‌సింగ్‌ ‌జీ రచనల అనువాదాలు, సంగత్‌ ‌మాసపత్రిక ‘సంగత్‌ ‌సంసార్‌’ ‌ద్వారా చిరంజీవ్‌ ‌సింగ్‌ ఆశయాన్ని కొనసాగిస్తోంది.
వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీక రించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌జీవితం నిస్సందేహంగా ఇస్తుంది. ఆయనను మొదట ‘‘జీ’’ అని పిలిచిన శాఖ నుండి, సంఘ్‌ ‌మొదటి సిక్కు ప్రచారక్‌గా ఎదిగే వరకు సాగిన ఆయన ప్రస్థానం, భారత్‌ ‌బలం విచ్ఛిన్నంలో కాకుండా నాగరిక ఐక్యతలోనే ఉందని గుర్తుచేస్తుంది. ఆయనను స్మరించుకోవడం ద్వారా మనం కేవలం ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవడం లేదు. కాలపరీక్షకు అతీతమైన ఆయన దృక్పథాన్ని స్మరించుకుంటున్నాము.

About Author

By editor

Twitter
YOUTUBE