ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

‌ప్రపంచంలో కొన్ని వేల మంది మాట్లాడే చిన్నచిన్న భాషలు మనుగడ కోల్పోతుండగా, పెద్ద సంఖ్యలో మాట్లాడుకొనే భాషలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా భాషలను, భాషా సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోగలమని ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అభి ప్రాయపడింది. అలా, 2000 సంవత్సరం నుంచి ఏటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని పాటిస్తోంది. మాతృభాష కోసం జీవితాలను త్యాగం చేసిన బాంగ్లా దేశ యువకులు స్మృత్యర్థం ఈ నిర్ణయం తీసుకొంది. ఇది ఆ దేశ యువకుల బలిదానం ఫలితమే అయినా, యావత్‌ ‌ప్రప•ంచానికి వర్తించే అంశం. దీనివల్ల భాషాశాస్త్ర విస్తరణతో పాటు బహు భాషల అధ్యయనం, ఆయా సమాజాలకు భాషాశాస్త్రం, సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని కూడా యునెస్కో పేర్కొంది. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘జాతీయ విద్యావిధానం-2020’లో మాతృభాషలోనే విద్యాబోధనకు అవకాశం కలిగించింది.

‌ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా ఉన్నత విద్యను ఆధునికీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. ప్రాథమిక విద్యా స్థాయిలోనే మాతృభాష అస్తిత్వానికి భంగం వాటిల్లు తోందన్న ఆందోళన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం-2020’లో భారతీయ భాషలకు/మాతృభాషలకు ప్రాధాన్యం కల్పించింది. ప్రాథమిక విద్య వరకు ‘అమ్మభాష’లోనే బోధించాలని నిబంధన విధించింది. వీలైతే 8వ తరగతి వరకు, ఆపై తరగ•తులలో కూడా ఆ విధానాన్నే కొనసాగిం చాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. బోధనలో ప్రాంతీయ/మాతృభాషలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఏ ఇతర భాషను బలవంతంగా అమలు చేయడం కాని, ఇతర భాషలను వ్యతిరేకించడం కాని ఉండదని ఈ విద్యావిధానం స్పష్టం చేస్తోంది.‘వివిధ దేశాల విద్యా విధానాల సమగ్ర అధ్యయనం తరువాతే, మన దేశంలోనూ ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని సూచించాం. పదవ తరగతి వరకు ‘అమ్మభాష’లో చదివితే ఇంకా మంచిది. ఆ తరువాత ఆంగ్లం తదితర భాషలను సులువుగా నేర్చుకోగలుగుతారు’ అని విద్యా విధాన కమిటీ చైర్మన్‌, ఇ‌స్రో పూర్వ అధిపతి డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ ‌తమ నివేదికలో పేర్కొన్నారు.
స్వరాజ్యం అనంతరం మన దేశ విభజనతో (1947) పాకిస్తాన్‌ ‌భౌగోళికంగా తూర్పు (నేటి బాంగ్లాదేశ్‌), ‌పశ్చిమ (నేటి పాకిస్తాన్‌)‌గా విడిపో యింది. అయితే భాషా సంస్కృతుల పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రధానంగా తూర్పు భాగంలో అత్యధిక ప్రజలు బెంగాలీ లేదా బాంగ్లా భాష మాట్లాడేవారు. కానీ పాకిస్తాన్‌ (1948) ‌ప్రభుత్వం ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించడం పట్ల ‘తూర్పు’ ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఉర్దూతో పాటు తమ ప్రాంతంలో వ్యవహారంలో ఉన్న బెంగాలీని జాతీయ భాషగా ప్రకటించాలన్న కోరికను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం జనం ఆందోళన బాటపట్టారు. ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్‌ ‌చర్యలకు దిగింది.
ఫిబ్రవరి 21, 1952న నిరసన ప్రదర్శన చేపట్టిన ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులకు దిగారు. నలుగురు విద్యార్థులు మరణించారు, అనేకులు గాయపడ్డారు. ఆ సంఘటనకు నిరసనగా, ముస్లిం లీగ్‌ ‌పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేసింది. ఉద్యమం ఉధృతం కావడంతో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం దిగి వచ్చి బెంగాలీని రాష్ట్ర భాషగా (ఫిబ్రవరి 29,1956) స్వీకరించింది. తూర్పు పాకిస్తాన్‌ ‌బాంగ్లాదేశ్‌గా స్వతంత్రం కాగానే (1971) బెంగాలీని జాతీయభాషగా ప్రవేశపెట్టింది. మాతృభాషకు గౌరవం కోసం నలుగురు ప్రాణత్యాగం చేసిన రోజును (ఫిబ్రవరి 21) అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించాలని దాదాపు మూడు దశాబ్దాలకు(1999) పారిస్‌లో యునెస్కో సమావేశంలో బాంగ్లాదేశ్‌ ‌ప్రతిపాదించింది. దానిని యునెస్కో ఆమోదించింది. ఇది ఆ దేశ యువకుల బలిదానం ఫలితమే అయినా, యావత్‌ ‌ప్రప•ంచానికి వర్తించే అంశం.
భాషకు భావ వ్యక్తీకరణే కాదు..సామాజిక స్వరూపం, సాంస్కృతికి ప్రాభవం ఉన్నాయి. సాంస్కృతిక వారసత్వానికి భాష ప్రాథమిక సాధనం. మానవ జాతి మనుగడలో భాషలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఆ•పాటలు, సంగీత సాంస్కృతిక సామూహిక కార్యక్రమాలు, వ్యాపార సంబంధాలు భాషతోనే ముడిపడి ఉంటాయి. సమాజాన్ని సృష్టించేది భాషే. దానిని సమాజం నుంచి వేరుచేసి చూడలేం.. మాతృభాషపై పట్టులేని ఏ జాతి పరిపూర్ణ ప్రగతిని సాకారం చేసుకోలేదని, ఒక భాష ఉనికి కోల్పోతే దానిని ఆవరించి ఉన్న చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని భాషావేత్తలు అంటారు. ప్రాథమిక విద్యాభ్యాసం సొంతభాషలో ఉంటేనే విద్యార్థుల్లో సామర్థ్యం, నైపుణ్యం వేగంగా వృద్ధి చెందుతాయని యునెస్కో, యునిసెఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
భావాన్ని నిర్దిష్టంగా వ్యక్తీకరించడంలో మాతృ భాషను మించినది లేదనడం నిర్వివాదాంశం. ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషకు సాటిరాదని, ఒక అంశాన్ని నిగూఢంగా చెప్పాలంటే అది అమ్మభాషకే సాధ్యమని అనేక అంశాలు రుజువు చేస్తున్నాయి. మాతృభాషలో చెబితే, ఎంతటి క్లిష్టతర అంశాలైనా తేలికగా ఒంటపడతాయి. అందుకే, బోధనలో అమ్మభాషకు పెద్దపీట వేయాలని ప్రఖ్యాత శాస్త్రవేత్త, పూర్వ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలామ్‌ ‌వంటివారు గట్టిగా సిఫార్సు చేశారు.
భాష, సంస్కృతులు విద్యావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. జర్మనీ, జపాన్‌, ‌చైనా వంటి దేశాలు బోధన, పాలనా వ్యవహారాలను మాతృ భాషలోనే నిర్వహిస్తూ, ఏదో ఒక విదేశీ భాషను అదనపు అంశంగా నేర్పిస్తారు. మాతృభాషలో విద్యాబోధన కారణంగానే జపాన్‌, ‌దక్షిణకొరియా లాంటి దేశాలు శాస్త్రరంగాలలో దూసుకుపోతున్నాయి. వృత్తివిద్యా కోర్సులను కూడా మాతృభాషలోనే బోధించడం ఐరోపా దేశాల ప్రత్యేకత. అమ్మభాష ద్వారా పడిన జ్ఞానబీజాల ఆసరాతో జర్మన్‌, ‌రష్యా, జపాన్‌, ‌బల్గేరియాలు లోతైన శాస్త్రాధ్యయనానికి, విస్తార పరిశోధనలకు ప్రోత్సహిస్తున్నాయి.
ప్రపంచీకరణ పేరుతో బహుళ జాతి సంస్థల విస్తరణ, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థల వంటి వాటి విజృంభణతో మాతృభాషలు విపరీత మైన ఒత్తిళ్లకు లోనవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం, వ్యాపార పారిశ్రామిక రంగంలోని శక్తులు ప్రాంతీయ, మాతృ భాషల అస్తిత్వాలకు సవాల్‌గా మారాయనే అందోళనా వ్యక్తమవుతోంది. బహుముఖంగా విస్తరించే విజ్ఞానానికి వాహిక భాష. అది సామాజిక ప్రయోజ నాలకు అనుగుణంగానే అది వృద్ధి చెందుతుంది. ఏ భాషకైనా ఆదాన ప్రధానాలు సహజం. ఒక భాష సమయానుకూల వాతావరణాన్ని బట్టి, అవసరాలకు తగినట్లుగా ఇతర భాషా పదాలను స్వీకరిస్తుంది. అలా.. వలసలు, వర్తక వ్యాపారాల కారణంగా విభిన్న భాషా వ్యవహారాలతో సంపర్కం కలిగి భాష విస్తరిస్తుంది. సంస్కృతం, ప్రాకృతం, అరబిక్‌, ‌పర్షియా, ఆంగ్లం భాషల ప్రభావం దేశీయ భాషలపై విశేషంగా కనిపిస్తుంది. తెలుగుకు సంబంధించి సంస్కృతం, ఆంగ్లం తదితర భాషల నుంచి ఇబ్బడిముబ్బడిగా పదాలను గ్రహిస్తోంది. ‘అలాంటి వాటిని వ్యతిరేకించ లేం. వ్యతిరేకించ నవసరం కూడా లేదు. అయితే సొంత భాష అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఆయా పదాలను అవసరం మేరకే వాడాలి. కొత్త మాటల / పదాల సృష్టికి ప్రయత్నించాలి. భాషను కాపాడు కోవాలి’ అని భాషాభిమానులు, భాషావేత్తల అభిప్రాయం.
‘నిత్యజీవన వ్యవహారాల్లో,సంభాషణల్లో, సాహిత్య సంగీతాది కళల్లో, మాధ్యమాలు, వ్యాపార వాణిజ్య, విద్యారంగాలలో ఏ భాష అయినా దూరమవు తోందంటే… అది అంతర్ధానానికి చేరువవుతున్నట్లేగానే భావించాలి. నిర్ణీత సంఖ్య సం•్యలో జనం తమతమ భాషల్లో మాట్లాడుకోకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది’ అని యునెస్కో ఎన్నడో హెచ్చరించింది. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలు గల భాషలు సుమారు ఆరు వేలు ఉండగా, ప్రపంచీకరణ పుణ్యమాని వాటిలో రమారమి సగం మేర ప్రమాదంలో పడ్డాయి. కడచిన మూడు శతాబ్దాల కాలంలో కేవలం అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతమై పోయాయి. ప్రపంచవ్యాప్తంగా గడచిన అరవై ఏళ్లలో 230 భాషలు అంతరించాయని, ప్రస్తుతం మరో 2,356 భాషలూ ఇదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే…. ఈ శతాబ్దాంతానికి ప్రపంచ భాషల్లో దాదాపు సగం అంతరించిపోతాయని, అదే జరిగితే… భాషా వై••విధ్యంతో ముడిపడి ఉన్న జీవవైవిధ్యం పెను ప్రమాదంలో పడుతుందన్నది యునెస్కో హెచ్చరిక.
‘భాషను మనం సంరక్షించుకుంటే, అది మన స్వేచ్ఛను కాపాడుడుంది. మాతృభాషను ప్రేమించని వాడు జంతువుకంటే హీనం’ అన్నారు ఫి••లిప్పీన్స్ ‌జాతీయోద్యమ నేత జోస్‌ ‌రిజాల్‌. ‘ఒకవేళ మనం మాట్లాడేభాష అంతరిస్తే, ప్రత్యామ్నాయ భాషను ఉపయోగించవచ్చుకదా?’ అనే అతి తెలివిపరులకు, వితండవాదులకు ‘ఒక భాష మరణంతో ఆ జాతి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అనేక రూపాలు మాయమవుతాయి. ప్రధానంగా అపురూపం, అమూల్యమైన ఆచార వ్యవహారాలు, సామెతలు, నానుడులు, జాతీయాలు, చమత్కార రూపాల్లోని ఆ జాతి మౌఖిక భావ వ్యక్తీకరణలు, ఆ జాతి ఆవాస ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణ సమాచారం రూపుమాసిపోతాయి. ఏ భాష అంత రించినా మానవ మేధలో కొంత భాగం అంతర్ధాన మైనట్లే’నని యునెస్కో పూర్వపు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌కొయిచిరో మత్సుర ఖరాకండిగా చెప్పారు.
ఇక, మన భాష తెలుగువరకే తీసుకుంటే, ఈ భాష మాట్లాడే యువత, విద్యార్థులు 27-30 శాతానికంటే తక్కువగా ఉంటే, అది మృతభాషగా మారేందుకు ఎంతోకాలం పట్టదని యునెస్కో హెచ్చరించింది. కాగా, ప్రవాసాంధ్రుల మాట (అమ్మ భాషను కాపాడుకునేందుకు వారికే ఆరాటం ఎక్కువ నేందుకు వారు నిర్వహించే కార్యకలాపాలే నిదర్శనం) రెండు తెలుగు రాష్ట్రాలలో 40 ఏళ్ల వయసులోపు వారిలో అధిక శాతం మంది తెలుగు మాట్లాడేందుకు బిడియపడుతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బడుల్లో.. ముఖ్యంగా ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల్లో తెలుగులో మాట్లాడే చిన్నారులు ‘శిక’•లు ఎదుర్కొంటున్న సందర్భాలు మాధ్యమాల్లో కనిపిస్తుం టాయి. అందుకు భిన్నంగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు అమ్మభాషను కంటికి రెప్పలా కాచుకుంటు న్నాయి. దేశంలో ప్రజల భాషను పాలన భాషగా పూర్తిస్థాయిలో అమలుపరచనిగా రెండు తెలుగు రాష్ట్రాలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. దేశంలోని ఇతర భాషీయులు సంగతి ఏమోగానీ, ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడు కుంటారనే అపప్రథ ఉండనే ఉంది. దానిని చేరిపేసి, సొంతభాషలో మాట్లాడుకోవడాన్ని ఆత్మ న్యూనతగా కాకుండా గర్వం, గౌరవంగా భావించే సమయం రావాలి.
ప్రాథమిక విద్యలో భారత్‌ ‌కొన్ని దశాబ్దాలు వెనుకబడిపోయిందని ఇటీవలి కాలంలో యునెస్కో అధ్యయన పత్రం పేర్కొంది. ఆ పరిస్థితిని నివారించి, ప్రాథమిక విద్యను వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా పరిగణించాలి. అందుకు నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న మాతృభాషకు సంబంధించిన అంశాలను త్రికరణశుద్ధిగా ఆచరించాలి.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE