‘భారతదేశానికి మొదటి శత్రువులు భారతదేశంలోనే ఉన్నారు. తరువాతే పాకిస్తాన్‌ ‌శత్రుత్వం…’

‘ఇలాంటివాటికి సమాధానం చెప్పడానికి అవకాశం ఇచ్చే ఒక ప్రభుత్వం ఏదో ఒకరోజు వస్తుంది. అప్పుడు చూద్దాం’..

‘ఇది నవభారతం. మాకు ద్రోహం చేస్తే మీ ఇంటిలో చొరబడి అయినా సరే సంగతి చూస్తాం..’

నిజమే, భారత్‌కు ప్రథమ శత్రువులు భారత్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ది రెండో స్థానమే. చారిత్రక వాస్తవాల సారాంశం, వర్తమాన పరిణామాల మూలం, భారత్‌ ఎదుర్కొంటున్న ఇన్ని సమస్యలకు కీలకం ఏమిటో చెప్పే చేదునిజమిది. ఈ సమస్యలను సృష్టిస్తున్న వారు ఎవరో తెలుసు. దీనిని ఎదుర్కోవడం ఎలాగో తెలుసు. కానీ ఆ పనిచేయగలిగినవారి చేతులు కట్టేసిన కాలం ఒకటి రాజ్యమేలింది. ఆ బాధను అణుచుకున్న గుండెలు పలికిన మాట ఇది- ఏదో ఒకరోజు ఇలాంటి వాళ్లకి సమాధానం చెప్పే అవకాశం కల్పించే ప్రభుత్వం ఒకటి వస్తుంది. వారు కోరుకున్నట్టు నిజంగానే వచ్చింది. ఆ ప్రభుత్వ అధినేత చేసిన హెచ్చరికే- ఇది నవభారతం…ఈ మూడు సంభాషణల నేపథ్యాలు ధురంధర్‌ (‌హిందీ) చిత్రాన్ని నడిపిస్తాయి.

కశ్మీర్‌ ‌ఫైల్స్, ‌కేరళ స్టోరీ, బెంగాల్‌ ‌ఫైల్స్, ఆర్టికల్‌ 370, ‌యురి వంటి సినిమాల మాదిరిగానే వామపక్షవాదుల వక్రభాష్యాలను, వికృత వ్యాఖ్యలను దాటుకుని ప్రస్తుతం దేశమంతా చర్చకు కారణమైన సినిమా ధురంధర్‌. ఆదిత్య ధర్‌ ‌దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం ఇతివృత్తం, చిత్రీకరణ, నటుల ప్రతిభ అద్భుతమే. డిసెంబర్‌ 5‌న విడుదలైన ఈ చిత్రం జాతీయ భావాలను నిరంతరం హేళన చేసే, దేశభక్తిని మూఢత్వంగా చిత్రించే నకిలీ మేధావులలో, ఉదారవాదులలో వణుకు పుట్టించింది.

భారత్‌-‌పాకిస్తాన్‌ల మధ్య పరోక్ష యుద్ధంలోని ఒక కీలక ఖండాన్ని అత్యంత వాస్తవికంగా చిత్రించినదే ధురంధర్‌. ఎనిమిది అధ్యాయాలు (చాప్టర్‌లు)గా దర్శకుడు ఇతివృత్తాన్ని విభజించారు. వాటి పేర్లు- ది ప్రైస్‌ ఆఫ్‌ ‌పీస్‌, ‌స్ట్రేంజర్‌ ఇన్‌ ‌ది ల్యాండ్‌ ఆఫ్‌ ‌షాడోస్‌, ‌ది బాస్టర్డ్ ‌కింగ్‌ ఆఫ్‌ ‌లయారి, బులెట్స్ అం‌డ్‌ ‌రోజెస్‌, ‌ది జిన్‌, ‌ది డెవిల్స్ ‌గార్డియన్‌, ‌ది బటర్‌ఫ్లై ఎఫెక్ట్, ఇట్‌ ‌టు బ్రూటస్‌.

‌తొలి చాప్టర్‌ ఆరంభం లేదా సినిమా మొదలు- హైజాక్‌ అయిన భారత విమానం ఐసీ 814 అఫ్ఘానిస్తాన్‌ ‌కొండలలో ఉంటుంది. ఇది డిసెంబర్‌ 30,1999‌న జరిగిన వాస్తవ ఘటన. బయట నిలబడి ఉన్న ఇంటెలిజెన్స్ ‌బ్యూరో అధిపతి అజయ్‌ ‌సన్యాల్‌ (అజిత్‌ ‌ధోవల్‌ ‌పాత్ర) దగ్గరకు దేవవ్రత కపూర్‌ (‌నాటి విదేశ వ్యవహారాల మంత్రి జస్వంత్‌సింగ్‌) ‌వచ్చి మంత్రిమండలి నిర్ణయం చెబుతాడు. ముగ్గురు కీలక ముస్లిం మతోన్మాద ఉగ్రవాదులను వాళ్లకి అప్పగించడానికి, (బతికి ఉన్న) విమాన ప్రయాణికులను విడుదల చేయడానికి కోటి అమెరికా డాలర్లకు ఒప్పందం చేసుకోవడం ఈ భాగంలో ప్రధానం. పాకిస్తాన్‌కు మన గూఢాచారులను పంపించడానికి అంతకు ముందు నిరాకరించిన ఆర్‌ అం‌డ్‌ ఏ ‌డబ్ల్యు అధిపతి ఇక తప్పక ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు. రెండో అధ్యాయంలో హమ్జా అలీ మజారీ అనే పేరుతో భారత గూఢచారిని అఫ్ఘాన్‌ ‌ద్వారా పాకిస్తాన్‌ ‌చేరుస్తారు. అక్కడి కరాచీలోని లయారీలో ఆయన పని చేయాలి. ప్రతి అధ్యాయం ఒక మలుపుతో, మొదలై మరొక మలుపుతో ముగుస్తూ ఉంటుంది.

రహమాన్‌ ‌డెకాయిట్‌ ‌లేదా రహమాన్‌ ‌బలోచ్‌ అనే గ్యాంగ్‌స్టర్‌తో చాలా తెలివిగా హమ్జా కలుస్తాడు. రహమాన్‌ ‌ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్‌ ‌బాబూ డెకాయిట్‌ అతడి పెద్ద కొడుకును చంపినప్పుడు అతడి వెంటే ఉన్న చిన్నకొడుకును రక్షించి రహమాన్‌కు దగ్గరవుతాడు. ఈ రహమాన్‌ ‌లయారీలో ఒక నేర సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. అక్రమ ఆయుధాలు, దొంగనోట్లు, ఉగ్రవాదులకు ఆశ్రయం వంటివన్నీ లయారీలోనే ఉంటాయి. వీళ్ల ప్రాపకం కోసం రాజకీయ పార్టీలు, ఇతర ముఠాలు ప్రాకులాడుతూ ఉంటాయి. లయారీలోకి ఎవరూ ప్రవేశించే సాహసం చేయరు. మొత్తానికి వీళ్లందరి మధ్య గొడవలు పెరిగేటట్టు చేసి, వారంతా ఒకరినొకరు చంపుకొనేటట్టు చేస్తాడు హమ్జా.

కాందహార్‌ ఉదంతం, తరువాత పార్లమెంట్‌ ‌మీద దాడి, ఆపై 26/11 ముంబై హత్యాకాండ వంటి భారత సార్వభౌమతాన్ని సవాలు చేసిన సంఘటనలను దర్శకుడు చిత్రించాడు. ఐదు వందల నోట్లకు సంబంధించిన బ్లాకులు భారత కేంద్రమంత్రి ఒకరే పాకిస్తాన్‌లో గ్యాంగ్‌లకు అందిచారన్న మాట విస్తుగొలుపుతుంది. ముంబై తాజ్‌ ‌హోటల్‌లో రక్తపాతం సృష్టిస్తున్న కసబ్‌కు యారీలో ఆనందంగా టీవీల ముందు కూర్చుని సూచనలు ఇచ్చే సన్నివేశం నిజంగానే కలచివేస్తుంది. అది మన మీడియా సాయంతోనే జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడ నుంచి కమాండోలు వస్తున్నారు? ఎక్కడ నుంచి పోలీసులు కాపు కాశారు వంటి విషయాలన్నీ ఆనాడు మన మీడియా కూలంకషంగా ఇచ్చింది. వీటిని లయారీ నుంచి ముంబైలోని కసబ్‌కు సమాచారం ఇచ్చారు. తరువాత వాళ్లు అనుకునే మాటలు కూడా అవమానకరంగా అనిపిస్తాయి. ముంబై దెబ్బకి భారత్‌ ‌దాడి చేస్తుందని అనుకున్నాం, ఇలా చేతకాని తనం ప్రదర్శంచిందేమిటి? అని నవ్వుకుంటారు. ముంబై దాడి కోసం హమ్జా ఎదుటే చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే నోరు విప్పలేని పరిస్థితి. ఆ రహస్యం స్వదేశానికి చేరవేయలేని పరిస్థితి. ఆఖరికి దాడులు కూడా జరిగిపోతాయి. ఆ ముఠాలన్నీ అల్లాహోఅక్బర్‌ అం‌టూ విజయ నినాదాలు చేస్తాయి. వాళ్లందరితో కలసి ఈ గూఢచారి కూడా అత్యంత బాధాకరంగా గొంతు కలపడం వంటి సన్నివేశాలలో రణ్‌వీర్‌ అద్భుతంగా నటించారు.

ధురంధర్‌లో హింస భాగం ఎక్కువగా ఉందని ఇదివరకు హింసను అతిగా, అనవసరంగా చూపించిన సినిమాలలో నటించిన వారు ఆరోపిస్తున్నారు. హింస తక్కువగా ఉండడం మంచిదే అయినా, పరమ కిరాతకంగా ఉండే గ్యాంగ్‌స్టర్‌ల గురించి, వారి ఖండాంతర కుట్రల గురించి చెప్పేటప్పుడు హింసాత్మక ఘట్టాలను పరిహరించడం వాస్తవికతకు అద్దంపట్టదు. తన అడ్డాలోకి వస్తున్న ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్‌ ‌మనుషులను రహమాన్‌ ‌డెకాయిట్‌ ఎం‌త దారుణంగా చంపిస్తాడో చెప్పే సన్నివేశం, పాకిస్తాన్‌కు దొరికిపోయిన భారత గూఢచారులను ఐఎస్‌ఐ ‌మనుషులు ఎంత కిరాకతంగా హింసిస్తారో చూపే సన్నివేశం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అదే సమయంలో గూఢచారులకు దేశం పట్ల ఉండే నిబద్ధత, దేశ రక్షణ పట్ల ఉండే పట్టుదలను చూపిస్తాయి. అయితే దేశంలో చాలామంది పాకిస్తాన్‌ ‌భక్తులు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల మీద ఈగ వాలకుండా చూడడం తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టు వ్యవహరించే హక్కుల కార్యకర్తలకు ఆ త్యాగాలు, నిబద్ధత పట్టలేదు. ఉగ్రవాదులు అయినప్పటికీ వారికీ కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి, పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్‌లని ఇంత దారుణంగా చిత్రించడం ఏమిటి అంటూ వాపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రజలు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ముంబైలో చాలా థియేటర్లలో రాత్రిపగలు ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు.

ఈ చిత్రంలో లయారీ, ఆ ప్రాంతం ఉన్న కరాచీ యథాతథంగా కనిపిస్తుంది. కానీ అదంతా థాయ్‌లాండ్‌, ‌బ్యాంకాక్‌లలో సెట్‌లు వేసి చిత్రించారు. ఇంకొంత లద్దాక్‌, ‌చండీఘడ్‌లలో చిత్రించారు. అచ్చంగా లయారీలోనే ఉన్న అనుభూతి కలిగించడానికి మరొక కారణం నేపథ్య సంగీతం.

ఇందులోని పాత్రలన్నీ నిజ జీవితంలోనివే. హమ్జా మజారీ పాత్రకు మోహిత్‌ ‌శర్మ అనే రహస్య గూఢచారి పాత్రను నమూనాగా తీసుకున్నారు. దీనిని రణ్‌వీర్‌ ‌సింగ్‌ అత్యద్భుతంగా పండించారు. ఇక రహమాన్‌ ‌డెకాయిట్‌ ‌పాత్రలో అక్షయ్‌ ‌ఖన్నా విశేష ప్రతిభను ప్రదర్శించారు. రహమాన్‌ ‌డెకాయిట్‌ ‌గ్యాంగులను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఉన్న ఎన్‌కౌంటర్‌ ‌స్పెషలిస్ట్ ఎస్‌పీ చౌదరీ ఆలంగా సంజయ్‌ ‌దత్‌ ‌మరపురాని నటనను ప్రదర్శించారు. అజయ్‌ ‌సన్యాల్‌ ‌పాత్రలో ఆర్‌ ‌మాధవన్‌ ‌చెరగని ముద్ర వేసే విధంగా నటించారు. వికాస్‌ ‌నవలఖా సినిమాటోగ్రఫీ, శాశ్వత్‌ ‌సచిదేవ్‌ ‌సంగీతం అందించారు. దర్శకత్వం చిత్రానువాదం, సంభాషణలు కూడా ఆదిత్య ధర్‌ ‌సమకూర్చారు.

ఈ చిత్రం సీక్వెల్‌ ‌వచ్చే సంవత్సరం మార్చిలో రాబోతున్నది.

భారత చలనచిత్రంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్‌ ఇప్పుడు కేవలం భారత్‌లోనే చర్చనీయాంశం కాదు. పాకిస్తాన్‌ ఈ ‌చిత్రాన్ని నిషేధించి అక్కడ కూడా చర్చకు అవకాశం ఇచ్చింది. బహ్రెయిన్‌, ‌కువైట్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌సౌదీ అరేబియా, ఒమన్‌ ‌దేశాలు కూడా పాక్‌ను అనుసరించాయి. ధురంధర్‌కు పోటీగా ‘మేరా లయారీ’ పేరుతో చిత్రం నిర్మిస్తున్నట్టు సింధ్‌ ‌ప్రాంత ప్రభుత్వం ప్రకటించింది. ధురంధర్‌ ‌ప్రతికూల ప్రచారం చేసే ఉద్దేశంతో నిర్మించారని సింధ్‌ ‌ప్రాంత ప్రభుత్వ సమాచార మంత్రి షర్జిల్‌ ఇనామ్‌ ‌మెమన్‌ ‌డిసెంబర్‌ 13‌న ప్రకటించారు. మేరా లయారీలో ఎంత శాంతిభద్రతలు పరిఢవిల్లాయో, సంపద ఉండేదో, పాకిస్తాన్‌కు ఎలా గర్వకారణమో ఆ చిత్రం తెలియచేస్తుందని కూడా ఆ మంత్రి ప్రకటనలో తెలియచేశారు. ఈ చిత్రంలో పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ చిహ్నాలను ఉపయోగించి అవమానించారని, లయారీని ఉగ్రవాద కేంద్రంగా చిత్రించడం వాస్తవానికి విరుద్ధమని మహమ్మద్‌ ఆమీర్‌ ‌కరాచీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనితో దర్శకుడు ధర్‌ ‌మీద, ఇతరుల మీద కేసు నమోదైంది.

దర్శకుడు ధర్‌

About Author

By editor

Twitter
YOUTUBE