నేను డేరావల్‌ ‌వెళ్లినప్పుడు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లాను. ఆ కార్యకర్త తన ఇంట్లో గోడకు ఓ చిత్రాన్ని తగిలించి ఉంచాడు. వాళ్ల ‘వంశ వృక్షం’ ఫోటో అది. మూలాలున్నాయి, అంతేకాదు దాదాపు ఇప్పుడున్న యువకులపేర్లతో పాటు ఆ వంశ వృక్షంలోని రెండు కొమ్మలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కొద్దిపాటి చీలిక కూడా రాలేదు. దగ్గర దగ్గర అందులో 25 తరాలు ఉన్నాయి. అంటే ప్రతి కొత్తతరం వాటి వైపు చూస్తూనే ఉన్నాయి.

ఒక స్కూల్‌లో పిల్లలకి పోటీ పెట్టారు, ఏడు తరాల వారి పేర్లు చెప్పాలని. దీనికి సంబంధించిన ప్రశ్నావళి క్విజ్‌ ‌రూపంలో పెట్టారు. చెప్పొచ్చేదేమంటే, దీనితో మనం ముడిపడాలి. ఆ తర్వాత మెలమెల్లగా మా ఊరు, మా పట్టణం, మా సమాజం, ఇక్కడ పలువురు శ్రేష్ఠ మహాపురుషులుండే వారు అని పేర్కొంటూనే ఎక్కడో ఓ చోట వారితో బంధం కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ప్రయోగాన్ని చేయవచ్చు.

మరోవిషయం ఏమంటే మెల్లమెల్లగా కొత్త తరాల వారికి వారి పెద్దల పట్ల ఆధార భావాన్ని ఉత్పన్నం చేసేందుకు, కుటుంబ పరంపరలని పాటించే విధంగా ఆ కొత్త తరాలని ప్రోత్సహించాలి. నేను ఓ సారి బర్మా వెళ్లాను, అక్కడ ఒక ఉమ్మడి కుటుంబాన్ని చూశాను, విశేషమేమంటే ఆ ఉమ్మడి కుటుంబంలో నాలుగు తరాల వారు కలిసే జీవిస్తున్నారు. వారి తండ్రి సుమారు 9 సంవత్సరాల నుండి కోమాలో ఉన్నాడు. ఆయనకు వారంతా కలిసి ఏంతో ఆత్మీయతతో సేవలందిస్తున్నారు, సపర్యలు చేస్తున్నారు. ఇవాళ ఈ విషయాన్ని పోల్చి చూసినప్పుడు నోయిడా ప్రాంతంలో కమర్షియల్‌ ‌వృద్ధాశ్రమాలు ప్రారంభ మయ్యాయి. మొదట్లో ఇవన్నీ సేవాభావంతో కొనసాగేవి, ఇప్పుడవి కమర్షియల్‌గా మారిపోయాయి. ఎందుకంటే ఇవాళ పిల్లలకి తీరిక లేకుండాపోయింది, కేవలం సంపాదనలో పడిపోయారు. జీవితమంటే కేవలం కూడు, గుడ్డ ఇంతేనా? ఎప్పుడయితే కోరికలు ఇలానే కేంద్రితమై ఉంటాయో అప్పుడు పరిస్థితి సామాజిక జీవనంలో మనల్ని నిలదీస్తుంది. నేను ఒకసారి లక్నో వెళ్లాను. అక్కడి యూనివర్సిటీ వైస్‌ ‌ఛాన్సలర్‌ ఇం‌తకుముందు ముంబైలోని పెద్ద మల్టీ నేషనల్‌ ‌కంపెనీలో పని చేసేవారు. మంచి జీతం వగైరాలన్నీ ఉండేవి. ఇవాళ రేపు ఆయన బాగానే ఉంటారు. వస్తువులు కొనేందుకు నాన్న గారే బజారుకు వెళుతుంటారు. నాన్నగారు వ్రాసిన ఉత్తరంలో విషయాలు చదివాక ఆయనకి అర్థమై ఉండొచ్చు.. తానుండగా నాన్న గారికి శ్రమ ఎందుకు అని భావించి మల్టీనేషనల్‌ ‌కంపెనీ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలానికి వెళ్లిపోయి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరిపోయాడు. పితృ యజ్ఞం విషయంలో నేను చెప్పేదేమంటే ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవంగా, ఆదరంగా చూడాలి. ఈ కోణంలో మన పరంపరను వికసింప చేయాలి, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను అలవరచుకునే ప్రయత్నం చేయాలి.

పాత విషయాలను మనం చాలానే వింటూ ఉంటాం…. ఆశుతోష్‌ ‌ముఖర్జీ హైకోర్టు జడ్జీగా ఉండేవారు. ప్రతిరోజూ అమ్మ పాదాలని ఒత్తు తుండేవారు. లార్డ్ ‌కర్జన్‌ ఆ ‌సమయంలో మనదేశంలో వైస్రాయ్‌గా ఉన్నారు. ఆయన ఓసారి ఆశుతోష్‌ ‌ముఖర్జీని ఇంగ్లాండ్‌కు వెళ్లమన్నారు. అందుకు ముఖర్జీ సరేనన్నారు. ఇంగ్లాండ్‌ ‌వెళ్లనున్నట్లు అమ్మతో చెప్పారాయన. దాంతో అమ్మ ‘నాయనా! నా ఆరోగ్యం బాగా లేదు, నువ్వు ఇంగ్లాండ్‌కు వెళితే నా బాగోగులు ఎవరు చూస్తారు’ అని చెప్పింది. ఇంగ్లాండ్‌కు వెళ్లకూడదన్న నిర్ణయం ఆయన వెంటనే తీసుకున్నారు. అంతేకాదు, తాను ఇంగ్లాండ్‌కు వెళ్లలేననీ, తన మాతృమూర్తి వెళ్లవద్దని చెప్పిందంటూ ఆయన లార్డ్ ‌కర్జన్‌కు ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని చదవగానే లార్డ్ ‌కర్జన్‌ ఆశుతోష్‌ ‌ముఖర్జీకి ఫోన్‌ ‌చేసి భారత వైస్రాయ్‌ ఆదేశించాడని మీ తల్లిగారితో చెప్ప మన్నారు. అందుకు ముఖర్జీ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? ‘వైస్రాయ్‌ ఆదేశానికన్నా నాకు అమ్మ ఆదేశమే శిరోధార్యం’ అని చెబుతూ ముఖర్జీ ఫోన్‌ ‌పెట్టేశారు.

మరో చిన్న ముచ్చట… మన సుప్రీంకోర్టులో లాహోటీగారనే జడ్జీ ఉండేవారు. చీఫ్‌ ‌జస్టిస్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయాన ఈ సంఘటన జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు బాగా వృద్యాప్యంతో ఉన్న జస్టిస్‌ ‌లాహోటీగారి తల్లి కూడా వచ్చారు. చీఫ్‌ ‌జస్టిస్‌గా ప్రమాణస్వీకారం చేశాక వేదిక దిగిన జస్టిస్‌ ‌లాహోటీ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవకుండా నేరుగా తన తల్లి వద్దకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కారం చేశారు. కుటుంబంలో ఏ పరంపరలయితే (సాంప్రదాయాలు) మొదటి నుండి కొనసాగుతూ వస్తున్నాయో అవి తరతరాలుగా అందరికి సంక్రమిస్తూనే ఉంటాయని చెప్పేందుకే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను. దీన్ని బట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఇలాంటి సాంప్రదాయాలు లేని కుటుంబాలలో ఆ సాంప్ర దాయాలు అమలు చేసేవిధంగా ప్రేరేపించాలి. ఇలాంటి పరంపరలను కొనసాగిస్తున్న కుటుంబాలలో తరతరాలుగా అమలయ్యే విధంగా ప్రోత్సహించాలి.

నానాజీ దేశ్‌ముఖ్‌గారు మూడు నాలుగు వందల సంస్థలను ఏర్పాటు చేసి వాటిని స్థిరంగా నిలబెట్టారు. ఆయుర్వేద పరిశోధనా సంస్థని నెలకొల్పాలనే ఆలోచన నానాజీ మదిలో మెదిలింది. జెఆర్‌డీ టాటాతో వారికి మంచి స్నేహం ఉండింది. ఇది జెఆర్‌డీ టాటా చివరి రోజుల నాటి సంఘటన. ఇద్దరి నడుమ కేవలం మౌఖికంగా మాటామంతి మాత్రమే జరిగాయి. సరే, దీనికోసం అయిదు కోట్ల రూపాయలను తానిస్తానని టాటా వాగ్దానం చేశారు. ఆలా చెప్పిన కొద్ది రోజులకే టాటా కన్ను మూశారు. ఆ తర్వాత టాటా సంస్థలకు రతన్‌ ‌టాటా అధిపతి అయ్యారు. జెఆర్‌డీ టాటా విధి కర్మలకు నానాజీ వెళ్లారు. రతన్‌ ‌టాటాని పరామర్శించారు, మాటల సందర్భంలో ‘కొన్ని రోజుల క్రితం నేను జెఆర్‌డీ టాటాని కలిశాను. అప్పుడు జరిగిన చర్చలకు సంబంధించి నా వద్ద ఎలాంటి లిఖిత పూర్వక ప్రమాణపత్రం ఏమీ లేదు…’ అని నానాజీ చెబుతుండగానే రతన్‌ ‌టాటా వారిని మధ్యలోనే ఆపేశారు. విస్మయంగా చూస్తున్న నానాజీతో ‘జెఆర్‌డీ టాటా తన డైరీలో మీరు కలిసిన విషయాన్నీ, దీన దయాళ్‌ ‌శోధ్‌ ‌సంస్థాన్‌ ‌కోసం 5 కోట్ల రూపాయలు ఇస్తానని చేసిన వాగ్దానం గూర్చి రాసుకున్నారు. నేను 2 కోట్ల రూపాయల చెక్‌ను ఇప్పుడు తయారుచేసి ఉంచాను, దాన్ని మీరు తీసికెళ్లండి.. మిగతా డబ్బులను 15 రోజుల్లో మీకు పంపిస్తాను’ అని రతన్‌ ‌టాటా అన్నారు. ఈ సంఘటన గూర్చి విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమంటే మనిషి పోయిన వెంటనే దస్తావేజులను మాయం చేస్తూ, ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘిస్తూ ఉంటారు కొందరు.. అయితే కుటుంబ సంస్కారాలు నిబద్ధతతో కూడి ఉన్నప్పుడు దస్తా వేజుల్లోనే కాదు, డైరీలో రాసుకున్న ప్రస్తావనలని పూర్తిచేసి తమ పూర్వీకుల పేరు ప్రతిష్ఠలను నిలబెడతారు ఇంకొందరు. రతన్‌ ‌టాటా రెండవ కోవలోకి వచ్చే మనిషి.

ఒక ఆదర్శ సమాజం, మానవ సమాజం గూర్చి చర్చలు జరుగుతున్న ఈ సమయాన కుటుంబంలో గొప్ప సాంప్రదాయాలను అమలు చేస్తూనే, వాటిని రాబోవు తరాలవారికి అందించే ప్రయత్నాలు కొనసాగించాలి. ఈ కోణంలో పితృ యజ్ఞానికి మనం ఒక కొత్త డైమెన్షన్‌ ఇచ్చే ప్రయత్నం చేయాలి.

  1. దేవయజ్ఞం

వీటన్నిటి నిర్వహణకోసం సంస్కారం అవసర మంటారు మన పెద్దలు. ఈ సంస్కారాలు భావ జగత్తు కన్నా పైనే ఉంటాయి, అనగా భావనలపై ఉంటాయి. ఇదే క్రమంలో కొంతమేర ఉపాసన అవసరముంటుంది. మన వద్ద అవసరమైన ప్రకృతి వనరులున్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, పూజాదికాలు ఉన్నాయి. దేవతా పరిచయాలున్నాయి. గోరఖ్‌ ‌పూర్‌లోని గీతాప్రెస్‌ ‌వాళ్లు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పిల్లల కోసం బొమ్మలతో కూడిన ఆధ్యాత్మిక పుస్తకాలని కూడా ప్రచురిస్తున్నారు. భగవంతుడున్నాడు, ఆ భగవంతునితో పాటు ఉండే దేవీదేవతలు, వారి శక్తులూ ఉంటాయి. సరస్వతీ దేవిని మనం చదువుల తల్లిగా, యమధర్మరాజుని మనం మృత్యు దేవతగా, సూర్య భగవానుడిని జీవన ప్రదాతగా, చంద్రుడిని అనారోగ్యాల నుండి కాపాడే దేవుడిగా భావిస్తున్నాం. అంతేకాదు ప్రతి సమస్య నుండి బయటపడేందుకు, సమస్యల సమాధానాన్ని పొందటానికి అవసరమైన, మంత్రాలు, శ్లోకాలు, ప్రార్థనలు ఉన్నాయి. వీటిని అభ్యాసం చేస్తూనే సృష్టిలో దేన్నయితే మనం దైవ రూపంగా భావిస్తున్నామో దాంతో భావనాత్మక రూపంలో ముడిపడిపోతాం.

నదులున్నాయి, ఈ నదులని అశుద్ధం చేస్తున్నారు. ఒకానొక సమయంలో నదులని దేవీ రూపంగా భావించేవారు.

ఈ కారణంగానే గంగా నదిలో దిగి స్నానాదులు చేసేవారు కారు. అంటే ఒక దైవ స్వరూపంతో మానసిక బంధం ఏర్పడుతుంది. ఈ దిశాగా మనం యోచించినప్పుడు ఈ దేవ యజ్ఞాన్ని ఒక సంప్రదాయంగా రూపొందించవచ్చు.

– సురేష్‌జీ సోని, ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు

అనువాదం : విద్యారణ్య కామ్లేక

By editor

Twitter
Instagram