మతానికి వక్రభాష్యం ఫలితం
దేశ రాజధాని పరిసరాలలో తబ్లిఘి జమాత్ అనే సంస్థ నిజాముద్దీన్ మర్కజ్‌లో వేల మందిని పోగుచేసి ప్రార్థనలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాతో సహా చాలా టీవీ చానళ్ల పేనలిస్టులకు ఇదే ప్రశ్న ఎదురైంది. జాతీయ మీడియాలో ఒక వర్గమైతే ఇంకొక అడుగు ముందుకేసి ‘కేంద్రం నిద్రపోతోందా?’ అని కూడా నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాలంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసు శాఖ ఉండదు కాబట్టి అంటున్నారు. వాస్తవంగా, కేంద్రం బాధ్యత వహించింది కాబట్టే, మర్కజ్ నిర్వాహకుల మెడలు వంచింది కాబట్టే ఒక పెను విపత్తు నుంచి భారతదేశం బయటపడింది. దీనిని ఈ దేశ పౌరులంతా గుర్తించవలసిన అవసరం ఉందని నా విన్నపం. ఆ విషయం వివరించే ముందు నేను మరొక ముఖ్య విన్నపం కూడా చేస్తున్నాను. నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబ సభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవారు, ఏదో రకంగా పరస్పరం తాకిన వారు అంతా… మాతృసమానులు, పితృసమానులు.. సోదర సమానులు ఎల్లరు కూడా అల్లా వారసులుగా, స్వచ్ఛందంగా బయటకు రండి! కొవిడ్ 19…