Media Card

Replace this text with descriptive copy to go along with the card image. Then add more blocks to this card, such as buttons, lists or images.

దేశ రాజధాని పరిసరాలలో తబ్లిఘి జమాత్‌ అనే సంస్థ నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌లో వేల మందిని పోగుచేసి ప్రార్థనలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాతో సహా చాలా టీవీ చానళ్ల పేనలిస్టులకు ఇదే ప్రశ్న ఎదురైంది. జాతీయ మీడియాలో ఒక వర్గమైతే ఇంకొక అడుగు ముందుకేసి ‘కేంద్రం నిద్రపోతోందా?’ అని కూడా నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాలంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసు శాఖ ఉండదు కాబట్టి అంటున్నారు. వాస్తవంగా, కేంద్రం బాధ్యత వహించింది కాబట్టే, మర్కజ్‌ ‌నిర్వాహకుల మెడలు వంచింది కాబట్టే ఒక పెను విపత్తు నుంచి భారతదేశం బయటపడింది. దీనిని ఈ దేశ పౌరులంతా గుర్తించవలసిన అవసరం ఉందని నా విన్నపం. ఆ విషయం వివరించే ముందు నేను మరొక ముఖ్య విన్నపం కూడా చేస్తున్నాను. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబ సభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవారు, ఏదో రకంగా పరస్పరం తాకిన వారు అంతా… మాతృసమానులు, పితృసమానులు.. సోదర సమానులు ఎల్లరు కూడా అల్లా వారసులుగా, స్వచ్ఛందంగా బయటకు రండి! కొవిడ్‌ 19 ‌వ్యాధి నివారణ కోసం పనిచేస్తున్న ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోండి! క్వారంటయిన్‌లో ఉండండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. లేకపోతే మనం మన కుటుంబాలతో సహా, బంధుమిత్రులతో సహా నాశనమైపోతాం. విజయవాడలో ఇప్పటికే ఇలాంటి దుర్మరణం చూశాం. ఢిల్లీ వెళ్లి వచ్చిన కొడుకు ఆ వ్యాధిని తన అమ్మకీ నాన్నకీ అంటించాడు. వారు కన్నుమూశారు. కన్న తల్లిదండ్రులను చంపుకోమని మతం చెబుతోందా? ఆలోచించండి!

అగ్రరాజ్యం అమెరికా. తనకు తిరుగే లేదని ఆ దేశం నిశ్చితాభిప్రాయం. స్పెయిన్‌, ఇటలీ వంటివి చిన్న చిన్న రాజ్యాలు. కానీ, అటు అమెరికా, ఇటు ఇటలీ, స్పెయిన్‌ ‌కూడా కరోనా వైరస్‌ ‌కాటుతో కకావికలయిన సంగతి ఇవాల్టి గొప్ప వాస్తవం. అమెరికా అధ్యక్షుడు కన్నీటి పర్యంతం కావడం, ఇటలీ అధ్యక్షుడు భోరున విలపించడం కరోనా విషయంలో ప్రపంచం గుర్తించవలసిన నిష్టుర సత్యాలను వెల్లడించేవే. చిన్న నిర్లక్ష్యంతోనే ఒక మహమ్మా రిని వారు తమ దేశాలలోకి అనుమతించారు. ఫలితం- దేశ చరిత్రలోనే పెద్ద విషాద ఘట్టా నికి, క్షమార్హం కాని పరిణామానికి చోటిచ్చారు. వాటితో పోల్చినప్పుడు భారతదేశంలో అంతటి దుస్థితి ఏర్పడలేదు. అయినా మన ప్రధాని నరేంద్ర మోదీ చేతులెత్తి, గద్గద స్వరంతో భారతీయులందరికి విన్నవించారు. స్వీయ నియంత్రణ తప్ప కరోనాను కట్టడి చేసే మరొక మందు ప్రస్తుతం ఎక్కడా లేదని చెప్పారు. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కరోనా వంటి అంటువ్యాధి ప్రబలితే కట్టడి చేయడం దాదాపు అసాధ్యం. ఈ వైరస్‌ని ఒక దావానలమో, బడబాగ్నిగానో చెప్పాలి. అలాగే ఉంది దాని వేగం. ప్రధాని వేదన వెనుక ఊహించుకోవ డానికి కూడా భయపడే వాస్తవాలు ఉన్నాయి. అంత వరకు పరిస్థితి రాకూడదనే ఆయన తపన. పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, అంతా ఊపిరి పీల్చుకోవచ్చునన్న భరోసా ఏర్పడిందనీ దేశం భావించిన శుభ తరుణం కనిపించిన మాట నిజం. అత్యంత దురదృష్టకరంగా, అప్పుడే నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌కల్లోలం ఆరంభమైంది. నిజంగా మన భారతదేశం హతాశురాలైపోయింది. తెలంగాణలో అయితే ఏప్రిల్‌ ఏడో తేదీ కల్లా కర్ఫ్యూ తదితర నిర్బం ధాలు ఎత్తి వేసే అవకాశం ఎంతో ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంబర పడడంలో వింతేమీ లేదు. అంత ఆశాజనకంగా ఉన్నాయి అప్పటి పరిస్థితులు. ఇండోనేషియా నుంచి నిజాముద్దీన్‌ ‌వచ్చిన ఎనిమిది మంది మత ప్రచారకులు, అక్కడ చిల్లా కార్యక్రమంలో పాల్గొని నేరుగా కరీంనగర్‌ ‌రావడంతోనే పరిస్థితులన్నీ తారుమారయినాయి. తొలి కరోనా మరణం మర్కజ్‌ ‌పుణ్యమే కూడా. నిజానికి దక్షిణాది మొత్తం కూడా మర్కజ్‌ ‌ఘటన తరువాతి పరిణామాలలో భాగంగానే ఆ వ్యాధి పాలపడింది. అమెరికాను అధిగమించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లోకి తెచ్చు కోవాలన్న చైనా దురాలోచనలోని ఒక భాగమే కరోనా వ్యాప్తి. ఇది పెద్ద కుట్ర. దారుణం. అమానుషం కూడా. అలాగే ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం రాజ్యంగా మార్చాలనీ, మార్చ గలమనీ భ్రమలతో ఉన్న కొందరు మతోన్మా దులు కుట్ర చేస్తున్నారు. నిన్నటి షాహిన్‌బాగ్‌లు, నేటి మర్కజ్‌ అం‌దులోవే. ఈ వికృత చేష్టలకి కొందరు చెత్త మేధావులు కొమ్ము కాస్తున్నారు. సీఏఏ వ్యతిరేకత పేరుతో ఇటీవల తాజాగా ముస్లింలను నీచంగా ఉపయోగించుకున్నది కూడా ఆ దరిద్రగొట్టు మేధావులే. మర్కజ్‌ ‌ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింలు గుర్తించ వలసింది ఒక్కటే. పలు వర్గాలు, రకరకాల జమాత్‌ల పేరుతో భారత్‌ అం‌తటా విస్తరించిన ముస్లింలు ఈ వైరస్‌ని భుజాల కెక్కించుకుని దేశమంతా వ్యాపింపచేశారు. తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఇది నిజం. కరోనా వైరస్‌కు ఏజెంట్లుగా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ సమాజం చచ్చిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి! బతికుండి భగవంతుడిని ఆరాధించాలని మత గ్రంథం చెబుతూ ఉంటే, చచ్చిపోయి ఏదో సాధిద్దామని చెప్పడం, బోధించడం స్వీయ హననమే అవుతుంది. తెలంగాణలో మరణించిన ఆరుగురు, జమ్ము కశ్మీర్లో చనిపోయిన ఒకరు మర్కజ్‌ ‌ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. ఈ వాస్తవాన్ని తేలిగ్గా తీసుకోవడం అవివేకం. ఢిల్లీ నగరం నుంచి పాల్గొన్నవారిలో 24 మందికి కూడా పాజిటివ్‌ అని తేలింది. ఆంధప్రదేశ్‌లో కూడా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వల్లే వైరస్‌ ‌సోకింది. లేదా వెళ్లి వచ్చినవారిలో వ్యాధి లక్షణాలు బయటపడినాయి. వైరస్‌ ‌బాధితుడు మరొక ముగ్గురికి అంటిస్తాడు కదా! అక్కడ నుంచి ఇంకొందరికి. అదో విష వలయం. ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు సహా రకరకాలుగా వారితో బంధం ఉన్న మొత్తం 9000 మందిని ఇప్పుడు క్వారంట యిన్‌ ‌చేయవలసి వచ్చింది. కాబట్టి ఇది భ్రమ కాదని గుర్తించడంలో ఇంకా ఆలస్యం చేస్తే భారతదేశానికి కాదు, యావత్‌ ‌మానవాళికి అలాంటి వారు చేస్తున్న ద్రోహంగానే భావించాల్సి వస్తుంది! ఒకవేళ కరోనా వైరస్‌ ‌కారణంగా ఒక ముస్లిం మరణిస్తే, అంత్యక్రియలు జరిపేందుకు ముస్లింలలోనే ఎవరూ ముందుకు రారని కూడా నేను చెప్పగలను.

ఒకటి వాస్తవం. మర్కజ్‌ ‌ప్రార్థనల ఆరంభానికి ముందునాటి భారత్‌ ‌వేరు. మర్కజ్‌ ‌పరిణామాల తరువాతి భారత్‌ ‌వేరు. ఇక, మర్కజ్‌ ‌సమావేశం గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ వచ్చిన విమర్శల మీద కూడా నేను స్పందించక తప్పదు. మొదటిగా, కేంద్రం నిర్లక్ష్యం వహించింది అనడం పూర్తిగా తొందర పాటు. ఈ ఉత్పాతం ఒక ఉన్మాద వర్గపు మౌఢ్యం ఫలితమే అనాలి తప్ప మరొక రకంగా చెప్పలేం. మర్కజ్‌కు ఐదు నిమిషాల నడక దూరంలో ఉన్న హజ్రత్‌ ‌నిజాముద్దీన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ అధికారి హెచ్చరిక మొదలు, భారత ప్రభుత్వ రక్షణ సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ అర్ధరాత్రి వెళ్లి మర్కజ్‌ను ఖాళీ చేయించడం వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి భారతీయులంతా తెలుసుకోవడం అవసరం.

బీజేపీ మీద వ్యతిరేకతతోనో, మోదీ మీద నిరసనతోనో వాస్తవాలను గమనించలేనంతటి మూర్ఖత్వానికి మీడియా దిగరాదు. మనం ఎదుర్కొంటున్న సమస్య సాధారణమైనది కాదు. మార్చి రెండో వారంలోనే 50 మంది మించి గుమి గూడరాదనీ, సభలు, సమావేశాలు, గోష్టులు రద్దు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. హోలీ పండగ సామాజికోత్సవమే. అయినా ఎంతో ఆనందో త్సాహాలతో హిందువులంతా చేసుకునే ఆ ఉత్సవానికి కూడా వారు స్వచ్ఛందంగా దూరంగా ఉన్న సంగతిని గమనించాలి. మరి ఈ ఆదేశాలను పాటించవలసిన బాధ్యత అంతర్జాతీయ స్థాయి మత సంస్థకు లేదా? ప్రపంచ పరిస్థితులు పట్టనంత స్థితిలో ఉన్నారా మర్కజ్‌ ‌నిర్వాహకులు? మార్చి 19న జనతా కర్ఫ్యూ గురించి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 22న ఎంతో విజయవంతంగా జనతా కర్ఫ్యూ జరిగింది. మార్చి 21న, అంటే జనతా కర్ఫ్యూకి ఒక రోజు ముందు మర్కజ్‌లో పాల్గొన్న 824 మంది విదేశీయుల పేర్లను రాష్ట్ర పోలీసు శాఖకు ఇచ్చి గుర్తించమని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అలాగే వైద్య పరీక్షలు చేయించి క్వారంటయిన్‌ ‌చేయించ మని సూచించింది. కానీ లోపల ఉన్న వారిని బయటకు రప్పించడానికి బల ప్రయోగం చేయలేదు. ఆ తేదీకి ఆ మసీదులో 1746 మంది ఉన్నారు. అందులో విదేశీయులు 216 మంది. 1530 మంది భారతీయులు. నిజానికి వేయి మంది భారతీయులతో కలసి 824 మంది విదేశీయులు ‘చిల్లా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాతే కరీంనగర్‌ ‌తదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. చాలామంది విదేశీయులు ఉత్తరప్రదేశ్‌ ‌తదితర రాష్ట్రాలలో అజ్ఞాతవాసంలో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీళ్ల వీసాలు రద్దయినాయి కూడా. విమానాలు లేవు. కాబట్టి ఇక్కడే ఉన్నారు. కానీ వైద్యానికి అంగీకరించడం లేదని అర్థమవు తున్నది. మార్చి 18న కరీంనగర్‌ ‌ప్రాంతంలో కరోనా కలకలం మొదలయిన సంగతి వీళ్లకు తెలియదా? వ్యాధి సోకిన కొందరు మసీదులలో ఉన్నారని కూడా తెలిసింది. అసలు ఈ అజ్ఞాతం ఎందుకు? ఇది అవమానకరమైన రోగం కాదు. రహస్య రోగాలలోది కాదు. ప్రపంచం ఇంతగా కుదేలవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అజ్ఞాతంలో ఉండిపోతున్నారు. ఇదేం న్యాయం? ఈ లోగా ఎందరికి ఆ వ్యాధి సోకుతుంది? మార్చి 24న హజ్రత్‌ ‌నిజాముద్దీన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ అధికారి మర్కజ్‌ను మూసి వేయాలని, అంటే కార్యకలాపాలను నిలిపి వేయాలని, ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చారు. అయితే లోపల వేయి మంది వరకు ఉన్నారని, వారందరినీ తరలించడానికి వాహనాలు కావాలని మర్కజ్‌ ‌నిర్వాహకులు కోరారు. మార్చి 25న ఒక వైద్య బృందం మర్కజ్‌కు వెళ్లింది. 26న అధికారులు మర్కజ్‌ ‌నిర్వాహకులతో పరిస్థితి గురించి చర్చించారు. నిర్వాహకులు ఇలా నాన్చుడు ధోరణి అవలంబించారే కానీ సరైన నిర్ణయం తీసుకోలేదు. మార్చి 28 అర్ధరాత్రి రెండు గంటలకు భారత రక్షణ వ్యవహారాల సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ ‌హుటాహుటిన వెళ్లి మౌలానా సాద్‌తో నేరుగా మాట్లాడారు. అప్పుడు మాత్రమే వ్యవహారం దారిలోకి వచ్చింది.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. సౌదీలో మక్కా మసీదుకు భక్తుల రాకను నిలిపివేశారు. వాటికన్‌ ‌సిటీ ఖాళీ అయింది. తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో కైంకర్యాలు తప్ప దర్శనం కల్పించడం లేదు. అలాంటిది ఒక మత శాఖకు చెందిన చిన్న సమావేశాన్ని జరపాలని ఎందుకు ఇంత పట్టుదల? దీనిని ఇప్పుడు దేశంలో చాలామంది భారత వ్యతిరేకతగా అర్థం చేసుకున్నారంటే దానిని ఎలా ఖండించగలరు? ఇదంతా ఘోరమైన బాధ్యతా రాహిత్యం. అంతకు మించిన బాధ్యతా రాహిత్యం మౌలానా సాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం. ఇంత తతంగం జరిగింది. ఇది తబ్లిఘి జమాత్‌ ‌మత మౌఢ్యమే. కొన్ని దేశాలు కరోనాతో శవాల దిబ్బలుగా మారిపోతున్నాయి. పది నిమిషాలకో ప్రాణం బలవుతున్నది. ప్రధాని మోదీ చెప్పారు కాబట్టి ఖాతరు చేయవలసిన అవసరం లేదనో, మనకి కరోనా వైరస్‌ ‌సోకినా బలయ్యేది మాత్రం భారతదేశమేనన్న భ్రమలలో బతికేయడమో సరికాదు. అది వాస్తవికత అనిపించుకోలేదు. ఇప్పుడు కరోనా మీద పోరాటం అంటే భారతదేశానికే పరిమితం కాదు. భారత్‌ ఒక్కటే చేస్తున్న యుద్ధమూ కాదు. ఒక మహమ్మారి మీద ప్రపంచం చేస్తున్న మహా యుద్ధం. దీనిలో మతాలు చూడవద్దు. మత విశ్వాసాలకు చోటివ్వవద్దు. ప్రాంతాల గురించి పట్టించుకోవద్దు. కరోనాను జయించే ఎంత చిన్న ప్రయత్నమైనా ఇప్పుడు గొప్పదే. ఎంత చిన్న నిర్లక్ష్యమైనా ఇప్పుడు పెద్ద మూల్యాన్నే కోరుతుంది. దీనిని సాగనివ్వవద్దు. మన ప్రధాని చెప్పినట్టు కరోనా మీద పోరాటంలో భారతీయులు గెలుస్తారు. అందుకు మన వంతు పాత్ర మనమూ నిర్వహిద్దాం!

– షేక్‌ ‌బాజీ, బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ కార్యదర్శి, న్యాయవాది, విజయవాడ.

About Author

By ganesh

Twitter
YOUTUBE