భారతీయులదే భారత్
భారత స్వాతంత్య్ర సమరానికి అనేక రూపాలూ, దశలూ ఉన్నాయి. చట్టబద్ధ విధానాలతో ఉద్యమించిన సంస్థలూ, ఇంగ్లిష్ రాజనీతి మీద విశ్వాసం లేక, బ్రిటిష్ జాతి పాలనలోని దమననీతి మీద ఆగ్రహంతో హింసాయుత పంథాలో సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న సంస్థలు ఉన్నాయి. దేశం లోపల, విదేశాల కేంద్రంగా, ఇక్కడి కొండ కోనలలో గిరిజనులు, మైదానాలలో రైతులు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన ఏకైక పోరాటంతోనే స్వాతంత్య్రం వచ్చిందన్న తీర్పు చారిత్రక దృక్పథంతో ఇచ్చినది కాలేదు.