ఆయుర్వేద, యోగ, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను ఆరోగ్యసేవలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయుష్‌ ‌మంత్రిత్వశాఖను 2014లో ఏర్పాటు చేశారు. జూన్‌ 21, 2015‌న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించడంతో, ప్రపంచ వ్యాప్తంగా యోగకు ప్రాధాన్యం ఇవ్వడానికి భారత్‌ ‌చేస్తోన్న ప్రయత్నాలు ఫలించాయి. కరోనా మహమ్మారి సమయంలో, యోగ సమర్థవంతమైన నివారణ విధానాల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ఊరటనిచ్చింది.

శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించటంలో అత్యంత విశ్వసనీయమైన సాధనంగా ఉన్న యోగను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో అనుసరిస్తున్నారు. యోగ మన దేశ సరిహద్దులను దాటేసి, విదేశాలకు చేరుకుని అక్కడ మరింత ప్రాచుర్యం సంపాదించుకుంది. శతాబ్దాల క్రితం అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్కృత కవులలో ఒకరైన భర్తృహరి యోగ ప్రాధాన్యం గురించి ఇలా చెప్పారు :

ధైర్యే యస్య పితా క్షమా చ జననీ శాంతిరిచర్‌ ‌గోహినీ

సత్యం సునరయం దయా చ భగినీ భ్రాతా మనః సంమయః।

శచ్య భూమితల్‌ ‌దిశోపి వసన్‌ ‌జ్ఞానామృతం భోజనం

ఐతే యస్య కుటింబినః వద సఖే కరసాద్‌ ‌భయం యోగినః

రోజూ యోగ సాధనం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. యోగా తండ్రిలా ధైర్యాన్నిస్తుంది. యోగతో తల్లిలో ఉండే క్షమాగుణం అలవడుతుంది. ఇది మనకి నిత్య స్నేహితుడిగా మారి, మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. భర్తృహరి ఏం చెప్పారంటే, యోగను సాధన చేయడంవల్ల సత్యం మన బిడ్డ, కరుణ మన సోదరి, ఆత్మ స్థైర్యం మన సోదరుడిగా, భూమి మనం పరుండే శయ్యగా, యోగవల్ల పొందే జ్ఞానం మనకు ఆహారంగా మారుతుంది. ఎప్పుడైతే యోగ సాధకుడికి ఇన్ని లక్షణాలు అలవడతాయో, అప్పుడు అతను తనలో ఉన్న భయాలన్నింటినీ అధిగమిస్తాడు. యోగ విధానాల కోసం నేటికి  డబ్బును వెచ్చించాల్సినవసరం లేదు. కరోనా మహమ్మారి సమయంలో యోగ ప్రాధాన్యతను తెలుపుతూ మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ‘‘ఈ శతాబ్దంలో యోగ ప్రపంచాన్ని ఏకంచేసింది. వత్తిడి, వ్యాధుల నుంచి బయటపడాలన్నా, సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించాలన్నా అది యోగను అనుసరించడం ద్వారానే సాధ్యమవుతుంది’’ అని తెలిపారు. శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందించడమేగాక, మన మనస్సులో, ఆలోచనల్లో స్వచ్ఛతను ఇవ్వడం ద్వారా యోగ మన జీవిత పయనంలో సమతుల్యతను తీసుకు వస్తుంది.

యోగ సహజంగా ఏర్పడే మార్పులను మన శరీరం స్వీకరించేలా మన జీవనశైలిని మారుస్తుంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన నాలుగు నెలల (2014) తరువాత యోగకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ (యుఎన్‌జిఎ)లో ప్రసంగించిన మోదీ, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి సమయంలో, ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో యోగ నిర్వహిస్తోన్న పాత్రపై పలు దేశాల ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించారు. గత ఏడాది అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి, ‘‘యోగ మనందర్నీ ఏకంచేసి, ఒక తాటిపైకి తీసుకొస్తుంది’’ అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగ శక్తి గుర్తింపునకు వచ్చిందంటే, అది నరేంద్రమోదీ తీసుకున్న నిరంతర కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది.

 ప్రపంచం ఎప్పుడు గుర్తించిందంటే

నరేంద్రమోదీ ప్రభుత్వ అవిశ్రాంత కృషితో, యుఎన్‌జిఎ జూన్‌ 21‌ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించింది. జూన్‌ 21‌ను ‘‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’’గా నిర్వహించాలనే తీర్మానానికి 193 మంది ప్రతినిధులు కలిగిన యుఎన్‌జిఏ 177 దేశాల మద్దతుతో డిసెంబర్‌ 11, 2014‌న ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంలో ‘‘యోగ జీవితంలో అన్ని అంశాలలో సమతుల్యతను తీసుకురావడమే కాకుండా, ఆరోగ్యానికి, సంక్షేమానికి సంపూర్ణ విధానాన్ని అందిస్తుంది. యోగ సాధనం చేయడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలియజేయడం కూడా ప్రపంచ జనాభా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం’’ అని యుఎన్‌జిఏ అంగీకరించింది. చికిత్స కంటే నివారణే మరింత ముఖ్యమని తెలియజెప్పింది.

తొలిసారి అంతర్జాతీయ యోగ దినోత్సవానికి చెందిన ప్రధాన కార్యక్రమాన్ని దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌లో జూన్‌ 21, 2015‌న నిర్వహించారు. ఈ కార్యక్రమం రెండు గిన్నిస్‌ ‌ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. మొదటిది 35, 985 మంది యోగ సాధకులతో ప్రపంచంలోనే అతిపెద్ద యోగ సెషన్‌ను నిర్వహించడం. రెండోది అదే రోజు 84 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో యోగ సెషన్‌ ‌జరుగడం. ఈ ఏడాది 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జూన్‌ 21‌న నిర్వహిస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత• 1970లో ఆయుర్వేద, యునాని, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య చికిత్సలకు చట్టపరమైన రక్షణ కల్పించారు. మొట్టమొదటిసారి, 1995లో దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. 2003లో అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కింద, దీనికి ఆయుష్‌గా నామకరణం చేశారు. ఆయుర్వేద, యోగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం 2014లో ప్రత్యేకంగా ఆయుష్‌ ‌మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. యుఎన్‌జిఏ సెప్టెంబర్‌ 27, 2014‌న యూఎన్‌జీఏ సదస్సులో ప్రసంగిస్తూ యోగ ప్రాముఖ్యాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఆ తర్వాత కొద్దికాలానికే, యుఎన్‌జిఏ జూన్‌ 21‌న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా నిర్వహించే తీర్మానానికి అధిక సంఖ్యాకుల అభిప్రాయం మేరకు ఆమోదం తెలిపింది.

భారత దేశ ప్రాచీన సాంస్కృతిక వారసత్వం

యోగ ఒక శాస్త్రం, ఇది ఆధ్యాత్మిక అధ్యయనంపై ఆధారపడి ఉంటుంది. మనసుకు, శరీరానికి మధ్య ఐక్యతను ఏర్పరుస్తుంది. యోగ అనేది కళ, శాస్త్రాల కలయిక, ఇది మనకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఎలా గడపాలో నిర్దేశిస్తుంది. సంస్కృతంలోని యుజీర్‌ అనే మూల పదం ప్రకారం, యోగ అనే పదానికి అర్థం కలయిక లేదా ఐక్యత. యోగాభ్యాసం వల్ల మన వ్యక్తిగత జీవనాన్ని సమాజంతో అనుసంధానించుకోవచ్చని ఇది చెబుతోంది. యోగ పుట్టుక సింధు-సరస్వతి లోయ నాగరికత కాలంలోనే అంటే క్రీస్తు పూర్వం సుమారు 2700 నాటిదని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్వ వేద కాలం నుంచే యోగాభ్యాసం చేస్తున్నట్టు ఆధారాలున్నాయి. మహర్షి పతంజలి మొదటిసారిగా తన గ్రంథం ‘యోగసూత్ర’ ద్వారా పురాతన యోగ విధానాలను క్రోడీకరించారు. సంప్రదాయ యోగకు ఆయనను పితామహుడిగా పిలుస్తారు. తర్వాత అనేక మంది యోగభ్యాసాలను, విధానాలను గ్రంథస్థం చేసి అభివృద్ధి చేయడానికి, పరిరక్షించేందుకు గణనీయమైన సహకారాన్ని అందించారు. యోగకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చారు. ఇటీవల కాలంలో చేపట్టిన పలు వైద్య అధ్యయనాలు కూడా యోగ సాధన వల్ల మనసుకు, శరీరానికి కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

యోగను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు..

స్వాతంత్య్రం తర్వాత, ప్రజారోగ్య సేవా కార్యక్రమాలతో యోగను అనుసంధానించడానికి పలు రకాల ప్రయత్నాలు జరిపారు. కానీ దానికి సరియైన వేదిక దొరకకపోవడంతో ఈ పక్రియ నిదానంగా సాగింది. 1976లో, దేశంలో మొదటి కేంద్ర యోగ పరిశోధన సంస్థ (ప్రస్తుతం మోరార్జీ దేశాయ్‌ ‌జాతీయ యోగ సంస్థ ఏర్పాటైంది. 1978లో కేంద్ర యోగ, ప్రకృతి వైద్య పరిశోధనా మండలిని ఏర్పాటు చేశారు. 2003లో ఇండియన్‌ ‌సిస్టమ్స్ ఆఫ్‌ ‌మెడిసిన్‌, ‌హోమియోపతి పేరును ఆయుష్‌ ‌విభాగంగా మార్చారు. కానీ యోగ విషయంలో అసలైన మార్పు, దాని పయనం కూడా ఎప్పుడైతే ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారో అప్పటి నుంచి అంటే నవంబర్‌ 9, 2014 ‌నుంచి ప్రారంభమైంది. యోగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ యుఎన్‌ఎ ‌వేదికపై 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, అంతర్జాతీయ సమాజం విస్తృతంగా దీన్ని స్వీకరించేందుకు సాయపడింది. ప్రజలకు అందుబాటులో ఉన్న యోగ శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి 2016లో, యోగ, ప్రకృతి వైద్యం ప్రోత్సాహక, అభివృద్ధి కోసం జాతీయ బోర్డు(ఎన్‌ఐపిడివైఎన్‌) ఏర్పాటయింది. ఈ ప్రయోజనాల కోసం, ఎయిమ్స్, ఐఐటీలకు చెందిన నిపుణులు దీనిలో భాగస్వాములయ్యారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయిలో పలు కార్యక్రమాలను నిర్వహించడంలో భారత్‌ ‌కీలక పాత్ర పోషిస్తోంది. నోడల్‌ ‌మంత్రిత్వ శాఖగా ఆయుష్‌, 45 ‌నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా యువత, వయోవృద్ధులు పాల్గొనేలా కామన్‌ ‌యోగ ప్రోటోకాల్‌ ‌విడుదల చేసింది.

పైలట్‌ ‌ప్రాజెక్టులో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో యోగను ప్రోత్సహించేందుకు ఆశా సిబ్బంది పుణేలో యోగ శిక్షణ పొందుతున్నారు. దేశంలో యోగాసనాలను పోటీకర క్రీడగా మార్చిన తర్వాత, ఆయుష్‌, ‌క్రీడా మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం యోగాసనాలను ప్రపంచ స్థాయి పోటీ క్రీడగా మార్చేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. ‘ఫిట్‌ ఇం‌డియా ఉద్యమం’లో కూడా యోగ భాగమైంది. 2021లో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యోగకు ఒక క్రీడగా గుర్తింపును ఇచ్చాయి. యోగశిక్షణ కూడా ప్రస్తుత కాలంలో అనివార్యమైంది. దేశంలోని విద్యార్థులలో యోగను ప్రోత్సహించే లక్ష్యంతో, ఎన్‌.‌సీ.ఈ.ఆర్‌.‌టీ ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకున్న పాఠ్యాంశాల్లో యోగను చేర్చింది. ఆయుష్మాన్‌భారత్‌ ‌పథకం కింద, 12,500 ఆయుష్‌ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ద్వారా యోగ శిక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

యోగ ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ ‌స్థాయి పెంపు

తేలికైన ఈ పద్ధతులను నేర్చుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ ‌స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళనలు శ్వాససంబంధమైన పక్రియలపై ప్రభావం చూపుతాయి. ఒకవేళ ఒత్తిడిగా అనిపిస్తే, ప్రశాంతంగా కూర్చుని, రెండు చేతులను దగ్గరకు చేర్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని ‘ఓంకారాన్ని’ నిదానంగా పఠించాలి. ఇది ఊపిరితిత్తులకు, మనస్సుకు ఎంతో సాంత్వన చేకూరుస్తుంది.

మరో మార్గం ఏమిటంటే, చేతులు, కాళ్లు 90 డిగ్రీల కోణంలో తీసుకుని నేలపై పడుకోవాలి. ఇలా ఐదు నుంచి ఆరు నిమిషాలపాటు ఉండాలి. భుజంగా సనం లాంటి ఇతర ఆసనాలు కూడా ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో సాయం చేస్తాయి. కరోనా నుంచి కోలుకునేందుకు యోగ గణనీయంగా ఉపకరిస్తుంది. రోజు యోగాసనాల ద్వారా, రోగనిరోధకత పదింతలు పెరుగుతుంది. యోగ మన శరీరంలోని ప్రతి కణాన్ని ఆరోగ్యకరంగా, బలంగా మారుస్తుందనడంలో సందేహాలు లేవని పలు శాస్త్రీయ అధ్యయనాలలో నిరూపితమైంది. వసుధైవ కుటుంబకమ్‌ (‌విశ్వమంతా ఒకే కుటుంబం) అనే మన ప్రాచీన తత్వశాస్త్రాన్ని సాధించడంలో యోగ కీలకపాత్ర పోషించనుంది.

‘న్యూ ఇండియా సమాచార్‌’ ‌నుంచి

About Author

By editor

Twitter
Instagram