– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులు పరిచయం కొంత ఊరటనిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. మీపై కుటుంబంలో మరింత ఆదరణ కనబరుస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ప్రతిభ చాటుకుంటారు. 5,6 తేదీలలో వృథా ఖర్చులు. అనారోగ్యం.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం కంటే ఖర్చులు పెరిగినా సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సోదరులు, స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమై ఊపిరి  పీల్చుకుంటారు. కాంట్రాక్టర్ల కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అందిన అవకాశాలు సంతోషం కలిగిస్తాయి. 6,7 తేదీలలో  బంధువులతో విరోధాలు. శారీరక రుగ్మతలు.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభ వర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలించే సమయం. ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. వాహనయోగం. మీ నిర్ణయాలలో కుటుంబసభ్యులు భాగస్వాములవుతారు. వ్యాపారులకు అధికంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు పైపోస్టులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. 9,10 తేదీలలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆశించిన రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులు మీకు వెన్నంటి నిలుస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారులు మరిన్ని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు లక్ష్యాలు సాధిస్తారు. 5,6 తేదీల్లో ధననష్టం. కుటుంబంలో చికాకులు.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులు పనిభారం తొలగి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 6,7 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత చేరువ కాగలరు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. 8,9 తేదీలలో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో రాజీమార్గం అనుసరిస్తారు. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. ఆస్తుల విషయం ఒక కొలిక్కి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మరిన్ని విజయాలు సాధిస్తారు. 7,8 తేదీలలో కష్టానికి ఫలితం ఉండదు. చోరభయం.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులు మీపై కొన్ని అపవాదులు మోపుతారు. పోటీ పరీక్షల్లో ఫలితాలు సంతృప్తినివ్వవు. తరచూ ప్రయాణాలు చేస్తారు. సోదరీలు, సోదరీల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిర్ణయాలలో నిదానం పాటించాలి. ఉద్యోగులు మరింత సమర్థతగా వ్యవహరించాలి. పారిశ్రామిక వేత్తలు, కళాకారుల ప్రయత్నాలు ఫలించవు. 9,10 తేదీల్లో శుభవర్తమానాలు. ధనలబ్ధి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలులో ముందుంటారు. రాబడి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి. వాహనసౌఖ్యం. కోర్టు కేసుల పరిష్కారం. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు మరిన్ని లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 10,11 తేదీలలో దుబారా ఖర్చులు. దూరప్రయాణాలు.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. బంధువులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. కాంట్రాక్టర్ల అంచనాలు నిజమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు లాభాలు రాబడతారు. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. 8,9 తేదీలలో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తీరతాయి. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల రాక. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు విశేష గౌరవం పొందుతారు. 10,11 తేదీలలో శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

దీర్ఘకాలిక రుణబాధల నుంచి క్రమేపీ బయటపడతారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కార్యక్రమాలలో కొంత అనుకూలత. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి ఉద్యోగులు కోరుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. 5,6  తేదీలలో వృథా ఖర్చులు. అనారోగ్యం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram