– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. గతంలో చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే అవకాశం. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పోస్టులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 27,28 తేదీలలో ఖర్చులు అధికం. అనారోగ్యం. దూరప్రయాణాలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా కొనసాగుతాయి. రాబడికి లోటు ఉండదు. బాకీలు సైతం వసూలవుతాయి. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. అలాగే, కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీమాటకు విలువ పెరుగుతుంది. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు రాగలవు. 22,23 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. శివాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీపై వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొంటారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలపై బంధువులతో సంభాషిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారులు లాభాలదిశగా కొనసాగుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు. 24,25 తేదీల్లో బంధువిరోధాలు. తీర్థయాత్రలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆదాయం కొంత పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బంధువుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు లక్ష్యం నెరవేరుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనస్సులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. ధైర్యం విడనాడకుండా ముందుకు సాగండి. వ్యాపారులు మొదట్లో నిరాశ చెందినా క్రమేపీ లాభపడతారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు సత్కారాలు. 25,26 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. దేవీస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆలోచనలు స్థిరంగా ఉండక గందరగోళం చెందుతారు. ఆప్తులతో సైతం వివాదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. నిర్ణయాలలో కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారులకు స్వల్పంగానే లాభాలు దక్కవచ్చు. ఉద్యోగస్తులకు బాధ్యతలపై నిర్లక్ష్యం వద్దు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. 26,27 తేదీలలో శుభవార్తలు. కార్యజయం. విందువినోదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఆస్తులు విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలకు అందరూ స్వాగతిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు మరింత గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు. 24,25 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యంతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు సహాయంగా నిలుస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారంలో చొరవ చూపుతారు. రాబడి కొంత పెరిగి అప్పులు సైతం తీరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. గతంలో చేజారిన కొన్ని పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులు మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు. రచయితలకు శుభవార్తలు.  22,23తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

క్రమేపీ పరిస్థితులు చక్కబడతాయి. మొదట్లో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. సాహిత్య, సంగీతాలపై ఆసక్తి చూపుతారు. ప్రముఖులతో పరిచయాలు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలు ఎట్టకేలకు కొలిక్కి తెస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారులు క్రమేపీ లాభాలబాట పడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తలు, కళాకారులు పరిశోధకులకు అనుకూల వాతావరణం. 26,27 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువిరోధాలు. ఆంజనేయ దండకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చిత్రవిచిత్రమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. దూరప్రాంతాల నుంచి అనుకూల సమాచారం రాగలదు. ఆస్తి ఒప్పందాలలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. సంతానం ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. సేవాభావంతో ముందుకు సాగి అందర్నీ ఆకట్టుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, పరిశోధకులు అనుకున్న విజయాలు సాధిస్తారు. 25,26 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్నేహితులతో విభేదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. బంధువులు,స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. అయితే ఆర్థికపరమైన హామీల విషయంలో తొందరపాటు వద్దు. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 22,23 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఈశ్వరారాధన మంచిది.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలను కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. సమాజంలో పేరుప్రఖ్యాతలు పొందుతారు. నేర్పరితనంతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల నుంచి కూడా కొంత సొమ్ము అందుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారస్తులకు ఈతిబాధలు తొలగుతాయి. ఉద్యోగులు కోరుకున్న విధంగా ప్రమోషన్లు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత గుర్తింపు లభిస్తుంది. 24,25 తేదీలలో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

పట్టినపట్టు వీడరు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతస్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీపై వచ్చిన అభాండాలు తొలగుతాయి. మీ సచ్ఛీలత, నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. 26,27 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram