– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విదేశీ విద్యావకాశాలు దక్కే సూచనలు.  ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారు, రచయితలకు  సత్కారాలు. 29,30 తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.  దేవీఖడ్గమాల పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

వ్యతిరేకులను కూడా మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  భూవివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.  వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడుదొడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలు , క్రీడాకారులకు ఊహించని పదవులు దక్కవచ్చు.   30,31 తేదీల్లో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు.  ఆదిత్య హృదయం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త వ్యూహాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కొంత సహకరించకపోయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాలు సాధనలో మిత్రులు చేయూతనిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం.  31,1 తేదీల్లో ధనవ్యయం. బంధువిరోధాలు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. ఆప్తులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.   మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తంగా మెలగాలి.కళాకారులు, క్రీడాకారులకు ప్రయత్నాలలో ఆటంకాలు. 30,31 తేదీలలో శుభవార్తలు. విందువినోదాలు.  గణేశాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనులు  నెమ్మదిగా సాగుతాయి.  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సంస్థల ఏర్పాటులో నిమగ్నమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సమతూకంగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 2,3 తేదీల్లో ధనం వృథా వ్యయం. అనారోగ్యం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అవసరాలకు లోటు రాదు. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. 29,30 తేదీల్లో అనుకోని ధనవ్యయం. బంధువిరోధాలు.  విష్ణుధ్యానం చేయండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.  ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.  స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. వ్యవసాయదారులు, సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. 3,4 తేదీల్లో మానసిక ఆందోళన. వివాదాలు. అనారోగ్యం.ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.  వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవర్గాలు, రచయితలకు విదేశీ పర్యటనలు కలసివస్తాయి. 30,31 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు.  హనుమాన్ఛాలీసా పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

 ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం.  తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. రచయితలు, వైద్యులకు  ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 30,31 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. భూములకు సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. వ్యవసాయదారులు, వైద్యులకు కొన్ని యత్నాలు  సఫలం. 1,2 తేదీల్లో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగిన మార్పులు కనిపించవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. క్రీడాకారులు, వైద్యులకు ఆకస్మిక పర్యటనలు.31,1 తేదీల్లో  శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువుల కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు సైతం అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు సమస్యలు తీరతాయి.  1,2 తేదీల్లో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
Instagram