– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త ఆదాయమార్గాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. దేవాలయ దర్శనాలు. సంగీత,సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. గృహనిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో సజావుగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. పరిశోధకులు, రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 21,22 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. తరచూ ప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలిస్తుంది. సన్నిహితులతో అకస్మాత్తుగా వివాదాలు. మీ నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి చికాకులు తప్పవు.  కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు, శ్రమ తప్పదు. 22,23 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులు,స్నేహితుల నుంచి మాటసహాయం. అదనపు రాబడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలు, పరిశోధకులకు ఆహ్వానాలు. 24,25 తేదీల్లో ధననష్టం, శారీరక రుగ్మతలు,. దూరప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల రాకతో కుటుంబంలో సందడి. భూ,గృహయోగాలు. అందర్నీ ఆశ్చర్యపరిచేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల విధి నిర్వహణలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవార్డులు లభించే వీలుంది. 19,20 తేదీలలో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కొన్ని అద్భుతాలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తికాగలవు. బంధువులు,స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. వాహనయోగం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారులకు చిక్కులు తొలగి నూతన భాగస్వాములు జతకడతారు.  రచయితలు, కళాకారులకు మరింత ఉత్సాహం. 22,23 తేదీల్లో  ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.  శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల ద్వారా ధనలాభం. యత్నకార్యసిద్ధి. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరఫు వారితో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారులు మరింతగా లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగస్తులకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.23,24 తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అన్నింటా విజయాలే సిద్ధిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.  ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వీ వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, రచయితలకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. 19,20  తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధననష్టం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

నిరుద్యోగులు ఇంతకాలం చేసిన కృషి ఫలించే సమయం. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదనపు రాబడి దక్కుతుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు మరింత విస్తరిస్తాయి.  వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పదోన్నతులు.  కళాకారులకు పురస్కారాలు. క్రీడాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 20,21 తేదీల్లో అనుకోని ఖర్చులు. సోదరులతో వివాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వాహన, గృహయోగాలు. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలను మార్చుకుంటారు.  వ్యాపారులు మరింత లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరి ఊరట చెందుతారు.   21,22 తేదీలలో అనారోగ్యం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.  కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. స్థిరాస్తుల వృద్ధి. కుటుంబానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు మరింత ప్రగతి సాధిస్తారు. పరిశోధకులు, కళాకారులకు ఊహించని అవకాశాలు. 23,24 తేదీల్లో  వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. గణేశాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొత్త  ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు. పెట్టుబడులు అందే అవకాశం. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు తథ్యం. కళాకారులకు సన్మానాలు. రచయితలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 24,25 తేదీల్లో బంధువులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి.  వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వాహనయోగం. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు.   రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. క్రీడాకారులు, రచయితలకు శుభవార్తలు. 21,22 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram