– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థిక పరిస్థితి  గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు.  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.అందుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులకు అవకాశం. కళాకారులు, రచయితలకు కీలక సమాచారం రావచ్చు. 30,1 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, వ్యవసాయదారుల ఆశలు ఫలిస్తాయి. 26,27 తేదీలలో అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు.మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. దూరపు  బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు ఆశించిన మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రచయితలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.  27,28 తేదీలలో బంధువిరోధాలు. వ్యయప్రయాసలు. ఆదిత్య హృదయం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులు గతం కంటే కొంత పుంజుకుంటారు.  రాజకీయ, పారిశ్రామికవేత్తలు నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. 29,30 తేదీలలో మానసిక అశాంతి. స్నేహితులతో వివాదాలు.  దేవీఖడ్గమాల పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కొంత ఇబ్బందిపడవచ్చు.  కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.  కొన్ని వివాదాలు నెలకొన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.  వ్యాపారులకు కొంత నిరాశ ఉండవచ్చు. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగేవీలుంది. కళాకారులు, రచయితల యత్నాలు  సఫలమవుతాయి. 30,1 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త కార్యక్రమాలు  విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  ఇంటి నిర్మాణాల్లో  ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు.ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారుల యత్నాలు ఫలిస్తాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.  పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 1,2 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు.ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారులు సంస్థలను మరింత విస్తరిస్తారు. రచయితలు, వైద్యులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో అనారోగ్యం. కుటుంబసమస్యలు. ధనవ్యయం. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారుల కృషి ఫలించి లావాదేవీలు సజావుగా సాగుతాయి.  కళాకారులు, వైద్యులకు ఊహించని ఆహ్వానాలు. 1,2 తేదీల్లో శ్రమాధిక్యం. స్వల్ప రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.  కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న అవకాశాలు సాధిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 29,30 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆంజనేయస్వామిని అర్చించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరి ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. క్రీడాకారులు వ్యవసాయదారులకు శుభవార్తలు అందుతాయి. 26,27 తేదీల్లో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పదు. గణేశాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినా రుణాలు చేస్తారు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 28,29 తేదీలలో దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఈశ్వరారాధన మంచిది.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు.  విద్యార్థుల్లో  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తులు కొనుగోలు విషయంలో ఒక అంచనాకు వస్తారు. ఎంతటి వారైనా మీ మాటలకు ఆకర్షితులు కావాల్సిందే.  వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు.   రాజకీయవేత్తలు, వైద్యులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.  29,30 తేదీలలో  వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. హయగ్రీవ స్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram