– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు   ఉద్యోగాలు దక్కే ఛాన్స్. ‌ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు.   10,11తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆప్తులతో కలహాలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

సన్నిహితులతో ఉత్సాహవంతంగా గడుపుతారు.  సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. అదనపు ఆదాయం సమకూరే సమయం. వ్యాపారస్తులకు ఈతిబాధలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు అంచనాలు నిజమవుతాయి.  13,14తేదీల్లో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పంచాక్షరి పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఖర్చులు పెరిగినా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. తీర్థయాత్రలు చేస్తారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 14,15తేదీల్లో దుబారా ఖర్చులు. మానసిక ఆందోళన. నృసింహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. రావలసిన సొమ్ము అందుతుంది. రుణభారాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు.  ఆత్మీయులు మీకు మరింత సహకరిస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.  వ్యాపారస్తులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి.  11,12తేదీలలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీరంటే మీపై మరింత ప్రేమ కనబరుస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. కొత్త ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వ్యాపారులు రెట్టించిన ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు అనుకున్నది సాధిస్తారు.  10,11తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఈశ్వరారాధన మంచిది.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఒక సమాచారం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది.  స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాలపై సందిగ్ధత తొలగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు తీపి కబురు అందుతుంది.  13,14తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

మొదట్లో కొద్దిపాటి ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా్య ధిగమిస్తారు. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు.  సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, వైద్యులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  14,15తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు, చికాకులు తొలగే సమయం.  అనుకున్నంత రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు.  రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు.  11,12తేదీల్లో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ప్రారంభంలో కొన్ని సమస్యలు సవాలుగా మారవచ్చు. అయినా పట్టుదలతో అధిగమిస్తారు.  రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు వ్యిధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరిగే వీలుంది.  13,14తేదీల్లో బంధువిరోధాలు. ధనవ్యయం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆదాయానికి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష ఆదరణ లభిస్తుంది. 10,11తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడతాయి. ఎంతగా కృషి చేసినా కార్యక్రమాలు ముందుకు సాగవు.  కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆ తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగండి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.  12,13తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీస్తుతి మంచిది.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.  ఒక ఆసక్తికర సమాచారం ఆందుతుంది.  ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వచ్చి లబ్ధి చేకూరుతుంది.  వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  15,16తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram