సంస్కార భారతి వ్యవస్థాపకులు బాబా యోగేంద్రజీ జ్ఞానదాయిని సరస్వతి దేవి ఉపాసకులు. వారి పూర్ణ జీవనం కళ, కళాకారులకు సమర్పితమైనది. కళాజగత్తులో భారత్‌, ‌భారతీయత, భారతీయ సంస్క ృతికి పెద్ద పీట వేయడంలో వారు అవిరళ కృషి చేశారు.

జూన్‌ 10, 2022‌న బాబా యోగేంద్రజీ స్వర్గస్తులైనారు. బాబా అన్న మాట వినిపించగానే కన్నుల ముందు ఒక అత్యున్నతమైన వ్యక్తిత్వం ప్రత్యక్షమవుతుంది. సదరు వ్యక్తిత్వపు సమ్ముఖం పూజ్య భావంతో తొణికిసలాడుతూ ఉంటుంది. శ్రీరామచంద్ర ప్రభువు ప్రసాదించిన 98 సంవత్స రాల సుదీర్ఘ జీవనంలో 77 సంవత్సరాలు సంఘ ప్రచారక్‌గా, 41 సంవత్సరాల కాలంపాటు సంస్కార భారతి సంస్థాపక సభ్యుల నుంచి సంరక్షకుల వరకు దేహానికి శాశ్వత విశ్రాంతి లభించేంతవరకు పద్మశ్రీ యోగేంద్రజీ సలిపిన అలుపెరుగని, అవిశ్రాంత సాధన సర్వులకూ స్ఫూర్తిమంతమైనది. ఉత్తరప్రదేశ్‌ ‌లోని గాంధీనగర్‌ ‌గ్రామంలో జనవరి 7, 1924 తేదీన బాబా యోగేంద్రజీ జన్మించారు. తండ్రి బాబూ విజయ్‌ ‌బహదూర్‌. ఈయన న్యాయవాది. గోరఖ్‌పూర్‌లో విద్యను అభ్యసిస్తుండగా స్వయం సేవకులైనారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జ్యేష్ఠ ప్రచారక్‌ ‌నానాజీ దేశ్‌ముఖ్‌ ‌నుంచి ప్రేరణ పొంది పూర్తికాలపు ప్రచారక్‌ అయ్యారు. గోరఖ్‌పూర్‌, ‌ప్రయాగ, బరేలి, బదాయూం, సీతాపూర్‌, ‌తదితర ప్రాంతాల్లో సంఘ ప్రచారక్‌గా కార్యకలాపాలు చేపట్టారు. వారు ఒక సర్వోన్నతమైన చిత్రకారులు. సంఘ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ వారిలో ఒక చిత్రకారుడు సుషుప్త చేతనావస్థలో ఉండేవాడు. అప్పటి సమకాలిన పరిస్థితులను ప్రతిబింబించేలా అనేక విషయాలపై వరుసగా చిత్ర ప్రదర్శనలకు వారు నాంది పలికారు. అత్యంత దు:ఖ పూరితమైన దేశ విభజనపై వారు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన కఠిన పాషాణ హృదయులను సైతం కంటతడి పెట్టిస్తుంది. 1857 నాటి స్వరాజ్య సంగ్రామ అమర గాథ, దేశ విభజన, రగులుతున్న కశ్మీర్‌, ‌మాత ృమూర్తి పిలుపు, సంకటంలో గోమాత, విశ్వానికి భారత్‌ అం‌దించిన ఫలాలు లాంటి ప్రదర్శనలు దేశ విదేశాల్లో అత్యంత ప్రజాదరణను పొందాయి.

కళారంగంలో భారతీయతను జాగృతపరచడం, కళలు, కళాకారుల సంరక్షణ, అభివృద్ధి ప్రధాన ఉద్దేశంగా 1981లో ఆవిర్భవించిన సంస్కార భారతికి తనదైన ప్రతిభా వ్యుత్పత్తులతో సంఘటన మంత్రి బాధ్యతలు వారిని వరించాయి. అనంతరం సాధనాలను గురించి ఆలోచించడాన్ని పక్కన పెట్టిన బాబా యోగేంద్రజీ.. అత్యంత కృషితో, పవిత్రమైన ప్రేమ నుంచి పొందిన బలంతో కళాకారులు, కార్యకర్తలను ఒక్కచోట చేర్చడానికి నాంది పలికారు. చూస్తూ ఉండగానే వందలాదిగా సంస్కారభారతి శాఖలు విస్తరించసాగాయి. ‘కళ మట్టికి ప్రాణం పోస్తుంది’ అనేది వారి ప్రసిద్ధి చెందిన ధ్యేయాన్ని ప్రతిబింబించే వాక్యం.  యోగేంద్రజీ ఆదినుంచి కూడా కళాకారులను ఒకచోట చేర్చే ప్రయత్నాలు చేస్తుండేవారు. ప్రసిద్ధి చెందిన కళాకారులు కావొచ్చు, ఔత్సాహిక కళాకారులు కావొచ్చు వారందరికీ స్నేహాన్ని అందిస్తుండేవారు. నిరాడంబరత్వం, సరళత, సౌమ్య స్వభావంతో ఎంతో ప్రభావం చూపేవారు. కార్యం తాలూకు ఆవశ్యకతను అర్థం చేసుకుంటూనే ఒక చిత్రకారునిగా వారి ఉనికిని సంస్థ రూపంలోకి అత్యంత సహజ సిద్ధంగా విలీనం చేశారు. బాబా అందరివారు, అందరూ బాబాకు చెందినవారు అనే చెరిగిపోని సంబంధం అద్భుత మైనది. వారు చూపించే ఆత్మీయత ఎంత ప్రత్యేక మైనదంటే చిన్నా పెద్ద కార్యకర్తలు, కళాకారుల సుఖదు:ఖాలను వారు నిత్యం పంచుకునేవారు. ప్రతి ఒక్కరూ కూడా తామే బాబాకు అత్యంత సన్నిహితులమని భావించేవారు. (సంస్థకు సంబంధించిన ఏదైనా నిర్ణయంతో పాటుగా వ్యక్తిగత వ్యవహారం కార్యకర్త, కళాకారుల హృదయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను బాబా కాకుండా మరి ఎవ్వరికైనా చెప్పడం సాధ్యం కాదు.) ఇది వారిలోని అత్యంత సంవేదనశీలతను పరిచయం చేస్తున్నది. సంపూర్ణ దేశంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు, కార్యకర్తలను కలుసుకుంటున్నప్పుడు గతంలో పర్యటించిన ప్రాంతం గురించి వారు చేసే వర్ణన ఆకాశవాణి (రేడియో)లో వినిపించే ప్రత్యక్ష ప్రసారానికి ఏ మాత్రం తగ్గదు. కార్యకలాపాల స్థితిగతులు, కలుసుకున్న హిందూ బంధువుల అర్హతలు, వారు అందుబాటులో ఉండే వివరాలను పేర్లతో సహా బాబా యోగేంద్రజీ కళ్లకు కట్టినట్టుగా చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్దులై పోతుంటారు. వారి దస్తూరి కాగితంపై ముత్యాలను పేర్చినట్టుగా ఉంటుంది. వారి లేఖలను భద్రంగా దాచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారు తమ జీవన యానంలో పద్మశ్రీ సహా అనేక పురస్కారాలను పొందినప్పటికీ వీసమెత్తు అహంభావాన్ని వారు ఒక్కనాడూ ప్రదర్శించింది లేదు. నిరంతరాయంగా పర్యటనలు చేయడం ద్వారా, నిత్య సంవాదం ద్వారా మాత్రమే సంస్థ తాలూకు వికాసం, విస్తరణ  సంభవమనే ఒక పాఠాన్ని బాబా యోగేంద్రజీ వారి వ్యవహార శైలి, ఆచరణతో అందరికీ నేర్పించారు. జీవితం చిన్నదైనప్పటికీ సార్థకత పొందాలనే మాట వింటూ ఉంటాము. అలాగే జీవన యానం ఎంత సుదీర్ఘమైతే అంత సార్థకత చెందాలనే సత్యాన్ని బాబా యోగేంద్రజీ వారి జీవన యజ్ఞం ద్వారా మనకు తెలియజెప్పారు.

(వ్యాసకర్త: సంస్కార భారతి ఢిల్లీ ప్రాంత పూర్వ సంఘటన మంత్రి)

——————————————————-

యోగేంద్రజీకి సంఘం శ్రద్ధాంజలి ఘటించింది

బాబా యోగేంద్రజీ అస్తమించడం పట్ల  సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌రావ్‌జీ భాగవత్‌, ‌సర్‌ ‌కార్యవాహ్‌ ‌దత్తాత్రేయ హోసబలే ఒక సంయుక్త ప్రకటనలో శ్రద్ధాంజలి తెలిపారు. ‘‘సంస్కారభారతి సంరక్షకులు యోగేంద్రజీ అస్తమించడంతో ఒక జ్యేష్టప్రచారక్‌ ‌సాధక జీవనం సంపూర్ణమైనది. అసంఖ్యాకమైన కార్యకర్తలకు ఒక అనిర్వచనీయమైన వియోగం అనుభవంలోకి రావడం అత్యంత సహజమైనది. వారు ఒక తపస్వి. దేశవ్యాప్తంగా సంగీత, కళారంగాలకు చెందిన సాధకులను ఒకే వేదికపైకి తీసుకురావడం జీవిత లక్ష్యం. వినమ్రతకు వారు నిలువెత్తు నిదర్శనం. పద్మశ్రీ పురస్కారంతో సన్మానితులైన బాబా యోగేంద్ర జీ జీవనం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. దివంగత ఆత్మకు పరమపిత వారి శ్రీచరణాల వద్ద స్థానం కల్పించాలి’’.

———————————————

 సహజమైన సరళ జీవనం

సంస్కార భారతి సంస్థాపకులు, సంరక్షకులు బాబా యోగేంద్ర జీ అస్తమించినారనే సమాచారం అత్యంత దుఃఖాన్ని కలిగించింది. ఈ కఠిన సమయంలో సమాజ హితైషులతో నా సానుభూతిని పంచుకుంటున్నాను. పద్మశ్రీ బాబా యోగేంద్రజీ సంస్కార భారతి రూపేణా కళాసాధకులకు ఒక పటిష్టమైన వేదికను సమర్పించారు. యువతీయువకుల్లో భారతీయ సంస్కారాన్ని పాదుగొల్పడంలోనూ, వారిలో జాతీయతను జాగృతపరచడంలోనూ కళను ఒక మాధ్యమంగా చేసుకున్నారు. ఆటుపోట్లతో కూడిన జీవన ఆరంభంతో చిరుప్రాయంలోనే జీవితపు విలువలను వారు తెలుసుకొని వృద్ధిలోకి వచ్చారు. జీవనారంభంలో సంఘ సిద్ధాంతంవల్ల వారిపై ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ఈ సిద్ధాంతాన్ని జనబాహుళ్యాన్ని చేర్చడంలో వారు తమ సంపూర్ణ జీవితాన్ని సమర్పించుకున్నారు. బాబా యోగేంద్రజీ ఆలోచనలు ఎంత లోతైనవో, వ్యక్తిగత జీవితంలో వారి వ్యవహార శైలి అంతే సహజమైనది, సరళమైనది. కళా జగత్తులో వారు లేని లోటు తీర్చలేనిది. నేడు భౌతికంగా, మన మధ్య లేకపోయినప్పటికీ వారి కర్తవ్యం, ఆలోచన, సంస్కారం సమాజానికి సరైన దిశానిర్దేశనం చేస్తూనే ఉంటాయి. కళా సాధనలో సమృద్ధి చెందిన వారి వారసత్వం కళా ప్రేమికులకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. దివంగత ఆత్మకు శాంతిని చేకూర్చాలని, శోకతప్త హృదయులకు ఈ దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

———————————–

సంస్కార భారతి సంస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత యోగేంద్రజీ అస్తమించడం అత్యంత దుఃఖదాయకమైనది. వారు కళాకారులకు, స్ఫూర్తి శక్తిప్రదాతలు.

– డాక్టర్‌ ‌ప్రమోద్‌ ‌సావంత్‌, ‌ముఖ్యమంత్రి, గోవా.

——————————–

సంస్కార భారతి సంస్థాపకులు, అసంఖ్యాకమైన కళా సాధకులకు స్ఫూర్తిదాత, కళా రుషి, పద్మశ్రీ బాబా యోగేంద్రజీ స్వర్గస్తులు కావడం అత్యంత దుఃఖదాయకం. దివంగత పుణ్యాత్మకు శ్రీ చరణాల చెంత స్థానం కల్పించాలని, అసంఖ్యాకమైన వారి అభిమానులకు దు:ఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తున్నాను.

– యోగి ఆదిత్యనాథ్‌, ‌ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌

————————

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram