విజయ్‌ ‌కుమార్‌

‌కళాసాధన అత్యంత కఠినమైనది. సంవత్సరాల తరబడి అభ్యాసం, పరిశ్రమతో కళ సిద్ధిస్తుంది. కానీ కళాకారులను సమీకరించడం అంతకన్నా అత్యంత కఠినమైనది. ‘సంస్కార భారతి’ వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర అలాంటి ఒక కళాకారులు. వారు వేలాదిగా కళాసాధకులను ఒక చోట చేర్చడమనే అత్యంత కఠినమైన కార్యాన్ని చేసి చూపించారు.

యోగేంద్రజీకి రెండేళ్ల చిరుప్రాయంలోనే వారి తల్లి అస్తమించారు. అనంతరం పొరుగునే ఉన్న ఒక కుటుంబం ఆయనను దత్తత స్వీకరించింది. అలా దత్తత స్వీకరించబడితే దీర్ఘాయుష్షులై జీవిస్తారనే ఒక నమ్మకం ఉంది. దీని వెనుక కారణమైంది. ఆ పొరుగింటి కుటుంబపు మాతృమూర్తి మరో పది సంవత్సరాలు యోగేంద్ర జీ ఆలనా పాలనా చూసుకున్నారు. వారి తండ్రి వకీల్‌గా పనిచేస్తుండేవారు. కాంగ్రెస్‌ ‌పార్టీ, ఆర్యసమాజ్‌తో సంబంధాలను కలిగి ఉండేవారు. తమ ప్రాంతంలో ఏర్పాటైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌శాఖలో చేరాలని కుమారుడైన యోగేంద్రకు ఆయన సూచించారు. గోరఖ్‌పూర్‌లో విద్యాభ్యాసం సాగిస్తున్న యోగేంద్రజీకి అక్కడి సంఘ ప్రచారక్‌ ‌నానాజీ దేశ్‌ముఖ్‌జీతో పరిచయం కలిగింది. అప్పటి నుంచి యోగేంద్రజీ సాయం కాలపు శాఖకు హాజరవుతుండేవారు. నానాజీ ప్రతి రోజూ ఉదయాన్నే యోగేంద్ర జీని నిద్రలేపుతుండేవారు. ఒకానొక సందర్భంలో తీవ్రమైన జ్వరానికి గురైన యోగేంద్రజీని నానాజీ తన భుజాలపై మోసుకుంటూ వెళ్లి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పడ్‌రౌనాకు చేర్చారు. అక్కడ వారికి వైద్య చికిత్స చేయించారు. ఈ ఘటన యోగేంద్రజీ పైన అత్యంత ప్రభావాన్ని చూపించింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌.‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం స్వయంగా సంఘ కార్య కలాపాలకు సమర్పితమైపోవాలని వారు నిర్ణ యించుకున్నారు.

యోగేంద్రజీ 1942లో లక్నో లోపల ‘సంఘ శిక్షావర్గ’ ప్రథమ వర్షను పూర్తి చేశారు. 1945లో సంఘ్‌ ‌ప్రచారక్‌ అయ్యారు. గోరఖ్‌పూర్‌, ‌ప్రయాగ, బరేలీ, బదాయూం, సీతాపూర్‌, ‌తదితర ప్రాంతాల్లో సంఘ కార్యకలాపాలు చేపట్టారు. కానీ వారి మనస్సులో నిత్యమూ ఒక కళాకారుడు సుషుప్త చేతనావస్థలో ఉండేవాడు. దేశ విభజన సమయంలో వారు ఒక ప్రదర్శన రూపొందించారు. సదరు ప్రదర్శనలోనూ వారిలోని కళాకారుడు వెలుగులోకి వచ్చాడు. ఆ సందర్భంలో కన్నుల నుంచి ఉబికి వచ్చే భావోద్వేగపు బాష్పాలను వారు అతికష్టమ్మీద తుడుచుకునేవారు. అయినప్పటికీ ప్రదర్శనలు కొనసాగుతూనే ఉండేవి.

యోగేంద్రజీలోని ఈ ప్రతిభ సంఘ ప్రముఖుల ద ృష్టికి వచ్చింది. 1981లో ‘సంస్కార భారతి’  పేరిట ఒక సంస్థ ఏర్పాటైంది. సంస్కార భారతి నిర్వహణా బాధ్యతలను యోగేంద్రజీకి అప్పగించారు. యోగేంద్రజీ అత్యంత శ్రద్ధాసక్తులతో అతి తక్కువ కాలంలోనే కళాకారులకు ఒక అగ్రగణ్యమైన సంస్థగా ‘సంస్కార భారతి’ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం సంస్కార భారతి  శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించాయి. యోగేంద్రజీ ఆది నుంచి కూడా పేరుగాంచిన ప్రముఖ కళాకారుల కోసం తాపత్రయపడలేదు. ఔత్సాహిక కళాకారులకు ఒక వేదికను కల్పించారు. కాలక్రమంలో సదరు ఔత్సాహిక కళాకారులే ప్రముఖ కళాకారులుగా అవతరించారు. ఆ ప్రకారంగా వారు కళాకారులతో ఒక సరికొత్త సైన్యాన్ని నిర్మించారు. నేడు గొప్ప గొప్ప కళాకారులు సంస్కార భారతి వేదికపైకి రావడం ద్వారా వారి గొప్పదనాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. ఆ విధంగా వేలాదిగా కళాకారులు వారిని ‘బాబా’ అనే సంబోధనతో గౌరవించుకున్నారు. కాలక్రమంలో ఆ గౌరవ సంబోధన వారికి నిదర్శనంగా నిలిచిపోయింది.

సరళత్వం, అహంకార రాహిత్యం యోగేంద్రజీలో అత్యంత విశిష్టమైన లక్షణాలుగా నిలిచిపోయాయి. ఏదైనా ప్రదర్శన నిర్మాణంలో సాధారణ కూలీ వలె శ్రమించేవారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని వారు  ‘ప్రత్యక్ష ప్రసారం’ (రన్నింగ్‌ ‌కామెంటరీ) చేస్తుంటే,  వారి గొంతు కంచు కంఠం వలె ఉండటంతో వినే వారికి ఎవరో రేడియో నుంచి వినిపిస్తున్నంత శ్రావ్యంగా ఉంటుంది. వారి దస్తూరి కాగితంపై ముత్యాలను పేర్చినట్టుగా ఉంటుంది. వారి లేఖలను ప్రజలు భద్రంగా దాచుకుంటూ ఉంటారు. వయో వృద్ధులైన అనంతరం 2021 ఏప్రిల్‌ 2 ‌న ఢిల్లీలో ‘కళా సంకుల్‌’ ‌పేరిట సంస్కార భారతి నూతనంగా నిర్మించిన కార్యాలయ భవన ఆరంభ కార్యక్రమానికి సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌జీ  భాగవత్‌, ‌సర్‌కార్యావాహ దత్తాత్రేయ హోసబలేతో పాటుగా యోగేంద్రజీ హాజరయ్యారు.

వారి కళాసాధనను 2018లో రాష్ట్రపతి

రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‘‌పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించారు. 2022 సంవత్సరం జూన్‌ 10‌న నిర్జల ఏకాదశి రోజున లక్నోలోని ఒక ఆసుపత్రిలో వారి జీవన యాత్ర సంపూర్ణమైనది.

‘పాంచజన్య’ నుండి

అను: మహేష్‌ ‌ధూళిపాళ్ల

————-

సంస్కార భారతితో బాబా యోగేంద్రజీ ఎంతగా మిళితమై పోయారంటే.. సంస్కార భారతి పేరును స్మరించుకుంటే కనుల ముందు బాబా యోగేంద్రజీ కదులాడుతారు. నామాన్ని తలచుకుంటే సంస్కార భారతి గోచరిస్తుంది. స్వతహాగా కళాకారులైనప్పటికీ వారు తమ సంపూర్ణ జీవితాన్ని భారతీయ కళా జగత్తునకు, సంఘ కార్యకలాపాలకు సమర్పించుకున్నారు. కీర్తిమంతమైన, సంస్కారయుతమైన, ఆదర్శనీయమైన వారి జీవనం సర్వులకు విదితమైనది. ప్రాచీనకాలంలో రుషులు, మునుల గురించి ఇప్పటిదాకా పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాము. కానీ బాబాజీ జీవన విధానం చూసిన తర్వాత రుషులు ఎలా ఉంటారనే విషయం అనుభవంలోకి వచ్చింది. వారిని కలిసిన ప్రతిసారీ కూడా ఆనందకరమైన సంగతులను మాట్లాడుకుందాం పద అని అనేవారు. ఎవరైనా ఔత్సాహిక కళాకారుల గురించి, వారి కళాసాధన గురించి, వారికి చెందిన ఏదేనీ కార్యక్రమం గురించి చెబుతుండేవారు. ఇలాంటి ఆనందకరమైన సంగతులు చెప్పేవారి మాట నేడు కరవైపోయింది. వారి జీవనం సంస్కార భారతి ప్రతి కార్యకర్తకు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. వారు నిత్యం మా నడుమ విరాజిల్లుతూనే ఉంటారు. ఇది నా విశ్వాసం.

– వాసుదేవ్‌ ‌కామత్‌, అధ్యక్షులు, సంస్కార భారతి.

—————————————–

బాబా యోగేంద్రజీతో నాకు వ్యక్తిగత సంబం ధము ఉంది. వారు సంస్కార భారతికి ప్రాణం. 98 సంవత్సరాల వయస్సు లోనూ వారు సంస్కార భారతి కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవారు. వారికి శతకోటి వందనాలు.

– సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ, రాజ్యసభ సభ్యులు

—————————————-

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram