కొన్ని విషయాలు, వాస్తవాలు తెలంగాణ సోదరుల దృష్టికి తేవాలన్న ఆశయంతో మీ ముందుకు వస్తున్నాను. నిజాం పాలనలో హిందువు లంతా అవమానాలను చవిచూశారు. స్త్రీలకు రక్షణ లేదు. అత్యాచారాలకు అంతులేదు. గోహత్యలు నిరంతరాయంగా సాగిపోయాయి. దేవాలయాలకు రక్షణ లేదు. మతమర్పిడికి హద్దులు లేవు. హిందుత్వం, దేశభక్తి భావనలను కాలరాశారు. అలాంటి దుస్థితిని ఎదుర్కోవడానికి అనేకమంది మహా పురుషులు నాడు తమ జీవితాలు అర్పించారు. దేశంలో 1857 నుండి 1947 వరకు, 90 సంవత్స రాల్లో 24వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు బలిదానమైతే, వారిలో ఒక్క తెలంగాణ నుంచే 3వేల మంది ఉన్నారు. అంటే అదొక నిరంతర పోరాటం. చివరికి మాననీయ వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌యోజనతో కనీసం స్వాతంత్య్రం అనే పదానికి ప్రాణప్రతిష్ట చేశారు. ఇది గతం.

74 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ ఏం జరుగు తోంది? అదే పునరావృతమవుతున్నది. కశ్మీరులో ఏరకమైన ఘోరం జరిగిందో, భైంసాలోనూ అదే జరిగింది. దీనికి మనమంతా ప్రత్యక్ష సాక్షులమే. దేవాలయం నుంచి ఘంటానాదం మసీదులోకి వస్తోందని సత్యనారాయణ అనే పూజారిని హత్య చేశారు. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడని నాగరాజు అనే హిందూ యువకుడిని పట్టపగలే చంపేశారు. ఒక ముస్లిం హిందువు నిర్వహించే దుకాణానికి వచ్చి ఒక వస్తువు ధర తగ్గించమన్నాడు. అందుకు నిరాకరించినందుకు వందలమంది వచ్చి దాడి చేశారు. చాదర్‌ఘాట్‌ ‌వద్ద పట్టపగలు ఎస్‌సీ కుటుంబానికి చెందిన యువతిపై లైంగిక అత్యాచారం చేశారు. మరొక యువతని అపహ రించుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకి లేదు. దేవాలయాల్లో దర్గాలు నిర్మించే ప్రయత్నాలు, దేవాలయ భూములు ఆక్రమించే యత్నం మరొకటి. గోహత్యలకి అడ్డులేదు. ఎన్ని కావాలంటే అన్ని గోవులు ఇక్కడే దొరుకుతున్నాయి. నాటి ఈ పరిస్థితులన్నీ మళ్లీ దాపురించాయి.

ఇలాంటి పరిస్థితులను ఆనాడు ఎదుర్కోవడం కోసం ఒక్కొక్క జిల్లాలో కొందరు కార్యకర్తలు తయారయి, జీవితాలను సమర్పించారు. వందే మాతర ఉద్యమం అనేక రీతుల్లో అణచివేయడానికి ప్రయత్నం జరిగింది. ఎందరినో చంపారు. ఇదీ మనం చూశాం. నేడు ఇంకొక వింత పరిస్థితిని కూడా చూస్తున్నాం. దేశభక్తిని ప్రదర్శించుకోవడానికీ, వందేమాతరం అని పలకడానికీ•, భారతమాతాకి జై అని చెప్పడానికీ కొన్ని వర్గాలు సిద్ధంగా లేవు. అంతేకాదు. వారు పలకక•పోతే సరే. ఆ నినాదాలు చేసేవారిని వేటాడడానికి కాలుదువ్వుతున్నారు. దీనికంతటికి దురదృష్టవశాత్తు ఇవాళ ఉన్న ప్రభుత్వం మద్దతు పలుకుతున్నది. కాబట్టి మళ్లీ అవే లైంగిక అత్యాచారాలు, మాతృభూమి ఎడల అగౌరవం, మతమార్పిడులు నిరంతరం సాగుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటే వారి భవిష్యత్తుకు భరోసా లేదు. స్త్రీ బయటికి వెళ్తే, తిరిగి వచ్చేంతవరకు నమ్మకం లేదు. ఎంత దారుణమంటే కరెంటు బిల్లుల వసూలు కోసం హైదరాబాద్‌లోని ఓల్డ్ ‌సిటీకి వెళితే అధికారులు దాడులకు గురవుతున్నారు. అక్కడ వాటర్‌ ‌బిల్‌, ఏదైనా మున్సిపాలిటీ వారి బిల్‌ ‌చెల్లించమని అడగడానికి వీల్లేదు. భవానిపురం అనే చోట ఒక్క హిందువూ మిగల్లేదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో తెలీదు.

నిస్సందేహంగా ఇదంతా అలనాటి నిజాం కాలాన్ని ప్రతిబింబించేదే. నాటి చరిత్ర పునరావృత మవుతున్నదని భావించక తప్పని పరిస్థితే. ఈ నేపథ్యంలోనే, నాడు ఇలాంటి దుస్థితిని నివారించ డానికి బలిదానం చేసిన వారు మన దృష్టిపథంలోకి వస్తున్నారు. రాంజీ గోండును ఆదిలాబాద్‌ ‌జిల్లాలో హత్య చేశారు. కొమురం భీమ్‌ను అదే పద్ధతిలో ఆ జిల్లాలోనే చంపించారు. స్వాతంత్య్రం కోసం ఆయన ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో! కిషోరీలాల్‌ అనే మరొక ధన్యజీవి గాథ ఇలాంటిదే. పుట్నాల రామక్క మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే అడ్డొచ్చిన భర్తను చంపారు. ఆ మహమ్మదీయుడిని ఆవిడ చంపడమే కాదు, చివరికి తాను కూడా మరణించింది.

రామానంద తీర్థ, వేదప్రకాష్‌, ‌రాజారెడ్డి, నారాయణరెడ్డి (వరంగల్‌), అదే పద్ధతిలో సోమగుళ్ల ప్రముఖ్‌, ‌చెప్పల్‌బజార్‌లో నడిపిన ఉద్యమాలు స్వాతంత్య్రం కోసం జరిగినవే. జగదీష్‌ ఆర్య, నారాయణ పవర్‌, ‌యశ్వంత్‌రావు జోషి, వందే మాతరం రామచంద్రరావు, కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ ఇలాంటి అనేక పేర్లు ఈ కోణం నుంచే మనకి వినిపిస్తాయి.ఈ చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఈనాడు ప్రతి ఊరిలో ఒక పుట్నాల రామక్క పుట్టాలి. ఎదుర్కోవాలి. కొమురం భీం లాంటి వాళ్లు ప్రతి ఊరిలో జన్మించాలి. ఈ చరిత్రను మార్చడం ఇవాళ్టి తక్షణ అవసరం.

అటువంటి మరొక స్వాతంత్య్ర సంగ్రామం నిర్మించవలసిన అవసరం ఇవాళ మనముందుంది. మళ్లీ పోరాడి మనదైన స్వాతంత్య్రం తెచ్చుకోవాలి. అరమరికలని, విభేదాలని మర్చిపోయి మనందరం భారతమాత సంతానమన్న భావనతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి. మన స్వాతంత్య్రం, మన స్త్రీల ఔన్నత్యం నిలబడాలి. గోమాతకు పూజలు జరగాలి. దేవాలయాలు సురక్షితంగా ఉండాలి. ఎవరూ మతమార్పిడులకు గురి కాకుండా సమష్టిగా రక్షించుకోవాలి. మన ధర్మాన్ని ప్రచారం చేసుకొనే స్వేచ్ఛ మనకు ఉండాలి. వసుదైక కుటుంబకం అన్న భావనతో మనమందరం సహకరించుకోవాలి. లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక్క దేశం భారతదేశం. స్వామి వివేకానంద ప్రపంచం అంతా తిరిగి చెప్పిన మాట ఇదే. ప్రపంచానికి భారత్‌ ‌గుండెకాయ. గుండె సరిగా పనిచేస్తే విశ్వం జీవంతో తొణికిసలాడుతుంది.

 భారతదేశానికి ఎవరైన సేవ చేయాలనుకుంటే మొదట సంస్కారవంతులైన, శక్తిమంతులైన, శీలవంతులైన, సమర్ధులైన వ్యక్తులను నిర్మాణం చేయాలి. అదే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. ఒకనాడు ఈ నేల మీద 14 విశ్వ విద్యాలయాలు అలరారాయి. ఎంతో విజ్ఞానం పరిఢవిల్లింది. మానవుని మాధవుడిగా మార్చడం కోసం ఇక్కడ నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. మరొకసారి దేశం అలాంటి స్థితికి వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ శ్రమిస్తున్నారు. ఆయన అన్ని దేశాలకు వెళ్లి, ఆ నేతలకు మన దేశ ఔన్నత్యం గురించి చెబుతున్నారు. మనతో కలసి అడుగులో అడుగు వేసి నడిపించేం దుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మనమూ సహకరించాలి. మన సమాజంలోని ప్రతి ఒక్క కులానికి మహాపురుషులున్నారు. అందరినీ గౌరవిద్దాం. వాళ్లందరినీ ఉత్సవాలలో స్మరిద్దాం. ప్రతి ఒక్కరం ఒక బీద కుటుంబాన్ని దత్తత తీసుకుందాం. వాళ్లింకా బీదరికంలో ఉండకూడదు. అంతా ఒకే స్థాయిలో జీవించేందుకు ప్రయత్నం చేద్దాం. సేవకు సంసిద్ధులమౌదాం.

ఇలాంటి యజ్ఞానికి ప్రతి ఒక్కరు కనీసం ఒక్క సంవత్సర కాలం సమయం ఇవ్వండి. ఇంట్లో కూర్చొని చేసే వాట్సప్‌ ‌సందేశాలతో, ఫేస్‌బుక్‌ అభిప్రాయాలతో ఇదంతా సాధ్యం కాదు. ఒక్క సంవత్సరం పాటు సమయం ఇవ్వండి. ఆనాటి త్యాగధనులు జీవితాన్ని ఇచ్చారు. తూటాలకు బలయ్యారు. ఉరికంబాలెక్కారు. జైళ్లలో మగ్గారు. ఈరోజు అవసరం అలాంటిది కాదు. ఒక్క సంవత్సర కాలం కేటాయించి, ప్రతి కుటుంబాన్ని కలిపి వాళ్లతో దేశ, ప్రాంత, జిల్లా పరిస్థితులను తెలియజేసి, జాగృతం చేయాలి. ప్రతి ఒక్క ఓటరుని జాగృతం చేయాలి.

దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడానికి ఓటును ఏ విధంగా ఆయుధంగా మలుచుకోవాలో చెప్పాలి. మరొక స్వాతంత్య్ర సంగ్రామం అనివార్యం. ఆ స్వాతంత్య్రాన్ని తెచ్చుకోవ డానికి మనమంతా అంకితం కావాలి. దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని అందరికి ప్రార్ధనాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.

 జై శ్రీరామ్‌, ‌భారతమాతాకీ జై. జై తెలంగాణ.

– వై. రాఘవులు, విశ్వహిందూ పరిషత్‌ ‌జాతీయ కార్యకారిణి సభ్యులు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram