నవంబర్‌ 8, నాగుల పంచమి

కార్తీకమాసంలో మరో ప్రముఖ పండుగ్న నాగ్నుల చవితి. ఈ మాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకు స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ కాలంలో నాగారాధన వల్ల కామమృత్యువులను జయించే సిద్ధి కలుగ్నుతుందని, శేషతల్పుడు

శ్రీ మహావిష్ణువు, నాగాభరణుడు పరమశివుడికి అత్యంత ప్రియమైన ఈ తిథి విశేష ఫలితాన్నిస్తుందని అంటారు. సర్పదోషం కలవారు, సంతాన విహీనులు నాగ్నుల చవితిని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతారు.

శాస్త్ర పురాణాలలో సర్పరాజుకు ప్రత్యేక స్థానం ఉంది. మానవసృష్టి కంటే ముందే నాగ్నజాతి ఆవిర్భవించిందని అంటారు. జీవరాశులలో ఒకటైన ఇది భూభారాన్ని వహిస్తోంది. కృతయుగ్నంలో క్షీరసాగ్నర మథనానికి వాసుకి కవ్వపు తాడుగా ఉపకరించగా, త్రేతాయుగ్నంలో శేషుడు లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడిగా అవతరించాడు. ఈ యుగ్నంలో తిరుమలవాసుని శిరస్సున దాల్చాడు. వివిధ దేవాలయాలలో మూలమూర్తులకు నాగాభరాణాలు అలంకరించడం కనిపిస్తుంటుంది.

భూమిలోపల ఉంటూ భూసారాన్ని కాపాడే నాగ్నులను దేవతలకు ప్రతిరూపాలుగా భావించి నాగ్నరాజుగా, నాగ్నదేవతగా పూజించడం అనాదిగా వస్తోంది. నాగేంద్రుడు ఆరోగ్న్య ప్రదాత అని, ఆయనను పూజించండం వల్ల రోగాలు తొలగిపోతాయని చెబుతారు. నవరంధ్రాల మానవ దేహాన్ని పుట్టతో పోలుస్తారు. మట్టితో తయారైన ఈ దేహం మట్టిలోనే కలిసి పోతుందనే తత్త్వాన్ని ౖ‘పుట్ట’ గ్నుర్తు చేస్తుంది.

తెలుగ్ను రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగ్నను విలక్షణంగా జరుపు కుంటారు. చాలా గ్రామాలలో, దేవాలయాలలో వేప లేదా రావిచెట్టు మొదళ్లలో రెండు సర్పాలు పెనవేసుకున్న ఆకారంలో నాగ్నవిగ్న్రహాలు కనిపిస్తుంటాయి. వీటిని కేవలం నాగ్నుల చవితినాడే కాకుండా ఇతర రోజులలోనూ కొలుస్తుంటారు. నాగ్నపూజానంతరం త్రిమూర్తి స్వరూపమైన రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల నాగ్నదోషాల తొలగిపోతాయని, పాము బహు సంతానానికి ప్రతీక అని, దానిని పూజించడం, నాగ్నప్రతిష్టతో సంతానం కలుగ్నుతుందని విశ్వాసం. సర్పారాధకుల వంశాలు తామరతంపరగా వర్థిల్లుతాయని భవిష్య పురాణం పేర్కొంటోంది.

ప్రధానంగా మహిళలు ఈ వ్రతాచరణలో పాలుపంచుకుంటారు. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ. నాగేంద్రుడిని ఆరాధించే కన్యలకు యోగ్న్యుడైన భర్త లభిస్తాడని, సలక్షణ సంతానం కలుగ్నుతుందని విశ్వాసం. ఈ పండుగ్న నాడు వేకువజామునే పుట్ట చుట్టూ శుభ్రం చేసి, పసుపు, కుంకుమ, వివిధ పుష్పాలతో పూజిస్తారు. పుట్టలో ఆవుపాలు పోసి, అరటిపండ్లు, నువ్వుల చిమ్మిలి, చలిమిడి, వడపప్పులను నైవేద్యంగా సమర్పిస్తారు. పుట్టమట్టిని చెవులకు, కనురెప్పలకు రాసుకుంటారు. పుట్టమన్నును పవిత్రం, సారవంతంగా పరిగ్నణిస్తారు. దీనిని ‘పుట్ట బంగారం’ అనీ పిలుచుకుంటారు. ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లలేనివారు ఇళ్లలోనే పిండితో నాగ్నరూపాన్ని తయారుచేసి పాలుపోయవచ్చని పెద్దలు ప్రత్యామ్నాయం చూపుతున్నారు. నాగ్నచవితి నాడు పగ్నలంతా నిరాహారంగా ఉండి రాత్రి భోజనం చేస్తారు. కొందరు ఆ రోజంతా ఉపవాసం ఉండి మరునాడు నాగ్నపూజ చేసిన తరువాత ఆహారం స్వీకరిస్తారు. చెవి, కంటి వ్యాధులు ఉన్నవారు నాగ్నుల చవితినాడు ఉపవాసం ఉంటే స్వస్థత చిక్కుతుందని, పుట్టమీద ఉంచి పూజించిన నూతన వస్త్రాలను ధరిస్తే మనోవాంఛలు నెరవేరతాయని విశ్వాసం. వీటిని ‘నాగ్నవస్త్రాలు’ అంటారు.

‘నాగ్నుల చవితికి నాగేంద్ర నీకు

పొట్టనిండా పాలు పోసేము తండ్రి

నీ పుట్ట దరికి మా పాపలొచ్చేరు

పాపపుణ్యమ్ముల వాసనే లేని

బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి

కోపించి బుస్సలు కొట్టబోకోయి

* * *

చీకటిలోన నీ శిరసు తొక్కేము

కసితీర మమ్మల్ని కాటేయబోకు

కోవ పుట్టలోని కోడెనాగ్నన్న

పగ్నలు సాధించి మా ప్రాణాలు దీకు..’ అనే బసవరాజు అప్పారావు ప్రసిద్ధ గీతంలో నాగేంద్రుడికి వేడుకోలు కనిపిస్తుంది.

ఇదే రోజున షట్చక్రాలకు ప్రతీకగా భావించే సుబ్రహ్మణ్యస్వామిని సర్పరూపంలో అర్చిస్తారు. తిరుమలేశుడు పెద శేషవాహనంపై తిరువీధుల్లో విహరించడం ఆనవాయితీగా వస్తోంది.

‘చవితి’`శాస్త్రీయత

నాగ్నుల చవితి నాడు పుట్టలో పాలు పోయడం, ఇతర పదార్థాలు వేయడం ఆధ్మాతిక భావన కాగా, దాని వెనుక శాస్త్రీయ కోణాన్నీ చెబుతారు. పుట్టలో వేసే పదార్థాలు తినేందుకు క్రిములు చేరితే, వాటి కోసం కప్పలు, ఎలుకలు చేరి అవి పాములకు ఆహారమవుతున్నాయి. అలా పాములు కదలకుండానే ఆహారం సమకూరేందుకు ఇదీ ఒక మార్గమంటారు. పాముల వల్ల మనుషులకు, మనుషుల వల్ల వాటికి ప్రాణహాని తొలగేందుకు అవకాశం ఉంది. ‘నరుడు నా కంట. నేను నరుడి కంట పడకూడదు’ అని నాగ్నులు అనుకుంటాయన్న సామెత అలానే పుట్టి ఉంటుంది. ఈ రెండిరటిలో ఏది జరిగినా ఎవరో ఒకరు నష్టపోక తప్పని పరిస్థితి. పాములు పంట చేలలో సంచరిస్తూ పైరుకు హాని కలిగించే క్రిమికీటకాదులను దరిచేరనీయవు. అలా వాటికి ఆహారం దక్కడంతో పాటు రైతులకు మేలు చేసినట్లవుతుంది. జీవసమతౌల్యం కాపాడేందుకు నాగ్నజాతి కూడా ఉపకరిస్తుందని, విష కీటకమైనంత మాత్రాన విచక్షణ రహితంగా కొట్టి చంపకూడదని చెబుతారు. ఆ కోణంలోనే వాటికి ఒక రోజును కల్పించారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

నాగ్నవంశాలు

నాగ్నదేవతల, నాగ్నవంశ స్వరూప స్వభావాలను పరిశీలిస్తే.. కశ్యప కద్రువలు నాగ్నులకు తల్లిదండ్రులు. కశ్యపుని 21 మంది భార్యలలో ఒకరైన కద్రువకు వెయ్యిమంది పుత్రులు, కుమార్తె కలిగారు. పుత్రులలో అనంతుడు, వాసుకి, శేషుడు, ఐరావతుడు, ధనంజయుడు, శంఖపాలుడు, తక్షకుడు, కర్కోటకుడు సర్పజాతికి మూలపురుషులుగా చెబుతారు. వీరిలో మొదటి ముగ్న్గురు సత్త్వగ్నుణ సంపన్నులు కాగా, తరువాతి ముగ్న్గురు రజోగ్నుణ ప్రధానులని, మిగిలిన ఇద్దరు తమోగ్నుణ ప్రధానులని చెబుతారు. బంగారురంగ్ను పాములు అనంతుడి వంశానికి, కపిల వర్ణంతో ఉన్నవి వాసుకి వంశానికి, తెలుపు రంగ్నులోనివి శేష, శంఖపాల వంశాలకు, తెలుపు లేక బూడిద వర్ణంలోనివి ఐరావత వంశానికి, పసుపు రంగ్నులోనివి ధనుంజయ వంశానికి, త్రాచుపాములు తక్షక వంశానికి, నల్లత్రాచులు కర్కోటక వంశానికి చెందినవిగా పురాణాలు పేర్కొంటున్నాయి.

ప్రముఖ నాగ్నక్షేత్రాలు

నాగ్నుల చవితి, నాగ్నపంచమి సందర్భంగా నాగేంద్రుని అర్చించడంతో పాటు వివిధ నాగ్నక్షేత్రాలలో సర్పదోష నివారణకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు. తెలుగ్ను రాష్ట్రాలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు, కృష్ణాజిల్లా మోపిదేవి, హైదరాబాద్‌ స్కందగిరిలోని సుబ్రహ్మణ్య ఆలయం ప్రసిద్ధమైనవి. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగ్నర్‌కోయిల్‌లో పురాతన నాగ్నరాజ దేవాలయం ఉంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ‘కుక్కె’ సుబ్రహ్మణ్య క్షేత్రం నాగ్నదోష నివారణ పూజలకు ప్రసిద్ధి.

హరిద్వార్‌, గౌహతి లాంటి ప్రాంతాలలోని మానసాదేవి (నాగ్నలోక రాణి)ని అత్యంత భక్తితో పూజిస్తారు. గౌహతి సమీపంలోని మానసాదేవి ఆలయం వద్దకు ‘చవితి’నాడు లెక్కకు మిక్కిలిగా పాములు చేరి, అమ్మవారి ఆలయంవైపు తదేకంగా చూస్తుంటాయట. అవి భక్తులకు అతి సమీపంగానే మసులుతున్నా ఎవరికి హాని చేయవట. కేవలం చవితి నాడే అక్కడికి చేరే సర్పాలు మళ్లీ కనిపించవట. ఆ విచిత్రాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

‘కర్కోటకస్య నాగ్నస్య దమయంత్యా నలస్యచ

ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనమ్‌’ అని నాగ్నచవితి, పంచమి నాడు పఠించడం వల్ల కలిదోషం నివారణమవుతుందని చెబుతారు.

డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram