కేరళలోని పాలక్కాడ్‌లో మార్చి 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్‌షో సంచలనంగా మారింది. అసలు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన కేంద్రం కేరళ రాష్ట్రమే అన్న అభిప్రాయం ఇప్పుడు ఏర్పడిరది. ఇటీవలి కాలంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆరుసార్లు దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించారు. బీజేపీ క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటున్న రాష్ట్రం కేరళ. ఏప్రిల్‌ 15 నాటి ప్రధాని పర్యటన దానికి కొనసాగింపు. అక్కడ రాజకీయ, మత, సామాజిక సమీకరణలను బీజేపీ మార్చగలిగిందన్నది నిజం. ‘ఇందులో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలలో బలాఢ్యమైన ప్రత్యర్థి!’ ఇది సంఘ పరివార్‌ సభ్యుడు ఎవరో చేసిన వ్యాఖ్య కాదు. కాంగ్రెస్‌ ప్రముఖుడు, విదేశ వ్యవహారాల శాఖ మాజీ సహాయ మంత్రి శశి థరూర్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం. మంచి రచయిత కూడా అయిన శశి గడచిన రెండు లోక్‌సభ ఎన్నికలలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా ఆ విషయం విశ్లేషించారు. ‘2009 ఎన్నికలలో నేను పోటీ చేశాను. అప్పుడు ఆ స్థానాన్ని (తిరువనంతపురం) కమ్యూనిస్టుల నుంచి చేజిక్కించుకున్నాను. బీజేపీ రెండో స్థానంలోకి వచ్చి చేరింది’ అన్నారాయన. అంటే ఆ రెండు సమరాలలోను ఆయన సమీప ప్రత్యర్థి సీపీఎం కాదు. బీజేపీయే. ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మార్చి 15న ఈ విషయాలు శశి చెప్పారు.

బీజేపీ విజయావకాశాల గురించి కమ్యూ నిస్టులు చెబుతున్నవన్నీ శుష్క వాదనలేనని కూడా తేల్చేశారు. ఇందులో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. తాను ఓడిపోతాననని ఏ నాయకుడు చెబుతాడు! కమ్యూనిస్టులైతే అసలే చెప్పరు. ఈ ఎన్నికలలో బీజేపీ కమ్యూనిస్టులను దాటి పోతుందనే అనుకుంటున్నట్టు కూడా శశి శషబిషలు లేకుండా చెప్పేశారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. ఇక్కడ నుంచి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. అయితే రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో అబాద్ధాలు ఉన్నాయని, ప్రత్యర్థులతో కంటే ఆ అంశంతోనే ఆయన ఎక్కువ పోరాటం చేస్తున్నారని శశి ఆరోపించారు. చంద్ర శేఖర్‌ వాస్తవంగా కలిగి ఉన్న ఆస్తులకు, ఆయన చెల్లించే పన్నులకు మధ్య పొంతన లేదని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను చంద్రశేఖర్‌ ఖండిరచారు. తిరువనంతపురం  నుంచి వామపక్ష కూటమి అభ్యర్థిగా పన్నయన్‌ రవీంద్రన్‌ పోటీ చేస్తున్నారు. ఈయన యథా ప్రకారం` ఇక్కడ పోటీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎప్‌కీ, ఎల్‌డీఎఫ్‌కే, బీజేపీ లెక్కలో లేదని యథా ప్రకారం రికార్డు వేసి వినిపించారు. బీజేపీ కమ్యూనిస్టులను భయపెడు తున్నదని చెప్పడానికి ఈ మాట చాలు.

తమ ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయన్న సంగతి సీపీఎం నేతలకు కూడా తెలుసు. ఈ ఎన్నికలలో కనుక మనం విజయం సాధించకపోతే మన సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తు హుష్‌ కాకి అయిపోతుందని సీపీఎం నాయకుడు  ఏకే బాలన్‌ హెచ్చరించాడని కథనాలు వెలువడినాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత ఆపార్టీ తన గుర్తును కోల్పో వచ్చునన్న అనుమానాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఓటమిని, వాస్తవాన్ని కాస్త కూడా ఏనాడూ అంగీక రించని కమ్యూనిస్టులే ఈ మాట అంటున్నారు. బాలన్‌ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు. మాజీ మంత్రి. ఈసారి నిజాయితీగా కష్టపడకపోతే మన పార్టీ గుర్తు మనకి దక్కదని ఆయన వాపోయి నాడని ‘న్యూస్‌ మినిట్‌’  కథనం. సుత్తీకొడవలి పైన నక్షత్రం గుర్తే పోతే ఇక మనం ఆక్టోపస్‌, పాంగోలిన్‌ వంటి జంతువుల గుర్తులతో పోటీ చేయవలసి వస్తుందని కూడా ఆయన కార్యకర్తలను జడిపించాడని తెలుస్తున్నది.

ప్రస్తుతం లోక్‌సభలో సీపీఎం బలం ఎంత? కేవలం మూడు. ఆ మూడిరటిలో రెండు తమిళనాడు నుంచి వచ్చాయి. ఒక్కటే కేరళ నుంచి నెగ్గింది. దానికే ఇంతటి వీరంగం. భారతదేశంలో పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎంత శాతం అని చూసినప్పుడు, 2019 ఎన్నికలలో సీపీఎం తెచ్చుకున్న ఓట్ల శాతం 1.77 శాతం. కేరళ రాష్ట్రం వరకు సీపీఎంకు పోలైన ఓట్లు మాత్రం 25.97 శాతం. రెండు సీట్లు ఇచ్చిన తమిళనాడులో ఆ పార్టీకి పోలైన ఓట్లు 2.38 శాతం. కాబట్టి సీపీఎంకి ఉన్న ఒకే ఒక్క ఆశ కేరళ. అలా అని కేరళ అసెంబ్లీ ఎన్నికలలో (2021) సీపీఎం భూమ్యాకాశాలను బద్దలు కొట్టే స్థాయిలో విజయం సాధించిందని అనుకోవద్దు. కేరళ శాసనసభలో మొత్తం స్థానాలు. 140. అందులో సీపీఎం సాధించుకున్నవి 62. ప్రభుత్వం స్థాపనకు అవసరమైన బలం కంటే ఎనిమిది తక్కువే. ఊతకర్రల సాయంతో సర్కారును నడిపిస్తున్నారు. దానికే సంకీర్ణమని పేరు.

ఇండీ కూటమిలో భాగస్వాముల బంధాలు దేశమంతటా ఒకే విధంగా లేవు. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా కేరళలో తమ పరిస్థితి అలా ఉంటే వాయనాయ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేయడం ఏమిటి? అంటున్నాయి వామపక్షాలు. అక్కడ ఉన్న 20 లోక్‌సభ స్థానాలలో 2019 ఎన్నికలలో సీపీఎం గెలిచినది ఒక్క స్థానమే. అక్కడ ఇండీ కూటమి పార్టీల మధ్య ప్రచారం కంటే మాటల యుద్ధం వేడి వాడిగా సాగుతోంది. ఇండీ కూటమి బంధం ఇప్పుడు బ్రహ్మ పదార్ధంలా తయారైంది. అది ఎక్కడ కలసి పోటీ చేస్తున్నదో తెలియదు కానీ, ఎక్కడెక్కడ ఆ కూటమి నాయకులు మాటల యుద్ధంలో మునిగి ఉన్నారో మాత్రం స్పష్టంగానే తెలుస్తున్నది. కేరళలో అది మరీ సుస్పష్టం. అక్కడ రాహుల్‌ కమ్యూనిస్టుల పాలిట పిలవని పేరంటం. రాహుల్‌ దక్షిణాదికి, అందునా కేరళకి వచ్చి పోటీ చేయడం ఏమిటి? బీజేపీ బలంగా ఉన్నచోట పోటీకి దిగొచ్చు కదా అంటున్నది సీపీఐ. ఆయనే ఉంటే క్షురకుడు ఎందుకు అన్నట్టు ఆ మాత్రం శక్తే ఉంటే రాహుల్‌ ఈ మూల కేరళకు వస్తాడా? దీనికి కమ్యూనిస్టుల వినిపిస్తున్న తిక్క తార్కికవాదం మరొక వింత.  2019 ఎన్నికలలో వాయనాడ్‌ స్థానాన్ని రాహుల్‌ గెలుచుకున్న మాట నిజం. ఇప్పుడూ అక్కడి నుంచే తాను పోటీ పడతానంటే, కాదు ఇది మా స్థానం అంటున్నది వామపక్షం.

కేరళ వామపక్షులు రాహుల్‌ని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. తిరువనంతపురం నుంచి పోటీ పడుతున్న శశి థరూర్‌ని కూడా చీకాకు పెడుతు న్నారు. అక్కడ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీపీఐ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే విధంగానే ఉంది అని ఆయన ధ్వజమెత్తారు. దీనికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మోతాదుకు మించి స్పందించారనాలి. అసలు ఈ సువిశాల భారతదేశంలో మతశక్తులతో పోరాడే శక్తి ఎవరికైనా ఉన్నదీ అంటే, కమ్యూనిస్టులకేనంటూ గొప్ప సాహసంతో ప్రకటించారు. దీనికి రాజా తర్కం ఏమిటి? చాలామంది కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిపోతుంటే, కమ్యూనిస్టులు మాత్రం మారకుండా పోరాటం చేస్తున్నారట. రాహుల్‌ పప్పు బిరుదాంకి తుడే కావచ్చు. కానీ కమ్యూనిస్టు పార్టీ నుంచి జారుకునే వారి సంఖ్యని కాంగ్రెస్‌ పార్టీ నుంచి జారుకునే వారి సంఖ్యతో పోలిస్తే ఎలా? రాహుల్‌ వయనాడ్‌ పోటీపై రాజా కడుపు మంటకి పెద్ద కారణమే ఉంది. అక్కడ సీపీఐ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆనీ రాజా రాజాగారి సతీమణి. బీజేపీ మీద పోరాటంలో కత్తి పట్టి ప్రథమ శ్రేణిలో సేనానిలా ఉన్నానని చెప్పుకునే రాహుల్‌ కేరళ వచ్చి వామపక్షాల మీద పోటీ చేయడం ఏమిటి అని రాజా ఆక్రోశించారు. ఇంతకీ కాంగ్రెస్‌కు అసలు శత్రువులు ఎవరు కమ్యూనిస్టులా, కమలమా? వెంటనే వివరణ ఇవ్వాలని గర్జించారాయన. ఈ గొడవంతా మతో న్మాదశక్తుల మీద పోరాటమూ కాదు, సెక్యులరిజం మీద ప్రేమా కాదు. ముస్లింల ఓట్ల గురించి పోటీ మాత్రమే అని తిరువనంతరపురం బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ తేల్చి చెప్పారు. తమకు మిగిలిన ఒకే ఒక్క రాష్ట్రంలో కూడా ముస్లిం ఓట్లలో కాంగ్రెస్‌ వాటాకి వస్తే కమ్యూనిస్టులకి బాధే మరి!

ఇండీ కూటమి సొగసు కేరళలోనే చూడాలి. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ విపక్షంలో ఉంది. ఆ స్పృహతోనే వ్యవరిస్తోంది కూడా. తన పాలనలోని లొసుగులని కప్పి పుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, రాహుల్‌ గాంధీ మీద రెచ్చి పోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ నిప్పులు చెరుగుతోంది. కాబట్టి విజయన్‌ ధోరణి బీజేపీ విజయానికే దోహదపడుతుందని కూడా వెల్లడిర చింది. నెల రోజుల నుంచి చూస్తున్నాం, ఒకే ఉపన్యాసం విజయన్‌ చదివి వినిపిస్తున్నారని విపక్ష నాయకుడు వీడీ సతీశన్‌ ఆక్రోశించారు. ఆ ఊకదంపుడులో ఎక్కడా మోదీ, బీజేపీల మీద విమర్శలే లేవు, కాంగ్రెస్‌, రాహుల్‌ను మాత్రమే విజయన్‌ ఆడిపోసుకుంటున్నారని కూడా సతీశన్‌ గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ సాయం లేకుండానే జాతీయ స్థాయిలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనగలవా? ఈ ఒక్క ప్రశ్నకు విజయన్‌ సమాధానం చెబితే చాలు’ అని పరీక్ష కూడా పెట్టారు సతీశన్‌. సీపీఎం ఇంత గోల ఎందుకు చేయడం వెనుక దేవ రహస్యాన్ని కాంగ్రెస్‌ నాయకుడు బయటపెట్టారు. లోక్‌సభ పోలింగ్‌ తేదీ (ఏప్రిల్‌ 29) ముంచుకొస్తున్నా  చెప్పుకోవడానికి సీపీఎం ప్రభుత్వానికి ఒక్క ఘనకార్యం కూడా లేదు అని తేల్చారాయన. సీపీఎం సర్కారు పాలనలో వైఫల్యం కావడమే కాదు, నిండా అవినీతిలో మునిగిందని సతీశన్‌ చాటారు. ఈ సీపీఎం ప్రభుత్వం ఎంత అడ్డదిడ్డమైనదో చెప్పడానికి రూ. 1500 కోట్ల కెఎఫ్‌ఓఎన్‌ పథకమే సాక్ష్యమని, ఏడేళ్లయినా దానిని పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ పధకంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తు చేయాలని సతీశన్‌ చెబుతున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. అయినా కమ్యూనిస్టులకి ఎందుకు ఇంత దిగులు? ఖాతా తెరవకపోయినా 13 శాతం ఓట్లు వచ్చాయి. ముస్లింలవి సరే, క్రైస్తవ మైనారిటీ ఓట్లు కూడా ఏనాటికీ బీజేపీకి పడవు అన్న పిచ్చి భ్రమలో ఉన్న కమ్యూనిస్టులకు ఈ మధ్య క్రైస్తవులు కంగారు పుట్టిస్తున్నారు. ఇందుకు లవ్‌ జిహాద్‌ ఒక కారణం. ఇదే అంశంతో నిర్మించిన ‘కేరళ స్టోరీ’ చిత్రాన్ని ఇటీవల కొన్ని చర్చ్‌లలో ప్రదర్శించి ముఖ్య మంత్రికి ముచ్చెమటలు పట్టించారు క్రైస్తవులు. కేరళలో ముస్లిం మతోన్మాదం, లవ్‌ జిహాద్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం అండతోనే సాగుతున్నాయి. అందులో క్రైస్తవ బాలికలు, యువతులు కూడా సమిధలే. దీనికి విరుగుడును క్రైస్తవులు బీజేపీలో చూస్తున్నారు. క్రైస్తవుల ఓట్లు బీజేపీ వైపు తరలించే పనిలో ఈ చిత్రాన్ని చర్చ్‌లలో ఆ వర్గం యువతీ యువకులు, బాలబాలికల కోసం ప్రదర్శించారు. మణిపూర్‌ హింసను, అందులో క్రైస్తవ వ్యతిరేకతను చూపిస్తున్నా కేరళ క్రైస్తవులు బీజేపీ పట్ల సానుభూతితో ఉన్నారు. ఈ వర్గం 22 శాతం ఉంది. కేథలిక్‌, సిరియన్‌ క్రైస్తవులు ఇటీవలి కాలంలో బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లాటిన్‌ క్రైస్తవులు, ప్రొటెస్టెంట్‌ వర్గ క్రైస్తవులు బీజేపీ వైపు మొగ్గు చూపకున్నా ఎల్‌డీఎఫ్‌కు దూరంగా జరుగుతున్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ నాయకత్వం లోని యూడీఎఫ్‌లను పక్కన పెట్టి పలువురు క్రైస్తవ పెద్దలు బీజేపీ తమ వర్గంలో బలపడేందుకు దారి చూపుతున్నారు. ముస్లిం మతోన్మాదం కారణంగా ఇప్పుడు కేరళలో ఒక కొత్త ఓట్‌ బ్యాంక్‌ తయారవు తున్న మాట వాస్తవం. అది బీజేపీని నమ్ముతున్నది. అటు హిందువుల, ఇటు క్రైస్తవులు కూడా ముస్లిం మతోన్మాదం పట్ల పెంచుకుంటున్న ద్వేషం ఈ కొత్త రాజకీయ సమీకరణకి దోహదం చేస్తున్నది. ఈ వాదాన్ని పట్టించుకోకుండానే, క్రైస్తవులు ఇటీవలి కాలంలో తమ వైపు చూస్తున్న సంగతి నిజమేనని బీజేపీ ఒప్పుకుంటున్నది. దీనికి మంచి రుజువు క్రైస్తవుల నుంచి పలువురు నాయకులు ఇప్పుడు బీజేపీలో కనిపిస్తున్నారు. అలాంటివారిలో వెంటనే గుర్తుకు వచ్చే నేత అనిల్‌ ఆంటోని. ఆయన కాంగ్రెస్‌ ప్రముఖుడు ఏకే ఆంటోని కుమారుడే. గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా బీజేపీ నాయకులు గణనీయంగానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితు లను బట్టి బీజేపీని తమ సహజ ఎంపికగా ఆ వర్గం భావిస్తున్నదని విశ్లేషకుల అంచనా. అటు ఎల్‌డీఎఫ్‌, ఇటు యూడీఎఫ్‌ రెండూ ముస్లిం ఓట్ల కోసమే వెంపర్లాడుతూ ఉంటే, క్రైస్తవులకు మిగిలేది బీజేపీయే.  దీనికి తోడు బీజేపీ అభివృద్ధి ఎజెండా సహజంగానే క్రెస్తవులను అటు నడిపిస్తున్నదని కేరళ ప్రాంత రాజకీయ పరిశీలకుడు జోసెఫ్‌ సి మాథ్యూ చెబుతున్నారు. మోదీ హవా కేరళలోను ఉన్నదనే సర్వేలు చెబుతున్నాయి. ఈసారి  బీజేపీకి మూడు స్థానాలు వస్తాయని సర్వేల అంచనా.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram