– అర్వింద్‌ ‌ధర్మపురి, ఎంపీ, నిజామాబాద్‌

‌విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేస్తే నేనూ ఊరుకోను అంటూ తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.టి. రామారావు బీరాలు పలికారు. పొరుగు రాష్ట్రానికి కష్టం వస్తే స్పందించడం మన కర్తవ్యమంటూ ఒక మహా సత్యాన్ని తొలిసారి చెబుతున్నట్టు ఆవేశంగా వల్లించారు. కానీ తన పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో, భైంసా అనేచోట, ముస్లిం మతోన్మాదులు కక్కుతున్న విషం గురించి ధైర్యంగా ఒక్కమాట కూడా బయటకు అనడం లేదు ఎందుకని? అక్కడ ఎప్పుడూ బాధితులుగా మిగిలిపోతున్న హిందువులను పలకరించి రావడానికీ, సాయమందించడానికీ అడుగు పడదెందుకు? ఎన్నికల వేళ హిందువుల ఓట్లు కావాలనుకుంటే ‘మతోన్మాద మజ్లిస్‌’ అని సన్నాయి నొక్కులు నొక్కే  కేటీఆర్‌ ఇప్పుడు ఈ విపత్కర వేళ నోరు విప్పుతారనీ, భైంసా పాతకం గురించి మాట్లాడతారనీ అనుకోవడం దురాశే. మూడు దశాబ్దాలుగా ఆ పట్టణంలో జరుగుతున్న రక్తపాతమంతా తెరాస దత్తపుత్రులు మజ్లిస్‌ ‌గూండాల నిర్వాకమే.

ఆ మతోన్మాదులు సృష్టించిన రక్తపాతంలో, బీభత్సంలో బాధితులుగా మిగిలి, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వారి పట్ల ఒక్క సానుభూతి మాటైనా కేటీఆర్‌ ‌నోటి నుంచి రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌కేటీఆర్‌ల ధోరణి ముస్లిం మతోన్మాదులు పెచ్చరిల్లిపోవడానికి ఎంతగా దోహదం చేయాలో అంతగానూ దోహదం చేస్తున్నది. మూడు దశాబ్దాలుగా భైంసా అనే ఆ చిన్న పట్టణం ముస్లిం మతోన్మాదుల ఆగడాలతో తల్లడిల్లిపోతున్నది. సర్దార్‌ ‌పటేల్‌ ‌పుణ్యమా అని నిజాం తెలంగాణలో చాలాభాగం ముస్లిం మతోన్మాదం పడగ నీడ నుంచి బయటపడింది. కానీ భైంసాలో ఆ ఉన్మాదం పడగలెత్తడానికి అనువైన వాతావరణం మళ్లీ తయారయింది. కారణం- ఆ పట్టణంలో మజ్లిస్‌ ఆడింది ఆట, పాడింది పాట. మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌మజ్లిస్‌ ‌నేత మాటలు వింటే ఆ పట్టణాన్ని మినీ పాకిస్తాన్‌గా మార్చాలన్న ధృఢ నిశ్చయానికి వచ్చినట్టే అనిపిస్తుంది.

 భైంసాలో హిందువులు మూడు దశాబ్దాల నుంచి బిక్కుబిక్కు మంటూ బతుకుతున్న మాట ఎవరూ దాచలేరు. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులు ముస్లింల చేతుల్లోకి పోయాయి. హిందూ జనాభా లేకుండా చేయాలన్న ఒక క్రూర పథకంతో అక్కడి మజ్లిస్‌ ‌నాయకత్వం నడుస్తున్న దాఖలాలు నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ఏం జరిగిందో చూస్తున్నాం. ఇంగ్లండ్‌లో, ఇంకొన్ని పాశ్చాత్య దేశాలలో ముస్లిం మతోన్మాదులు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్నాం. ఆగడాలు, కబ్జాలు, ముస్లిం చట్టం కోసం అలజడులు, ముస్లిం మత రాజ్యస్థాపన కోసం తెగింపు. ఈ మతోన్మాద పథకాన్ని వాళ్లేమీ రహస్యంగా అమలు చేయాలని అనుకోవడం లేదు. సరిగ్గా ఇదే వాతావరణం నిర్మల్‌ ‌జిల్లా భైంసాలో కనిపిస్తుంది. అక్కడి హిందూ జనాభా మీద మజ్లిస్‌ ‌యుద్ధం ప్రకటించిన మాట నిజం. అయినా రాష్ట్ర పాలకులకి జ్ఞానోదయం కావడం లేదు. ఆ కొద్ది ఓట్ల కోసం ఒక ఉన్మాద మూకను సమర్ధిస్తున్నామన్న తెలివిడి వీళ్లలో నశించిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న మజ్లిస్‌ ఆగడాల పట్ల మౌనం వహిస్తూ తెరాస ప్రభుత్వం ఘోర తప్పదం చేస్తున్నది. గతంలో కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో ఇప్పుడు తెరాస అదే పంథాలో నడుస్తున్నది. బీజేపీ నాయకులే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తారని తెరాస వితండవాదం చేయవచ్చు. ఇంత వరకు జరిగిన అల్లర్ల మీద దర్యాప్తు చేయించమని కోరుతున్నాను. ఎవరివి ఆరోపణలో, ఏవి నిజాలో ప్రజలకి తెలుస్తుంది.

మజ్లిస్‌, ‌రోహింగ్యాలు, భైంసా విషయంలో తెరాస వైఖరి ఎలా ఉన్నదంటే తమ గోడును వినిపించుకునే హక్కు హిందువులకు లేదని బాహాటంగా చెబుతున్నట్టే ఉంది. ఈ ‘హిందూగాళ్లూ బొందూగాళ్లూ’ ముస్లిం మతోన్మాదుల చేతులలో ఊచకోతకు గురైతే మాత్రం నష్టమేమిటి? వాళ్లు ఉన్మాదులే కావచ్చు, అయినా మాకు అధికారం కట్టబెట్టే వారిని ఎందుకు దూరం చేసుకోవాలి అన్నట్టే విధానం సాగుతోంది. మార్చి 7వ తేదీన భైంసాలో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చిపోయారు. కానీ బాధితులైన హిందువులను పరామర్శించడానికి బీజేపీ నాయకులకు అనుమతే దొరకలేదు. సర్వం కోల్పోయిన సోదరులకు కొంచెం పప్పూ ఉప్పూ అందించే అవకాశం కూడా లేదు. అరెస్టులు, నిర్బంధాలు. హిందువులను ఆదుకుంటే తెరాస దత్తపుత్రుల మనసు బాధపడదా? వారు బాధ పడితే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌తట్టుకోగలరా? రాష్ట్రంలో గెలిచిన పార్టీ తెరాసయే. పాలించేది మాత్రం మజ్లిస్సేననడానికి ఇదే నిదర్శనం. ముస్లిం బుజ్జగింపు ధోరణికి తెరాస సరికొత్త కొనసా గింపు. ప్రమాదకర మలుపు కూడా. వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్లడం అని ఈ దేశంలో వెన్నెముక లేని చాలామంది సెక్యులరిస్టులు, ప్రాంతీయ పార్టీల మోచేతి నీళ్లు తాగే కమ్యూనిస్టులు, ఇంకా బుద్ధిలేని ఆచార్యులు పెద్దపెద్ద మాటలతో బీజేపీనే తప్పు పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్లలో ఒక్కరికీ వాస్తవాలు తెలియవు. తెలిసినా బీజేపీనే నిందించడం వీరి పంథా. 2020 జన వరిలో సంక్రాంతికి ముందు ముస్లిం మతోన్మాదులు జరిపిన దాడులలో గాని, ఇటీవలి ఘర్షణలలో గాని బాధితులైన హిందువులకు వైద్యం చేయించినదీ, నిత్యావసరాలు అందించి ఆదుకున్నదీ బీజేపీ, హిందూ ధార్మికసంస్థల కార్యకర్తలే. నిజామాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో యాంటీబయోటిక్‌ ‌కూడా లేకుండా చేసిందీ తెరాస ప్రభుత్వం. చావుబతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టును హైదరాబాద్‌ ‌తరలించినది బీజేపీ కార్యకర్తలేనన్నది ఈ సందర్భంగా ఆ అసందర్భ ప్రలాపులకి తెలియచేస్తున్నాను. ఏరియా ఆస్పత్రి దుస్థితి పుణ్యమా అని, ప్రాథమిక చికిత్స కూడా దక్కక రక్తమోడుతుండగానే తీసుకువెళ్లవలసి వచ్చింది.

 మార్చి ఏడో తేదీ రాత్రి జరిగిన బీభత్సకాండ దృశ్యాలు వైరల్‌ ‌కాకుండా పోలీసులు అంతగా ఉక్కుపాదం మోపడం ఎందుకు? సామాజిక మాధ్యమాలను, మీడియాను అంతగా బెదిరించడం ఎందుకు? ముమ్మాటికీ ముస్లింలను కాపాడడానికే. మజ్లిస్‌ను అంటకాగిన ఫలితం జీహెచ్‌ఎం‌సీ ఎన్నిక లలో కనిపించింది. అది పునరావృతం కాకుండా చూసుకోవడానికే. బయటి ప్రపంచానికి వాస్తవాలు తెలియకూడదని తపన పడుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మజ్లిస్‌ ‌తన పార్టీ వాళ్లకీ, ఇతర ముస్లింలకీ నష్టపరిహారం ఇప్పించుకుంటుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వెళ్లి, బాధితులకు హామీలు కురిపించినా, ఒక్క రూపాయి కూడా హిందువులకు అందదు. మరి ఎవరు అదుకోవాలి హిందువులని? ఈ దేశంలో పౌరులంతా సమానమని భావించే బీజేపీ, లేదా ఇతర హిందూ ధార్మిక సంస్థలే కదా? వీళ్లకీ ప్రవేశం ఇవ్వదా తెరాస ప్రభుత్వం? ఇది హిందువుల జీవించే హక్కును ముస్లిం మతోన్మాదులకు తాకట్టు పెట్టడం కాదా?

అసలు భైంసాలో హిందువుల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా మరొక ప్రశ్నే వస్తుంది. భైంసాలో నడుస్తున్నది తెరాస ప్రభుత్వమా? రజాకార్‌ ‌పాలనా? ఇది మూడు దశాబ్దాల ఘోర పరిస్థితిని చూసిన వారంతా వేసుకోక తప్పని ప్రశ్నే. ప్రజాస్వామ్య భారతదేశంలోనే తెలంగాణ ఉన్నా, భైంసా కూడా తెరాస ఏలుబడి కిందనే ఉన్నా, అది రజాకార్‌ ‌రాజ్యానికి నమూనాయే. కాసిం బేగ్‌, ‌జావెద్‌ అహ్మద్‌, ‌ఫైజుల్లా ఖాన్‌, ‌మాజిద్‌ అనే దుష్ట చతుష్టయం ఆ భీతావహ వాతావరణానికి నాలుగు దిక్కులు. అక్కడ జరిగే ప్రతి అల్లరి వీళ్ల కనుసన్నలలోనే జరుగుతుంది. చిత్రం ఏమిటంటే ఇందులో కాసింను పదిహేను సంవత్సరాల పాటు పట్టణం నుంచి బహిష్కరించారు. కానీ అక్కడే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఆ నిర్భాగ్య పేద హిందువులను పలకరించడానికి మేం భైంసా బయలుదేరుతున్న సంగతి ఏదో కర్ణ పిశాచి చెప్పినట్టు ఎంతో ముందే పసిగట్టిన తెలంగాణ నిఘావర్గాలకి ఆ ముష్కరుడు ఆ పట్టణంలోనే యథేచ్ఛగా తిరుగుతున్న సంగతి తెలియదా? ఆ పట్టణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి ఉంది. దాని సర్వే నెంబరు 468. దీనిని కబ్జా చేసి బయట నుంచి వచ్చిన ముస్లింలు ఇళ్లు కట్టుకునేందుకు పందేరం చేసేశారు, స్థానిక ముస్లిం నాయకులు. 338 సర్వే నెంబరు భూమిని కూడా ఇలాగే దర్జాగా కబ్జా చేశారు. గట్టు మైసమ్మ కోనేరు గతీ ఇంతే అయింది. ఎడ్ల బజారు స్థలం సహా ఇవన్నీ కలిపి ఇరవై ఎకరాలు. నిజామాబాద్‌లో బంగ్లాదేశీయులకు 72 వీసాలు పందేరం చేసిన దేశద్రోహం కుట్ర మీద దర్యాప్తు చేయిస్తున్నట్టే, భైంసాలో అరాచకాల మీద, కబ్జాల మీద లోతైన దర్యాప్తు అవసరమని కేంద్రాన్ని కోరుతున్నాను. ఇది తక్షణం చేయాలి. ఎందుకంటే ఆఖరికి హిందువుల స్మశానం కూడా ముస్లింలు కబ్జా చేస్తున్నారు.

భైంసాలో జరిగిన ప్రతి అల్లరినీ, రక్తపాతాన్నీ, మతోన్మాదుల ఆగడాలనూ పోలీసులు దాచి పెడుతున్నారు. మతోన్మాదులు రెచ్చిపోవడానికీ, వీళ్లని కాపాడుకుంటూ వస్తున్న పోలీసులకీ కూడా ప్రభుత్వ అండ ఉంది. అయినా బీజేపీ సాహసించి, అనేక నిర్బంధాల మధ్య వాస్తవాలను వెల్లడిస్తున్నది. తరువాత తీరికగా సినిమా పోలీసుల మాదిరిగా అవే మాటలను పోలీసు శాఖ చెబుతోంది. ఇప్పుడు జరిగిందీ అదే! ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించి, భయానకమైన శబ్దంతో వీధులలో తిరుగుతున్న ఆకతాయి ముస్లిం యువకులను నిలదీసినందుకే గొడవ మొదలయింది. పగలంతా కాయకష్టం చేసుకువచ్చిన సాధారణ హిందువులు పడుకునే సమయంలో ఈ రగడ సృష్టించారు. బీబీసీ చానెల్‌కు నిర్మల్‌ ఇన్‌చార్జ్ ఎస్‌పీ విష్ణు వారియర్‌ ఏం ‌చెప్పారో చాలామంది విన్నారు. ఆయన వినిపించినది అంతుకు ముందు బీజేపీ చెప్పినదే. భాషే తేడా. సైలెన్సర్లు తీసి ఆకతాయిలు గొడవ చేయడం ఏమిటి? అదే ముస్లింలు కత్తులు తీసుకుని వీధులలో హిందువులే లక్ష్యంగా వీరంగం వేస్తూ, ఇష్టానుసారం గాయపరిచేటంత ఉన్మాదానికి వెళ్లడం ఏమిటి? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసు యంత్రాంగం మెలకువతోనే ఉందా? లేకుంటే భైంసా ముస్లిం మతోన్మాదులు తాము పాకిస్తాన్‌లో ఉన్నామని అనుకుంటున్నారా? కత్తిపోట్లకు గురైన వారు ఎవరు? వృద్ధులు, బాలలు కూడా. ఆఖరికి జర్నలిస్టులూ మతోన్మాదుల కత్తిపోట్లు రుచి చూడవలసి వచ్చింది. ఎంత నీచం కాకపోతే, ఎక్కడో కశ్మీర్‌లో, హథ్రాస్‌లో ఏదో జరిగితే గంటల కొద్దీ చర్చలూ, కాలాల కొద్దీ వార్తలూ ఇచ్చే మీడియా సంస్థలు తోటి జర్నలిస్ట్ ‌కత్తిపోట్లకు గురైతే నోరెత్తలేదేమి? నిజ నిర్ధారణ సంఘాలు ఊరేగలేదేమి? తప్పిపోయిన మేకల కోసం అల్లర్లు ఆరంభించారన్న మాట కూడా ఉంది. అదే నిజమైతే, ఎవరివో మేకలు తప్పిపోతే హిందువులు కత్తిపోట్లకు గురికావాలా? అక్కడ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని బీజేపీ ఆరోపిస్తుంటే ఎందుకు ఉక్రోషం? ఇంతా జరిగాక, ఆరువందల మంది పోలీసులను మోహరించారట. 50 మంది పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారట. డ్రోన్‌ ‌కెమేరాలు కూడా ఉపయోగిస్తున్నారట. ఎవరికోసం? ముస్లిం మతోన్మాదులు చేయదలుచుకున్నదంతా చేశాక ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటి? ప్రతిసారి జరిగేది ఇదే. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని హోంమంత్రి కేటీఆర్‌కి నివేదించారు. అంటే ముస్లింలకి రక్షణ కల్పించాం అనే అర్ధం చేసుకోవాలి.

 సరిగ్గా జనవరి 2020లో జరిగిన అల్లర్లు ఇదే విధంగా మొదలైన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. అవే దృశ్యాలు, అదే క్రమం. అంటే హిందువుల రక్తం కళ్ల చూడాలని కోరిక కలిగినప్పుడల్లా సైలెన్సర్లు తొలగించిన ద్విచక్రవాహనాలు రోడ్లెక్కుతాయేమో పోలీసు వారు చెప్పాలి. ఇవి రోడ్లు ఎక్కిన వెంటనే హిందువుల ఇళ్ల మీద మసీదు నుంచి రాళ్లు కురవడం రివాజు. తరువాత కత్తిపోట్లు. ఇళ్లలోకి చొరబడి లూటీలు చేయడం. ఇదొక క్రమం. ఒక పథకం. ఇందులో మతోన్మాదం తప్ప మరొకటి లేదు. హిందూ ద్వేషం తప్ప మరొక సమస్య ఏదీ కనిపించదు. నిరుడు జరిగిన అల్లర్లలో మున్నూరు కాపు భవనం కూడా నష్టపోయింది. దాని నిర్వాహకులు, దారుణంగా నష్టపోయిన స్థానిక హిందూ కుటుంబాలు ముక్తకంఠంతో చేసిన ఆరోపణ ఒక్కటే. దుండగులు పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ అం‌టూ నినాదాలు చేశారు. హిందూ దేవుళ్ల ఫొటోలను బద్దలు కొట్టి, దగ్ధం చేసి, వాటి మీద మూత్ర విసర్జన చేసి అనాగరికంగా ప్రవర్తించారు. దీనిని మరొకలా అర్థం చేసుకో గలమా? ఇతర కోణం చూడగలమా? పండుగ కోసం చేసుకున్న పిండివంటలలో, వండి పెట్టుకున్న అన్నంలో మూత్రం పోయడం ఎంత హేయమైన చర్యో గ్రహించే స్పృహ కూడా తెరాస నాయకులకు లేదా? సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరిగిన ఊరేగింపులలో ఈ మారుమూల భైంసా ముందుంది. ఇది దేనికి సంకేతం? కాబట్టి ముస్లిం మతోన్మాదంతో ప్రపంచానికి పొంచి ఉన్న చేటు గురించి ఎన్నో గణాంకాలు వెలువడుతున్న వాస్తవాన్ని ఎప్పుడూ విస్మరించరాదు. అందుకు జరుగుతున్న కుట్రలు రహస్యమేమీ కాదు. ఈ కోణం నుంచే భైంసా పరిణామాలను చూడడం అవసరం.

 బీజేపీ వాళ్ల కంటే నేనే పెద్ద హిందువుని అని చెప్పుకుంటూ, యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి భైంసాలో దేవాదాయ భూములను రక్షించరెందుకని! అయోధ్య రామాలయానికే ఎందుకు? మీ ఊళ్లో రామాలయానికి విరాళాలు ఇవ్వండి అన్న ఉదారులు తెరాసలో చాలామంది ఉన్నారు. వారు కాస్త ధైర్యం తెచ్చుకుని ప్రశ్నించవచ్చు. ముఖ్యమంత్రిగారూ! మీ హిందూ అభిమానం కాస్త భైంసా హిందువుల కోసం వెచ్చించండి అని కోరవచ్చు. కానీ ఇది ఆశించడం అత్యాశే. ఇదే సమయంలో ఒక వివరణ. హిందూధర్మం గురించి బీజేపీ మాట్లాడుతున్నదీ అంటే, అది సర్వధర్మ సమభావనతోనే. అంతే తప్ప, హిందుత్వం మీద మా పార్టీకి పేటెంట్‌ ‌హక్కు ఉందని ఏనాడూ చెప్ప లేదు. ఇక్కడ ఉన్నవారంతా హిందువులే. హిందు వులు మెజారిటీలుగా ఉంటేనే ఈ దేశంలో సౌభాత్రం వెల్లివిరిస్తుందన్నది చరిత్ర నిష్కర్షగా చెప్పే వాస్తవం.

 ఉమ్మడి ఆంధప్రదేశ్‌, ‌నేటి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని గమనిస్తే ఒకటి నిశ్చయంగా చెప్పవచ్చు. ఇక్కడ హిందువులకు రక్షణ లేదు. రోహింగ్యాలకు ఉన్న భద్రత హిందూ జనాభాకు లేదు. ఇక మేల్కొనవలసింది హిందువులే. తమ ధర్మాన్ని రక్షించుకునే హక్కు, తమ విశ్వాసాలను ఆచరించే హక్కు వారికి కూడా రాజ్యాంగం ఇస్తున్నదన్న వాస్తవాన్ని నిరంతరం గుర్తు చేసుకోవడం నేటి కర్తవ్యం. హిందువుల ఆత్మగౌరవం నిలబడాలంటే ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాలను మూసీ నదిలో నిమజ్జనం చేయాలి. హిందువుల కంటే, పోలీసు శాఖ పది నిమిషాలు పక్కకి తప్పుకుంటే తడాఖా చూపిస్తాం, హిందువుల సంగతి చూస్తానని చెప్పిన ఉన్మాదిని పెంచిన పార్టీయే తెరాసకు ప్రధానమని చాలాసార్లు రుజువైంది. పదవుల కోసమో, రాజకీయ ప్రాబల్యం కోసమో స్వమతాభి మానాన్ని విస్మరించడం ఎవరూ చేయదగినది కాదు. కొందరు హిందువులలో కనిపించే ఇలాంటి పెడధోరణితోనే హిందూ ధర్మం భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అదే ఇంకా కొనసాగడం ముందుతరాల వారికి ద్రోహం, రేపటి తరాల పాలిట విధ్వంసం. ఈ అంశంలోనే వాస్తవికత లోపించి, చరిత్రను విస్మరించి అధికారం మత్తులో పడి తెరాస తూగుతోంది, ఊగుతోంది. నిజం చెప్పాలంటే మధ్య యుగాల మనస్తత్త్వం నుంచి ముస్లిం మతోన్మాదులు బయటపడకుండా, ప్రధాన జీవనస్రవంతిలోకి రాకుండా అడ్డుకుంటున్నవి తెరాస వంటి పార్టీలే. ఇంకొక మాటలో చెప్పాలంటే ముస్లింల వెనుకుబాటుకు కారణం ఈ దొంగ సెక్యులరిజం, దాని ఆధారంగా అధికారంలో కులకాలని భావించే ఇలాంటి పార్టీలే. ఇంకా, ఈ పార్టీలు ముస్లింలలోని ఆధిపత్య ధోరణిని పెంచి పోషిస్తున్నాయి. మజ్లిస్‌కు మతం, రాజకీయం వేర్వేరు కావు. కానీ హిందువులు ఆ పంథాలో నడవరు. కాబట్టి మన ధర్మానికీ, మనదైన విశ్వాసాలకీ చేటు చేసే రాజకీయాల ఎడలనే కాదు, భారతీయతను నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న పార్టీలతో ఓట్ల కోసం చెలిమి చేసే తెరాస వంటి శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ హిందువులకు గౌరవం ఉంటేనే ప్రజాస్వామ్యం నిలుస్తుంది. సౌభాత్రం పరిఢవిల్లుతుంది. నేటి ప్రపంచంలో నాగరిక దేశాలకు ప్రజాస్వామ్యం, సాభాత్రమే గీటురాళ్లు. హిందువులు, ఇతర ధర్మాల వారు మెజారిటీలుగా ఉన్నచోట ప్రశాంత వాతావరణం కనపడుతుంటే, ముస్లిం జనాభా కాస్త ఎక్కువగా ఉన్నా ఉన్మాదం పెచ్చరిల్లడం నేటి అంతర్జాతీయ వాస్తవం. భైంసా ఇందుకు మినహాయింపు కాదు.

జైహింద్‌

By editor

Twitter
Instagram