– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. స్థిరాస్తి వివాదాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు.  విద్యార్థులకు కొంత శ్రమ తప్పదు. ఉద్యోగులకు స్థానమార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా. 30,31 తేదీలలో శుభవార్తలు, వాహనసౌఖ్యం. గణపతిని పూజించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

బంధువుల నుంచి  విలువైన సమాచారం.  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని  పాతబాకీలు వసూలవుతాయి.    వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో  గందరగోళం తొలగుతుంది. రాజకీ యవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అన్ని విధాలా కలిసివచ్చేకాలం. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. 26,27  తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆశించిన ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల సాయంతో  కొన్ని కార్యక్రమాలు చక్కదిద్దుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రాగలవు.   25,26  తేదీల్లో దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం.  విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చర్చలు కొన్ని ఫలిస్తాయి.  స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి.  క్రీడాకారులు, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 29,30 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు.  సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రెండుమూడు విధాలుగా ధనలబ్ధి. అత్యంత విలువైన సమాచారం అందుతుంది.  ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. సేవకార్యక్రమాలపై ఆసక్తి.  వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. సాంకేతిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 27,28 తేదీల్లో అనుకోని సంఘటనలు.  బందువిరోధాలు. శివస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు.  దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. 25,26 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

తెలివిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 27,28 తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి.  కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  వాహనాలు, భూములు కొంటారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు విధుల్లో కొత్త బాధ్యతలు దక్కుతాయి. రాజకీయ, కళారంగాలవారు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. లక్ష్మీగణపతిని పూజించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. అదనపు రాబడి ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.  సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.  వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత అనుకూలత. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వారం 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. దత్తాత్రేయుని పూజించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

దూరపు బంధువుల కలయిక. వేడుకలు, విందువినోదాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 26,27  తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలలో పురోగతి. . పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. 27,28 తేదీల్లో ప్రయాణాలలో మార్పులు. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి..


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.  ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఒత్తిడులు తొలగుతాయి. 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువులతో విభేదాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram