– ‌జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌హిజాబ్‌:

‌శిరోజాలూ, మెడ కనిపించకుండా ముస్లిం బాలికలు, యువతులు ధరించే ఒక వస్త్రం. ఈ చిన్న వస్త్రం చుట్టూ అల్లుకున్న సంప్రదాయం 2022 సంవత్సరాన్ని పెద్ద వివాదానికి వేదికను చేసి చరిత్రపుటలలోకి తీసుకుపోయింది. మత ప్రమేయం లేని భారతదేశంలో జనవరి, 2022లో హిజాబ్‌ ఒక అలజడిని సృష్టించింది. అది ముస్లిం మహిళకు అనివార్యమైన మత చిహ్నమని, ధరించక తప్పదంటూ కర్ణాటకలోని ఉడిపిలో ఆరుగురు విద్యార్థినులు కోరడంతో వివాదం మొదలయింది. కానీ హిజాబ్‌ ‌ధారణ ఇస్లాంలో తప్పనిసరి కాదనీ, విద్యార్థినులు యూనిఫారాలు ఉపయోగించవలసిందేననీ హైకోర్టు తేల్చి చెప్పింది. తాము చదువు కంటే మత చిహ్నం ధరించడానికే ప్రాధాన్యం ఇస్తామని ఆ విద్యార్థినులు మంకు పట్టు పట్టారు. ఈ వివాదం నడుస్తూ ఉండగానే ఇస్లామిక్‌ ‌దేశమైన ఇరాన్‌లో తాము హిజాబ్‌ ‌ధరించబోమని ప్రకటించి, శిరస్సు మీద ఉన్న ఆ వస్త్రాన్ని దహనం చేయడం ఆరంభించారు మహిళలు. ఇప్పుడు ఈ వివాదం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. హిజాబ్‌ ‌ధరించబోమంటూ ఉద్యమించిన మహిళల మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీద, విద్యార్థినుల మీద ఇరాన్‌ ‌ప్రభుత్వం తూటాల వర్షం కురిపిస్తోంది. మరణదండనలకు సిద్ధపడుతోంది. ప్రభుత్వం, పార్లమెంటు కూడా హిజాబ్‌ను సమర్థిస్తున్నాయి. ప్రజానీకం పోరాటం కొనసాగిస్తూనే ఉంది.

హిజాబ్‌ ఆకృతి, ఆచరణలో ముస్లిం ప్రపంచ మంతా ఏకరూపంలో కనిపించడం లేదు. దీనికి ఇస్తున్న నిర్వచనాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. హిజాబ్‌ ‌ధరించడం వల్ల ఆ వర్గ స్త్రీల సౌందర్యం మరుగున ఉండి, వారు దాడులకు గురికాకుండా కాపాడుతుందని కొన్ని భాష్యాల వల్ల తెలుస్తుంది. హిజాబ్‌కు అనుకూలంగా ఉడిపి (కర్ణాటక) ముస్లిం బాలికలు లేవదీసిన వివాదం తరువాత, ఇరాన్‌ ‌మహిళల తిరుగుబాటు మొదలయింది. కర్ణాటకలో తీవ్రమైన మత భావన కనిపిస్తే, ఇరాన్‌లో మత భావనలోని తీవ్రతను నిరాకరిస్తున్న పరిణామం కనిపిస్తుంది. మొదటిది ఛాందసవాదంలోకి చొచ్చుకు పోవడానికి ఆరాటం. ఇంకొకటి ఛాందసవాదం నుంచి విముక్తికి పోరాటం. మహసా అమిని (ఈమెను జినా అమిని అని కూడా పిలుస్తారు) అనే 22 ఏళ్ల యువతిని ‘ప్రభుత్వ నిబంధనల మేరకు’ హిజాబ్‌ ‌ధరించలేదన్న కారణంతో ఇరాన్‌ ‘‌మొరాలిటీ పోలీసులు’ టెహ్రాన్‌లో నిర్బంధంలోకి తీసుకోవడం, సెప్టెంబర్‌ 16‌న ఆమె పోలీసు కస్టడీలోనే మరణిం చడంతో ఒక్కసారిగా ఇరాన్‌లో హిజాబ్‌ ‌వ్యతిరేక ఆందోళన పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఆందోళన క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించడం వర్తమాన చరిత్ర. గత 40 ఏళ్లుగా ఇరాన్‌లో మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొనడానికి, ఛాందసవాద ప్రభుత్వాలు అనుసరిస్తున్న అణచివేత విధానాలే ప్రధాన కారణం.

 ఇరాన్‌ ‌రాజ్యాంగం మహిళలను పురుషుల్లో అర్ధభాగంగా పరిగణిస్తుంది. గతంలో దక్షిణ అమెరికాలోని రాష్ట్రాల్లో నల్లజాతి బానిసలను ఒక వ్యక్తిలో 2/3వ వంతుగా పరిగణించేవారు. ఇరాన్‌లో ప్రస్తుత మహిళల దుస్థితిని, నాటి అమెరికాలోని నల్లజాతి బానిసల స్థితితో పోల్చవచ్చు. 1979లో ఇస్లామిక్‌ ‌విప్లవం తర్వాత, కొత్త ప్రభుత్వం దేశంలో ఇస్లామిక్‌ ‌చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఇస్లామిక్‌ ‌పీనల్‌ ‌కోడ్‌, 5‌వ పుస్తకంలోని 638వ అధికరణ ప్రకారం హిజాబ్‌ ‌ధరించని మహిళలకు పదిరోజుల నుంచి రెండు నెలల వరకు జైలుశిక్షతో పాటు 50వేల నుంచి 5లక్షల రియాల్స్ ‌వరకు జరిమానా విధించవచ్చు. పరిస్థితిని బట్టి ఈ రెండింటిలో ఒకటి లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంది. 1979 విప్లవానికి ముందు మహమ్మద్‌ ‌రెహజా పహ్లవి పాలనాకాలంలో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌ ‌ధరించాలన్న నిబంధన ఉండేదికాదు. ఐచ్ఛికంగా కొందరు తలపై ఛదర్‌ను ధరించేవారు. ప్రస్తుతం ఇరాన్‌లో హిజాబ్‌ ‌వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. 2020లో నిర్వహించిన ఒక సర్వేలో 58% మంది ఇరానియన్లు హిజాబ్‌ ‌పట్ల విశ్వాసం ప్రదర్శించలేదు. 72% మంది హిజాబ్‌ ‌తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను వ్యతిరేకిం చారు. కేవలం 15% మంది బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ ‌ధరించాలన్న అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

గర్ల్ ఆఫ్‌ ‌యెంఘ్‌లాబ్‌ ‌స్ట్రీట్‌

2017-18 ‌సంవత్సరంలో ఇరాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమం పెద్ద ఎత్తున చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విదా మొవహెద్‌ అనే పేరు గల మహిళ 2017, డిసెంబర్‌ 27‌న టెహ్రాన్‌లోని యెంఘ్‌లాబ్‌ ‌స్ట్రీట్‌ (‌రివల్యూషన్‌ ‌స్ట్రీట్‌)‌లో ఒక తెల్లని హిజాబ్‌ను ఒక కర్రకు కట్టి దాన్ని జెండా మాదిరిగా ఊపుతూ, అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను ఉత్సాహపరచింది. అప్పటి నుంచి ఈమెను ‘గర్ల్ ఆఫ్‌ ‌యెంఘ్‌లాబ్‌ ‌స్ట్రీట్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. ఆరోజు ఆమెను పోలీసులు అరెస్ట్ ‌చేసినా, నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. అయితే మొవహెద్‌ ఈ ‌చర్య వెనుక, ఇరానియన్‌ -అమెరికన్‌ ‌జర్నలిస్టు మసిహ్‌ అలెనిజాద్‌ ‘‌వైట్‌ ‌వెన్స్‌డేస్‌’ ‌పాటించాలని ఇచ్చిన పిలుపు స్ఫూర్తిదాయక మైనదని చెబుతారు. కాగా 2022లో మొహసా అమిని మరణంతో ఈ నిరసనలు ఉధృతం కావడం తాజా పరిణామం.

రైసీ ఇచ్చిన ఆదేశాలతో రావణకాష్టం

గతంలో ఇరాన్‌ ‌న్యాయవ్యవస్థకు అధినేతగా పనిచేసిన ఇబ్రహీం రైసీ 2021, ఆగస్ట్ 3‌వ తేదీ నుంచి ఆ దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇరాన్‌ 8‌వ అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్న ఈయన ముస్లిం పండితుడు మాత్రమే కాదు, ఛాందసవాది. హిజాబ్‌ను మహిళలు తప్పనిసరిగా ధరించాలంటూ ఈయన ఇచ్చిన ఆదేశాలు ఇరాన్‌ను రావణకాష్టంగా మార్చాయి. హిజాబ్‌ ‌చట్టాన్ని అమల్లోకి తెచ్చే ముందు ఇబ్రహీం రైసీ దేశ ప్రజల ఆలోచనా సరళిని అంచనా వేయడంలో తప్పటడుగు వేశారు. ముఖ్యంగా దేశ ప్రజల్లో 30 ఏళ్లకు అటూ ఇటూ వయసున్న వారి సంఖ్య అత్యధికం. వీరంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, ప్రపంచంలో ఏకాకిగా మిగిలిన దేశంలో పూర్తి కట్టుబాట్ల మధ్య పెరిగారు. వీరిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల మక్కువ, విదేశాలతో సంబంధాలు కొనసాగించాలన్న ఆకాంక్ష మెండు. కానీ రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలపై నిషేధం, మీడియాపై ఆంక్షలు, టెలివిజన్‌ ‌ఛానళ్లను నిలువ రించడం వంటి ప్రభుత్వ చర్యలను వీరు సహిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం ఇరాన్‌లో హిజాబ్‌ను బహిరంగంగా వ్యతిరేకించడానికి ఏ మత పెద్ద సాహసించడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హిజాబ్‌ ‌విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వవచ్చునని కొందరు మతపెద్దల అభిప్రాయం. కొన్నేళ్ల క్రితం మోహసేన్‌ ‌ఘరావియన్‌ అనే మత పెద్ద ఇరాన్‌కు వచ్చే పర్యాటకులపై హిజాబ్‌ను ధరించాలని వత్తిడి తీసుకొని రాకూడదని చెప్పి అప్పట్లో పతాక శీర్షికల్లో నిలిచారు.

నిజం చెప్పాలంటే హిజాబ్‌ ‌సమర్థకులు ఉన్నట్లే, వ్యతిరేకించేవారూ ఉన్నారు. మొత్తంమీద వర్తమాన ఇరాన్‌ ‌పరిస్థితి చెప్పాలంటే హిజాబ్‌ను తప్పనిసరి చేయడం ద్వారా ప్రత్యర్థులను నిర్వీర్యం చేసి, రాజకీయంగా దేశంపై మరింత పట్టు సాధించా లన్న ప్రభుత్వ ఉద్దేశం వెల్లడవుతోంది. అంతేకాదు ఇక్కడ వస్త్రధారణ, మతం అనే అంశాలను పక్కన పెడితే మహిళలను నియంత్రణలో ఉంచడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా హిజాబ్‌ ‌సమస్య మహిళలను కేంద్ర స్థానంలో నిలిపిందనడంలో సందేహం లేదని ఇరానియన్‌ – ‌కెనడియన్‌ ‌స్త్రీవాద రచయిత నజ్లీ కమ్‌వరీ వ్యక్తం చేసిన అభిప్రాయం సముచితమైనదే. మరో అంశం- హిజాబ్‌ ‌సమస్య ఇరాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇతర వివక్షలను కూడా బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. కానీ హిజాబ్‌ ‌చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు చైనా మాదిరిగా తమ దేశ ప్రజలపై ఎలక్ట్రానిక్‌ ‌నిఘా పెట్టాలని ప్రభుత్వం తలపోస్తున్నది. తాను కచ్చితంగా అమలు చేయాలనుకుంటున్న సామాజిక, మతపరమైన నిబంధనల ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అగాధం పెరుగుతున్నదన్న సత్యాన్ని రైసీ గుర్తించడంలేదు.

ఆలస్యంగా స్పందించిన పశ్చిమ దేశాలు

ఇప్పటికే భిన్న ధృవాలుగా ఉన్న పశ్చిమ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఇరాన్‌ ‌సమస్యపై చాలా ఆలస్యంగా స్పందించాయి. పాశ్చాత్య మీడియా కూడా ఇరాన్‌లో మహిళల నిరసన ప్రదర్శనలను, హిజాబ్‌లను తగులబెట్టే దృశ్యాలను ప్రచురించినప్పటికీ అక్కడ మహిళల హక్కుల కోసం జరిపే పోరాటానికి దన్నుగా నిలిచేందుకు ఇది మాత్రమే సరిపోదు. తాము ఏ దుస్తులు ధరించాలి? ఎవరిని ప్రేమించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాలను ప్రభుత్వాలే నిర్ణయిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ప్రస్తుతం ఇరాన్‌ ‌మహిళలు రోడ్డెక్కడానికి ప్రభుత్వ వైఖరే కారణమన్నది ఇక్కడ గుర్తించాల్సిన సత్యం. ఫ్రాన్స్‌లో బురఖాని, భారత్‌లో హిజాబ్‌ను నిషేధించినప్పుడు, అమెరికాలో అబార్షన్‌ను చట్టవిరుద్ధం చేసినప్పుడు గట్టిగా విమర్శించిన ఫెమినిస్టులు, ఇరాన్‌ ‌మహిళల విషయంలో తమ గళాన్ని మరింత కఠినంగా, బిగ్గరగా వినిపించకపోవడం విచిత్రం!

సూడో లిబరల్స్ ‌రెండు నాల్కల ధోరణి

ఇక మనదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునేవారు ఇరాన్‌లో హిజాబ్‌ ‌వ్యతిరేక ఉద్యమంపై ఎందుకు పెద్దగా స్పందించడం లేదు? వీరి మౌనానికి కారణమేంటి? కళాశాలల తరగతి గదుల్లో హిజాబ్‌ ‌ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు, ఈ సామాజిక పోరాటవాదులు ‘ఐచ్ఛికం’ అనే వాదనకు మద్దతు నిచ్చారు. మరి వీరు ఇరాన్‌ ‌మహిళల పోరాటంపై ఎందుకు పెదవి విప్పరు? ఇది వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనం కాదా? పురుషాధిక్య సమాజంపై పోరాటం చేస్తున్నామని డప్పులు కొట్టి ప్రచారం చేసు కునేవారు.. అన్ని వర్గాలు, మతాల్లోని మహిళలకు అనుకూలంగా పోరాటాలు చేయాలి. అంతేకాని ఇతర రాజకీయ ఉద్యమాలు ‘హైజాక్‌’ ‌చేస్తాయన్న భయంతో వ్యవహరించకూడదు.

ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే, భారత్‌లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. మనదేశంలోని ముస్లిం మహిళలు హిజాబ్‌పై భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. తమను తాము మేధావులుగా చెప్పుకుంటున్న సూడో లిబరల్స్.. ‌మోదీ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వం దేశంలోని 200 మిలియన్ల ముస్లింలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొడుతుందని వాదించడంలో పెద్ద విశేషమేం లేదు. కానీ ‘భారత్‌లో హిజాబ్‌కు మద్దతు, ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకం’ అన్నట్టుగా ఉన్న వారి వ్యవహారశైలి, తమలోని ద్వంద్వ వైఖరిని బట్ట బయలు చేస్తోంది. ఇదే సమయంలో మనదేశంలోని జాతీయవాద ప్రభుత్వ మద్దతుదార్లు ఇరాన్‌ ‌మహిళల ఆందోళనకు తమ మద్దతు తెలుపుతున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా లెఫ్ట్ ‌లేదా రైట్‌ ‌మహిళలు స్పష్టం చేసేది మాత్రం ఒక్కటే, ‘హిజాబ్‌ ‌కాదు ఇక్కడ ముఖ్యం. మా ఐచ్ఛికం అనేది కీలకం’.

ఈ జనవరిలో కర్ణాటక రాష్ట్రంలో; ప్రస్తుతం ఇరాన్‌లో జరిగిన హిజాబ్‌ ‌నిరసనలు దానిని ధరించాలా వద్దా అన్న విషయాన్ని మహిళలకే వదిలేయాలన్న సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో మాదిరిగా కాకుండా, ఇరాన్‌లో సమస్య హిజాబ్‌, ‌మతాన్ని దాటిపోయాయనే చెప్పాలి. ఎందుకంటే మహసా అమిని మృతికి కారణమైన మొరాలిటీ పోలీసు విభాగ అధినేతను సస్పెండ్‌ ‌చేసినా, ఈ యువతి మృతిపై విచారణకు రైసీ ఆదేశాలు జారీచేసినా మహిళల ఆందోళన పెరిగిందే తప్ప తగ్గుముఖం పట్టలేదు. డజన్ల కొద్దీ నగరాల్లో ఆందోళనల ఉధృతి పెరగడమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది. అల్లర్లు ఐదో వారంలోకి ప్రవేశించిన సమయానికి మరణాలు 233కు చేరాయి. ఇది అక్టోబర్‌ ‌నాటి లెక్క. అంటే అమిని మృతి ఇరాన్‌ ‌మహిళల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహావేశాలు హింసాత్మక రూపం దాల్చడానికి ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. 15,000 మందిని అరెస్టు చేసినట్టు అల్‌ ‌జజీరా టీవీ చానల్‌ ‌కూడా వెల్లడించింది. వీరందరికీ మరణ దండన విధిస్తారన్న కథనాలు ఇప్పుడు కలకలం సృష్టి స్తున్నాయి. కానీ దీనిని నమ్మడం సాధ్యం కాదని చాలా మంది దేశాధినేతల అభిప్రాయం.

2009లో జరిగిన ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనను ఇవి తలపునకు తెస్తున్నాయి. హిజాబ్‌ ‌వివాదం ఎప్పటినుంచో ఇరాన్‌ ‌మహిళల్లో ఇస్లామిక్‌ ‌ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని ఒక్కసారిగా విస్ఫోటం చెందేలా చేసింది. అంతేకాదు ఇరాన్‌ అధినేత 83 ఏళ్ల అలీ ఖమైనీ అధికారం నుంచి వైదొలగాలన్నది ప్రస్తుతం మహిళల ప్రధాన డిమాండ్‌. ‌ప్రభుత్వం సహజంగానే ఆందోళనలను కఠినంగా అణచివేస్తున్న తీరు, 2019 నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తున్నది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ‌ట్రంప్‌ ఇరాన్‌పై పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ఒత్తిడి నుంచి తట్టుకోవ డానికి ఏకపక్షంగా ఇరాన్‌ ‌ప్రభుత్వం పెట్రోలు ధరలను 50 శాతం వరకు పెంచేసింది. దీనికి వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పటి అధ్యక్షుడు హస్సన్‌ ‌రౌహానీ ఆందోళనలను కఠినంగా అణచివేసే పక్రియలో 321 మంది అసువులు బాసారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. 2019లో మాదిరిగానే నేడు కూడా మహిళలతో సహా సాధారణ ఇరానియన్లూ పోలీసుల దాష్టీకానికి బలవుతున్నారు. పశ్చిమ దేశాలతో ఇరాన్‌ అణుచర్చలు జరుపుతున్న సమయంలో ఈ ఆందోళనలు చెలరేగడం ఇక్కడ కీలకాంశం. డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌విధించిన ఆంక్షల్లో కొన్నింటిని జో బైడెన్‌ ‌సడలించడంతో ఊపిరి పీల్చుకున్న ఇరాన్‌, ‌ప్రస్తుత అణుచర్చల్లో తేడా వస్తే మళ్లీ ఆంక్షలను ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యాకు డ్రోన్‌లను సరఫరా చేయడం కూడా అణుచర్చలకు మరో ప్రధాన అడ్డంకి. ఒకవేళ మళ్లీ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే ఆర్థికంగా ఇరాన్‌ ఏకాకి కావడం ఖాయం. కానీ దీని దుష్ఫలితాన్ని స్పష్టంగా అనుభవించేది మాత్రం సాధారణ ఇరానియన్లు మాత్రమే.

ఇరాన్‌ ‌ప్రజల్లో వచ్చిన మార్పు

నలభయ్యేళ్ల క్రితం 98.2% ఇరానియన్లు ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ఆవిర్భావానికి రిఫరెండమ్‌ ‌ద్వారా తమ ఆమోదాన్ని తెలిపారు. అయితే 1979 నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇరాన్‌ ‌ప్రజల్లో మత దురభిమానం తగ్గిపోయి, ఆలోచనా విధానాల్లో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ‘గ్రూప్‌ ‌ఫర్‌ అనలైజింగ్‌ అం‌డ్‌ ‌మెజరింగ్‌ ‌యాటిట్యూడ్స్ ఇన్‌ ఇరాన్‌’ (‌జీఏఎం ఏఏఎన్‌) అనే సంస్థ ఇరాన్‌లో 50వేల మందికి పైగా ప్రజలపై ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం 32% మంది మాత్రమే తమను తాము షియాలుగా చెప్పుకున్నారు. 68% మంది రాజ్య శాసనాల్లో మతపరమైన ఆజ్ఞలను తొలగించాలని కోరారు. అంతేకాదు ఇప్పటి ఇరాన్‌ ‌ప్రజల ఆలోచనా విధానం ఐదేళ్ల క్రితం నాటికి పూర్తి భిన్నం. అప్పట్లో అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తూ వీరు తమ ప్రభుత్వానికి దన్నుగా నిలిచారు. కానీ తర్వాతి కాలంలో ఆంక్షలు, కొవిడ్‌-19 ‌మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఆహార, ఇంధన కొరత వంటి సమస్యలు ప్రజలను పీల్చి పిప్పిచేశాయి. ప్రస్తుతం వారి ఆలోచనా విధానంలో మార్పునకు ఇదే కారణం. దీని ఫలితమే నేటి ఆందోళనలు. గతంలో మాదిరి కాకుండా, నేడు ప్రజలు ముఖ్యంగా మహిళలు బహిరంగంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్‌లను తగలబెట్టడం మాత్రమే కాదు, తమ జుట్టును కూడా కత్తిరించుకుంటున్నారు. ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ‌వ్యవస్థాపకుడు అయొతుల్లా రుహల్లా ఖొమైనీ ప్రస్తుత ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అలీ ఖొమైనీల పోస్టర్లను ధ్వంసం చేస్తుండటం వారిలోని వెల్లువెత్తుతున్న ఆగ్రహానికి నిదర్శనం.

దేశ ఆర్థిక దుస్థితి, మతమౌఢ్యం తగ్గిపోవడం… ఈ రెండు అంశాలు ప్రస్తుతం ఇరాన్‌లో ఆందోళనలు సుస్థిరంగా కొనసాగడానికి కారణభూతమవు తున్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఇరాన్‌ ‌ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విదేశాంగ విధానం, దేశీయ విధానాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ఇటు అంతర్జా తీయంగా, అటు దేశీయంగా ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. గత సెప్టెంబర్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో మాట్లాడుతూ, గత జనవరిలో యూఎస్‌ ‌డ్రోన్‌ ‌దాడిలో మరణించిన ఇరానియన్‌ ‌మిలిటరీ కమాండర్‌ ‌ఖాసిమన్‌ ‌సోలైమని మరణానికి కారకులను శిక్షించాలని ఒక పక్క డిమాండ్‌ ‌చేయగా, మరోపక్క దేశంలో సోలైమని బ్యానర్లను ప్రజలు తగులబెడుతూ నిరసన ప్రదర్శనలు జరపడం గమనార్హం. సోలైమని రైసీకి ఒకప్పుడు కుడిభుజంగా వ్యవహరించారు.

అన్ని వర్గాల మద్దతు

 అమిని మరణం తర్వాత దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో వివిధ సామాజిక నేపథ్యమున్న మహిళలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ముఖ్యంగా టెహ్రాన్‌లో కుర్దులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి. అమిని కుర్దు యువతి కావడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన డ్రెస్‌ ‌కోడ్‌ ‌మాత్రమే ఇంతటి తీవ్రస్థాయి ఆందోళనకు కారణమని చెప్పలేం. దేశంలో ప్రాథమికంగా రాజకీయ, ఆర్థిక సంస్కరణలు అవసరమన్న బలీయమైన కోర్కె ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా మహిళల్లో కనిపించింది. నిజానికి ఈ హిజాబ్‌ ఆం‌దోళన ఇప్పటికిప్పుడు రగిలింది కాదు. మహిళలు పని ప్రదేశాల్లో హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలని 1979లో అప్పటి ఇరాన్‌ అధినేత అయొతుల్లా ఖొమైనీ ప్రకటించినప్పుడే మహిళలు తిరగబడ్డారు. అయితే నాటి రివల్యూషనరీ దళాలు వీరిపై హింసాత్మక దాడులకు పాల్పడ్డాయి. ఈ రివల్యూషనరీ దళాలే తర్వాతి కాలంలో మొరాలిటీ పోలీస్‌గా రూపాంతరం చెందాయి. అయితే 1979 నాటి ఆందోళనకు, ప్రస్తుత నిరసనలకు ముఖ్యంగా మూడు అంశాల్లో తేడా ఉంది. మొదటిది మార్పును కోరుతూ మహిళలే ఆందోళనలో ముందుండటం, రెండవది మధ్య తరగతి, శ్రామిక వర్గాల నుంచి మాత్రమే కాకుండా ధనిక వ్యాపారులు, ప్రముఖుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడం, మూడవది దేశంలోని విభిన్న భౌగోళిక ప్రాంతాల్లోకి వేగంగా విస్తరించడంతో చిన్నా పెద్దా నగరాలు ఆందోళనకు కేంద్రస్థానాలుగా మారిపోవడం.

సహజంగానే ఇరానియన్‌ ‌మహిళల్లో చాలా హిజాబ్‌ ఆకృతి, ఆచరణలో ముస్లిం ప్రపంచ మంతా ఏకరూపంలో కనిపించడం లేదు. దీనికి ఇస్తున్న నిర్వచనాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. హిజాబ్‌ ‌ధరించడం వల్ల ఆ వర్గ స్త్రీల సౌందర్యం మరుగున ఉండి, వారు దాడులకు గురికాకుండా కాపాడుతుందని కొన్ని భాష్యాల వల్ల తెలుస్తుంది. హిజాబ్‌కు అనుకూలంగా ఉడిపి (కర్ణాటక) ముస్లిం బాలికలు లేవదీసిన వివాదం తరువాత, ఇరాన్‌ ‌మహిళల తిరుగుబాటు మొదలయింది. కర్ణాటకలో తీవ్రమైన మత భావన కనిపిస్తే, ఇరాన్‌లో మత భావనలోని తీవ్రతను నిరాకరిస్తున్న పరిణామం కనిపిస్తుంది. మొదటిది ఛాందసవాదంలోకి చొచ్చుకు పోవడానికి ఆరాటం. ఇంకొకటి ఛాందసవాదం నుంచి విముక్తికి పోరాటం. మహసా అమిని (ఈమెను జినా అమిని అని కూడా పిలుస్తారు) అనే 22 ఏళ్ల యువతిని ‘ప్రభుత్వ నిబంధనల మేరకు’ హిజాబ్‌ ‌ధరించలేదన్న కారణంతో ఇరాన్‌ ‘‌మొరాలిటీ పోలీసులు’ టెహ్రాన్‌లో నిర్బంధంలోకి తీసుకోవడం, సెప్టెంబర్‌ 16‌న ఆమె పోలీసు కస్టడీలోనే మరణిం చడంతో ఒక్కసారిగా ఇరాన్‌లో హిజాబ్‌ ‌వ్యతిరేక ఆందోళన పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఆందోళన క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించడం వర్తమాన చరిత్ర. గత 40 ఏళ్లుగా ఇరాన్‌లో మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొనడానికి, ఛాందసవాద ప్రభుత్వాలు అనుసరిస్తున్న అణచివేత విధానాలే ప్రధాన కారణం.

సహజంగానే ఇరానియన్‌ ‌మహిళల్లో చాలా మంది విద్యావంతులు. వీరిలో డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, నర్సులు, టీచర్లు ఉన్నారు. హిజాబ్‌ ‌ధరించాలన్న నిబంధనను వ్యతిరేకించిన వీరు సామాజిక-ఆర్థికరంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయారు. అదీకాకుండా 1979 ఇస్లామిక్‌ ‌విప్లవానికి ముందు మహిళల జీవన శైలిపై విప్లవ అనుకూలురు వివరాలు సేకరించడమే కాదు, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలకు శిక్షలు విధించారు. ఉదాహరణకు ఇస్లామిక్‌ ‌విప్లవానికి ముందు సైన్యంలో పనిచేసిన వారి కుమార్తెలను యూనివర్సిటీ విద్యకు లేదా ఉద్యోగాల్లో చేరడానికి అనుమతించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే డ్రెస్‌ ‌కోడ్‌.. ‌మహిళలు, పురుషును విద్య, ఉద్యోగం వంటి సామాజిక హక్కులకు దూరం చేసింది. జీన్స్, ‌షార్ట్ ‌స్లీవ్‌లు, గాఢమైన రంగుల దుస్తులు వేసుకో కూడదన్న నిబంధన పురుషులకు కూడా విధించారు. ఆ విధంగా ప్రభుత్వం ప్రజల జీవితాలకు సంబంధిం చిన ప్రతి అంశంలో కలుగజేసుకుంది. పుట్టినరోజు వేడుకలు, సంగీతం వినడం, విదేశీ చిత్రాలను చూడటం, ఆఖరికి కుక్కలను పెంచే విషయంలో కూడా ప్రభుత్వం కలుగజేసుకోవడం మొదలు పెట్టింది. అయితే ఇస్లామిక్‌ ‌విప్లవం వచ్చిన తర్వాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు అనుగుణంగా ప్రభుత్వం మార్పులు చేపట్టలేదు. కానీ ప్రస్తుత తరం తమ వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేదు. ప్రభుత్వం విధించే డ్రెస్‌ ‌కోడ్‌ ‌సామాజిక, రాజకీయ వెనుకబాటుకు చిహ్నంగా వారు పరిగణిస్తున్నారు. ఇస్లామిక్‌ ‌విప్లవానికి ముందు హిజాబ్‌ ‌ధరించడంపై నిర్బంధం ఉండేది కాదు. వీరు బహిరంగ ప్రదేశాల్లో తిరగడమే కాదు, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వారు. వీటికి సంబంధించిన ఫొటోలు విపరీతంగా వైరల్‌ ‌కావడంతో, ఇప్పటి మహిళలు తమ ప్రైవేటు జీవితాలపై కొనసాగుతున్న నియంత్రణ విషయంలో మౌనంగా సహిస్తున్న బాధ మహసా అమిని మరణంతో ఒక్కసారిగా ఆందోళనల రూపంలో విస్ఫోటం చెందింది. అంతేకాదు, ఆమె మరణం ఇరాన్‌లో గూడుకట్టుకున్న అనేక సమస్యలను ఒక్కసారిగా బహిర్గతం చేసింది. ప్రపంచ దేశాల్లో హిజాబ్‌ ‌ధరించడం అనేది వ్యక్తిగతంగా మతపరమైన అంశంగా పరిగణిస్తే, ఇరాన్‌ ‌దాన్ని సామాజిక – ఆర్థిక వెనుకబాటుకు చిహ్నంగా మార్చేసింది. అందువల్ల ఇక్కడ ఆందోళన కారులు హిజాబ్‌ ‌ధరించడాన్ని తిరస్కరిస్తున్నా రంటే ఇస్లామిక్‌ ‌విలువలను వ్యతిరేకించి నట్టు కాదు. దశాబ్దాలుగా తమ స్వేచ్ఛను కోల్పోయిన మహిళల్లో వ్యక్తమవుతున్న అసహనం, కోపంగా దీన్ని పరిగ ణించాలి.

ఒక్కో దేశంలో, ఒక్కో నిబంధన

ప్రస్తుతం హిజాబ్‌ను కొన్ని దేశాలు అనుమతిస్తుండగా, మరికొన్ని దేశాలు నిషేధించాయి. అంటే హిజాబ్‌ ‌ధరిం చడంపై వివిధ ప్రభుత్వాలు భిన్న వైఖరులు అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండొనేసియా, ఇరాన్‌, ఆఫ్ఘానిస్తాన్‌ ‌వంటి దేశాల్లో హిజాబ్‌ ‌ధరించడం తప్పనిసరి. యూరప్‌ ‌దేశాల్లో హిజాబ్‌ ‌విషయంలో వివాదాలు ఏర్పడి, దీన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురావాలన్న వత్తిడులను కూడా ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాల్లో హిజాబ్‌ ‌విషయంలో చట్టం తేవడానికి అంతర్గతంగా చర్చలు కొనసాగుతుండగా, మరికొన్ని దేశాల్లో దీనిపై పరిమిత నిషేధం అమల్లో ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో హిజాబ్‌లతో సహా మతపరమైన చిహ్నాలను నిషేధిస్తూ ఫ్రాన్స్ ‌ప్రభుత్వం 2005లో చట్టం అమల్లోకి తెచ్చింది. ముస్లిం మెజారిటీ దేశాలైన కొసావో, అజర్‌ ‌బైజాన్‌, ‌ట్యునీషియా, టర్కీల్లో పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ‘బురఖా’ను నిషేధించాయి.

లెబనాన్‌, ‌మొరాకో, ట్యునీసియా దేశాల్లో హిజాబ్‌ ‌ధరించే మహిళల పట్ల వివక్ష చూపు తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పదహారు దేశాలు బురఖాను నిషేధించాయి. అవి వరుసగా ట్యునీసియా, ఆస్ట్రియా, డెన్మార్క్, ‌ఫ్రాన్స్, ‌బెల్జియం, తజకిస్తాన్‌, ‌బల్గేరియా, కామెరూన్‌, ‌ఛాద్‌, ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కాంగో, గబన్‌, ‌నెదర్లాండ్స్, ‌చైనా (జిన్‌జియాంగ్‌ ‌ప్రాంతంలో), మొరాకో, శ్రీలంక, స్విట్జర్లాండ్‌. ‌హిజాబ్‌ ‌లేదా బురఖా విషయంలో వివిధ దేశాలు విభిన్న రీతుల్లో వ్యవహరిస్తున్న నేపథ్యంలో, నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడలేదు. అందువల్ల ప్రతి దేశం తన అంతర్గత పరిస్థితుల కనుగుణంగా వ్యవహ రించడమే ఉత్తమం. ఒకరితో మరొకరు పోల్చుకో వాల్సిన అవసరం లేదు.

————————

హిజాబ్‌ ‌చరిత్ర

1936, జనవరి 8న అప్పటి ఇరాన్‌ (‌పర్షియా) రాజు రెజా షా ‘కస్ఫ్-ఇ- ‌హిజాబ్‌’ ‌పేరుతో ఒక డిక్రీ జారీచేశారు. దీని ప్రకారం ఇరాన్‌లో అన్ని రకాల హిజాబ్‌లు, ఛదర్‌లు రద్దయినాయి. ఈ డిక్రీని జారీ చేయడమే కాదు, రెజా షా దీన్ని వేగంగా అమలు పరచారు. అంతేకాదు పురుషులు సంప్రదాయ దుస్తులను ధరించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఇరాన్‌ ‌రాజకీయాల్లో హిజాబ్‌ ‌వివాదం కొనసాగుతూ వస్తోంది. ఆ విధంగా రెజా వస్త్రధారణను ఇరాన్‌ అం‌తర్గత రాజకీయ సమస్యగా మార్చేశారనే చెప్పాలి. రెజా షా తన దేశాన్ని ఆధునిక మార్గంలోకి నడపాలని ఆకాంక్షించారు. సంప్రదాయ దుస్తుల విషయంలో ఆయన తీసుకున్న చర్యలు ఇందులో భాగమే. అంతేకాదు దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశించాలంటే మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములు కావాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకు ఆయన అప్పట్లో ఆధునిక పోకడలతో ఉన్న టర్కీని ఉదాహరణగా తీసుకున్నారు. రాణి, రాజు కుటుంబంలోని ఇతర మహిళలు ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ‘కస్ఫ్-ఇ-‌హిజాబ్‌’ ‌డిక్రీకి నమూనాగా నిలిచారు.

రెజా షా సంస్కరణలకు ఉపక్రమించడానికి చాలాకాలం ముందు అంటే, 1928లో రాణి తాడ్జ్ ఒల్‌-‌మొలౌక్‌ ‌ఖోమ్‌ ‌నగరానికి తీర్థయాత్రకు వెళ్లి అక్కడి ఫాతిమా మసుమొహ్‌ ‌ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. అప్పుడు ఆమె హిజాబ్‌తో పూర్తిగా ముఖాన్ని కప్పుకోకపోవడాన్ని అక్కడి మతపెద్ద తీవ్రంగా విమర్శించారు. అయితే ఇరాన్‌లోని నాటి మహిళా హక్కుల కార్యకర్తలు హిజాబ్‌ ‌ధరించక పోవడాన్ని పూర్తిగా సమర్థించారు. అంతేకాదు ఇరాన్‌కు చెందిన నాటి ప్రముఖ ఫెమినిస్టు సెదిఖె దౌలతాబాది 1928లో హిజాబ్‌ ‌ధరించకుండా బహిరంగంగా కనిపించిన తొలి మహిళగా చెబుతారు. నాటి సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలోనే రెజా షా ఒకేసారి కాకుండా, క్రమంగా సంస్కరణ లను ప్రవేశపెట్టారు. 1930లో ఇరాన్‌లో మొత్తం 6.5 మిలియన్ల మంది మహిళలుండగా, నాలుగువేల మంది మాత్రమే హిజాబ్‌ ‌ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చేవారంటే అక్కడ కట్టుబాట్లు ఎంత కఠినమో అర్థమవుతుంది. ధైర్యంగా బయటకు వచ్చింది విద్యావంతులైన మహిళలే. 1935లో ఇరాన్‌ ‌ప్రభుత్వ మద్దతుతో ‘కనూన్‌-ఇ-‌బన్‌వాన్‌’ ‌పేరుతో మహిళా కమిటీ ఏర్పాటైంది. క్రమంగా మహిళా హక్కుల కార్యకర్తలు హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. అప్పటి సంస్కరణలను షియా మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించినా సంస్కరణల అమలు మాత్రం ఆగలేదు. 1936, జనవరి 8న ‘కస్ఫ్-ఇ-‌హిజాబ్‌’ ‌పేరుతో డిక్రీ జారీచేసిన తర్వాత, ఇరాన్‌ ‌రాజు రెజా షా టెహ్రాన్‌ ‌టీచర్స్ ‌కాలేజీలో కార్యక్రమానికి తన రాణి, ఇద్దరు కుమార్తెలతో సహా హాజరయ్యారు. వీరంతా ఆధునిక దుస్తులతో, హిజాబ్‌లు ధరించకుండా ఒక కార్యక్రమంలో పాల్గొనడం అదే ప్రథమం. ఈ సందర్భంగా రాణి చేతుల మీదుగా డిప్లొమాలను అందజేశారు.

By editor

Twitter
Instagram