Category: ప్రత్యేక వ్యాసం

ఒక యుద్ధం.. రెండు వ్యూహాలు

కొవిడ్‌ 19 ‌మహమ్మారితో యుద్ధానికి విరామం ఇవ్వలేం. ఆర్థిక వ్యవస్థ పునర్‌ ‌నిర్మాణ యజ్ఞం ప్రారంభించకుండా ఇక ఉండలేం. ఇలాంటి అత్యంత కీలక దశకు భారతదేశం చేరింది.…

సాలెగూడు

– జాగృతి డెస్క్ గోరక్షణ పేరుతో కొంతమంది, ఒక సమయంలో అజ్ఞానంతో వ్యవహరించారు. కొందరిని చంపారు. ఇది హేయమైన చర్య. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ…

దేశం కాదు స్వార్థ రాజకీయాలే ముఖ్యం

– ‌కరోనా సంకట సమయంలో మోదీ విరోధుల సిగ్గుమాలిన చర్యలు – లాక్‌డౌన్‌ ‌నెపంతో ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు మీ స్వంత పూచీతో ఈ కథనాన్ని చదవండి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశం. బహుశా ‘రాజకీయంగా తప్పుడు’ వ్యాసం. నేను గతంలో నా రాజకీయ అభిప్రాయాలను ఎవరితోనూ పంచుకోలేదు. మొదటిసారి నా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇది జీవన్మరణ సమస్య. అలాంటి సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. నేను రాసిన ప్రతిదాన్ని చదివినప్పటికీ మీకు నా మాటలు అర్థం కాకపోతే, దయచేసి ఇక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దు. నా వద్ద సమయం లేదు. శక్తి అంతకంటే లేదు. మీతో వాదించాలనే కోరిక నా మనసులో లేదు. మీరు నన్ను అనుసరించకపోయినా ఫర్వాలేదు. జీవన్మరణ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు బాగా అర్థం చేసుకోవచ్చు.…

‌శ్రీరాముడే మనకు స్ఫూర్తి

మా. భయ్యాజీ జోషి   శ్రీరామనవమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా మనం ఒక భిన్నమైన వాతావరణంలో నిర్వహించుకున్నాం. శ్రీరాముడు భగవంతుని అవతారం. ఆయన అసురులను సంహరిస్తూ, జీవన విలువలను, సర్వమానవులను రక్షించారు. నేడు మానవాళి ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజలంతా దీనివల్ల భయకంపితులవుతున్నారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి. ఈ సంక్రమణను నివారించడమే ఏకైక పరిష్కారం. ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నట్లు నడుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కుతాం. భారతీయులైన మనం ఇటువంటి ఎన్ని సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన స్థితిని నిర్మాణం చేసి శ్రీరాముని స్ఫూర్తితో మనం ఈ ప్రపంచానికి చాటిచెబుదాం. నేడు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్న మయ్యారు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏ అవసరం వచ్చినా ముందుండి స్వయంసేవకులు సమాజ హితంకోసం పని చేస్తున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. పదివేలకు పైగా స్థలాల్లో లక్షలాది స్వయం సేవకులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యోజన ప్రకారం సుమారు పది లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది.…

మతానికి వక్రభాష్యం ఫలితం

దేశ రాజధాని పరిసరాలలో తబ్లిఘి జమాత్‌ అనే సంస్థ నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌లో వేల మందిని పోగుచేసి ప్రార్థనలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాతో సహా చాలా టీవీ చానళ్ల పేనలిస్టులకు ఇదే ప్రశ్న ఎదురైంది. జాతీయ మీడియాలో ఒక వర్గమైతే ఇంకొక అడుగు ముందుకేసి ‘కేంద్రం నిద్రపోతోందా?’ అని కూడా నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాలంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసు శాఖ ఉండదు కాబట్టి అంటున్నారు. వాస్తవంగా, కేంద్రం బాధ్యత వహించింది కాబట్టే, మర్కజ్‌ ‌నిర్వాహకుల మెడలు వంచింది కాబట్టే ఒక పెను విపత్తు నుంచి భారతదేశం బయటపడింది. దీనిని ఈ దేశ పౌరులంతా గుర్తించవలసిన అవసరం ఉందని నా విన్నపం. ఆ విషయం వివరించే ముందు నేను మరొక ముఖ్య విన్నపం కూడా చేస్తున్నాను. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబ సభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవారు, ఏదో రకంగా పరస్పరం తాకిన వారు అంతా… మాతృసమానులు, పితృసమానులు.. సోదర సమానులు ఎల్లరు కూడా అల్లా వారసులుగా, స్వచ్ఛందంగా బయటకు రండి! కొవిడ్‌ 19…

భారతీయులదే భారత్‌

‌భారత స్వాతంత్య్ర సమరానికి అనేక రూపాలూ, దశలూ ఉన్నాయి. చట్టబద్ధ  విధానాలతో ఉద్యమించిన సంస్థలూ, ఇంగ్లిష్‌ ‌రాజనీతి మీద విశ్వాసం లేక, బ్రిటిష్‌ ‌జాతి పాలనలోని దమననీతి మీద ఆగ్రహంతో హింసాయుత పంథాలో సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న సంస్థలు ఉన్నాయి. దేశం లోపల, విదేశాల కేంద్రంగా, ఇక్కడి కొండ కోనలలో గిరిజనులు, మైదానాలలో రైతులు కూడా బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌జరిపిన ఏకైక పోరాటంతోనే స్వాతంత్య్రం వచ్చిందన్న తీర్పు చారిత్రక దృక్పథంతో ఇచ్చినది కాలేదు.

Twitter
Instagram