హఠాత్తుగా టిబెట్‌ ‌మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.  టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలకు భారత్‌ ‌భారతీయ పేర్లు పెట్టబోతోందన్న వార్తతో, అమెరికా నుంచి అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఏకగ్రీవంగా టిబెట్‌ ‌స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని, కనుక దాని వివాదం ఇంకా అపరిష్కృతంగానే ఉన్నదంటూ సెనేట్‌లో తీర్మానాన్ని ఆమోదించడమే కాదు, ఏకంగా ఏడుగురు సభ్యుల బృందం వచ్చి  దలైలామాను కలవడం వరస సంచలన వార్తలు ప్రపంచం దృష్టికి వచ్చాయి.  దలైలామాను కలిసేందుకు వచ్చిన అమెరికా బృందం ప్రధాని మోదీని కూడా కలవడంతో చైనా కస్సుబుస్సులాడుతోంది. నిన్నటివరకూ తాను అడుగు పెట్టిన ప్రతి ప్రాంతంలో భూమిని ఏదో ఒక మిషతో నిరాటంకంగా ఆక్రమిస్తూ తన పరపతిని పెంచుకుంటూ వస్తున్న చైనాకు మరి ఇది ఒక ఆటంకమే.

హిమాచల్‌‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్‌ ‌ప్రవాస ప్రభుత్వ అధిపతి టెంజిన్‌ ‌గయాస్టో (14వ దలైలామా)ను జూన్‌ 19‌న అమెరికా కాంగ్రెస్‌ ‌సభ్యులు కలుసుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఒక అధికారి అరుణాచల్‌లో పర్యటించినా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉండే చైనా, అమెరికా బృందం రాకతో మండిపడింది. టిబెట్‌ ‌ప్రజానీకం తమకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును, వారి సంస్కృతిని కాపాడుకునే హక్కును కూడా కలిగి ఉందని కొన్ని దశాబ్దాలుగా అమెరికా భావిస్తున్నది. ఆ విధానంలో ఇప్పుడు పెను మార్పు తెచ్చింది. దీనికి కొనసాగింపుగానే అమెరికా బృందం దలైలామాను కలుసుకున్నది. టిబెట్‌తో 2010 నుంచి స్తంభించిన చర్చలను చైనా పునరుద్ధరించాలని ఈ మాసంలోనే అమెరికా కాంగ్రెస్‌ (‌పార్లమెంట్‌) ఒక బిల్లును ఆమోదించింది. ‘టిబెట్‌ ‌సమస్యను పరిష్కరించాలి’ పేరుతో అన్ని పక్షాల ఆమోదంతో తెచ్చిన ఈ బిల్లు మీద జోబైడెన్‌ ‌త్వరలోనే సంతకం చేయనున్నారు. ఆ బిల్లు రూపకర్త, కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ ‌నాన్సీ పెలోసి కూడా ఆ బృందంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ‌విదేశ వ్యవహారాల కమిటి చైర్మన్‌ ‌మైకేల్‌ ‌మెక్‌కౌల్‌• ‌నాయకత్వం వహించారు. కాంగ్రెస్‌ ‌నిబంధన కమిటీ ర్యాకింగ్‌ ‌సభ్యుడు జిమ్‌ ‌మెక్‌గోవర్న్, ఇం‌డోపసిఫిక్‌ ‌ర్యాంకింగ్‌ ‌సభ్యుడు అమీ బెరా కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా శక్తిమంతమైన ప్రతినిధి బృందం.

ఈ పరిణామం పట్ల చైనా ఆందోళనకు, ప్రతికూల ధోరణికి కొన్ని అంశాలు కనిపిస్తాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాలు పతనమైన కాలమిది. వాటిని పునరుద్ధరించుకునే పనిలో ఉన్న చైనాకు అమెరికా బృందం దలైలామాను కలవడం అపశకునంగానే కనిపిస్తుంది. టిబెట్‌ ‌మీద అమెరికా విధానం ఏమిటి? టిబెట్‌ అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం చైనాలో భాగమే. కానీ తమ భవిష్యత్తును టిబెటన్లు మాత్రమే నిర్దేశించుకోవాలి అంటుంది అమెరికా. అలాగే 2016 నాటి డోక్లాం, 2020 నాటి గల్వాన్‌ ‌పరిణామాలతో భారత్‌తో కూడా చైనా సంబంధాలు అధ:పాతాళానికి పడిపోయిన సమయంలో ఈ పరిణామం సంభవించింది. ఈ పరిణామానికి చైనా తత్తర పడుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. టిబెట్‌ ‌సమస్య పరిష్కారం బిల్లు మీద సంతకం చేయరాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను చైనా హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. టిబెట్‌ ‌సమస్య పరిష్కార బిల్లు అమెరికా విధానంలో వచ్చిన మార్పును సంకేతిస్తున్నదని అమెరికా కాంగ్రెస్‌ ‌విదేశ వ్యవహారాల కమిటీ చైర్‌పర్సన్‌ ‌మైకేల్‌ ‌మెక్‌కౌల్‌ ‌చెప్పడం ఈ పరిణామానికే కీలకం. మెక్‌కౌల్‌ ‌టిబెట్‌ ‌పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఈ మాట చెప్పారు. అమెరికా బృందం వచ్చి దలైలామాను కలుసుకోవడం అంటే చైనాకు గట్టి సందేశం పంపించడమేనని టిబెట్‌ ‌ప్రవాస పార్లమెంట్‌ ‌స్పీకర్‌ ‌కెన్పో సోనమ్‌, ‌పలువురు టిబెటన్లు భావిస్తున్నారు. దీనికి కొసమెరుపు:చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా బృందం ధర్మశాలలో ఉండగానే జూన్‌ 20‌న మన ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి కలుసుకున్నారు. జూన్‌ 23‌వ తేదీనే దలైలామా ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా చేరుకోవడం మరొక మలుపు.

 మొన్నమొన్నటివరకూ ఉత్పత్తి రంగంలో చైనాను ప్రోత్సహించి, పెట్టుబడులు పెట్టిన అమెరికా, ఇప్పుడు అది తనను శాసించే స్థాయికి ఎదుగు తుందేమోనని వణుకుతోంది. అందుకే, వడివడిగా ఆర్ధిక నిచ్చెన ఎక్కుతున్న భారత్‌ను దానికి పోటీగా నిలిపేందుకు తాపత్రయ పడుతోంది. నిజానికి, అది మనకు మేలు చేసినా, ఇన్నేళ్లు అటకమీద ఉన్న విషయాన్ని అమెరికా సంచలనం చేయడం వెనుక లక్ష్యం చైనాను ఇరుకున పెట్టడమే అన్నది నిర్వివాదం. అయితే ఈ ప్రాంతం నిన్నటి వరకూ భారత్‌, ‌చైనాలకు మధ్య ఈ ప్రాంతం ఒక హిమాచల్‌‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్‌ ‌ప్రవాస ప్రభుత్వ అధిపతి టెంజిన్‌ ‌గయాస్టో (14వ దలైలామా)ను జూన్‌ 19‌న అమెరికా కాంగ్రెస్‌ ‌సభ్యులు కలుసుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఒక అధికారి అరుణాచల్‌లో పర్యటించినా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉండే చైనా, అమెరికా బృందం రాకతో మండిపడింది. టిబెట్‌ ‌ప్రజానీకం తమకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును, వారి సంస్కృతిని కాపాడుకునే హక్కును కూడా కలిగి ఉందని కొన్ని దశాబ్దాలుగా అమెరికా భావిస్తున్నది. ఆ విధానంలో ఇప్పుడు పెను మార్పు తెచ్చింది. దీనికి కొనసాగింపుగానే అమెరికా బృందం దలైలామాను కలుసుకున్నది. టిబెట్‌తో 2010 నుంచి స్తంభించిన చర్చలను చైనా పునరుద్ధరించాలని ఈ మాసంలోనే అమెరికా కాంగ్రెస్‌ (‌పార్లమెంట్‌) ఒక బిల్లును ఆమోదించింది. ‘టిబెట్‌ ‌సమస్యను పరిష్కరించాలి’ పేరుతో అన్ని పక్షాల ఆమోదంతో తెచ్చిన ఈ బిల్లు మీద జోబైడెన్‌ ‌త్వరలోనే సంతకం చేయనున్నారు. ఆ బిల్లు రూపకర్త, కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ ‌నాన్సీ పెలోసి కూడా ఆ బృందంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ‌విదేశ వ్యవహారాల కమిటి చైర్మన్‌ ‌మైకేల్‌ ‌మెక్‌కౌల్‌• ‌నాయకత్వం వహించారు. కాంగ్రెస్‌ ‌నిబంధన కమిటీ ర్యాకింగ్‌ ‌సభ్యుడు జిమ్‌ ‌మెక్‌గోవర్న్, ఇం‌డోపసిఫిక్‌ ‌ర్యాంకింగ్‌ ‌సభ్యుడు అమీ బెరా కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా శక్తిమంతమైన ప్రతినిధి బృందం.

ఈ పరిణామం పట్ల చైనా ఆందోళనకు, ప్రతికూల ధోరణికి కొన్ని అంశాలు కనిపిస్తాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాలు పతనమైన కాలమిది. వాటిని పునరుద్ధరించుకునే పనిలో ఉన్న చైనాకు అమెరికా బృందం దలైలామాను కలవడం అపశకునంగానే కనిపిస్తుంది. టిబెట్‌ ‌మీద అమెరికా విధానం ఏమిటి? టిబెట్‌ అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం చైనాలో భాగమే. కానీ తమ భవిష్యత్తును టిబెటన్లు మాత్రమే నిర్దేశించుకోవాలి అంటుంది అమెరికా. అలాగే 2016 నాటి డోక్లాం, 2020 నాటి గల్వాన్‌ ‌పరిణామాలతో భారత్‌తో కూడా చైనా సంబంధాలు అధ:పాతాళానికి పడిపోయిన సమయంలో ఈ పరిణామం సంభవించింది. ఈ పరిణామానికి చైనా తత్తర పడుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. టిబెట్‌ ‌సమస్య పరిష్కారం బిల్లు మీద సంతకం చేయరాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను చైనా హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. టిబెట్‌ ‌సమస్య పరిష్కార బిల్లు అమెరికా విధానంలో వచ్చిన మార్పును సంకేతిస్తున్నదని అమెరికా కాంగ్రెస్‌ ‌విదేశ వ్యవహారాల కమిటీ చైర్‌పర్సన్‌ ‌మైకేల్‌ ‌మెక్‌కౌల్‌ ‌చెప్పడం ఈ పరిణామానికే కీలకం. మెక్‌కౌల్‌ ‌టిబెట్‌ ‌పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఈ మాట చెప్పారు. అమెరికా బృందం వచ్చి దలైలామాను కలుసుకోవడం అంటే చైనాకు గట్టి సందేశం పంపించడమేనని టిబెట్‌ ‌ప్రవాస పార్లమెంట్‌ ‌స్పీకర్‌ ‌కెన్పో సోనమ్‌, ‌పలువురు టిబెటన్లు భావిస్తున్నారు. దీనికి కొసమెరుపు:చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా బృందం ధర్మశాలలో ఉండగానే జూన్‌ 20‌న మన ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి కలుసుకున్నారు. జూన్‌ 23‌వ తేదీనే దలైలామా ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా చేరుకోవడం మరొక మలుపు.

 మొన్నమొన్నటివరకూ ఉత్పత్తి రంగంలో చైనాను ప్రోత్సహించి, పెట్టుబడులు పెట్టిన అమెరికా, ఇప్పుడు అది తనను శాసించే స్థాయికి ఎదుగు తుందేమోనని వణుకుతోంది. అందుకే, వడివడిగా ఆర్ధిక నిచ్చెన ఎక్కుతున్న భారత్‌ను దానికి పోటీగా నిలిపేందుకు తాపత్రయ పడుతోంది. నిజానికి, అది మనకు మేలు చేసినా, ఇన్నేళ్లు అటకమీద ఉన్న విషయాన్ని అమెరికా సంచలనం చేయడం వెనుక లక్ష్యం చైనాను ఇరుకున పెట్టడమే అన్నది నిర్వివాదం. అయితే ఈ ప్రాంతం నిన్నటి వరకూ భారత్‌, ‌చైనాలకు మధ్య ఈ ప్రాంతం ఒక బఫర్‌జోన్‌గా (తటస్థ ప్రదేశంగా) ఉందన్న విషయాన్ని విస్మరించరానిది.

చైనాను నియంత్రించడమే అమెరికా లక్ష్యం

 చైనాను నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది. సమస్య సత్వర పరిష్కారం పేరుతో బిల్లు ఆమోదం ఇందుకే. గుర్తింపు, మానవ హక్కులు, మత, సాంస్కృతిక, జాతీయ హక్కుల ప్రస్తావనతో పాటు తమకు నచ్చిన మతపరమైన నాయకులను ఎంపిక చేసుకునే హక్కు టిబెటన్‌ ‌ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ చట్టం నొక్కి చెప్తుంది. టిబెటన్‌ ‌బౌద్ధాన్ని పిఆర్‌సి, భూటాన్‌, ‌నేపాల్‌, ‌మంగోలియా, భారత్‌, ‌రష్యన్‌ ‌ఫెడరేషన్‌, ‌యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌సహా పలు దేశాల్లో ఆచరిస్తున్న విషయాన్ని పట్టి చూపుతూ, ఈ కారణంగానే దలైలామాను చైనా ఏకపక్షంగా నియమించలేదనే విషయాన్ని స్పష్టం చేసింది. లాసాలో యుఎస్‌ ‌కాన్సులేట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతించే వరకూ అమెరికాలో పిఆర్‌సి మరొక కాన్సులేట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు చైనాకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆ మాత్రానికే వివిధ దేశాల్లోని టిబెటన్లు సంతోషిస్తున్నారు.ప్రస్తుతం చైనా పాక్‌, శ్రీ‌లంకల నుంచి, బంగ్లా నుంచి కూడా కాస్త ప్రతికూలత ఎదుర్కొంటున్న తరుణంలో అమెరికా కొత్త ఎత్తు వేసినప్పటికీ టిబెట్‌ ‌సమస్య దక్షిణాసియా లోనే పెద్ద చరిత్ర కలిగిన అంశం.

అధికారం లేనివారితో ఒప్పందం

నిజానికి చైనాను ఇబ్బంది పెట్టేందుకు అత్యంత ముఖ్యమైన చట్టకోణం ఒకటుంది. టిబెట్టుపై 1950లో ఆక్రమణకు దిగిన చైనా, మే 23, 1951న చట్టవ్యతిరేకంగా 17 పాయింట్ల చట్టంపై బల వంతంగా సంతకాలు చేయించు కుంది. పిఆర్‌సికి టిబెట్‌పై పూర్తి నియంత్రణను ఈ ఒప్పందం ఇచ్చింది. ఏ అధికారం లేకుండానే టిబెట్‌ ‌తరఫున, దాని ప్రజల తరఫున ఈ ఒప్పందంపై ఒక వ్యక్తి సంతకాలు చేశాడు. కాగా, ప్రధాన ప్రకటనలో మొదటిలోనే టిబెట్‌ను ప్రత్యేక భూభాగమని, గత శతాబ్ద కాలంలో చైనా ఎటువంటి ప్రభావవంతమైన నియంత్రణను కలిగి లేదని కూడా ఆ ఒప్పందంలో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ న్యాయపరమైన లోపాలను వాడుకోవచ్చు. తనంతట తానుగా టిబెట్‌ ‌చైనాలో భాగం కాదనే విషయాన్ని ఇది రుజువు చేస్తుంది. ఇందుకు మరింత లోతుగా అధ్యయనం చేయడం అవసరం.

మావో ఫైవ్‌ ‌ఫింగర్‌ ‌సిద్ధాంతం

2020లో భూటాన్‌కు 100 కిమీల లోపల ఉన్న సాకతెంగ్‌ ‌శాంక్చువరీ తమదంటూ చైనా ప్రకటించింది. ఈ ప్రాంతం తవాంగ్‌ ‌ప్రాంతం దగ్గరగా ఉంటుంది, దీనితో దీనిని కూడా దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ప్రకటించేసింది. ఈ రకంగా చైనా మావో అరచేతిని, అతడి ఫైవ్‌ ‌ఫింగర్‌ ‌థియరీ (ఐదు వేళ్ల సిద్ధాంతాన్ని) చైనీయులు పునరుద్ధరిం చారు. ‘‘గ్జిజాంగ్‌ (‌టిబెట్‌) అన్నది తన ఐదువేళ్ల – లద్దాక్‌, ‌నేపాల్‌, ‌సిక్కిం, భూటాన్‌, అరుణాచల్‌ ‌నుంచి విడివడిన చైనా కుడి చేతి అరచెయ్యి. ఈ ఐదింటినీ భారత్‌ ఆ‌క్రమించింది, లేదా అవి భారత్‌ ‌ప్రభావంలో ఉన్నాయి. ఈ ఐదూ గ్జిజాంగ్‌ (‌టిబెట్‌)‌తో తిరిగి కలిసేందుకు వాటిని ‘విముక్తం’ చేయడం చైనా బాధ్యత,’ అన్న ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే తన పావులు కదపడం ప్రారంభించింది.

భారతీయ దృక్పధం

టిబెట్టును 2003వరకూ చైనాలో భాగంగా భారత్‌ ‌గుర్తించలేదు. ఆ ఏడాది చేసుకున్న ఒప్పందం ఇలా ఉంది -‘సరిహద్దు వాణిజ్య మార్కెట్టుకు వేదికగా సిక్కింలోని చంగ్గు ప్రాంతాన్ని నిర్దేశించేందుకు భారతీయ పక్షం అంగీకరిస్తోంది; చైనా పక్షం టిబెట్‌ ‌స్వతంతప్రతిపత్తిగల ప్రాంతంలోని రెన్‌క్విన్‌గ్గాంగ్‌ను సరిహద్దు వాణిజ్య మార్కెట్‌కు వేదికగా పేర్కొం టోంది.’ కానీ, ఈ ప్రకటనను కాస్త తిరగమరగ చేస్తే, టిబెట్‌ను చైనాలో భాగంగాను, సిక్కింను భారత్‌లో భాగంగానూ భారత్‌ ‌గుర్తిస్తున్నట్టు స్థాపించవచ్చు. నాథూలా పాస్‌ను ప్రవేశ, నిష్క్రమణ పాయింట్‌గా ప్రస్తావించడంతో, దానినే సరిహద్దుగా పరిగణించడం సహజం. మరొక విషయం ఏమిటంటే, టిబెట్‌ ‌స్వయంప్రతిపత్తి ప్రాంతం మెక్‌మోహన్‌ ‌రేఖకు దక్షిణం వరకూ విస్తరించి ఉందని 2003లో చైనా ఎప్పుడూ పేర్కొనలేదు. సహజ అవగాహన ఏమిటంటే, కొన్ని ప్రదేశాలలో ఆ రేఖపై వివాదాలు ఉన్నప్పటికీ, మెక్‌మోహన్‌ ‌రేఖకు ఉత్తరంగా టిబెట్‌ ఉం‌టుందన్నది సామాన్య అవగాహన. ఇందుకు సాక్ష్యం, 1917లో చైనా పోస్టేజ్‌ ‌మ్యాపే. ఇందులో ఎక్కడా అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ను టిబెట్‌లో భాగంగా చూపలేదు. అలాగే ఉత్తర సరిహద్దులు సంప్రదాయ భావనకు అనుగు ణంగా అనిపిస్తాయి. ఇందులో టిబెట్‌, ‌గ్జిన్‌జియాంగ్‌, ‌మంగోలియాలను భిన్న ప్రాంతాలుగానే చూపారు.

2003 అనంతరమే, అరుణాచల ప్రదేశ్‌ ‌దక్షిణ టిబెట్‌ అన్న వాదనను చైనా ప్రారంభించింది. తమ జలమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో 2006లో చైనా ఒక మ్యాప్‌ను (ఇప్పుడు తొలిగించినా) పోస్ట్ ‌చేసింది. ఇందులోనే చిత్రరూపంలో దక్షిణ టిబెట్‌గా అరుణాచల్‌ను చూపింది. కాగా, అలా చేయడం ద్వారా చైనీయులు వాస్తవంగా 2003 హామీలను ఉల్లంఘించారు. అంతేకాదు, చైనా ఎప్పుడూ చైనా- భారతీయ ఒప్పందాలను ఉల్లంఘించి తూర్పు లద్దాక్‌ ‌ప్రాంతంపై 2020లో ఆక్రమణలకు పాల్పడింది. కేవలం ఈ వాస్తవాలు చాలు, టిబెట్‌ను చైనాలో భాగంగా భారత్‌ ‌గుర్తించకుండా ఉండటానికి.

అయితే, టిబెట్‌ను స్థిరీకరించేందుకు చైనా పలు చర్యలకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఇందులో వాస్తవాధీని రేఖవద్ద సైనిక మౌలిక సదుపాయాల మెరుగుదల, టిబెట్‌ ‌జనాభా, టిబెటన్‌ ‌బౌద్ధాన్ని చైనామయం చేయడం కీలకమైనవి. అంతేకాదు, తమ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దేందుకు దారిద్య్ర నిర్మూలన ముసుగులో నైపుణ్యాల శిక్షణ కేంద్రాలలో ఐదులక్షలమంది టిబెటన్లను ఉంచారనే వార్తలు కూడా ఉన్నాయి.

పేర్ల మార్పుతో ఆట

భారత్‌ ఈశాన్య ప్రాంతాలను మధ్య ప్రాచ్యానికి ప్రధాన ద్వారంగా రూపొందిస్తానంటూ ప్రకటించి నప్పటి నుంచీ చైనా 2017 నుంచి అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మారుస్తూ వస్తోంది. వాస్తవాధీన రేఖ వెంట గల 12పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత పాస్‌తో పాటుగా కొంత భూభాగం సహా 30 ప్రదేశాల పేర్లను మార్చింది. తిరిగి 2021లో 15 ప్రదేశాలు, 2023లో 11 ప్రదేశాల పేర్లను మార్చివేసి, అది దక్షిణ టిబెట్‌గా పిలుచుకునే ప్రాంతాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

భారత వైఖరిలో మార్పు

చైనాతో సన్నిహితమైన సంబంధాలను నెలకొల్పుకోవడం కోసం మోదీ ప్రభుత్వం ధర్మశాలలో నివసిస్తున్న బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా నుంచి దూరంగానే ఉన్నది. కానీ, 2020లో వాస్తవాధీన రేఖ వద్ద గల్వాన్‌లో భారత్‌, ‌చైనా సైనికుల మధ్య క్రమంతప్పకుండా హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలలో కదలిక వచ్చింది. తదనంతరం టిబెటన్‌ ‌స్పెషల్‌ ‌ఫ్రాంటియర్‌ ‌ఫోర్స్‌ను అధికారికంగా సమర్ధించడం ద్వారా భారత్‌ ‌తన వైఖిరిని వెల్లడించింది. కాగా, కేంద్ర టిబెటన్‌ ‌ప్రభుత్వాన్ని గుర్తిస్తే, ఆ సమర్ధనకు మరింత విలువుంటుందని టిబెటన్లు భావిస్తున్నారు.

ఈ మార్పు వెలుగులోనే మోదీ ప్రభుత్వం 14వ దలైలామాతో తమ దూరాన్ని చెరిపివేసింది. దలైలామా 87వ జన్మదినమైన జులై 6న ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం చైనాకు ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించి నట్టుగానే, ‘‘14వ దలైలామా వేర్పాటువాద, చైనా వ్యతిరేక స్వభావాన్ని భారత్‌ ‌పూర్తిగా తెలుసుకోవలసి ఉంది,’’ అంటూ హితవు కూడా పలికింది. నిజానికి 2014లో మోదీ ఎన్నిక అయినప్పటి నుంచీ దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపుతూనే ఉన్నారు.

దీనితో పాటుగా, 2023లో అంతర్జాతీయ బౌద్ధ సంఘను భారత్‌లో నిర్వహించారు. ఇటీవలికాలంలో చైనా సరిహద్దు వివాదంపై తన వైఖరిని కటువుగా మార్చుకుంది. దీనితో, దేశీయంగా, అంతర్జా తీయంగా దలైలామా కదలికలను నియంత్రించే భారతీయ ప్రభుత్వం, ఆయన ఉనికిని వ్యూహాత్మక సందేశం కోసం ఉపయోగించు కుంటోంది. ఇందుకు అనుగుణంగానే భారత్‌ ఆగస్టు 2023లో 6వ యూఘర్‌ ‌స్వాతంత్య్ర సమరయోధుల సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించింది. అంతర్జాతీయ టిబెట్‌ ‌స్వాతంత్రోద్యమంలో భాగమైన ఈ సమావేశానికి ప్రవాస టిబెట్‌ ‌ప్రభుత్వ, పార్లమెంటు సభ్యులు కూడా హాజరయ్యారు.

టిబెట్‌ ‌విషయంలో చైనా అత్యంత సున్నితంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ దేశ అతిపెద్ద బలహీనత అదే. దానికి గ్జిన్‌జియాంగ్‌ను కూడా జతచేస్తే ఈ బలహీనత మరింత పెరుగుతుంది. ఈ క్రమంలోనే భారత్‌ ‌తన దూకుడును పెంచడం అవసరం. మొదటగా, 2003 ఒప్పందంపై వ్యాఖ్యానం ఏకపక్షమన్న విషయంతో ప్రారంభించి, దానిని చట్టపరంగా సవరించాలంటూ ప్రచారం చేయడం అవసరమన్నది నిపుణుల భావన. తూర్పు లద్దాక్‌లో చైనా పాల్పడిన సైనిక దౌర్జన్యం అన్ని ఒప్పందాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో టిబెట్టును చైనాలో భాగంగా గుర్తించకూడదు, 2003లో గుర్తింపు వివాదాస్పదమైంది. కనుక, టిబెట్‌ను మొదటగా నిర్వచించాలన్నది వారి సూచన. అదనంగా, అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌తమదని చైనా అంటున్నట్టుగా ప్రాచీన మత గ్రంథాల ఆధా రంగా మానససరోవర్‌ ‌సరస్సు ఉన్న ప్రాంతమంతా ఉత్తరాంచల్‌లోని భాగమని ప్రకటించాలి. ఈ మొత్తం అంశాలపై తిరిగి చర్చలు జరపాల్సిన అవసరం ఉం ది. అప్పటివరకూ టిబెట్టును స్వతంత్ర దేశంగా పరిగణించడం ఒక ఉత్తమ పద్ధతి అన్నది భౌగోళిక రాజకీయ నిపుణుల వాదన.

వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దులను భారత్‌ ‌పరిరక్షించుకోవాలి. ఇందుకోసం భారత్‌ ‌సంప్రదాయ పద్ధతులపై ఆధారపడితే ఉపయోగం ఉండదు. తూర్పు, పశ్చిమ హైవేలవరకూ ప్రాంతాలన్నీ మన నిఘాలో ఉండాలి. భవిష్యత్తులో సైనికపరమైన చర్య జరిగితే, యుద్ధ క్షేత్రాన్ని తీవ్రం చేసేలా దళాలను వ్యవస్థీకరిం చుకోవాలి. మనం భిన్నంగా ఆలోచించి వ్యవహరించనంతవరకూ, చైనా వాస్తవాధీన రేఖ సహా ఎక్కడ కావాలంటే అక్కడ తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూనే ఉంటుంది.

టిబెట్టు, చైనా వ్యవహారాలపై పట్టు ఉన్న వ్యక్తులు మన దగ్గర లేకపోవడం పెద్ద లోపం. పైగా తమను తాము నిపుణులుగా చెప్పుకునే కొద్ది మంది కూడా ఒకేరకమైన భాషను, భావనలను వ్యక్తం చేస్తుంటారన్నది భౌగోళిక రాజకీయ వ్యవహారాల నిపుణుల భావన. వీరంతా కూడా భావజాలపరంగా మావోతోనో, మార్కస్ ‌కారణంగానో ప్రభావితమైన వారే. అందుకే వారు చైనా గొప్పదనాన్ని, భారత్‌ ‌నిస్సహాయతను గురించే మాట్లాడుతారు. తన ప్రభావం కోసం చేపట్టే ఆపరేషన్లలో భాగంగా చైనా అంతర్జాతీయ మీడియాను కొనుగోలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి.

టిబెట్‌లో భారత్‌కు నిఘా స్థావరం అవసరమని సైనిక వ్యవహారాల నిపుణులు సూచిస్తున్నారు. యుఎస్‌ఎ ఉన్నా, లేకున్నా మనం వివిధ అంశాలకు సంబంధించి లోతుగా నిఘాను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే, మనం కూడా విషయాలను మనకు నచ్చిన లైనుపై పట్టాలను ఎక్కించి, ప్రగతి సాధించగలమన్నది వారి వాదన. ఏ పరిస్థితిలో అయినా భారత్‌ ‌వెనక్కి తగ్గింది అంటే, నిఘా లోపమే. వాస్తవాధీనరేఖ ఆవలి నుంచి మానవ మేధస్సు అనేది కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది కనుక దానిపై దృష్టి పెట్టాలి. మనం కూడా సమాచార, నిఘా ఆపరేషన్లతో మీడియాను కూడా కలిపేయాలి.

వీటన్నింటినీ మించి భూటాన్‌, ‌నేపాల్‌ ‌వంటి దేశాలలో భూఆక్రమణకు చైనా పన్నుతున్న పన్నాగాలను అడ్డుకునేందుకు ఆ దేశాలను కలుపుకుపోవడం కూడా అవసరం. దీనితో పాటుగా, చైనా మింగివేసిన తమ తమ భూభాగాలను/ సముద్రయాన, నావికా హక్కులను పునరుద్ధరించేం దుకు దేశాలతో ఒక బృందాన్ని భారత్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని జియోపొలిటికల్‌ ‌నిపుణులు అంటున్నారు.

చైనా వెనక్కి తగ్గకపోతే దానికి ఎర్రజెండా చూపాల్సిందే. టిబెట్టే ఆ ఎర్ర జెండా. ఎన్నో లోటుపాట్లు ఉన్నా దానిని ఎర్రజెండాగా మార్చే ప్రయత్నాలు జరుగాల్సిందే. అదేమీ రాత్రికి రాత్రి జరిగే పని కాదు. కానీ, ప్రయత్నం చేయ వలసిందే. భారత్‌ ‌రక్తం స్రవించేందుకు పాకిస్తాన్‌తో కలిసి చైనా ఆడిన ఆటలను మనం విస్మరించలేం. అది చేసిన ప్రయోగ రుచిని దానికి చూపవలసిందే.

భౌగోళిక రాజకీయ వ్యవహారాలలో ప్రతి దేశం తన స్వార్థాన్ని చూసుకుని ముందుకు పోతుంటుంది. ఈ రాజకీయ చదరంగంలో జాలి, దయ అనే వాటికి చోటుండదు. ఇప్పుడు మనం చైనాతో పోటీపడి రహదారులను నిర్మిస్తున్నాం, రేవులను అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. దానిని పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, నిర్దయగా మన ప్రభావాన్ని పెంచుకుంటూ పోవడం ద్వారానే చైనావంటి దేశాలను నియంత్రించ గలుగుతాం.

టిబెట్ కోణంలో వాస్తవ చరిత్ర

The Potala Palace in Tibet with beautiful sunset sky

అవతారమూర్తి బుద్ధుడు జన్మించిన పవిత్ర స్థలిగా, ఆర్యభూమిగా టిబెటన్లు భారత్‌ను చూస్తారు. భారత్‌ ఎప్పుడూ టిబెటన్లకు ఆశ్రయమిస్తూనే వచ్చింది. దలైలామా 1959లో తప్పించుకుని భారత్‌కు వచ్చే యాభై ఏళ్ల ముందు 1910లో చైనా సైన్యం లాసాను చేరుకున్నప్పుడు రక్షణ కోసం పదమూడవ దలైలామా బ్రిటిష్‌ ఇం‌డియాకు వచ్చారు.
ప్రాచీనకాలం నుంచి టిబెట్‌ ‌తమ అంతర్భాగమన్న చైనా వాదనను 1949 కాలానికి ముందు అధికారిక చారిత్రిక రికార్డులు కొట్టిపారేస్తున్నాయంటూ ఒక ప్రాజెక్టు నివేదిక కనుగొన్న అంశాలను 2022లో యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌చైనాకు సమర్పించింది. అంతేకాదు, పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా (పిఆర్‌సి) 1950ల్లో దానిపై దండెత్తే వరకూ టిబెట్టు ఏనాడూ చైనాలో భాగం కాదని ఆ నివేదిక తేల్చిపారేసింది. టిబెట్‌ ఏనాడూ చైనా సామ్రాజ్యంలో భాగం కాదని రుజువు చేసేందుకు, మింగ్‌, ‌చింగ్‌ ‌వంశాల కాలం నాటి మ్యాపులను కూడా అందించింది. దీనితో టిబెట్‌ను కలుపుకోవడం ద్వారా చైనాను ఏకీకరించా మంటున్న పిఆర్‌సి చేస్తున్న వాదనలు నిరాధారమైనవని కూడా తేల్చింది. పిఆర్‌సి చెప్పే చారిత్రిక వర్షెన్‌ ‌కన్నా వాస్తవ చైనా చరిత్ర భిన్నమైందని దీని ద్వారా మనకు అవగతమవుతుంది.
ఇంకాస్త వెనకకు వెళ్లినా టిబెట్‌ ‌స్వతంత్రంగానే ఉన్న సంగతి తెలుస్తుంది. సాంగ్‌త్సేన్‌ ‌గంపో (627-649) ఏడవ శతాబ్దంలో టిబెట్‌ను స్వతంత్ర రాజ్యంగా పాలించాడు. అతడు ఒక చైనీస్‌ ‌యువరాణిని వివాహం చేసుకొని చైనాతో సంబంధాలను నెలకొల్పుకున్నాడు. దాదాపు అదే కాలంలో భారత్‌ ‌నుంచి బౌద్ధం టిబెట్‌లో ప్రవేశిం చింది. మంగోలులు 13వ శతాబ్దంలో చైనాను, టిబెట్‌ను జయించి పాలించే వరకూ అది స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. మంగోలుల ప్రభ తగ్గి పోయిన తర్వాత వచ్చిన మింగ్‌ ‌వంశం (1368 -1644) టిబెట్‌ను అధీనంలోకి తీసుకోలేదు. తర్వాత (చివరి) చింగ్‌ ‌వంశం (1644-1911) మంచూరియాకు (మంచూస్‌ అని కూడా అంటారు) చెందినవారు. 1720 ప్రాంతంలో టిబెట్‌లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభ సమయంలో మంచూలు జోక్యం చేసుకొని అక్కడ శాంతి, భద్రతలను పునరుద్ధరించారు. ఇదంతా కూడా టిబెట్‌ ‌తన స్వంత అధికారిక, న్యాయ వ్యవస్థలను నిలుపుకున్న సమయంలోనే జరిగింది. చింగ్‌లు కూడా టిబెట్‌ను తమ ప్రావిన్సుగా అధికారికంగా ప్రకటించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.
ఈ అస్పష్టమైన సంబంధాన్నే బ్రిటిషర్లు ‘చైనా ఆధిపత్యం’ (సుజారానిటీ)గా అభివర్ణించారు. కల్నల్‌ ‌యంగ్‌హజ్బెండ్‌ ‌తన పటాలంతో 1904లో లాసాకు వచ్చే ప్రవేశించే సమయానికి చైనా ప్రభావం తగ్గిపోయింది. 1912లో చాంగ్‌ ‌కై షెక్‌ ‌నేతృత్వంలోని జాతీయ ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో భాగంగా ప్రకటించింది. తక్షణమే, 1913 ఫిబ్రవరి 13న దలైలామా టిబెట్‌ ‌స్వాతంత్య్రాన్ని ప్రకటించి, చైనీయులందరినీ బహిష్కరించారు. ఇది తన స్వంత జెండా, సైన్యం, ప్రభుత్వం, భాష, కరెన్సీ, సరిహద్దు నియంత్రణతో కూడిన వాస్తవ స్వతంత్ర టిబెట్‌ను సృష్టించింది. బ్రిటిష్‌ ‌వారి ఉనికి కారణంగా చైనీయులు ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లక తప్పలేదు. భారత్‌ ‌స్వాతంత్య్రం సాధించిన అనంతరం బ్రిటిష్‌ అధికారం కూడా తగ్గిపోవడంతో, 1949లో కమ్యూనిస్టు పార్టీ టిబెట్‌ను విముక్తి చేయవలసిందిగా వారికి అప్పీల్‌ ‌చేసేలా పంచన్‌ ‌లామాను ప్రభావితం చేసి, ప్రేరేపించింది.1950లో పిఎల్‌ఎ ఈ ‌కారణాన్ని సాకుగా చూపి టిబెట్‌పై దండెత్తింది. మిగిలింది చరిత్ర.
ఒక్కముక్కలో చెప్పాలంటే, చైనాలో కలిసిపోయేందుకు టిబెట్‌పై వత్తిడి వచ్చింది. పిఆర్‌సి ప్రకటించుకున్నట్టుగా అది ఏనాడూ చైనాలో సమగ్ర లేదా దాని సార్వభౌమాధికారంలో భాగం కాదు. చైనా, టిబెట్‌ల మధ్య సంబంధం అప్పుడప్పుడు ఆధిపత్యానికి సంబంధించిందే. ఈ విషయా లన్నింటినీ యుఎస్‌ ‌కాంగ్రెషనల్‌ ‌కమిటీ బయటపెట్టింది.

-డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE