అధికరణం-356 అమల్లోకి వచ్చిన దగ్గరినుంచి దీనిపై చర్చలు కొనసా గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతిపాలన విధింపు వల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటున్నదనేది ఈ చర్చల్లోని ముఖ్యాంశం. ఈ అధికరణం మూలం, భారత ప్రభుత్వ చట్టం`1935లో, 93వ సెక్షన్‌లో ఉంది. ఏదైనా ప్రావెన్స్‌ గవర్నర్‌ ఈ చట్టంలోని నిబంధనల మేరకు పనిచేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ప్రావెన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించవచ్చునని ఈ సెక్షన్‌ పేర్కొంటున్నది. భారత ప్రభుత్వ చట్టం-1935లో పేర్కొన్న ఈ నిబంధనను యథాతథంగా రాజ్యాంగంలో కి తీసుకున్నారు. అయితే అక్కడ ఉపయోగించిన ‘గవర్నర్‌’ స్థానంలో ‘రాష్ట్రపతి’ అనే పదాన్ని చేర్చారంతే. అంటే ఒక బ్రిటిష్‌ అవశేషంతో కాంగ్రెస్‌ ఎన్నో ప్రజాతీర్పులను వంచించింది. 134 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయినాయి. ఇందులో ఎక్కువ వాటా కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే. కొన్నింటి విషయంలో కోర్టులు మొట్టికాయలు వేశాయి.

ఆర్టికల్‌-356వల్ల రాష్ట్రాలపై కేంద్ర ఆధిపత్యం పెరుగుతుందనేది ప్రధానంగా వాదనల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ‘అదర్‌వైజ్‌’ అనే పదం ఈ ఆధిపత్యానికి కారణమన్నది విమర్శకులు ప్రధా నంగా లేవనెత్తుతున్న అంశం. నిజం చెప్పాలంటే రాజ్యాంగకర్తలు భావి భారత రాజకీయాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే అంశాన్ని సరిగా అంచనా వేయలేదనే చెప్పాలి. అంతేకాదు ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకోసం రాజ్యాంగ సవరణలను చేపట్టే అవకాశాన్ని వారు ఊహించి ఉండరు. 1984లో ఎన్‌టీఆర్‌ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ కూలదోసిన తీరు ఇప్పటికీ ప్రజల మనోఃఫల కాలపై ఉంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చాక సరిగ్గా ఏడాదికి, 1951లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం 356 అధికర ణాన్ని దుర్వినియోగం చేస్తూ గోపీచంద్‌ బారువా నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం ఈ చర్యకు పాల్పడిరది. రాష్ట్రంలో భద్రతకు ఇబ్బంది కలిగించే సమస్యలు కూడా ఏమీలేవు. అంటే సరైన కారణాలు లేకుండానే ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఈ అధికరణం దుర్వినియోగం అవుతుందనేది స్పష్టమైంది. అదేవిధంగా 1954లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న అనుమానంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసింది. నాటి నుంచి నేటివరకు కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించిన సంఘటనలు అనేకం జరిగాయి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను నియమిస్తారు. రాష్ట్రపతి సంతృప్తి మేరకే గవర్నర్‌ పదవిలో కొనసాగుతారు. ఇక రాష్ట్రపతి కేంద్రమంత్రిమండలి సలహా ప్రకారం పాలన కొనసాగిస్తారు. రాజ్యాంగంలోని ఈ నిబంధన కలిగిన 356వ అధికరణాన్ని ఉపయోగించి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడానికి కేంద్రం ప్రభుత్వానికి ఒక ఆయుధంగా మారింది. అందువల్ల ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించే రాష్ట్రపతి అధికారం విచక్షణ ఇక్కడ ప్రశ్నార్థకమవుతోంది.

పరిస్థితి చేయిదాటినప్పుడు…

వివిధ దేశాల్లో అత్యవసర విధింపునకు అవసరమైన పరిస్థితుల విషయంలో భిన్నమైన నియమాలున్నాయి. కొన్ని దేశాల్లో ఈ నియమాలు విపులంగా ఉండగా మరికొన్ని దేశాల్లో అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ పరిధినుంచి పరిస్థితులు చేయిదాటితే అత్యవసర పరిస్థితి విధించవచ్చుననేది మొత్తంమీది సారాంశం. అత్యవసర పరిస్థితి విధించే విషయంలో జర్మనీలో చట్టాలు చాలా స్పష్టంగా విపులంగా ఉండటంతో వీటిని మన రాజ్యాంగంలోకి తీసుకున్నారు. జర్మనీ, భారత్‌లో మాదిరి అత్యవసర పరిస్థితి విధించే నిబంధనలు చాలా ప్రజాస్వామ్య దేశాల్లో లేవు. అమెరికాలో జాతీయ, ఆర్థిక అత్యవస పరిస్థితి విధించేందుకు వీలు కల్పించే చట్టాలు అమల్లో ఉన్నాయి. భారత్‌, జర్మనీల్లో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థపై అత్యవసర పరిస్థితి విధింపు ఆధారపడి ఉంటుంది. అట్లాగని ఈ విధింపు న్యాయ సమీక్షకు అతీతం కాదు. ‘‘రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు’’ విధించే అత్యవసర అధికారంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.

ఈ 356వ అధికరణాన్ని ఇందిరాగాంధీ దుర్విని యోగం చేసిన స్థాయిలో మరే ఇతర ప్రధాని చేయలేదన్నది వాస్తవం. 1966`77 మధ్యకాలంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన వివిధ రాష్ట్రాల్లో 39సార్లు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. 1975 తర్వాతి కాలంలో కూడా కేంద్రం అత్యవసర పరిస్థితిని వివిధ రాష్ట్రాల్లో చాలాసార్లు విధించింది. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ మళ్లీ, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్షాల ప్రభుత్వాల రద్దుకు పాల్పడిరది. గమనార్హమైన విషయమేమంటే ఎమర్జెన్సీ విధింపు విషయంలో న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటుండటంతో క్రమంగా రాష్ట్రపతి పాలన విధించడం తగ్గుతూ రావడం ఒక సానుకూల పరిణామం. రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా ఈ ఆర్డినెన్స్‌ పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందడం తప్పనిసరి. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు చేస్తే సరిపోతుంది. దీన్ని 356(2) అధికరణం స్పష్టం చేస్తోంది. ఒకవేళ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత రెండు నెలల్లోగా పార్లమెంట్‌ రద్దయితే, కొత్త లోక్‌సభ కొలువుతీరిన తర్వాత 30 రోజుల వరకు ఈ రాష్ట్రపతిపాలన అమల్లో ఉండి తర్వాత రద్దవు తుంది. రాజ్యసభ శాశ్వతసభ కావడంవల్ల ఈ ఆర్డినెన్స్‌ బిల్లును సకాలంలో ఆమోదించాలి.

రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

ఏప్రిల్‌ 17,1977న జనతా ప్రభుత్వానికి చెందిన కేంద్ర హోంమంత్రి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఆర్టికల్‌`356వల్ల రాష్ట్రాలపై కేంద్ర ఆధిపత్యం పెరుగుతుందనేది ప్రధానంగా వాదనల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ‘అదర్‌వైజ్‌’ అనే పదం ఈ ఆధిపత్యానికి కారణమన్నది విమర్శకులు ప్రధా నంగా లేవనెత్తుతున్న అంశం. నిజం చెప్పాలంటే రాజ్యాంగకర్తలు భావి భారత రాజకీయాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే అంశాన్ని సరిగా అంచనా వేయలేదనే చెప్పాలి. అంతేకాదు ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకోసం రాజ్యాంగ సవరణలను చేపట్టే అవకాశాన్ని వారు ఊహించి ఉండరు. 1984లో ఎన్‌టీఆర్‌ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ కూలదోసిన తీరు ఇప్పటికీ ప్రజల మనోఃఫల కాలపై ఉంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చాక సరిగ్గా ఏడాదికి, 1951లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం 356 అధికర ణాన్ని దుర్వినియోగం చేస్తూ గోపీచంద్‌ బారువా నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం ఈ చర్యకు పాల్పడిరది. రాష్ట్రంలో భద్రతకు ఇబ్బంది కలిగించే సమస్యలు కూడా ఏమీలేవు. అంటే సరైన కారణాలు లేకుండానే ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఈ అధికరణం దుర్వినియోగం అవుతుందనేది స్పష్టమైంది. అదేవిధంగా 1954లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న అనుమానంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసింది. నాటి నుంచి నేటివరకు కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించిన సంఘటనలు అనేకం జరిగాయి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను నియమిస్తారు. రాష్ట్రపతి సంతృప్తి మేరకే గవర్నర్‌ పదవిలో కొనసాగుతారు. ఇక రాష్ట్రపతి కేంద్రమంత్రిమండలి సలహా ప్రకారం పాలన కొనసాగిస్తారు. రాజ్యాంగంలోని ఈ నిబంధన కలిగిన 356వ అధికరణాన్ని ఉపయోగించి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడానికి కేంద్రం ప్రభుత్వానికి ఒక ఆయుధంగా మారింది. అందువల్ల ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించే రాష్ట్రపతి అధికారం విచక్షణ ఇక్కడ ప్రశ్నార్థకమవుతోంది.

పరిస్థితి చేయిదాటినప్పుడు…

వివిధ దేశాల్లో అత్యవసర విధింపునకు అవసరమైన పరిస్థితుల విషయంలో భిన్నమైన నియమాలున్నాయి. కొన్ని దేశాల్లో ఈ నియమాలు విపులంగా ఉండగా మరికొన్ని దేశాల్లో అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ పరిధినుంచి పరిస్థితులు చేయిదాటితే అత్యవసర పరిస్థితి విధించవచ్చుననేది మొత్తంమీది సారాంశం. అత్యవసర పరిస్థితి విధించే విషయంలో జర్మనీలో చట్టాలు చాలా స్పష్టంగా విపులంగా ఉండటంతో వీటిని మన రాజ్యాంగంలోకి తీసుకున్నారు. జర్మనీ, భారత్‌లో మాదిరి అత్యవసర పరిస్థితి విధించే నిబంధనలు చాలా ప్రజాస్వామ్య దేశాల్లో లేవు. అమెరికాలో జాతీయ, ఆర్థిక అత్యవస పరిస్థితి విధించేందుకు వీలు కల్పించే చట్టాలు అమల్లో ఉన్నాయి. భారత్‌, జర్మనీల్లో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థపై అత్యవసర పరిస్థితి విధింపు ఆధారపడి ఉంటుంది. అట్లాగని ఈ విధింపు న్యాయ సమీక్షకు అతీతం కాదు. ‘‘రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు’’ విధించే అత్యవసర అధికారంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.

ఈ 356వ అధికరణాన్ని ఇందిరాగాంధీ దుర్విని యోగం చేసిన స్థాయిలో మరే ఇతర ప్రధాని చేయలేదన్నది వాస్తవం. 1966`77 మధ్యకాలంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన వివిధ రాష్ట్రాల్లో 39సార్లు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. 1975 తర్వాతి కాలంలో కూడా కేంద్రం అత్యవసర పరిస్థితిని వివిధ రాష్ట్రాల్లో చాలాసార్లు విధించింది. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ మళ్లీ, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్షాల ప్రభుత్వాల రద్దుకు పాల్పడిరది. గమనార్హమైన విషయమేమంటే ఎమర్జెన్సీ విధింపు విషయంలో న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటుండటంతో క్రమంగా రాష్ట్రపతి పాలన విధించడం తగ్గుతూ రావడం ఒక సానుకూల పరిణామం. రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా ఈ ఆర్డినెన్స్‌ పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందడం తప్పనిసరి. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు చేస్తే సరిపోతుంది. దీన్ని 356(2) అధికరణం స్పష్టం చేస్తోంది. ఒకవేళ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత రెండు నెలల్లోగా పార్లమెంట్‌ రద్దయితే, కొత్త లోక్‌సభ కొలువుతీరిన తర్వాత 30 రోజుల వరకు ఈ రాష్ట్రపతిపాలన అమల్లో ఉండి తర్వాత రద్దవు తుంది. రాజ్యసభ శాశ్వతసభ కావడంవల్ల ఈ ఆర్డినెన్స్‌ బిల్లును సకాలంలో ఆమోదించాలి.

రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

ఏప్రిల్‌ 17,1977న జనతా ప్రభుత్వానికి చెందిన కేంద్ర హోంమంత్రి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఒక లేఖ పంపారు. 356వ అధికరణం కింద రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేస్తున్నామన్నది ఆ లేఖ సారాంశం. 1977 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణంగా ఓటమి పాలైన నేపథ్యంలో జనతా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఒక్కసారిగా ఈ పది రాష్ట్రాల్లో ప్రభుత్వాల రద్దు, వెంటనే ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అప్పుడు రాజస్థాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కడంతో, ఈ ఆదేశం న్యాయసమ్మతంగా లేదన్న అంశాన్ని గుర్తించిన కోర్టు ఈ విషయాన్ని పరిశీలిచింది. అయితే కోర్టు జోక్యాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ కొట్టివేసింది. చాలా సందర్భాల్లో కోర్టులు ఈ అధికరణం విషయంలో కలుగజేసుకోలేదు. కొన్ని సందర్భాలో దీనికింద రాష్ట్రపతి పాలన విధింపులోని సామంజసత్వంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య స్పర్థలు కొన సాగినప్పటికీ, చివరకు ఎగ్జిక్యూటివ్‌దే పైచేయిగా నిలుస్తూ వచ్చింది. ఈ కేసులో ‘రాష్ట్రపతి సంతృప్తి’ అనేది ప్రధానాంశం.కేంద్ర ప్రభుత్వాలు పేర్కొనే ‘అసంతృప్తి’ దురుద్దేశంతో కూడినదైనప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా 356(1)వ అధికరణం రాష్ట్రపతి ‘సంతృప్తి’ అనే అంశాన్ని స్పష్టంగా పేర్కొంటున్నం దున, ఆయన ‘అసంతృప్తి’ చెందనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమవు తుందని కూడా స్పష్టం చేసింది.

42, 44 రాజ్యాంగ సవరణలు

1975`77 మధ్యకాలంలో విధించిన అత్యవసరపరిస్థితి సమయంలో 42వ రాజ్యాంగ సవరణ (1976)ద్వారా, భారతీయ చట్టాల్లో అనేక మార్పులు చేశారు. ఈ రాజ్యాంగ సవరణ దేశంలో అమలవుతున్న సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సవరణకు జనసమ్మతి లభించలేదు. ముఖ్యంగా పౌర హక్కుల ఉల్లంఘన, పోలీసులు మానవ హక్కుల హననానికి పాల్పడటంతో దేశవ్యాప్తంగా ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. అనంతరం ఏర్పడిన వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో చేపట్టిన కొన్ని మార్పులను రద్దుచేసింది. ఆ విధంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను పునరుద్ధ రించారు. 44వ రాజ్యాంగ సవరణ 356 అధికరణం పరిధిని కుదించింది. ఇందులో ‘ఏడాది’ అనే పదం స్థానంలో ‘ఆర్నెల్లు’ అనే పదాన్ని చేర్చారు. ఫలితంగా అత్యవసర పరిస్థితిని కేంద్రం ప్రకటించిన రోజు నుంచి ఆర్నెల్ల కాలంలోగా పార్లమెంట్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆర్నెల్ల కాలం ముగిసిన ప్రతిసారి పార్లమెంట్‌ అనుమతి తప్పనిసరి. 44వ రాజ్యాంగ సవరణద్వారా 356 అధికరణానికి 5వ క్లాజును జతచేశారు. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఏడాది కంటే ఎక్కువ కాలం ఈ క్రింది పరిస్థితుల్లో తప్ప విధించకూడదు.

  1. పార్లమెంట్‌ సదరు తీర్మానాన్ని ఆమోదించే సమయానికి అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న ప్పుడు.
  2. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టతరంగా ఉన్నందువల్ల 356వ అధికరణం కింద అత్యవసర పరిస్థితి ప్రకటించడం తప్పని సరి అని ఎన్నికల సంఘం ధ్రువీకరించి నప్పుడు. అయితే అత్యవసర పరిస్థితి గరిష్టంగా మూడేళ్లకు మించి విధించకూడదని 44వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది.

ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరణకు అవసరమైన కనీస కాలవ్యవధిని నిర్ణయించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు దేశంలో పాలనను మరింత ప్రజాస్వామ్యయుతం చేయడం కోసం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం రాజ్యాంగంలో మరిన్ని మార్పులు చేసింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పరిపాలనకు ఈ రాజ్యాంగ సవరణ మరింత విస్తృత నిర్వచనం ఇచ్చింది. తర్వాతి కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించిన సర్కారియా కమిషన్‌ 356వ అధికరణాన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రయోగించాలని తన సిఫారసుల్లో స్పష్టం చేసింది. ఇక పూంచి కమిషన్‌ అత్యవసర పరిస్థితిని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలని, అదికూడా మూడు నెలలకు మించి కొనసాగించరాదని సిఫారసు చేసింది. దీన్నే ‘లోకలైజ్డ్‌ ఎమర్జెన్సీ’ అని పేర్కొంది.

యథేచ్ఛగా ప్రభుత్వాల రద్దు

రాజ్యాంగం అమల్లోకి వచ్చిననాటినుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 134సార్లు ఇదే అధికరణాన్ని ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. జూన్‌ 20, 1951న ఈ అధికరణాన్ని మొట్టమొదటిసారి పంజాబ్‌ ప్రభుత్వంపై అప్పటి కేంద్రం ప్రయోగించింది. పాటియాలా ఈస్ట్‌ పంజాబ్‌ స్టేట్‌ యూనియన్‌ (ఇది భారత్‌లోని పూర్వపు రాష్ట్రం. పంజాబ్‌లోని వివిధ సంస్థానాలను కలిపేయడం ద్వారా జులై 15, 1948న ఇది ఏర్పాటైంది. 1950లో ఇది దేశంలో అధికారిక రాష్ట్రమైంది. అప్పట్లో దీని రాజధాని పాటియాలా. దీని చివరి సంస్థానాధీశుడు యదువీర్‌ సింగ్‌ను ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిం చారు. నవంబర్‌ 1,1956న ఈ పీఈపీఎస్‌యూ, పంజాబ్‌లో అధికారికంగా కలిసిపోయింది) అసెంబ్లీకి 1952 సెప్టెంబర్‌లో తొలి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 26, అకాలీదళ్‌ 19సీట్లు గెలుచుకున్నాయి. మొత్తం స్థానాలు 60. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జ్ఞాన్‌సింగ్‌ రాణేవాలా కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో 1953లో నెహ్రూ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విషయంలో కేంద్రం స్వార్థపూరితంగా వ్యవహ రించింది. 1951`52 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర అసెంబ్లీలోని 375 స్థానాల్లో, 152 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవత రించింది. కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ (టంగుటూరు ప్రకాశం పంతులు దీని నాయకులు) నాయకత్వంలో యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ తమకు 166 సభ్యుల మద్దతున్నదని గవర్నర్‌కు నివేదించినా ఖాతరు చేయని గవర్నర్‌, కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వడంతో చక్రవర్తి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ జవాహర్‌లాల్‌ నెహ్రూ నైతిక విలువల పేరుతో కలుగజేసుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమే. ఇక కేరళలో ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూడా 1959, జులై 31న ఇదే అధికరణాన్ని ప్రయోగించి నెహ్రూ ప్రభుత్వం కూల్చివేసింది. 1970`80 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం ఒక అలవాటుగా మారిపోయింది. 1966`77 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 39సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగిస్తే, 1977లో అత్యవసరపరిస్థితి తర్వాత అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ 9రాష్ట్ర ప్రభుత్వా లను ఈ అధికరణాన్ని ఉపయోగించి రద్దుచేసింది. 1992లో కేంద్ర ప్రభుత్వం మూడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఈ అధికరణాన్ని విచ్చలవిడిగా ప్రయో గించడం బాగా తగ్గిపోయింది.

ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని సార్లు…

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన వివరాలీవిధంగా ఉన్నాయి. ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం మణిపూర్‌. ఆంధ్ర రాష్ట్రం (1), ఆంధ్రప్రదేశ్‌(2), అరుణాచల్‌ప్రదేశ్‌(2), అస్సాం (4), బీహార్‌(8), ఢల్లీి(1), గోవా(3), గోవా, డామన్‌ Ê డయ్యు (2), గుజరాత్‌(5), హరియాణా(3), హిమాచల్‌ప్రదేశ్‌(2), జమ్ముÊ కశ్మీర్‌ రాష్ట్రం(8), జమ్ముÊ కశ్మీర్‌(కేంద్రపాలిత ప్రాంతం`1), జార్ఖండ్‌(3), కర్ణాటక(6), కేరళ(6), మధ్యప్రదేశ్‌ (3), మహారాష్ట్ర(3), మణిపూర్‌(10), మేఘాలయ(2), మిజోరం(3), నాగాలాండ్‌(4), ఒడిశా(6), పాటియాలా ఈస్ట్‌ పంజాబ్‌ స్టేట్‌ యూనియన్‌ (1), పుదుచ్చేరి(7), పంజాబ్‌(8), రాజస్థాన్‌(4), సిక్కిం(2), తమిళనాడు(3), ట్రావన్‌కూర్‌`కొచ్చిన్‌(1), త్రిపుర(3), ఉత్తరప్రదేశ్‌(9), ఉత్తరాఖండ్‌ (2), పశ్చిమబెంగాల్‌ (5)సార్లు రాష్ట్రపతిపాలన విధింపునకు గురయ్యాయి.

పావులుగా మారిన గవర్నర్లు

1967`72 మధ్యకాలంలో 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనపడటమే కాదు 8 రాష్ట్రాల్లో పట్టుకోల్పోయింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను పావులుగా వాడుకొని, కాంగ్రెస్సేతర ప్రభుత్వాలను కూల్చివేయడం మొదలుపెట్టింది. 1971లో అప్రతిహత విజయాన్ని నమోదు చేసిన ఇందిరాగాంధీ, ఈ అధికరణాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడానికి ఎంతమాత్రం సంకోచించలేదు. ఆవిధంగా ఆమె ప్రారంభించిన ‘కూల్చివేత ట్రెండ్‌’ తర్వాత అధికారంలోకి వచ్చిన మొరార్జీదేశాయ్‌, రాజీవ్‌గాంధీ ఇతర ప్రధానులకు మార్గదర్శకంగా నిలిచింది.

ఈ విధంగా గవర్నర్లను పావులుగా వాడుకోవడాన్ని బొమ్మై కేసుకు ముందు, తర్వాత అనే రెండు భాగాలుగా విశ్లేషించవచ్చు. బొమ్మై కేసుకు ముందు గవర్నర్లను ఉపయోగించి 356 అధికరణాన్ని కేంద్రం యథేచ్ఛగా ప్రయోగించింది. బొమ్మై కేసు తర్వాత ఇది న్యాయ సమీక్షా పరిధిలోకి వెళ్లడంతో గవర్నర్లను మరోవిధంగా ఉపయోగించుకోవడం మొదలైంది. 1984లో జమ్ము`కశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా పార్టీలో చీలికలను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని పడగొట్టడం, అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వాన్ని కూల్చివేయడం వంటివి బొమ్మై కేసుకు ముందు ఉదాహరణలుగా చెప్పవచ్చు. 1989, ఏప్రిల్‌ 20న కర్ణాటక గవర్నర్‌ వెంకటసుబ్బయ్య, ఎస్‌.ఆర్‌.బొమ్మై ప్రభుత్వాన్ని రద్దుచేశారు.

బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరిం చడం తర్వాతి పరిణామాలు. ఆ తర్వాత 1997 అక్టోబర్‌`నవంబర్‌ నెల ల్లో ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ సహాయంతో కేంద్రం ఏకపక్షంగా రద్దుచేసింది. 2004లో వచ్చిన యు.పి.ఎ ప్రభుత్వం అంతకుముందు ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామాలు చేయాలని కోరింది. గవర్నర్లుగా పనిచేసిన బూటాసింగ్‌ (బిహార్‌`2004), సయ్యద్‌ సిబ్టె హసన్‌ రిజ్వి (జార్ఖండ్‌-2004), హెచ్‌.ఆర్‌. భరద్వాజ్‌ (కర్ణాటక-2009), కమలా బేణీవాల్‌ (గుజరాత్‌`2009)లు గవర్నర్‌ పదవి ప్రతిష్టను పెంచేరీతిలో వ్యవహరించలేదు. కేవలం ఒక పార్టీ నాయకులుగానే ప్రవర్తించడంతో, గవర్నర్‌ వ్యవస్థపై ఒకరకమైన అప నమ్మకం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

– జమలాపురపు విఠల్‌రావు,

సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE