జనవరి 22,2024- భారత నాగరికత చరిత్రలో చిరస్మరణీయమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఐదు వందల ఏళ్ల పోరాటం తరువాత అయోధ్యలో నిర్మించుకున్న భవ్య రామమందిరంలో బాలక్‌రామ్‌ను హిందూ సమాజం ప్రతిష్ఠించుకుంది. హిందువుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఇవాళ నిలిచి ఉన్న ఆ మందిర నిర్మాణానికి నవంబర్‌ 9, 1989‌న  శిలాన్యాసం (పునాదిలో తొలి ఇటుకను ప్రతిష్ఠించడం) జరిగింది. అంతటి అదృష్టం కలిగిన వ్యక్తి  కామేశ్వర్‌ ‌చౌపాల్‌. ఆయన విశ్వహిందూ పరిషత్‌ ‌పూర్తి సమయం కార్యకర్త. బిహార్‌లోని మిథిలాంచల్‌ ‌ప్రాంతం వారు. షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తి. రామమందిరానికి ఆయన చేతుల మీదుగానే పునాదిరాయి పడింది.

శిలాన్యాస్‌ ‌జరిపేనాటికి ‘బాబరీ మసీదు’గా పిలుస్తున్న కట్టడం కూలలేదు. అయినా శ్రీరాముడు జన్మించిన ఆ స్థలంలో భవ్య మందిర నిర్మాణం జరుగుతుందన్న విశ్వాసం పరిపూర్ణంగా ఉండేది. అందుకే పునాది వేశారు. ఆ మహత్య్కార్యానికి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన శ్రద్ధాళువు అయిన వ్యక్తితో శిలాన్యాసం జరిపించే సాహసం విశ్వహిందూ పరిషత్‌ ‌చేసింది. 35 సంవత్సరాల తర్వాత అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముని మూర్తికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ప్రపంచం మొత్తం వీక్షించిన ఆ ప్రతిష్ఠకు  గర్భగుడిలో ప్రవేశించిన ఆ కొద్దిమందిలో కామేశ్వర్‌ ‌చౌపాల్‌ ఒకరు. ఆయన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో సభ్యుడు కూడా. పుణే నుండి వెలువడే ఆంగ్ల మాసపత్రిక ‘అన్‌హర్డ్ ‌వాయిసెస్‌’ (•అష్ట్ర‌వ•తీ• •శీఱమీవ) ప్రతినిధి ఈ జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠకు ముందు కామేశ్వర్‌ ‌చౌపాల్‌ను కలుసుకున్నారు. ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ పత్రిక జనవరి సంచికలో వెలువడిన ఆ ముఖాముఖీ  తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు జాగృతి పాఠకుల కోసం.

నవంబర్‌ 9,  1989 ‌నాటి శిలాన్యాసం నవభారత ఆవిష్కరణకు నాందియని అంటున్నారు. మీరేమంటారు?

వ్యక్తిగతంగా అది నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని రోజు. నా కులం వారికీ•, సమాజంలోని ఇతర జనసమూహాల వారికీ మధ్య అప్పటికి కూడా అంతరాలూ, అగాథాలూ ఉన్నాయి. అయినా మహాత్ములైన సాధుసంత్‌లు శిలాన్యాస్‌కు నన్ను ఎంపిక చేసి, నా చేతి మీదుగా ఆ పని చేయించారు. మా కులానికి గౌరవాన్ని ఆపాదించారు. ఇది శిలగా పడివున్న అహల్యలో శ్రీరామచంద్ర ప్రభువు మళ్లీ చేతనను తెచ్చిన సందర్భం వంటిది. ఇది గొప్ప సామాజిక చైతన్యానికి నాందియని, దానితో ఒక బలమైన సందేశం సమాజానికి చేరుతుందని గ్రహించాను. ‘మధ్యయుగాల నాడు సమాజ జీవితం లోకి చొచ్చుకువచ్చిన కురీతులకు వ్యతిరేకంగా ఒక స్పష్టమైన వైఖరిని హిందూ సమాజం తీసుకోలేదు’ అనే అభిప్రాయం బలంగా ఉంది. దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాదిమంది ధర్మా చార్యులు పాల్గొన్న ధర్మసంసద్‌లో దళితులకు చెందిన వ్యక్తి ద్వారా శిలాన్యాసం జరిపించడానికి తీసుకున్న నిర్ణయం స్తబ్దంగా పడివున్న సమాజంలో నూతన చైతన్యాన్ని తేవడానికి, సమాజంలో అగాథాలను పూడ్చడానికి  ఉపకరిస్తుందని తేటతెల్లమైంది. అది వెంటనే రుజువైంది కూడా. ఆ నిర్ణయం కారణంగా నేను ఉన్న విద్యార్థి వసతిగృహం నుండే డజను మంది సమాజసేవకు ఉద్యుక్తులై వచ్చారు. నాతోసహా వారంతా ఇప్పటికీ పనిచేస్తు న్నారు. హిందూ సమాజంలో వివక్ష, భేదభావాలూ లేవని సాధుసంత్‌లు ప్రకటించాలని డా।।బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్‌ ‌తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్ని ఆనాడే ప్రకటించి ఉంటే, దురదృష్టకరమైన ఎన్నో ఘటనలు జరిగేవి కావు. హిందువులలో ఎవరూ తక్కువవారు కాదని (మమ మంత్ర స్సమానతా) ధర్మసంసద్‌ ‌ప్రకటించింది. సాధుసంతులు దానిని ఘోషించారు. హిందవః సోదరాస్సర్వే (హిందువులందరూ సమానులే) అన్న సందేశం ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్నది. నిజాయితీతో కూడిన ఈ ప్రయత్నా లలో నుండి వేల సంవత్సరాల ఘర్షణల ఫలితంగా సమాజంలో ఏర్పడిన పగుళ్లను సరిచేసుకుంటూ దృఢమైన సమాజాన్ని రూపొందించుకోగలం.

శిలాన్యాస్‌ అవకాశం వచ్చినప్పుడు మీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఎలా స్పందించారు?

నా స్నేహితులు ఎప్పుడూ సానుకూలమే. కానీ సమాజం కూడా సానుకూలంగా స్పందించడమే కొత్త అనుభవం. సమాజంలోని సంపన్నులు, పలుకుబడి గలవారు, విద్యావంతులు మాకు దూరంగా ఉండేవారు. అది మాకు దుర్భరంగా ఉండేది. శిలాన్యాస్‌ ‌తరువాత నేను ఇంటికి చేరాక మా గ్రామానికి చెందిన ముఖియా బలదేవ్‌ ‌ఝా తన ఇంటికి పిలిచారు. ‘పెద్దవారు పిలిచారు, కాబట్టి వెళ్లాల’ని మా నాన్న సూచించారు. వారు నన్ను ఎలా చూస్తారు? ఎక్కడ కూర్చోమంటారు? చాలా సందేహాలు ముసిరాయి. అప్పటివరకు పెద్దలతో కలిసి కూర్చోడమనేది లేదు. వారు కుర్చీలలో, మేము నేలమీద. ఇదే ఆనవాయితీ. అయితే నేను బలదేవ్‌బాబు ఇంటికి వెళ్లగానే ఆయనే లేచి వచ్చి పలకరించారు. తాను కూర్చునే చోటుకు నన్ను తీసుకొని వెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. పిల్లలందరినీ పిలిచి, నేను వాళ్లకంటే పెద్దవాడిని కాబట్టి, వారికి అన్నలాంటివాడినని చెపుతూ నా పాదాలకు నమస్కరింపజేశారు. నాకు చాయ్‌ ‌తెప్పించి ఇచ్చారు. తరువాత ఆ కప్పును ఎక్కడ కడగాలా అని ఆలోచిస్తూ చాయ్‌ ‌తాగాను. కానీ నేను తాగడం పూర్తి చేశాక ఖాళీ కప్పును ఆయనే చేతిలోకి తీసుకున్నారు. మేమిద్దరమూ పరమానంద భరితులమైన క్షణాలవి. అంతకుముందెన్నడూ నాకు అలాంటి అనుభవం లేదు. మా గ్రామంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఆ క్షణాన నేను గ్రహించాను. ఇప్పుడు మా గ్రామంలో అన్నిరకాల కార్యక్రమాలలో అందరూ కలసిమెలిసి పాల్గొంటారు. కలిసి భోజనం చేస్తారు. అంతరాలను చూసేవారు ఎవరైనా ఉంటే, గ్రామమంతా వారిని అసహ్యించుకొంటున్నది.

యావత్తు సమాజాన్ని మార్చివేసే శక్తి కలిగిన నిర్ణయాన్ని సాధుసంతులు తీసుకున్నారని గ్రహించాను. మా పరిసర గ్రామాల్లో సోషలిస్టులు చాలా ఎక్కువ. కాని, శుభకార్యాలన్నీ బ్రాహ్మణుల ద్వారానే జరిగేవి. నాద్వారా శిలాన్యాసం జరిపించా లని సాధుసంతులు నిర్ణయించి, జరిపించారని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలబోయాయి. ఇప్పుడు కులతత్వం తగ్గి, అన్ని స్థాయిల వారిలోనూ హిందుత్వ భావన ప్రస్ఫుటమవుతున్నది.

మీ అనుభవాల మేరకు – మీరు శిలాన్యాసం చేయడానికి ముందు మన సమాజ మానసిక స్థితి ఎలా ఉండేదంటారు?

మా పట్ల వివక్ష ఉండేది. పెద్ద కులాలవారితో కలసిమెలసి ఉండేందుకు, కలసి భోంచేయడానికి అనుమతి ఉండేది కాదు. బడిలో నాకెదురైన అనుభవం చెప్తాను. పిల్లలను తప్పక చదివించాలనే ధ్యాస తల్లిదండ్రులకు ఉండేదికాదు. పిల్లలని బడిలో చేర్చడానికి ఉపాధ్యాయుడు చాలా శ్రమపడవలసి వచ్చేది. సమీప గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు నచ్చచెప్పి చేర్చుకొనేవాడు. అలా ఉపాధ్యాయునితో వెళ్లిన మేము ఒక రాత్రి ఆ గ్రామంలోనే ఉండి పోవలసి వచ్చింది. ఆ ఇంటి యజమాని చిన్న గొంతుతో మా ఉపాధ్యాయుడిని అడిగాడు, ‘వీరందరూ ఏయే కులాలవాళ్లు?’ అని. నా సంగతి తెలిసినప్పుడు, ఆయన ముఖం వివర్ణమైంది. దగ్గరలో ఉన్న దళితుల బస్తీకి పంపించి, అక్కడి నుండి ఒక కంచం తెప్పించాడు. నేను గుమ్మం దగ్గర క్రింద కూర్చొని తినవలసి వచ్చింది. మా ఉపాధ్యాయుడూ, మిగిలిన విద్యార్థులూ లోపల భోంచేశారు. అయితే అలాంటివి నేను చూడడం, వినడం అదే ఆఖరు.

మీ కుటుంబ నేపథ్యం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌తో మీ తొలి పరిచయం వివరిస్తారా?

 నేను పుట్టింది భాగల్పూరు జిల్లాలో. ఈ మధ్య ఆ జిల్లాను పునర్వ్యవస్థీకరించగా, మా గ్రామం సుపాల్‌ ‌జిల్లాలోకి వచ్చింది. మా గ్రామం ‘బిహారు దుఃఖదాయిని’  కోసీ నదికి దగ్గరగా ఉంది. తరచు వరదలు. చదువుకొనే ఏర్పాట్లేవీ లేవు. మా చిన్నప్పుడే మా నాన్న 8వ తరగతి ఉత్తీర్ణుడైన ఒక ఉపాధ్యాయుని తీసికొచ్చి బడి మొదలుపెట్టించాడు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత నేను దగ్గరలో ఉన్న పెద్ద గ్రామంలో బంధువుల ఇంట్లో ఉండి చదువు కొన సాగించాను. కొన్నాళ్ల తర్వాత ఒక ఉపాధ్యాయుడు నలుగురైదుగురు విద్యార్థులకు తన ఇంటిలోనే వసతి కల్పించగా, నేనూ అక్కడే చేరాను.

ఆయన విశాల హృదయుడు. అక్కడ నాకు ఏ విధమైన సమస్యలూ ఎదురుకాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు హృదయ్‌ ‌నారాయణ్‌ ‌యాదవ్‌ అనే ఉపాధ్యాయుడు మా పాఠశాలలో పని చేయడానికి వచ్చాడు. ఆయన కాంగ్రెసుపార్టీ కార్యకలాపాలలోను, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలలోనూ చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు. ఆయనతోపాటు మేము నలుగురైదు గురం శాఖలో పాల్గొనేవాళ్లం. ఆయన ద్వారానే సంఘం మాకు పరిచయమైంది. నేను మెట్రిక్యులేషన్‌ ‌పాసయినప్పుడు చదువు ఆపకుండా, కొనసాగించాలని చెపుతూ, ఒక ఉత్తరమిచ్చి మధుబనిలోని ఓ పెద్దాయన దగ్గరకు పంపించాడు. ఆయన నన్ను కాలేజీలో చేర్పించటమే కాక, హాస్టల్‌లోనూ చేర్పించారు. హృదయ నారాయణ బాబు తరచుగా హాస్టల్‌కి వచ్చి కలుస్తుండేవారు. ఒక క్రమపద్ధతిలో సమావేశాలు జరుగుతుండేవి. ఆ రోజుల్లో ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను.

ఎమర్జన్సీ తొలగించిన తర్వాత సంఘశిక్షా వర్గలో శిక్షణ పొంది తాలూకా ప్రచారక్‌గా, జిల్లా ప్రచారక్‌గా పనిచేశాను. 1980లో నన్ను విశ్వ హిందూ పరిషత్‌లో పనిచేయమన్నారు. వివిధ స్థాయుల్లో పనిచేస్తూ ప్రదేశ్‌ ‌సంఘటన మంత్రి వరకు వచ్చాను.

శిలాన్యాసం తర్వాత రాజకీయ క్షేత్రంలో పనిచేయమన్నారు. 12-13 సంవత్సరాలు రాజకీయ క్షేత్రంలో ఉన్నాను. ఆ సమయంలో కూడా రామజన్మభూమి విముక్తి ఉద్యమంలోనూ ఉన్నాను. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌విశ్వహిందూపరిషత్‌లలోనూ చురుకుగా ఉన్నాను. విశ్వహిందూ పరిషత్‌ ‌కేంద్ర నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నాను. వారిచ్చిన ప్రేరణ, ప్రోత్సాహాలతోనే ఇతర రంగాలలోనూ చురుకుగా పనిచేయగలిగినాను.

రామజన్మభూమి ఉద్యమం రాజకీయమైనదనే విమర్శ ఉంది. దీనిలో సామాజిక పరివర్తనతో ముడిపడిన అంశాలేమైనా కనిపించాయా?

వాస్తవమేమిటంటే, శ్రీరామునిపట్ల, ఆయన భక్తులపట్ల వ్యతిరేక భావాలున్నవారే మమ్ములను వ్యతిరేకిస్తున్నారు. శ్రీరాముడు చారిత్రక పురుషుడు, ఈ భూమిపై నడిచినవాడు అనే వాస్తవాన్ని కూడా అంగీకరించడానికి వారు ఇష్టపడరు. రాముడు, రామాయణం అంతా కట్టుకథేనని వాదిస్తారు. కాబట్టి రాముని పేర జరుగుతున్న ఉద్యమం కారణంగా సమాజంలో గొప్ప పరివర్తన వస్తున్నదనే వాస్తవాన్ని ఎలా అంగీకరించగలరు? అయితే వస్తున్న మార్పు వారికి తెలియకుండా లేదు. ఉత్తరప్రదేశ్‌లో, బిహార్‌లో కులతత్వం బాగా తగ్గిపోయింది. కులవిద్వేషాలపై ఆధారపడిన రాజకీయాలు వెనుకబడ్డాయి. కులాల మధ్య హత్యలూ, కొట్లాటలూ తగ్గుముఖం పట్టాయి. నగరాలలోను, గ్రామాలలోనూ షెడ్యుల్డూ కులాలవారు, వెనుకబడినవర్గాల వారు, అగ్రవర్ణాలవారూ శ్రీరాముని పేర జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. కులం కేంద్రబిందువుగా నడిపించజూసే తమ రాజకీయాలు సాగకపోవటంతో వారు కోపోద్రిక్తులవుతున్నారు. బిహారులోనైతే వారు మూడవ స్థానానికో, నాల్గవ స్థానానికో పరిమితమవుతున్నారు. రామచంద్ర ప్రభువు ఉద్యమం జనులలో జాతీయభావనను జాగరితం చేస్తున్నది. దేశభక్తి, హిందుత్వ భావనలు వెల్లివిరుస్తున్నవి.

మీరు రాజకీయకోణం నుండి వివరిస్తున్నారు. సమాజంలో ఉన్న స్థితి ఏమిటో మీ అనుభవం ద్వారా చెప్పండి!

రాజకీయాలకు అతీతమైన పరివర్తన గురించే నేను చెపుతున్నాను. అయోధ్యలో మూలవిరాట్‌ ‌మూర్తిని రూపొందించడానికి నేపాల్‌ ‌నుండి ఒక నల్లరాయిని తీసుకొనివచ్చాం.ఈ కార్యక్రమంలో నేనూ ఉన్నాను. దాని గురించి బ్యానర్లు, పోస్టర్లు, మైక్‌లో ప్రకటనలూ ఏమీ లేవు. అయినా  జనక్‌పూర్‌ ‌నుండి అయోధ్య వరకు దారిపొడవునా, అన్ని వయసులవారు, స్త్రీలు, పురుషులు గంటల తరబడి వేచి ఉండి ఆ పవిత్ర శిలను దర్శించారు. శ్రీరాముని పట్ల భక్తి కులం, ప్రాంతం, భాషా విభేదాలకతీతంగా ప్రజలను సమైక్యపరుస్తున్నది. ఆ దారిలో బిహారులో ఉన్న మొదటి గ్రామం కమ్యునిస్టుల ప్రభావంలో ఉన్నదిగాను, బడుగు వర్గాలు ఎక్కువ ఉన్నదిగాను ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్య పోయాం. వీథులన్నీ పరిశుభ్రం చేసి, కళ్లాపి చల్లారు. తోరణాలు, పూలదండలూ కట్టి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన పత్రికా ప్రతినిధులకు కూడా ఆనందబాష్పాలు వచ్చాయి. విగ్రహ రూపం దాల్చబోయే ఒక నల్లరాయిని చూడడానికే ప్రజలలో ఇంత బలీయమైన శ్రద్ధ, ఆకాంక్ష ఉన్నదంటే, అది ప్రజలను ఏకం చేస్తున్నదంటే, శ్రీరామకార్యం ప్రజలను ఎంతగా ఉద్విగ్నులను చేస్తున్నదో ఊహించుకోవలసిందే.  ఇందులో రాజకీయ మేమున్నది?

అసమానతలను, భేదభావాలనూ రామజన్మ భూమి ఉద్యమం తగ్గిస్తున్నదని మీరంటున్నారు. ఇది కేవలం పైకి ప్రదర్శించడానికే  ఉద్దేశించినదని, మౌలికంగా మార్పేమీ లేదని కొందరంటున్నారు.

కులాలను ఆధారం చేసుకొని ప్రజలను విడగొట్టాలనే తమ కుట్రలు, కుతంత్రాలు విఫల మవుతున్నందుకు గుండెల్లో రాయి పడినవారే ఇటువంటి సందేహాలను లేవదీస్తారు. జనకపూర్‌ ‌నుండి అయోధ్య వరకు సాగిన యాత్రలో పాల్గొనిన బ్రాహ్మణుల సంఖ్య చాలా స్వల్పం. బడుగువర్గాల వారు, వెనుకబడిన వర్గాలవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. శ్రీరామచంద్రుడు తన జీవితకాలంలో సమాజంలోని వివిధ స్థాయిలవారిని దగ్గరికి తీసుకున్నాడు. ఉద్యమం కారణంగా ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అందరూ ఒకచోటకు వస్తున్నారు. భజనలు చేస్తున్నారు. ప్రసాదం స్వీకరిస్తున్నారు. భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. శబరి వంటి వృద్ధ స్త్రీ సహాయంతో, వానరుల సహాయంతో ఆ కాలంలోని అతిపెద్ద టెర్రరిస్టు అయిన రావణాసురుని చెరనుండి సీతాదేవిని విడిపించాడు రాముడు. ఇప్పుడు కూడా అదేవిధంగా అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు శ్రీరాముని వారసత్వాన్ని గుర్తుచేసుకొంటూ రామరాజ్యాన్ని మరల ప్రతిష్ఠించుకోగలమన్న విశ్వాసాన్ని పెంచుకొంటున్నారు.

శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో ట్రస్టీగా మీ అనుభవాలు చెప్పండి. ఈ వాతావరణాన్ని ఇకముందు కూడా నిలుపుకోగలమనుకొంటున్నారా?

మందిర నిర్మాణంలో ఉన్నవారు ఎక్కువగా వెనుకబడిన వర్గాలవారే. అంతా రాముని పట్ల ఎంతో భక్తి ఉన్నవారు. తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తున్నవారు రాముని ఆదర్శాలనూ పాటించాలనుకొంటారు.

నిధి సమర్పణ ఉద్యమం నడిపించినప్పుడు నేను కూడా బిహారులోని కొన్ని గ్రామాలకు వెళ్లాను. కటిక పేదరికంలో నివసిస్తున్నవారి గూడేలకూ వెళ్లాం. మందిర నిధి గురించి వస్తున్నామని తెలిసిన ప్రజలు వీథులలో కళ్లాపి చల్లి,తోరణాలు కట్టి మమ్మల్ని ఆహ్వా నించారు. వారందరూ ఆనందపరవశులయ్యారు. ఒక స్త్రీ రూ.100రూపాయలు సమర్పించింది. ఆమె భర్త రూ.1000  సమర్పించాడు. అది కూడా ఎవరి దగ్గరో అప్పుగా తెచ్చిచ్చాడు. మొత్తం1100 రూ.లు స్వీకరించాలని పట్టుబట్టాడు. శబరిమాతను పోలినవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారని నాకు అర్థమైంది. శ్రీరామచంద్ర ప్రభువు పేరున జరుగు తున్న ఈ ఉద్యమంతో సమాజ జీవితంలో అద్భుత మైన పరివర్తన వస్తుంది. సందేహమే లేదు.

– ‘ఎస్‌.‌సి., ఎస్‌.‌టి. హక్కుల సంక్షేమ వేదిక’ నుండి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram