డిసెంబర్‌ 31, 2014 ‌ముందు వరకు పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ అనే మూడు ముస్లిం దేశాల నుండి వచ్చిన అల్పసంఖ్యాకులకు (హిందూ, పార్సి, క్రిస్టియన్‌, ‌సిక్కులు, బౌద్ద, జైన్‌) ‌పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమలులోకి తెస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. హర్షించదగ్గ విషయం. ఆ దేశాలలో మతపరమైన వివక్ష, హింసను ఎదుర్కొంటున్న అభాగ్యులకు దీని ద్వారా భారత్‌లో గౌరవప్రదమైన సామాజిక జీవితం దక్కుతుంది.

మత ప్రాతిపాదికన జరిగిన దేశ విభజన హిందువులకు అన్ని రకాలుగా నష్టం కలిగించింది. పాకిస్తాన్‌ ‌నుండి భారత్‌కు వచ్చిన హిందువుల బాధలు వర్ణనాతీతం. ఆస్తులు, బంధువులు, భూములు కోల్పోయి; ముస్లింలు జరిపిన అత్యాచారాలలో తమ భార్యాపిల్లలను కోల్పోయి నిజంగానే కట్టుబట్టలతో వారు భారతదేశానికి తరలివచ్చారు. కానీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఒక పెద్ద సమూహం మాత్రం ఆనాడు పాకిస్తాన్‌ ‌విడిచి రాలేక పోయింది. నిజానికి వారిని రానివ్వలేదు. వారంతా దళితులే.

 ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం దళితులను అక్కడే ఆపింది. మరుగుదొడ్లు కడగడం, రోడ్లు ఊడవడం వంటి పనుల కోసమే వారంతా భారతదేశానికి రాకుండా అడ్డుకుంది. ప్రముఖ బ్రిటిష్‌ ‌చరిత్రకారిణి అలిస్‌ అల్బినియా తన పుస్తకం ‘ఎంపైర్స్ ఆఫ్‌ ఇం‌డస్‌: ‌ది స్టోరీ ఆఫ్‌ ఎ ‌రివర్‌’‌లో ఈ పరిణామాలను నమోదు చేశారు.

విభజన తర్వాత సింధ్‌లో మతపరమైన అల్లర్లు ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వం జనవరి, 1948లో తరలింపు చర్యను ప్రారంభించింది. ప్రతిరోజూ దాదాపు 3,000 మంది హిందువులు కరాచీని వీడడం ప్రారంభించారు. నగర పాలక సంస్థలో స్వీపర్లుగా, మురుగుకాల్వలను శుభ్రం చేసే పనిలో ఉన్న నిమ్న కులాల హిందువులు వేగంగా, అంటే అప్పటికి ఒక నెలలోనే భారతదేశానికి బయలుదేరుతున్నారని పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం గ్రహించింది. కరాచీ నగరంలోని పారిశుద్ధ్య విభాగంలో 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి తగినంత మంది లేరు. ఎందుకంటే ముస్లింలు ఆ ఉద్యోగాలు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఫిబ్రవరి 1948లో, పాకిస్తానీ ప్రభుత్వం తన పరిపాలనా విధానాలను సమీక్షించవలసి వచ్చింది. ఇది పారిశుద్ధ్య సేవలలో నిమగ్నమైన ‘అణగారిన తరగతుల’ వలసలను అడ్డుకునేందుకు దారితీసింది.

 దీనిపై అప్పటి భారత హైకమిషనర్‌, ‌ప్రధాని లియాఖత్‌ అలీఖాన్‌కు ఫిర్యాదు చేయగా, ‘వారు (పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న హిందువులు) వెళ్లిపోతే కరాచీ వీధులు, మరుగుదొడ్ల• ఎవరు శుభ్రం చేస్తారు?’ అని స్పందించారు. ఈ విధంగా పాకిస్తాన్‌లో మిగిలిపోయిన హిందువులలో ముఖ్యంగా దళితుల సంఖ్యే ఎక్కువ. ప్రముఖ వార్తాపత్రిక జరిపిన పరిశోధనలో ఇప్పటి వరకూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న 5,764 శరణార్ధులలో 70 శాతం మంది దళితులే అని తేలింది.

విభజన తరువాత తూర్పు పాకిస్తాన్‌ (‌నేటి బంగ్లా)లో దళితుల పరిస్థితుల గురించి అప్పటి పాకిస్తాన్‌ ‌న్యాయ, కార్మిక శా• మంత్రి జోగేంద్ర నాథ్‌ ‌మండల్‌ ఆ ‌దేశ ప్రధాని లియాకత్‌ అలీఖాన్‌కి రాసిన లేఖలోని కొన్ని అంశాలను గుర్తు చేసుకుందాం.

దళితులంటే పడని ముస్లింలు చేసిన ఫిర్యాదును అటువంటి విచారణ జరపకుండానే దళితులను అరెస్ట్ ‌చేసేవారు (గోపాల్‌ ‌గంజ్‌ ‌సంఘటన). సిల్హేట్‌ ‌జిల్లాలో ఆర్మీ, పోలీసులు అక్కడ దళిత మహిళలను ఆర్మీ క్యాంపులకు తీసుకొని వెళ్లి ఆర్మీ ఆఫీసర్లను శారీరకంగా సుఖపరచాలని ఒత్తిడి తీసుకువచ్చేవారు. లేకుంటే వారిని భౌతికంగా గాయపరిచేవారు. నాచోలే జిల్లాలో పోలీసులు ముస్లింలతో కలిసి అక్కడున్న దళితుల ఆస్తులను దోచుకోవడమే కాకుండా ఇళ్ల్లు తగలబెట్టడం, చేపలు పట్టే వలలను ధ్వంసం చేయడం, మహిళల మీద అత్యాచారాలు విస్తృతమయ్యాయి. 350 ఇండ్లు గల కలిశ్రా గ్రామంలో అక్టోబర్‌ 28, 1950‌న జరిగిన విధ్వంసం వల్ల మూడు ఇళ్లు మాత్రమే మిగిలాయి. మిగిలినవాటిని తగలబెట్టారు, లేదా ధ్వంసం చేశారు. బారిసాల్‌ ‌జిల్లా , చుట్టుపక్కల గ్రామాలలో ముస్లింలు జరిపిన దాడుల్లో దాదాపు పదివేల మంది దళితులు చనిపోయారు. ఆస్తులు కోల్పోయిన హిందువులకు వాటిని ఢిల్లీ ఒప్పందంలో భాగంగా తిరిగి ఇప్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించలేదు.

సింధు పాకిస్తాన్‌లో లక్షల మంది దళితుల మతం మార్చారు. దళిత అమ్మాయిలను చెరపట్టారు. వందల గురుద్వారాలు, మందిరాలు మసీదులుగా మారాయి. పాకిస్తాన్‌ ‌హిందువుల పాలిట శాపభూమిగా మారింది. ఈ విధంగా దేశ విభజన మిగిల్చిన ఆ దారుణ విషాదంలో, దుఃఖంలో ఎక్కువ మంది దళితులే నష్టపోయారు.

ఈ అత్యాచారాలు తట్టుకోలేక భారతదేశానికి వలసవచ్చిన శరణార్ధుల మీద ఇక్కడి నాటి ప్రభుత్వం కూడ ఎన్నో అత్యాచారాలు జరిపింది. బంగ్లాదేశ్‌ ‌నుంచి వచ్చిన నామశూద్రులు, ఇతర దళిత ప్రజలు పశ్చిమబెంగాల్లోని మార్చిజాపి లో శరణార్ధులుగా ఉంటే, వారి మీద నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం 1979 సంవత్సరంలో దారుణమైన దాడులు జరిపింది (••••వ జూశీఅశీతీవ• ••శ్రీఱ• ••ఱఅ••ఱశీఅ • ఔవ• దీవఅస్త్ర•శ్రీ శీఎఎబఅఱ• +శీఙవతీఅఎవఅ• ఱఅ 1979).

ప్రస్తుత పశ్చిమబెంగాల్‌ ‌సందేశ్‌ ‌ఖాలిలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత షేక్‌ ‌పాజహాన్‌ ‌దళిత గిరిజన మహిళల మీద అనేక సంవత్సరాలుగా జరుపుతున్న అత్యాచారాలు గురించి కొన్నిరోజులుగా వింటూనే ఉన్నాం. ఇలా మనసులను కలిచి వేసి సంఘటనలు ఎన్నో!

తరతరాలుగా కష్టాలనే, విషాదాలనే చూస్తున్న, ఎదుర్కొంటున్న, కనీస మానవ హక్కులకు నోచుకొని శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన సీఏఏని బీజేపీయేతర పక్షాలు, హక్కుల నేతలు, వామపక్షాలు, ఒక వర్గం మీడియా వ్యతిరేకించడం సిగ్గుచేటు. అమానుషం కూడా. జర్నలిస్ట్ ‌దిలీప్‌ ‌మండల్‌, అడ్వకేట్‌ ‌నితిన్‌ ‌మేశ్రం వంటి దళిత మేధావులు ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నారు. దళితుల పక్షాన ఉంటాం, మాట్లాడుతాం, దళితుల కోసం పోరాడుతామనే కమ్యూనిస్టు పార్టీలు, డీఎంకే, బీఎస్‌పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ వంటివి ఇప్పుడు సీఏఏని వ్యతిరేకించడం దేనికి సంకేతం? అందుకే 70 నుండి 80 శాతం వరకు దళితులు బ్ధి పొందే ఈ చట్టాన్ని వ్యతిరేకించడం దళితులను వ్యతిరేకించడమే.

కృష్ణబాబు నాయక్‌

‌సామాజిక కార్యకర్త

About Author

By editor

Twitter
Instagram