హైదరాబాద్‌ ‌లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల  మాధవీలతతో ముఖాముఖీ

ఇవాళ్టి సామాజిక మాధ్యమాలలో ఆమె ఒక నయాగరా. 2024 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్‌ ‌లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్న ధీర. ఆమె కొంపెల్ల మాధవీలత. ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్‌ ‌పేరు వినిపించడం అత్యంత శోచనీయం. అందుకు ఉన్న పరిస్థితులు వేరు. అందుకు అక్కడ ఉన్న సామాజిక, మత పరిస్థితులు వేరు. దాదాపు నలభయ్‌ ఏళ్లు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లే పాతబస్తీ వెనకపడిపోయిందని చెప్పడమే అన్నిటికన్నా వింత. దీని ముఖచిత్రాన్ని మారుస్తానని అంటున్నారు మాధవీలత. ‘రజాకార్‌ ‌వారసుల’ అడ్డాలో ఇప్పుడు ఆమె ఒక సంచలనం.మాధవీలతతో జాగృతి జరిపిన ముఖాముఖి పాఠకులకు అందిస్తున్నాం.

ఇవాళ బీజేపీ ఒక ప్రభంజనం. అయినా అభ్యర్థుల మొదటి జాబితాలో మీ పేరు వెలువడింది. దేశంలోనే అనేక ప్రత్యేకతలు ఉన్న హైదరాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రంగంలోకి ఉన్నారు. ఇది మీకెలా అనిపించింది?

జన్మ సార్థకమవ్వాలంటే ఒక్కొక్కరికి పరమేశ్వ రుడు ఒక్కొక్క బాధ్యతను ఇవ్వాలి. ఇచ్చే స్థాయికి మనిషి ఎదగాలి. బహుశ అది నా జన్మసార్థకత్వం. ఏ వర్గాలకూ న్యాయం చేయని అధర్మపాలన నుంచి ఆ నియోజకవర్గాన్ని విడిపించి ప్రజలకు న్యాయం చేసే చక్కటి అవకాశం బహుశా నాకు ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. జీవితానికి ఇంతకన్నా ఇంకేమి కావాలి అనిపించింది.

రాజకీయాలంటే వాటిదొక ప్రత్యేక పంథా. మీ కుటుంబ నేపథ్యం, మీ అభిరుచులు, మీ తత్త్వం అనుకున్నా.. రాజకీయాలపట్ల ఆసక్తి కలగడమూ ప్రత్యేకంగానే కనిపిస్తుంది. ఇలాంటి ఆసక్తికి ఏదైనా నేపథ్యముందా?

అసలు సిసలైన నేపథ్యమేమంటే భగవద్గీత. చాలాకాలం నాకు గీత మీద నా దృష్టి పడలేదు. అమ్మవారు, అనుష్టానం.. మంగళగౌరి, దక్షిణామూర్తి ఈ విధంగా ఉన్నాను. అనుకోకుండా ఒక విచిత్రమైన ఆలోచన లేదా, ఒక దృక్పథం మొదలయింది. అంతా భగవద్గీత నేర్పిస్తూ ఉంటారు. అది విన్నప్పుడల్లా, చెప్పినప్పుడల్లా ఒక వైరాగ్య చింతన అన్నట్లుగా ఉంటుంది. ఒకరోజు అనిపించింది. భగవద్గీత ఎవరు చెప్పారు? ఒక రాజు. కృష్ణపరమాత్ముడే. ఆయన రాజు. విన్నదెవరు, అర్జునుడు. ఒకరాజు. చెప్పిందెక్కడ? కురుక్షేత్రం. వినాల్సిన అవసరం ఏమిటి? ధర్మపరిపాలన కోసం. అసలు భగవద్గీత వచ్చినదే రాజకీయాల కోసం. అంటే అది పాటిస్తూ రాజకీయాలు చేయాలి. అయితే వాళ్లు (రాజకీయ నాయకులు) తప్ప అంతా వింటున్నారెందుకు భగవద్గీతను అనిపించింది. మనం ఎన్నో నిర్వచనాలు రాసుకున్నాం కానీ, ధర్మబద్ధమైన రాజ్యపాలనలో మొదట చదవవలసిన అద్భుతమైన ఒక పుస్తకం, పరమేశ్వరుడు తానే జగద్గురువై అందించింది- భగవద్గీత. అక్కడి నుంచి రాజకీయాల పట్ల నా దృక్పథం మారిపోయింది. ఇతరుల మాటెలా ఉన్నా నేను దానిని ఎలా చూస్తున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను అని ప్రశ్నించుకున్నాను. అప్పుడే ఒక మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాకు ఉందేమోనని పించింది. దానికితోడు నేను ఎమ్‌.ఏ. ‌రాజనీతిశాస్త్రం చదివాను.

తాత్వికదృష్టి అర్థమవుతోంది. మీరు క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి వెనుక ఉన్న వాస్తవిక సామాజిక దృష్టి ఏది?

మానవ సేవ కోసం. ఛారిటబుల్‌ ‌ట్రస్టు ద్వారా నేను సాయపడని రంగమంటూ లేదు. విద్య, వైద్య రంగాలు. భోజన వసతి, అనాథాశ్రమాలు, స్త్రీలు, వృద్ధులు, యువతకు చేయూత… అయినా ఒకచోట ఆగిపోతుంది. ఆ ఆపేది ఏమిటీ? సిస్టమ్‌. అం‌టే? ప్రజలు కాదు, వాళ్లను పరిపాలిస్తున్నవారు, వాళ్లతో పనిచేస్తున్నవారు. ఒక ఊరిలో అనాథాశ్రమం కట్టాలనుకున్నాను. గ్రామ పంచాయతీవారు లక్ష రూపాయలు లంచం అడిగారు, ఆ రోజు భద్రకాళి అవసరం ఎత్తాల్సింది. నా చుట్టూ ఉన్నవారు ‘ఇదీ ప్రపంచం’ అని శాంతపరిచారు. తుంగభద్ర పొంగి కర్నూలు బెల్టు అంతా వరదలొచ్చాయి. నది అన్నాక మనకు చెప్పి పొంగుతుందా? ఎవ్వరికీ పట్టలేదు. అప్పట్లో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ను రిమోట్‌ ‌ప్లేస్‌ ‌గురించి అడిగాను. ఎవ్వరు వెళ్లని స్థలం, ఆహారం అందని చోటు. అన్నల ఊర్లు ఉంటాయి, ఎవ్వరూ వెళ్లరు అన్నాడు. నేను వెళ్తా, అన్నాను. ఎవరైనా, ఎలా ఉన్నా, ఈ రోజు వాళ్లు బాధితులే కదా. వాళ్లకు కూడా అమ్మ పోయి అన్నం పెట్టాలి కదా. అలా అన్నలు ఉన్న స్థానాలకు కూడా వెళ్లి సేవ చేసినపుడు, వాళ్ల ప్రేమ, ఆదరణ కూడా అర్థమయింది. అలాగే పాతబస్తీ (హైదరాబాద్‌). అక్కడ ఇరుమతాల వారిదీ పీడనే. బాధే. హైందవ వర్గం కనిపిస్తూ బాధపడు తుంది, ముస్లిం వర్గం కనిపించకుండా బాధపడు తుంది. బయటికి తీసుకొచ్చే ధైర్యం కావాలి అని అర్థమయింది. ఏమైతేనేం చూసుకుందాం అని రంగంలోకి దూకాను.

మీ జీవితాశయం, లేకపోతే ఒక గొప్ప ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి వేదికగా బీజేపీ ఉపయోగపడుతుందని నమ్మకమెలా కలిగింది?

ఓటు హక్కు వచ్చాక, 18వ ఏ• మొట్ట మొదటిసారిగా బీజేపీకి వేశాను. ఎందుకంటే జాతీయపార్టీ. సంఘం నుంచి, సామాజిక స్ఫూర్తితో కష్టపడి పార్టీని నిర్మించారు. అమ్మ, నాన్న, మేన మామ, మామగారు వీళ్లలో ఎవరో రాజకీయాల్లో ఉంటే వచ్చినవాళ్లు కాదు బీజేపీ వాళ్లు. 99 శాతం కాదు. ఇప్పుడు మోదీగారి నాయకత్వం. నా మనసులో ఏముండిందంటే బీజేపీ నాకు చిన్న అవకాశమిస్తే నిరూపించి చూపించాలి. వాళ్లు గనక ఇవ్వకపోయుంటే నేను ఎవరి తరఫున కూడా నిలబడి ఉండేదాన్ని కాదు.

పాతబస్తీ అన్నారు. హైదరాబాద్‌ ‌నియోజక వర్గాన్ని ప్రభావితం చేసేది, శాసించేది పాతబస్తీ. అక్కడ ముస్లింలు వెనకబడి ఉన్నారు. అలా ఎవరు ఆరోపిస్తున్నారంటే దశాబ్దాలుగా దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. వారే ప్రజాప్రతినిధులుగా ఉండి అభివృద్ధి చెందలేదని వారే ప్రభుత్వాన్ని తిట్టడం. ఈ విషయాన్ని మీరు ప్రజలకు అర్థమయ్యేలా ఎలా చెబుతారు?

మనం ఎక్కువ శ్రమ తీసుకోనక్కరలేదు. మోదీ త్రిపుల్‌ ‌తలాక్‌ను రద్దు చేశారు. కరెక్టుగా ఈ రోజు నుంచి 5 ఏళ్ల క్రితం. 2019 వరకు అసదుద్దీన్‌ ఏం ‌చేస్తున్నాడు? మోదీగారు వచ్చారు కాబట్టి సరిపోయింది. తలాక్‌తో నానా తంటాలు పడుతున్న మహిళల అదృష్టం ఆయన రావడం. ఆడపిల్లలను విక్రయిస్తున్నారు. వాళ్లదగ్గర ట్రావెల్‌ ‌మ్యారేజ్‌ ఉం‌టుంది. ఎవరైనా ప్రయాణం చేస్తుంటే, మగ మహానుభావులు, పురుషుడు… ముస్లిం, ఆ ప్రయాణం కోసమే పెళ్లి చేసుకోవచ్చట. భగవంతుడా! ఏమిటది? అది ఒక సంస్కారమా? పద్ధతా? ఆడకూతుర్ల జీవితాలతో ఆట. ఇంకో చిత్రముంది. పెళ్లి చేసుకొని పరదేశానికి తీసుకొని పోయి ఆ దేశపు చట్టం అమలు చేస్తారు. ఒక కుటుంబంలో 15 మంది ఉన్నారనుకోండి, ఈ అమ్మాయిని అంతా పంచుకుంటారు. అక్కడ కూడా ఇన్‌స్టంట్‌ ‌తలాకులు ఇవ్వవచ్చు. వాళ్లు ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వదలివేయవచ్చు. మొన్ననే 15,20 రోజుల క్రితం అమ్మాయి ఫోన్‌ ‌చేసి చెప్పింది, ‘అమ్మా! శుభాకాంక్షలు. సంతోషపడు. నాకు 18వ పెండ్లి జరిగింది’ అని. హైందవ ధర్మ సంస్థాపకుడు, కర్మయోగి, బ్రహ్మచర్యంలో సన్యాసం చూసినవాడు మోదీగారు వచ్చి త్రిపుల్‌ ‌తలాక్‌ను రద్దు చేసి ఆ ముస్లిం స్త్రీకి విముక్తి కల్పించేదాకా వాళ్లంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వింత చూస్తున్నారా? లేకపోతే వీళ్లూ పాలు పంచు కుంటున్నారా, ఆ భయంకరమైన విషయంలో?

రెండవది ఉమ్మడి పౌరస్మృతి. అసలు ఇది ఎవరికి? పేద కుటుంబాల ఆడపిల్లలకు. ముస్లింల గురించి కదా మోదీ తపన. అక్కడ ఆడపిల్లకి పెళ్లికి ముందైన సంపాదన నాలుగు రాళ్లలో రెండురాళ్లను అప్పచెప్పుతారేమో, అలా అయినా ఈ అమ్మాయి కాళ్లమీద నిలబడుతుందేమో అన్న తపన ఆయనకు. మన ప్రబుద్ధుడు అదీ వద్దన్నాడు. ఏం కావాలి మరి? స్త్రీ చితికిపోయి, అణగిపోయి, అమ్ముడుపోయి, మళ్లీ మళ్లీ అమ్ముడుపోతే వాడికి సంతోషమా? వాళ్లింట ఆడపిల్లలు లేరా? వాడొక తండ్రేనా? అసలు మనిషేనా? హైందవుల ఇండ్లలో మగపిల్లలకంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆస్తులు రాసిస్తున్నాం. స్త్రీ ధనం సమకూర్చి పంపిస్తున్నాం.హైందవులు ముందగుడు వేసినవారే.

మూడోది సీఏఏ. ఈ యాక్టు డిసెంబర్‌ 31,2014 ‌ముందు కూడా నీవు ఇక్కడ ఉన్నా, ఆధార్‌ ‌కార్డు, నీకు ఫ్రూఫ్‌ ఏమున్నా ఇక్కడనే ఉండిపోతావు అంటోంది. పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లలోని ముస్లిం మీకు మైనార్టీ ఎందుకవుతాడు? నీకు ఇక్కడ ఏడుస్తున్న ఆడపిల్లలు వద్దు, షియా మదరాసాలు వద్దు. వక్ఫ్‌బోర్డు స్థలాలు తినేయండి హాయిగా. దీనికి ప్రొటెస్టు చేయరు. కానీ ముస్లిం దేశాలవారు వాళ్లకొద్దని తన్ని తరిమిన ముస్లింలు మీ ముస్లిం లయ్యారా? ఎందుకో చెప్పనా? ఆ శరీరంలో తిరుగుతున్నది రజాకార్‌ ‌రక్తం కాబట్టి. 2011లో అక్బరుద్దీన్‌ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు, మేము రజాకారులము. మేము ఎమ్‌ఐఎమ్‌ ‌వాళ్లము. మేము రెండు మూడు తూటాలకు ఎదురుగా నిలబడ్డాము. మా పూర్వికులైతే ఫిరంగులకు ఎదురు నిలబడ్డారు హిందుస్తాన్‌తో పోటీ చేయడానికి. అలా అన్నావంటే నీవు ఈ దేశవాసుడివే కావు.

ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. కానీ సీఏఏ అమలు పేరుతో అలజడి చేస్తారు. నాటి షాహిన్‌బాగ్‌ అం‌త స్థాయిలో అయితే ఉండదు. ఈ వాస్తవాలు మీరు ఎట్లా ప్రజలకు చెబుతారు?

ఇది వాళ్లకు చేరాలంటే, నాకు హిందీ, ఉర్దూ లేకపోతే రెండు కలిపిన భాష వచ్చు. ఆ భాషలో వారికి మెసేజ్‌లు పంపాలనుకుంటున్నాం. అది చాలా జరగాలి, బాగా జరగాలి. అదీకాకుండా వాళ్లు ఎవరెవరినో పట్టుకొస్తారు, వాళ్లు అడ్డమైన పనులు చేస్తూ, దేశద్రోహానికి పాల్పడతారు. వాళ్లని పోషించేది పెద్ద పెద్ద ఎంఐఎం ప్రముఖులే. ఇదంతా ఒక సామాన్య హిందువు వినేటప్పుడు ముస్లిం పేరే వినిపిస్తుంది. ఈ రాజకీయాలు ఓటు బ్యాంకు కోసం. అతను బారిష్టర్‌, ‌లండన్‌లో చదివాడు. అటు లండన్‌ ‌నీతి, ఇక్కడ రజాకార్‌ ‌రీతి రెండు కలియగలిపి, శుభ్రంగా 40 ఏళ్ల నుంచి రాజ్యమేలుతున్నాడు. సీఏఏతో ముస్లింలకు కించిత్తు కూడా నష్టం జరగదు. ఈ సంగతి చదువుకున్న హిందువులు, ముస్లింలు సాధారణ ముస్లింలకు చెప్పాలి. సీఏఏతో మోదీగారు చెపుతున్నది ఒకటే. ఈ దేశ మైనారిటీలు, ముస్లింలు మీ హక్కులు మీకు చాలా ఉన్నాయి. వాటిని మీరే అనుభవించాలంటే బయట దేశాలు తరిమేసిన ముస్లింలను తీసుకరావడానికి ఇక్కడివాళ్లు చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలి. వాళ్లు రావడంవల్ల మూడు నష్టాలు. మీకున్న తిండి, గుడ్డ, బట్టలు, విద్య, వైద్యం అభివృద్ధి సదుపాయాలు వాళ్లు ముందు పంచుకుంటారు. ఇది ఇక్కడి ముస్లింల బుర్రలోకి చేర్చాలి. పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్లు దుర్మాన్గాలు చేస్తారు. ఆ దుర్మార్గాలు ఏమీ తెలియని ముస్లింల మీద పడతాయి. ఇలా జరిగే ఒకప్పుడు అమెరికావాళ్లు మొత్తం ముస్లింలకే వీసాలివ్వడం మానేశారు. మూడవది, బయటి వారు అటు ముస్లిం ఆడపిల్లల్ని, మన ఆడపిల్లల్ని కూడా ఇబ్బందిపెట్టి, వాళ్ల స్వార్థానికి, స్వలాభానికి వాడుకునే అవకాశాలు ఉంటాయి.

ఇప్పుడు రెండు దృష్టి కోణాలు. మీరు చెప్పినట్టు బయట నుంచి వచ్చినవారు- రోహింగ్యాలు కావచ్చు, మరొకరు కావచ్చు. వాళ్ల ఆడపిల్లల్ని, వేధించవచ్చు అన్నారు. ప్రస్తుతానికి ప్యారిస్‌లో, జపాన్‌లో, ఇంగ్లాండ్‌లో జరుగుతున్నదదే. రెండోది- కొన్ని ముస్లిం దేశాల్లో ముఖ్యంగా అరేబియన్‌ ‌దేశాలు సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఇప్తార్‌ ‌విందులు రద్దు చేశారు. కొన్ని పాత సంప్రదాయాలు విడిచిపెడుతున్నారు. ఈ విషయాలు ఇక్కడ సామాన్య ముస్లింలకు లేకపోతే ముస్లిం స్త్రీలకి చేరుతున్నాయా?

ఎలా చేరుతాయి? వాళ్లకు చదువు సంధ్యా లేదు. అసలు పాతబస్తీకి వచ్చి చూడండి. ఒక తమాష చెబుతాను, అడిగారు కాబట్టి.7,8 ఏళ్లుగా ముస్లిం స్త్రీలతో పనిచేస్తున్నాను. వాళ్లు మాకు ఉద్యోగం ఇప్పిస్తావా అని అడుగుతారు. రిసెప్షనిస్టు, మరొకటి ఏదో ఒకటి ఇప్పించమంటారు. ఏం చదువుకు న్నావమ్మా అని అడిగితే 10వ తరగతి ఫెయిలయ్యా నంటారు. అంతేనా అంటే, మావాళ్లయితే 5వ తరగతి వరకే చదివారు అంటారు. ఇది పరిస్థితి. ఏ రోజైతే వాళ్లు చదువుకుంటారో, బయటి ప్రపంచంలో కాళ్లు పెడుతారో వాళ్లు ఆలోచించడం మొదలుపెడతారు. అందుకే చదువనివ్వరు, ఎదగనివ్వరు. మతం పేరుతో వాళ్లను హింస పెడతారు.

ముస్లిలంతా ఒకటే అని అనలేం. కొందరితో ఆ వర్గానికి చెడ్డ పేరు వస్తున్నది. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా నెట్టుకొస్తున్నారు?

నేను ముస్లింల గురించి మాట్లాడుతున్నాను. వారు బాధల్లో ఉన్నారు. అయినా మన వాళ్లు చాలా ఆప్యాయంగా తీసుకున్నారు నన్ను. ఏరోజు కూడా ఈవిడ హోమాలు, పూజలు చేస్తూ ముస్లింల మీద జాలిగా మాట్లాడుతుందేమి అని అనలేదు. హైందవుడి మనసే అలాంటిది. అక్బరుద్దీన్‌ ‌చిటికేసి, పంద్రా మినట్‌, 130 ‌కోట్లకి సమాధానం చెబుతా నన్నాడు, నిజమే. అయితే ఇలాంటి ధోరణికి కూడా చేతులు కట్టుకుని కూచుంటామా! ఇపుడు చూపిద్దాం మనమేంటో, నా ఎంట్రీయే అందుకు. ‘నా’ అంటున్నాను. ఇక్కడ మాధవీలత ఒక వ్యక్తి కాదు. హైందవుల శక్తి. ఆ 15 నిమిషాలు చిటికెలు వేసిన వాడి సంగతి చూపిస్తా, వాళ్లన్న సంగతి చూపిస్తా.

ఇప్పుడు కూడా పాతబస్తీ మీదే అరబ్బులు మీరు చెప్పిన ఈ దొంగ వివాహాలు ఆగలేదని అంటారు. దీనికి ఎక్కడ అంతం?

370 అధికరణం రద్దు కాకముందు కశ్మీర్‌కు వెళ్లాలంటే భయం. ఈ అధికరణం తీసేశాక ఎంత మార్పు! అన్నిచోట్ల విధి విధానమొకటే. పాతబస్తీకి ఎవ్వరూ వెళ్లరు, ఎందుకని, భయం! వీధులు చిన్నగా ఉంటాయి. సెక్యూరిటీ ఉండదు. ఎలక్ట్రికల్‌ ‌పోల్స్ ‌పేపరు మీద ఉంటాయి, వీధుల్లో ఉండవు. బల్బులు పేపరు మీద వెలుగుతుంటాయి, వీధులలో వెలగవు. నాలాలు క్లీన్‌ అయినట్లు పేపర్ల మీద ఉంటాయిగానీ, కీన్‌ అవ్వవు. చక్కటి రోడ్లు పేపర్లమీద ఉంటాయి గానీ, నిజంగా ఉండవు. ఇలా ఎవ్వరూ అటువైపు పోకుండా భయం సృష్టించారు. ఎప్పుడైతే ఏకాకిగా మారిందో ఇక ఇష్టారాజ్యం. అత్యాచారాలు పెరిగి పోయాయి. ఏమి చేయాలి? అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రి తీసేశారు, యునాని ఎత్తి పారేశారు. ఆయుర్వేదం ఎత్తిపారేశారు. హైకోర్టును తీసి పారేస్తున్నారు. స్పోర్టస్ ‌రెండు గ్రౌండ్స్‌ను ఎత్తిపారేశారు. దౌర్భాగ్యం.. విద్య, వైద్యం తీసేశారు, న్యాయం తీసేశారు. అర్థం ఏమిటి, మాకది అక్కరలేదు. అన్యాయం పెరగక ఏమవుతుందండి! మొదట ధర్మబద్ధంగా ఏ యుద్ధంతోనో కైవసం చేసుకుని, దడదడ మార్పులు తేవాలి.

ఒకటైతే ఉంది, ముస్లింలు, స్త్రీలు, పురుషులు కూడా, వాళ్లు మిగతా ప్రపంచాన్ని తెలుసుకోలేక పోడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొందరికి అన్నీ తెలుసు, ప్రపంచ పరిస్థితులు తెలుసు, చరిత్ర తెలుసు, ఇస్లాం భారతదేశానికి వచ్చి ఏం చేసిందో తెలుసు. అయినప్పటికీ మేల్కొనవలసిన హిందువులు మేల్కోవటం లేదు. దాని గురించి ఏం చెబుదాం?

కాంగ్రెస్‌పార్టీ ఇదివరకు ఇదే ఎమ్‌ఐఎమ్‌తో చేతులు కలిపింది. అప్పుడు తెలియదా? వీళ్లు రజాకార్లు, మన స్త్రీలను హింస పెట్టారు, మాన భంగాలు చేశారు. దళితులను తొక్కేశారు. రైతులను నాశనం చేశారు. ఎంత స్వార్థ రాజకీయాలండి! వాళ్లు పోషిస్తేనే కదండి వీళ్లు పెరిగారు.

వీళ్లను అదుపు చేయడానికి ఎంతమంది మోదీలు రావాలి?

ఒక మోదీగారికి మాలాంటి వెయ్యి మంది తయారవుతే సరిపోతుంది. మేము ఐక్యమవుతాం. అలాగే ధర్మం అనేది ఉంది. 2023లో ఏమైంది? టిఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌ ‌చేశారు. అక్కడ నుంచి గరాజ్‌ ‌వెళ్లిపోయారు. పైగా యజ్ఞాలు చేస్తారు. ఎందుకు చేస్తారో వాళ్లకే తెలియాలి. ఇంత చేసి కూడా విజయాన్ని సాధించలేక పోయారంటే అర్థం- అధర్మపాలన రాణించదు. మన అనుకొంటూ దుర్మార్గులను పోషించలేము. కచ్చితంగా చెప్పగలను. 40 ఏళ్ల చరిత్రలో ఒక స్త్రీ నిలబడింది ఈరోజు. శక్తిగా మారుతుంది. ఆ శక్తిని ఏమైనా అనండి, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, పరమేశ్వరుడు అనండి. పేరు ఏదైనా కావచ్చు, కాలం అలాంటి వారిని శిక్షించక మానదు.

ఎంపీగా మీరు ఏం చేయబోతున్నారు?

పెద్ద జాబితాయే ఉంది. కానీ పప్రథమంగా రెండు చేయబోతున్నాను. హైందవ దేవాలయాల పునరుద్ధరణ, సంరక్షణ. ముస్లిం స్త్రీలకు అండ. కరసేవకులు, అత్యవసర పరిస్థితిలో జైలుకు వెళ్లినవారికి పెన్షన్‌లు దొరకలేదు. ప్రధానిగారికి చెప్పి వీరికి ఏదైనా చెయ్యాలని తపన నాకు. మూడు- పిల్లలందరికీ చక్కటి పాఠశాలలు. నాకు ప్రభుత్వ పాఠశాలలంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్స్‌ని సపోర్టు చేసే వ్యక్తిని కాదు. పాతబస్తీకున్న అదృష్టమేమిటంటే అక్కడ టూరిజం ఉంది. వాళ్లు వాడుకోవడం లేదు సరిగ్గా. చార్మినార్‌, ‌గోల్కొండ, జగదంబ గుడి- వెయ్యి సంవత్సరాలది. సీతారాంబాగ్‌లో అంత పెద్ద దేవాలయం. చూసుకుంటూ పోతే చోళులు, మౌర్యులు కట్టిన గుళ్లున్నాయి. సోమనాథ్‌ ‌దేవాలయం ఉంది. చాలా పురాతనమైనది. కాశీబుగ్గ దేవాలయం. టెంపుల్‌ ‌టూరిజంను పెంచాలి. బతుకమ్మ పండుగను వీళ్లు రాష్ట్ర పండుగని అని వాడుకున్నారు. బతుకమ్మక• పూర్వం వంద కొలనులుండేవి అక్కడ. వాటిని పునరుద్ధరించాలి.

ఉత్తర భారతదేశం, రాజస్తాన్‌లో బావులంత అందంగా తీర్చిదిద్దితే, ఇన్ని బావులు పెట్టుకొని మనం చేయకపోవడమేమిటి? కళలు. లోకల్‌ ‌ఫోక్‌ ఉన్నాయి. వాటిని బయట పెట్టాలి. నాకు లలితకళలు, డ్యాన్స్ అం‌టే ఇష్టం. డాన్స్ ‌మ్యూజిక్‌ ‌కాలేజీ పెట్టాలి. త్యాగరాయ గానసభకు నా చిన్నతనంలో వెళ్లేదాన్ని. చాలా బాగుండేది. ఫైనార్టస్ ఉం‌డేచోటు. చాలామంది, పెద్ద పెద్ద ప్రముఖులు ఈ ప్రాజెక్టు కోసం పనిచేయడానికి ఇంట్రస్ట్ ‌చూపుతున్నారు. సంవత్సరానికి 3 లక్షల ఉద్యోగాలు ఐటి ఇండ్రస్టీలో భర్తీ అవుతాయి. అందులో 40 శాతం, లక్షా 20 వేల ఉద్యోగాలు హైదరాబాద్‌ ‌నుంచి భర్తీ అవుతాయి. అందులో కనీసం ఒక శాతం కూడా హైదరాబాద్‌ ‌లోక్‌సభ నుంచి భర్తీ కావు. వినడానికి వింతగానే ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఇం‌డస్ట్రీ వాళ్లందరు నెలకు 10వేల కోట్లు ఖర్చు పెడ్తారు. అందులో కేవలం 5 శాతం ఖర్చు పెడితే హైదరాబాద్‌నే మార్చవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రేస్‌ఫుల్‌ ‌జాబ్‌ ‌కదా! ఐటి వాళ్లు సరాదాగా కాలక్షేపం చేయాలంటే హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌జంట నగరాలలో హైదరాబాద్‌ ‌లోక్‌సభ నియోజక వర్గంలో తప్ప ఎక్కడ చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి? మనసుంటే ఇదంతా చేయవచ్చు. కరెక్టుగా 5 ఏళ్లల్లో, జూబ్లీహిల్స్‌ను మించి అంత అద్భుతంగా తయారు చేసే అవకాశం ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram