370 – ఈ అంకెలు చెవిన పడితే మన విపక్షాలకు మెదడు మొద్దు బారిపోతున్నదా? కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే  370 అధికరణ రద్దు  ఇచ్చిన షాక్‌ నుంచి విపక్షాలు ఇప్పటికీ కోలుకోలేకపోయాయనే చెప్పాలి. తమ ఎన్‌డీఏ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, 370 స్థానాలు తగ్గకుండా బీజేపీ గెలుచుకుంటుందని మోదీ ఈ పార్లమెంట్‌లో ఇచ్చిన తుది ఉపన్యాసంలో చెప్పడం మళ్లీ మెదడు మొద్దుబారిపోయేటట్టు చేసింది. 370 అధికరణం రద్దు పరిణామాలను గుర్తుకు తెచ్చింది. 2024 ఎన్నికలలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనన్న సంగతి విపక్షాలకు తెలియనిది కాదు. తాము పార్లమెంటుకు మళ్లీ వస్తామని మోదీ అత్యున్నత చట్టసభ సాక్షిగా చెప్పారు. ఇక విపక్షాల ధోరణి ఏమిటి? బీజేపీ విజయం సాధించకుండా రోడ్ల మీద పోరాటం చేస్తామని చెప్పక చెబుతున్నాయి. ఇటీవలి సంఘటనలన్నీ ఇందుకు సంబంధించినవే. ఢల్లీిలో రైతుల పేరిట ఖలిస్తానీలు వీరంగం, హల్ద్వానీ ఉదంతం, ఉత్తరప్రదేశ్‌లో మత గురువు తౌకీర్‌ ఆందోళనల పిలుపు. ఇవన్నీ బీజేపీ ప్రభావం తగ్గించేందుకే.  అయోధ్యలో బాలక్‌రామ్‌ ప్రతిష్ఠతో పెరిగిన మోదీ గ్రాఫ్‌ కూడా వీరిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

ఢిల్లీలో మళ్లీ ‘రైతు’ ఆందోళన! ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమైనప్పటికీ అంతకు ముందే అక్కడ రైతుల పేరుతో ఖలిస్తానీలు తిష్ట వేశారు. 12వ తేదీ సాయంత్రం ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాలతో చర్చించింది. అంతా ఊహించినట్టుగానే చర్చలు విఫలమయ్యాయి. ఇక్కడ విషయం సమస్యకు పరిష్కారం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చడం. అందుకే చర్చల ఫలితాలతో నిమిత్తం లేకుండానే చలో ఢిల్లీ అంటూ ఆందోళనకు దిగారు. 2020-21లో ఏ నినాదాలతో ఆందోళనకు దిగారో, మళ్లీ అదే పాచిపాట వినిపిస్తున్నారు. వీరి ఆందోళనలో న్యాయం ఎంతో ప్రజలు ఇప్పటికే గ్రహించారు. రైతులను నడిరోడ్డు మీదే తూర్పార పడుతున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ అంతటా 144 సెక్షన్‌ విధించారు. ఆందోళన ఆరంభంలోనే పంజాబ్‌`హరియాణా శంభు సరిహద్దులలో పోలీసులు ఆందోళనకారుల మీద టియర్‌ గ్యాస్‌ ప్రయోగించవలసి వచ్చింది. ఇది ఏ మలుపు తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. ఒకటి నిజం. లోక్‌సభ ఎన్నికల వేళ టూల్‌కిట్లు (కుట్ర పథకాలు) వేగంగా తెరుచుకుంటున్నాయి.

త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో బల్లగుద్ది మరీ చేసిన ప్రకటనతో ప్రతిపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ పడిరది. వాస్తవానికి ఆ సత్యం వారికి తెలిసిన విషయమే. పైగా ప్రధాని అంత ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. అందుకే మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు తెరతీశారు. వారికి మోదీ సామర్ధ్యం పట్ల గల ద్వేషం దేశం పట్ల ద్వేషంగా మారడం క్షమార్హం కానిది. మేము గతంలో చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ విధానాలను భగ్నం చేయడానికీ, భారతదేశ సమగ్రతను చెదరగొట్టడానికి మధ్య వ్యత్యాసాన్ని చాలా విపక్షాలు పూర్తిగా విస్మరించాయి. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. మోదీ కులం గురించి మాట్లాడి రాహుల్‌ గాంధీ బొక్క బోర్లా పడ్డారు. ఇందులో విజ్ఞత ఏమిటో జనం గమనించారు. ఇండీ కూటమి ఘోర వైఫల్యం తెచ్చిన తలవంపుల నుంచి కూడా వారు కోలుకోలేరు. తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ పరిణామం చెందడాన్ని ప్రతిపక్షాలు సహించలేక పోతున్నాయి. ఆయనను నిలువరించాలని గత దశాబ్ద కాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ అవే పాత పాచికలతో ఎన్నికల వేళ విపక్షాలు, వాటి తైనాతీలు, భారత వ్యతిరేక అంతర్జాతీయ శక్తులు మళ్లీ ప్రయత్నం ప్రారంభిం చాయి. గతంలో జరిగిన  సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలే ఇందుకు సాక్ష్యం. నిజాన్ని కప్పిపెట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టడం ప్రతిపక్షా పార్టీలకు నిత్యకృత్యంగా మారింది. వారు ఈ ఆందోళనలను చేపట్టేందుకు విదేశీ శక్తుల నుంచి కూడా నిధులు వస్తున్న విషయం ఆ ఘటనల విచారణలో తేలిన సంగతి మనందరికీ తెలిసిందే.

 తాజాగా దేశంలో చోటు చేసుకుంటున్న ఘటనలను కూడా ఈ దృక్పథంలోనే చూడవలసి ఉంటుంది. హల్ద్వానీలో హింస, తాజాగా పంజాబ్‌ రైతుల ముసుగులో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఖలిస్తానీలు చేస్తున్న డిమాండ్లు, నిరసనలు, దక్షిణాన తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీ అసెంబ్లీలో జాతీయగీతాన్ని అవమానించి తమ వేర్పాటువాద వైఖరి బయటపెట్టుకోవడం, ఇందుకు తోడుగా కోయంబత్తూరు బాంబు పేలుళ్లకు కారకులైన మైనార్టీ వర్గానికి చెందిన నిందితులను ఓట్ల మీద దృష్టితో జైలునుంచి వదిలిపెట్టడం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా పాల్పడుతున్న దేశ వ్యతిరేక చర్యలే.

తాజాగా పంజాబ్‌ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. దేశ వ్యతిరేక గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను వంటి ఖలిస్తానీలు ఇచ్చే నిధులతోనే వీరి కార్యక్రమాలు జరుగుతుంటాయన్నది జగమెరిగిన సత్యం. నాడే, వారు రైతాంగ చట్టాలను ఆమోదించి ఉంటే, వారు నేడు తమ ఉత్పత్తులకు సరైన ధర పలకడం లేదంటూ రోడ్లెక్కవలసి వచ్చేది కాదు. నిజానికి, హరిత విప్లవంతో అత్యంత లబ్ధి పొందిన రాష్ట్రం పంజాబ్‌, ఇప్పటికీ అత్యధిక పంటలు పండిరచే రాష్ట్రంలో దళారులను తొలగించి రైతులు నేరుగా లబ్ధి పొందేలా రైతు చట్టాలను రూపొందించడం వారికి నచ్చలేదు. అందుకే, గత నిరసనలు జరిగాయి. ఖలిస్తానీ నాయకులను ప్రభుత్వం వారి హద్దులో ఉంచుతున్న నేపథ్యంలో వారు తమ అక్కసును ఇలా బయిట పెట్టుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది.

 మెర్సిడీస్‌ బెంజ్‌కార్లలో బయలుదేరిన ఆ నిరుపేద రైతులు తమకు నెలకు రూ. 10వేల పెన్షను, కనీస మద్దతు ధరపై లిఖితపూర్వకంగా హామీ సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారు దేశ రాజధానికి బయలుదేరారు. వాస్తవానికి గత నిరసన ప్రదర్శన సమయంలో ప్రభుత్వం వారి డిమాండ్లు కొన్నింటికి ఆమోదించింది. అయితే, ఇంతకాలమూ ఊరుకొని, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని తెలిసి వారు రాజధానికి బయలుదేరడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థంకాని వారు బహుశ ఎవరూ ఉండరు. గతంలో వారు రాజధాని రోడ్లను దిగ్బంధనం చేసి ప్రజలకు, వ్యాపారాలకూ ఎంతో నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. దానితో పాటుగా ఆ సమయంలో జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు అప్పుడే వెలుగులోకి వచ్చాయి.

ప్రధాని రణభేరి

17వ లోక్‌సభలో ప్రధాని మోదీ ఆఖరి ఉపన్యాసం చాలా ప్రసిద్ధి చెందింది. మోదీ ఏం మాట్లాడారు?

ఆయన అమ్ముల పొది నిండా వ్యంగ్యాస్త్రాలే. ప్రతి శరమూ ప్రతిపక్షులను పార్టీలని చీల్చి చెండాడే శక్తిగలదే. అసలే సవ్యసాచి! ఇంకేమిటి? అది దేశం మొత్తాన్ని కదిల్చివేసింది. విపక్షం కూసాలు కుదిపేసింది. పార్లమెంటు అనే రణరంగంలో ఆయన ఏ ఒక్క పార్టీనీ వదలకుండా తన శరాలను సాధించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పై అయితే, బ్రహ్మాస్త్రాన్ని సంధించినట్టే అనిపించింది. ఉత్తర దక్షిణ విభజన కుట్ర, కుల గణన వంటి విషయాలలో ప్రతిపక్షాల విధ్వంసక వైఖరిని తూర్పార పట్టారాయన. తమ ప్రభుత్వం వేయేళ్ల ప్రగతికి పునాదులు వేస్తోందని అన్నారాయన. అందుకు మూలం నెహ్రూ, ఇందిరల వలె కాకుండా ఈ దేశ ప్రజల కష్టించే తత్త్వం మీద తమకు నమ్మకం పెంచుకోవడమేనని ఆయన ఎలుగెత్తి చాటారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విశ్వరూపం ప్రదర్శిం చారు. వారికి స్వస్వరూప జ్ఞానం కలిగించారు. ప్రతిపక్షాల ఉద్దేశాలు ఏమిటో, వారు చేసిన ప్రజా వ్యతిరేక పనులు ఏమిటో వారికి, ప్రజలకూ పార్లమెంటు సాక్షిగా బహిరంగం చేశారు. ఒకరకంగా సార్వత్రిక ఎన్నికలకు శంఖం పూరించారు. కేవలం తమ ప్రభుత్వ విజయాలనే కాక, కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు, అవినీతి, పాలనలో అలసత్వం సహా అన్నివైపులా వారి వైఫల్యాలను పట్టిచూపించడం ద్వారా తమకు ఎదురు లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 17వ లోక్‌సభలో ప్రధాని చివరి ప్రసంగం ఇదే కావడంతో ఆయన ఎటువంటి తటపటాయింపూ లేకుండా ‘తాము గెలవడంపై కాక, తనను ఓడిరచడంపై మాత్రమే దృష్టిపెట్టిన’ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ప్రతిపక్షాలపై విమర్శను గుప్పిస్తూ, మేం ఆ భవనంలో (పాత పార్లమెంటు) కూర్చున్నప్పుడు, దేశ ప్రధాని గొంతుకను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. నేడు కూడా మీరు (నా మాట) వినేందుకు రాలేదు. కానీ, నా మాటలను అడ్డుకోలేరు. దేశ ప్రజలు నా గొంతును మరింత బలోపేతం చేశారు. నేను కూడా ఈసారి తయారయ్యే వచ్చాను అంటూ హెచ్చరిక చేశారు.

మోదీ చేసిన ప్రసంగంలో ఈసారి కూడా అధికారం తమదేననే ఆత్మవిశ్వాసం ప్రధానంగా ప్రతిధ్వనించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వయంగా కనీసం 370 స్థానాలను, మొత్తంగా ఎన్డీయే 400 పైచిలుకు స్థానాలను సాధిస్తుందని, తన మాటలు వాస్తవ రూపం దాల్చ డానికి ఎక్కువ కాలం పట్టదని, మహా అయితే 100 `125 రోజులంటూ పార్టీ ఎంపీల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలోని రానున్న ఎన్డీయే ప్రభుత్వం రానున్న వెయ్యేళ్లపాటు దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకుంటుందని తమ అజెండాను కూడా సభలోనే స్పష్టం చేశారు.

నిజానికి బీజేపీ ఈ లక్ష్యాన్ని సాధించే దిశలోనే పనిచేస్తోంది. వారు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడమే కాక, భారతదేశం ఒక నాగరికతా దేశమని, మనం పాశ్చాత్య దేశాలనుంచి కాక మన సనాతన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పునర్వైభవాన్ని సాధించ వచ్చనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచీ సెక్యులరిజం బరువును మోస్తున్న దేశంలోని మెజారిటీ ప్రజలకు ఇది సాంత్వన కలిగిస్తోందన్నది నిర్వివాదం. ఎక్కడా, రాజ్యాంగస్ఫూర్తిని ఉల్లంఘించకుండా, నిర్ణయాలు తీసుకుని, ప్రజల మన్ననలు పొందడం ప్రతిపక్షాలను విలవిల్లాడిస్తోంది. అందుకే వారు మోదీని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా ఇండి కూటమిని కట్టినా, అంతిమంగా సరైన పునాదిలేని ఆ సంఘటన విచ్ఛిన్నమైపోతున్న తీరును చూస్తున్నాం.

దేశం కూడా మానవ శరీరం వంటిదేనంటూ, దేశం పనితీరును శరీర పని తీరుతో పోల్చారు. శరీరంలోని ఒక్క అంగానికి దెబ్బతగిలినా, అది శరీరాన్నంతా ప్రభావితం చేసినట్టు ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా, ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించలేమన్నారు. దేశమంటే కేవలం భౌగోళిక ప్రదేశం కాదని, ఒక ప్రాంతంలో బాధ ఉంటే దానిని అందరూ పంచుకోవాలన్నారు. ఒక్క అంగం వికలమైనా, మొత్తం శరీరాన్ని అంగవైకల్యం చెందిందిగా ముద్రవేస్తారనే విషయాన్ని గుర్తు చేస్తూ, అలాగే దేశాభివృద్ధి కూడా అని, కనుక మనం దేశాన్ని ముక్కలు ముక్కలుగా కాక ఏకభూభాగంగా చూడాలని ఉద్బోధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉత్తర, దక్షిణమంటూ దేశాన్ని విభజిస్తున్న వారిపై మండిపడ్డారు. హిమాలయాలను ఉదాహరణగా తీసుకుంటూ, అక్కడ నుంచి ప్రవహించే నదులను ఇతరులతో పంచుకోనంటే ఏం చేస్తారు? బొగ్గు అధికంగా ఉన్న రాష్ట్రాలు తాము దానిని వేరేవారితో పంచుకోమంటే, దేశం ఎలా పని చేస్తుందన్నారు. ఇది ఎక్కడ ఆగుతుందని ప్రశ్నించారు? ఈశాన్య రాష్ట్రాలు కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ను తాము ఇతర ప్రాంతాలతో పంచుకోమని ఉంటే అప్పుడేం జరిగేదని ఆయన ఆగ్రహంగా అడిగారు. కానీ ఇప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేసే యత్నం జరుగుతోందని, ‘హమారా టాక్స్‌, హమారా మనీ’ అంటూ ఏం భాష మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇటువంటి కొత్త కథనాలను వ్యాప్తి చేయడం మానుకొని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు.

ప్రత్యేకంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆ పార్టీ దిక్కు తోచని స్థితిలో ఉందని, ఎన్నో దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రస్తుతం మరికొన్ని దశాబ్దాలు ప్రతిపక్ష స్థానంలో ఉండేందుకు నిర్ణయించుకున్నట్టుందంటూ చురకలు వేశారు. ప్రజలు మీ కోరికను మన్నించి, అక్కడే ఉంచుతా రంటూ నవ్వుతూనే వాతలు పెట్టారు. అంతేనా, మీరు ఈ దిశగా మరిన్ని విజయాలను సాధించి, పార్లమెంటులో సాధారణ ప్రజలు కూర్చునే గ్యాలరీల్లోకి మీ స్థానాన్ని మార్చుకుంటారంటూ వ్యంగ్యంగా చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ దళితులకు, వెనుకబడిన కులాలవారికీ వ్యతిరేకమంటూ, జవాహర్‌లాల్‌ నెహ్రూ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకమని ధ్వజమెత్తారు. ప్రధానిగా ఉన్న నెహ్రూ నాటి ముఖ్యమంత్రులకు ఈ విషయాన్నే పేర్కొంటూ 1961లో రాసిన లేఖను ఆయన సభకు చదివి వినిపించారు. ఓబీసీలకు ఎన్నడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్‌ సామాజిక సంక్షేమం గురించి నీతులు చెప్పకూడదంటూ మండిపడ్డారు. వారు రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ, నాడు వారికి రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకుని, ఎప్పటికప్పుడు వారికి ప్రమోషన్లు ఇచ్చి ఉంటే, వారు ఇక్కడ ఉండి ఉండేవారని ప్రధాని మోదీ అన్నారు. తమ కుటుంబంలోని వారికి తప్ప సాధారణ వర్గంలోని పేదలకు కానీ, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు గానీ భారతరత్న ఇవ్వడాన్ని కూడా పరిగణించని కాంగ్రెస్‌ సామాజిక న్యాయం గురించి నీతులు చెప్తోందని విమర్శిస్తూ, తమకే గ్యారెంటీ లేని నాయకులు మోదీ గ్యారెంటీపై ప్రశ్నలు లేవనెత్తు తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని ఈ విషయాన్ని పార్లమెంటు ఇరు సభల్లోనూ లేవనెత్తడం గమనార్హం.

నెహ్రూ, ఇందిరలపై వ్యంగ్యాస్త్రాలు

 అలాగే, నెహ్రూ, ఇందిరకు భారతీయుల సామార్ధ్యాలపై ఉన్న చిన్న చూపును సోదాహరణంగా వివరించి, విమర్శించారు. అమెరికా, చైనా ప్రజలతో పోలిస్తే భారతీయులు బద్ధకస్తులని, తెలివైన వారు కాదన్నది నెహ్రూ అభిప్రాయమన్నారు. ఎర్రకోటపై నుంచి ఉపన్యసిస్తూ, ‘భారతీయులకు సాధారణంగా కష్టించి పని చేసే అలవాటు ఉండదు, మనం ఐరోపా లేదా జపాన్‌ లేదా చైనా లేదా రష్యా లేదా అమెరికా ప్రజలంతగా పనిచేయం’ అంటూ నాటి ప్రధానిగా జవాహర్‌లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఆయన కుమార్తె, ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆలోచనలు కూడా భిన్నమైనవి ఏం కాదంటూ, భారతీయులు కష్టాల నుంచి పారిపోతా రంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

ఎన్నో దశాబ్దాలు అధికారంలో ఉన్న నెహ్రూ, ఇందిర కాంగ్రెస్‌ ఆలోచనలకు, సిద్ధాంతాలకు కాలం చెల్లిపోయిందని, దానితో వారు తమ పనిని ఔట్‌సోర్సింగ్‌ చేసుకుంటున్నారంటూ, ఆ పార్టీ అలా పతనం అయిపోవడం తమకూ బాధాకరంగా ఉందని, అందుకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈసారి కాంగ్రెస్‌ నలభై స్థానాలు కూడా దాటదంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు మీ 40 స్థానాలను కాపాడుకోవాలని ప్రార్థిస్తానంటూ మోదీ ఆ పార్టీ పరిస్థితిని పట్టి చూపారు.

ప్రారంభం కాలేని స్టార్టప్‌ యువరాజు అంటూ రాహుల్‌ గాంధీని ఎత్తి పొడిచారు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీని స్టార్టప్‌గా ముందుంచినా, అది మాత్రం ‘ప్రారంభం కాలేనిది’ (నాన్‌` స్టార్టర్‌) అని, ఆ స్టార్టప్‌ కదలదు, ప్రారంభం కాదని పరిహసిం చారు. ఒకే ఉత్పత్తిని పదే పదే ప్రారంభించే ప్రయత్నంలో కాంగ్రెస్‌ పార్టీయే మూతపడేలా ఉందంటూ లోక్‌సభలో కూడా ఆయన చురకలు వేశారు.

రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసంగించిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను లక్ష్యంగా చేసుకుంటూ, ఆయనకు ఇంత వాక్‌స్వాతంత్రం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా అనిపించిందని, అయితే, ఎప్పుడూ ఇక్కడ ఉండే ఇద్దరు కమెండోలు గైర్హాజరు కావడమే అందుకు కారణమని గుర్తించానని అన్నారు. బహుశ ఖర్గేజీ ‘ఐసా మౌకా ఫిర్‌ కహా మిలేగా’ (ఇలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుంది) అనే పాట విని ఉంటారంటూ ఆయనను పరిహాసం చేశారు. అంపైర్లు, కమెండోలు లేకపోవడంతో ఆయన సిక్సర్లు, బౌండరీలు కొట్టారంటూ కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత ప్రజస్వామ్యాన్ని పరోక్షంగా పట్టి చూపారు. లోక్‌సభలో తమకు లభించని వినోదాన్ని ఖర్గేజీ ఇక్కడ పంచినందుకు ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నానంటూ ప్రధాని వ్యంగ్యోక్తిని విసిరారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఒక్కొక్కదాన్నే ఆయన ఉభయసభలో ఎత్తిచూపి విమర్శించారు. ‘మన దేశంలో ఎంతో భూభాగానికి శత్రువులకు వారు అప్పగించారు, దేశ సైన్యాన్ని ఆధునీకరించడం ఎప్పుడో మానేసిన పార్టీ నేడు మాకు జాతీయ, అంతర్గత భద్రత గురించి ఉపన్యాసాలనిస్తోందంటూ’ విరుచుకుపడ్డారు.

ఆర్థికరంగంలో కాంగ్రెస్‌ సాధించిన ప్రగతిని గురించి కూడా ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు. పదేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థను 12వ స్థానం నుంచి 11వ స్థానానికి కాంగ్రెస్‌ తెచ్చిందని, తాము కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తెచ్చామని చెప్తూ, ఆర్థిక విధానాల గురించి మాకు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సభకు వస్తోందంటూ ఎత్తిపొడిచారు.

Bengal guv visits trouble-torn Sandeshkhali; Smriti Irani hits out at  Mamata | Kolkata - Hindustan Timesకాంగ్రెస్‌ పార్టీ వ్యాప్తి చేసిన కథనం ఫలితంగా, భారతీయ సంస్కృతి, విలువలపై విశ్వాసం కలిగిన వారిని ఆత్మ న్యూనతాభావం కలిగిన వారిగా చూడటం మొదలు పెట్టారన్నారు. ఈ కథనం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రపంచానికి తెలుసంటూ, ‘మేడిన్‌ ఫారిన్‌’ అన్నది అంతస్తుకు చిహ్నంగా మార్చారంటూ మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులు ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, మాట్లాడలేరంటూ ఎత్తి పొడిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ‘కాన్సిల్‌ (రద్దు) సంస్కృతి’ని అనుసరిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ కాన్సిల్‌ సంస్కృతిలో చిక్కుకుపోయింది, దేశం సాధించిన విజయాలను, ప్రగతిని కాన్సిల్‌ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంది. మేం మేకిన్‌ ఇండియా అంటాం, కాంగ్రెస్‌ కాన్సిల్‌ అంటుందిÑ మేం ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటాం, కాంగ్రెస్‌ కాన్సిల్‌ అంటుంది, మేం వోకల్‌ ఫర్‌ లోకల్‌ అంటే కాంగ్రెస్‌ కాన్సిల్‌ అంటుంది, మేం వందేభారత్‌ రైలు అంటాం, కొత్త పార్లమెంటు భవనం అంటాం, కాంగ్రెస్‌ కాన్సిల్‌ అంటుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, ఇవి మోదీ విజయాలు కావు, ఇవి దేశపు ప్రగతికి చిహ్నాలు,’’ అంటూ మండిపడ్డారు. దేశం సాధించిన విజయాలను, పురోగతి గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలలోని డొల్లతనాన్ని ప్రధాని బయటపెట్టారు.

గాంధీ కుటుంబం చుట్టూనే వంశపారంపర్య రాజకీయాలను కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్నట్టు ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. వంశపారంపర్య రాజకీయాలు, పాలనలో వైఫల్యాలే కాంగ్రెస్‌ పార్టీని వదలని గతకాలపు భూతాలంటూ, ప్రతిపక్షంగా తమ పార్టీ, ఇతర పార్టీల దుస్థితికి కాంగ్రెసే కారణమని ధ్వజమెత్తారు. తెలివైన నాయకులని పార్టీ ఎదగ నివ్వలేదని, తనకే కాక ప్రతిపక్షానికి, పార్లమెంటుకు, దేశానికీ కూడా కాంగ్రెస్‌ చాలా హానిచేసిందని మోదీ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కట్టి బెదిరించబోయినా, దానికి రూపకర్తగా ఉన్న నితీష్‌ కుమార్‌ బీజేపీ గూటిలో చేరినా, టిఎంసి అధినేత్రి మమత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గొంతెత్తడం పెద్ద పరిణామమని అన్నారాయన.

యూపీఏ విధానపరమైన పక్షవాతం

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం గతంలో చేసిన కంతలన్నింటినీ తాము నింపా మంటూ, మూడవ విడత తాను పగ్గాలు చేపట్టి నప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడాన్ని చూస్తారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మూడు దశాబ్దాలలో దేశ జీడీపి మూడవ అతిపెద్దదిగా అవతరిస్తుందంటూ 2014లో నాటి ఆర్థికమంత్రి పి. చిదంబరం ప్రకటించిన విషయాన్ని పట్టి చూపుతూ, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అనంతరం, తన ప్రభుత్వకాలంలో వివిధ పథకాలు సాధించిన లక్ష్యాలను ఏకరువు పెడుతూ, అదే కాంగ్రెస్‌ పాలన అయి ఉంటే ఈ సాధనకు ఎంత సమయం పట్టి ఉండేదని ప్రశ్నించారు.

ఒకవైపు తన ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టడంతో పాటు, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు దేశాన్ని భ్రష్టుపట్టించిన వైఖరిని ఉతికి ఆరేసిన తీరుతో ప్రతిపక్షాలన్నీ ఖంగుతిన్నాయి. ప్రధాని మోదీపై ద్వేషం మినహా దేశానికి ఉపయోగపడే సానుకూల వాదన లేని ప్రతిపక్షాలు ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇసక తక్కెడ పేడ తక్కెడ మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి. ఎప్పటిలాగే కాంగ్రెస్‌ కూడా, ‘మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు, మా ఇంటికొస్తే మాకేమి తెస్తావ్‌’ అన్న చందంగా ప్రవర్తిసున్నందున ఘనంగా ప్రారంభించిన ఇండి కూటమి మూడునాళ్ల ముచ్చటవుతోంది.

బెదిరింపు రాజకీయాలు

వీటికి తోడుగా ఇత్తెహాద్‌`ఎ`మిల్లత్‌ అధిపతి తౌకీర్‌ రజా ఖాన్‌ వంటి మతనాయకులు ముస్లింలను మరింత రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది. తాము దేశాన్ని ప్రేమిస్తున్నాం కనుకనే సంయమనం పాటిస్తున్నామని, తాను ఒక్క పిలుపు ఇస్తే దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందంటూ ఆయన ప్రభుత్వాన్ని బెదిరించడం ‘హేట్‌ స్పీచ్‌’ కిందకి రాదని ఎవరైనా అంటే, అది అబద్ధమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ముస్లింలు కాశీలోని జ్ఞాన్‌వాపీని, మధురలను హిందువులకు వదిలిపెట్టాలంటూ చేసిన ప్రకటనతో మండిపడుతూ, జైల్‌ భరో కార్యక్రమానికి ఖాన్‌ పిలుపునివ్వడం, పోలీసులను ఆయనను నిర్బంధం లోకి తీసుకోవడంతో వేలాదిమంది అతడి అనుచరులు బరేలీలో రోడ్లపైకి వచ్చి హడావిడి సృష్టించారు.

మరోవైపు బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కూడా మైనార్టీలుగా చెప్పుకునే ఈ వర్గం చేస్తున్న దుర్మార్గాలు బయటకురావడం గమనార్హం. గత నెలలో సందేశ్‌ఖాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ బ్లాక్‌ స్థాయి నాయకుడు షేక్‌ షాజహాన్‌ ఇంటిపై సోదాలు జరిపేందుకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై ముస్లింలు జరిపిన దాడి ఎవరి స్మృతిపథం నుంచీ చెరిగిపోలేదు. ఈ హంగావ ూలో షాజహాన్‌ షేక్‌ తప్పించుకొని, సరిహద్దులు దాటి ఉంటాడనే వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోకి అక్రమంగా చొరబాటుదారులు ప్రవేశించి, స్థిరపడుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు కూడా తమ ఓట్ల ప్రయోజనాల కోసం వారిని చూసీ చూడనట్టుగా వదిలివేయడమే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నది. సందేశ్‌ఖాలీలో ముస్లింలు హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిపై జరుపుతున్న అత్యాచారాలు వింటే ఎవరి హృదయమైనా ద్రవించకమానదు. గ్రామంలోని అందమైన యువతి, వివాహిత అయినా సరే, వారి కుటుంబసభ్యుల ఎదురుగానే బలవంతంగా ఎత్తుకుపోవడం, తృణమూల్‌ కార్యాలయంలో యథేచ్ఛగా వారిపై అత్యాచారాలు చేయడం నిత్యకృత్యంగా మారిన విషయాన్ని బాధితులే మీడియా ఎదుటికి వచ్చి చెప్పుకోవడంతో, అక్కడ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చోవడం వల్ల ఏర్పడినవేనన్నది నిర్వివాదం.

రైతులను అడ్డం పెట్టుకుని అల్లర్లు, ముస్లిం మతోన్మాదులను అడ్డం పెట్టుకుని మతకల్లోలాలు రేపాలని ఎన్నికల ముందు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది. బీజేపీని అధికారంలో నుంచి దించాలంటే ఇది మార్గం కాదు. అందుకు రాజ్యాంగబద్ధమైన పద్ధతి అవసరం. ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. రోడ్ల మీద తేల్చుకుంటా మంటే సాధ్యం కాదు. ప్రజలు మోదీ వైపు ఉన్నారు. సర్వేలు ఇవే చెబుతున్నాయి. ఈ వాస్తవాన్ని హుందాగా అంగీకరించడం అవసరం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
Instagram