ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పర్యావరణ కాలుష్యపు విషాన్ని తగ్గించేందుకు దేశాలు మార్గాలను అన్వేషిస్తుండగా, భారత్ సంప్రదాయ మార్గాలను అనుసరించేందుకు ప్రయత్నిస్తోంది. శతాబ్దాల కిందటే చోళులు మన నావికా శక్తిని ప్రపంచపటంలో అగ్రాన ఉంచడమే కాదు, సుదూర తీరాలకు మన వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని, సంస్కృతిని వ్యాపింపచేసిన విషయం మనకు తెలుసు. ఆ పద్ధతిలోనే సముద్రమార్గం ద్వారా వాణిజ్యాన్ని శక్తిమంతం చేసేందుకు గత దశాబ్ద కాలంగా భారత్ యత్నిస్తోంది. నౌకాదళ శక్తిని, ఓడరేవుల సామర్ధ్యాన్ని పెంచుకోవడం ద్వారా వాణిజ్యాన్ని పెంపొందించాలని భారత్ తీసుకుంటున్న చొరవలు ప్రశంసనీయంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మారిటైం ఇండియా విజన్ (ఎంఐవి) 2030 ప్రకటన అన్నది స్థిరమైన పద్ధతులను అవలంబించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రక్షణ కవచంగా ఉంటూ రేవులను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
వందల సంవత్సరాల క్రితమే తూర్పును, పశ్చిమాన్ని అనుసంధానం చేస్తూ సిల్క్ రూట్‌గా చెప్పుకునే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని ఉత్తేజితం చేసింది. ప్రపంచంలోని పలు దేశాల అభివృద్ధిలో అది కీలకపాత్ర పోషించింది. ఇదే పంథాలో భారతదేశ చొరవతో భారత్-మధ్య ప్రాచ్యం- యూరప్ ఆర్థిక కారిడార్ నిర్మాణానికి అంగీ కరించారు. ఈ అడుగు 21వ శతాబ్దిలో ప్రపంచ నౌకా రవాణా పరిశ్రమను పరివర్తనకులోను చేయనుంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు 2023ని ప్రారంభించారు.
ముంబైలో జరిగిన దేశంలోని అతి పెద్ద నౌకా రవాణా సదస్సు మూడో ఎడిషన్ గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు 2023ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత నౌకారవాణా రంగం కోసం బ్లూ ఎకానమీ బ్లూ ప్రింట్ ‘‘అమృత్ కాల్ విజన్ 2047’’ని ఆవిష్కరించారు. భవిష్యత్ ప్రణాళికతో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.23,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నీ భారత సాగర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం ‘అమృత్ కాల్ విజన్ 2047’ తో అనుసంధానమై ఉన్నాయి.
ప్రధాని మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, అధిక శాతం ప్రపంచ వాణిజ్యం సముద్రమార్గంలోనే సాగిందని ప్రతీ ఒక్కరికీ తెలుసునన్నారు. కరోనా అనంతరం నేడు యావత్ ప్రపంచానికి విశ్వసనీయమైన, అందరికీ ఉపయోగ కరమైన సరఫరా వ్యవస్థలు కీలకంగా మారాయని, భారత సాగర రవాణా సామర్థ్యాలు ఎంత బలంగా ఉంటే దేశం, ప్రపంచం కూడా అంత భారీగా ప్రయోజనం పొందాయనేందుకు చరిత్ర సాక్షి ఆయన పేర్కొన్నారు.
భారతదేశం చొరవతో భారత-మధ్యప్రాచ్య-యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ప్రపంచ సమాజం అంగీకరించింది. ఈ కారిడార్‌తో వాణిజ్య వ్యయాలు తగ్గడమే కాదు, సదుపాయాలు కూడా విస్తరిస్తాయి. ఈ కారిడార్ నిర్మాణం అనంతరం పర్యావరణానికి హాని అతి తక్కువగా ఉంటుంది. భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
వచ్చే 25 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న ప్రణాళికతో నేడు భారతదేశం కృషి చేస్తోంది. సముద్ర రవాణా ద్వారా వాణిజ్యాన్ని సరళతరం చేయడం లక్ష్యంగా భారతదేశం ఆ రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెస్తోంది. యావత్ నౌకారవాణా మౌలిక వసతులు పటిష్టం చేసేందుకు ఎంతో శ్రమించి చర్యలు తీసుకుంటోంది. గత దశాబ్ద కాలంలో భారత ప్రధాన ఓడరేవుల సామర్థ్యం రెట్టింపయింది. కంటైనర్ నౌకల రవాణా సమయం 2014లో 42 గంటలుండగా 2023 నాటికి 24 గంటలకు తగ్గింది. పోర్టులతో అనుసంధానత పెంచేందుకు వేలాది కిలోమీటర్ల కొత్త రోడ్లు నిర్మించారు. సాగర్‌మాల ప్రాజెక్టుద్వారా కోస్తా ప్రాంతాల్లో మౌలిక వసతులు పటిష్టం చేస్తున్నారు.
సుసంపన్నత, పురోగతికి ఓడరేవులు అన్న భారత ప్రభుత్వ దృష్టికోణానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగానే ఓడరేవుల సామర్థ్యం పెరిగింది. గత దశాబ్ద కాలంలో కోస్తా సరుకు ట్రాఫిక్ రెట్టింపై తక్కువ ధరల్లో లాజిస్టిక్స్ అందుబాటులోకి వచ్చాయి. పదేళ్ల కాలంలో జాతీయ జలమార్గాల ద్వారా వస్తు రవాణా కూడా నాలుగు రెట్లు పెరిగింది. దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశ సామర్థ్యం, శక్తికి నిదర్శనమని మోదీ అన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచంలో అయిదో పెద్ద నౌకా నిర్మాణ దేశంగా మారనుంది. నౌకా రవాణాలో భాగస్వాములందరినీ ఒక్కటి చేసే దిశగా ప్రభుత్వం సంఘటిత వైఖరిని అనుసరిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో నౌకా నిర్మాణ, మరమ్మత్తు కేంద్రాలు నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. సాగర రవాణా వ్యవస్థలో నెట్ జీరో కార్బన్ వ్యూహం కోసం భారతదేశం కృషి చేస్తోంది.
ప్రపంచంలోని పెద్ద నౌకారవాణా నిర్వాహకు లందరూ భారతదేశానికి వచ్చి ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. గుజరాత్‌లోని ఆధునిక గిఫ్ట్ సిటీ షిప్ లీజింగ్‌ను పెద్ద పెట్టుబడి సేవగా ప్రవేశపెట్టింది. భారతదేశానికి విస్తారమైన కోస్తా ప్రాంతం, బలమైన నదీ వ్యవస్థ, సమున్నత సాంస్కృతిక వారసత్వం ఉన్నాయి. ఇవన్నీ సాగర పర్యాటకానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తాయి. దేశంలో సాగర జలాల ఆధారిత పర్యాటకరంగాన్ని ప్రోత్స హించడంలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్ సర్వీస్‌ను ప్రారంభించారు. దేశంలోని విభిన్న పోర్టుల్లో ఇందుకు సంబంధించిన పలు పథకాల అమలుకు భారతదేశం కృషి చేస్తోంది. ముంబైలో కొత్త అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, చెన్నైలలో ఆధునిక క్రూయిజ్ టెర్మినల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అత్యాధునిక మౌలిక వసతులతో ప్రపంచ క్రూయిజ్ హబ్‌గా మారే దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది.
మారిటైమ్ సదస్సులో నీటి రవాణా నుంచి మెరైన్ టూరిజంలో పెట్టుబడుల వరకు పలు అంశాలపై చర్చలు చోటు చేసుకున్నాయి.
రూ.23,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేయడంతో పాటు మరి కొన్నింటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీలో అన్ని వాతావరణ పరిస్థితులకు దీటైన తునా టెక్రా డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
– పిపిపి విధానంలో నూతనంగా అత్యాధునిక టెర్మినల్‌ను నిర్మించనున్నారు. భారత్-మధ్యప్రాచ్య-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఇఇసి) ద్వారా భారత వాణిజ్యానికి ఇది ముఖద్వారంగా ఉంటుంది.
– సముద్ర రవాణా రంగంలో ప్రపంచ, జాతీయ భాగస్వామ్యాల కింద చేపట్టే రూ.7 లక్షల కోట్లకు పైగా విలువ గల 300 అవగాహన పత్రాలను (ఎంఒయు) జాతికి అంకితం చేశారు.
– దేశంలోనే అతి పెద్దదైన సాగర సదస్సుకు యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా (సెంట్రల్ ఆసియా, మధ్యప్రాచ్యం, బిమ్ స్టెక్ ప్రాంతాలు సహా) దేశాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సిఇఒలు, వ్యాపార దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర భాగస్వాములు కూడా ఎన్నికయ్యారు.
– మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో భవిష్యత్ ఓడరేవులు, డీకార్బనైజేషన్, కోస్తా నౌకాయానం, అంతర్గత జల రవాణా, నౌకా నిర్మాణం, మరమ్మతులు, పునర్వినియోగం (రీసైక్లింగ్), ద్రవ్యం, పెట్టుబడి, బీమా, మధ్యవర్తిత్వం, సాగర భద్రత, సాగర పర్యాటక ఆధారిత భద్రత వంటి భిన్న అంశాలపై చర్చించారు.
– తొలి మారిటైమ్ ఇండియా శిఖరాగ్రం 2016లో ముంబయిలో జరిగింది. రెండో శిఖరాగ్ర సదస్సు 2021లో వర్చువల్ గా జరిగింది.
భారతీయ సముద్ర రంగం దూకుడు
వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఐ-పిఐ -ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచీ) నివేదిక-2023 ప్రకారం కంటైనర్ నిరీక్షించే సగటు కాలం 3 రోజుల స్థాయిని భారత్ సాధించింది. ఇది యుఎఇలో , దక్షిణాఫ్రికాలో 4 రోజులు కాగా, యుఎస్‌లో 7రోజులు, జర్మనీలో 10 రోజులుగా ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం కింద 2014 నుంచి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు దేశంలోని ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఓడరేవులు ఉత్పాదకత, డిజిటలీకరణ ద్వారా సరఫరా లంకె దృగ్గోచరతను మెరుగుపరిచేందుకు దేశం చేపట్టిన సంస్కరణల ఫలితంగా భారతీయ సముద్ర రేవుల వద్ద అతి తక్కువ కాలం నిరీక్షణ ఉంటుంది.
పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద సమన్వయ ప్రణాళిక, అమలు ద్వారా లోతట్టు ప్రాంతాలకు అనుసంధానతను మెరుగుపరచడంపై, సముద్రయాన రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టడం వల్ల అంతర్జాతీయ షిప్‌మెంట్స్ విభాగం ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతదేశం 22వ స్థానానికి ఎదిగింది. దేశపు లాజిస్టిక్స్ పనితీరు సూచీ స్కోర్ ప్రకారం 38వ స్థానంలో నిలిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం కింద విధాన సంస్కరణలు, నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడం, అధిక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వా మ్యాల ద్వారా రేవు సామర్ధ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టి, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. టర్న్ అరౌండ్ టైమ్ (ఓడలు రేవులో సరుకును దించే పక్రియకు పట్టే సమయం) విషయంలో భారతీయ రేవులు భారీ మెరుగుదలను నమోదు చేశాయి.
ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచీ (ఐ-పిఐ) నివేదిక- 2023లో ప్రచురించిన టర్న్ అరౌండ్ టైమ్ కొలమానంపై భారతీయ రేవులను ప్రపంచ స్థాయిలో పోల్చి చూస్తే, యుఎస్‌ఎ (1.5 రోజులు) , ఆస్ట్రేలియా (1.7 రోజులు), బెల్జియం (1.3 రోజులు) కెనడా (2.0 రోజులు), జర్మనీ (1.3 రోజులు), యుఎఇ (1.1 రోజు) సింగపూర్ (1.0 రోజు) రష్యన్ సమాఖ్య (1.8రోజులు), మలేషియా (1.0 రోజులు) ఐర్లాండ్ (1.2 రోజులు), ఇండొనేషియా (1.1రోజు) న్యూజిల్యాండ్ (1.1రోజు), దక్షిణాఫ్రికా (2.8 రోజులు) కంటే మెరుగ్గా భారతీయ రేవులలో టర్న్ అరౌండ్ టైమ్ 0.9 రోజులుగా ఉంది.
‘న్యూ ఇండియా సమాచార్’ నుంచి