– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

గత సంవత్సరం ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం సంచలనం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండితులపై ఉగ్రవాద ముష్కర మూకలు సాగించిన మారణకాండను ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులు, జిహాదీ మూకలు, కుహన లౌకిక రాజకీయ శక్తుల అమానుష అకృత్యాలను ప్రపంచం ముందుంచింది. ఆ సినిమాను అడ్డుకునేందుకు సెక్యులర్‌ ‌ముసుగులో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్, ‌ప్రాంతీయ కుటుంబ పార్టీలు, జిహాదీ అనుకూల రాజకీయశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేశాయో వేరే చెప్పనక్కరలేదు. అలాగే కొన్ని మీడియా సంస్థలు, కొందరు ‘మేధావులు’ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ, సంఘ్‌ ‌పరివార్‌ ‌ప్రయత్నిస్తున్నాయని విమర్శలతో విరుచుకుపడ్డారు.  సినీమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అరాచక శక్తులన్నీ ఏకమయ్యాయి. కోర్టులను ఆశ్రయించాయి. బాలీవుడ్‌ ‌దావూదులు, ఖాన్లు కత్తులు తీశారు. కుట్రలు చేశారు. అడ్డదారులన్నీ తొక్కారు. అంతిమంగా ధర్మం గెలిచింది. ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం విడుదలైంది. కశ్మీర్‌ ‌పండితుల యధార్థ వ్యథలను దేశం ముందుంచింది.

మళ్లీ అదే కథ

ఇప్పుడు మళ్లీ అదే కథ. కేరళలో మొదలై వేర్వేరు రాష్ట్రాలకు విస్తరిస్తున్నది. లవ్‌ ‌జిహాద్‌ ‌కథాంశంతో సుదీప్తో సేన్‌ ‌దర్శకత్వంలో విపుల్‌ అమృత్‌లాల్‌ ‌షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను అడ్డుకునేందుకు ఉగ్రవాద అనుకూల శక్తులు అన్ని విఫల ప్రయత్నాలు చేశాయి. నిజానికి విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకి వ్యతిరేకంగా విష ప్రచారం మొదలైంది. నల్లకోట్లు వేసుకున్న న్యాయవాదులు, జర్నలిస్టులు, కుహన లౌకికవాదులు, జిహాదీ అనుకూల వ్యక్తులు, శక్తులు కోర్టులను అశ్రయించాయి. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ సినిమాను నిషేధించాలని ప్రజా ‘హిత’ వ్యాజ్యాలు దాఖ లయ్యాయి. అయితే, పిల్‌ ‌వేసిన పెద్దలకు చివరకు కోర్టు మొట్టికాయలు తప్ప ఇంకేమి మిగల్లేదు.

కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే మద్రాస్‌ ‌హైకోర్టులో మరో పిల్‌ ‌దాఖలైంది. మద్రాసు హైకోర్టు అడ్మిషన్‌ ‌స్టేజీలోనే కేసును కొట్టేసింది. విడుదలకు సిద్ధమైన సినిమాపై చివరి గంటలో పిటిషన్‌ ‌దాఖలు చేయడం ఏంటని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. సినిమా చూడ కుండానే కోర్టు మెట్లెక్కడం ఏంటని ప్రశ్నించింది. అలాగే, గంటకు కోటి రూపాయలు ఫీజుగా పుచ్చుకునే ప్రముఖ న్యాయవాది కపిల్‌ ‌సిబాల్‌ ‌ద్వారా నేరుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అక్కడా చుక్కెదురైంది. ఈ సినిమాలో విద్వేష పూరిత ప్రసంగాలు, సన్నివేశాలు ఉన్నాయనీ, అందుకే విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్‌ ‌పూర్తయిందనీ, ఈ సమస్యను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని జస్టిస్‌ ‌జోసఫ్‌, ‌జస్టిస్‌ ‌నాగరత్న సూచించారు. ఇలా అవరోధాన్నిటినీ అధిగమించి, మే 5న ‘ది కేరళ స్టోరీ’ విడుదలైంది. విడుదలైన తొలి రోజునే ప్రకంపనలు సృష్టించింది.

ఏంటీ కథ

గతంలో ఆంఖేన్‌, ‌వక్త్, ‌నమస్తే లండన్‌ ‌వంటి మల్టీస్టారర్‌ ‌బాలీవుడ్‌ ‌చిత్రాలకు దర్శకత్వం వహించి, సింగ్‌ ఈజ్‌ ‌కింగ్‌ ‌వంటి చిత్రాలను నిర్మించిన విపుల్‌ అమృతలాల్‌ ‌షా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, ఈ చిత్రానికి ఆయన సృజనాత్మక దర్శకునిగా, సహరచయిత కూడా వ్యవహరించారు. ఆయనే ‘కేరళ స్టొరీ కథ కాదు. కల్పన అసలే కాదు. యధార్థ గాథల ఆధారంగా నిర్మించిన చిత్రం’ అని స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు, ఈ చిత్రంలో అసత్య సన్నివేశం ఏదైనా ఉంటే దాన్ని తొలగించేందుకు సిద్ధమని ప్రకటించారు. వాస్తవ కథ కావడంతో సెన్సార్‌ ‌బోర్డు ప్రతిచిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పది కట్లు వేసిన తర్వాతనే సెన్సార్‌ ‌బోర్డు ‘ది కేరళ స్టోరీ’కి సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు కూడా ప్రస్తావించాయని చిత్ర దర్శకుడు పేర్కొన్నారు. అంతేకాదు, కేరళకు చెందిన ఓ యువతి ఐఎస్‌ఐఎస్‌లో చేరి, సిరియా వెళ్లి ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌ ‌జైల్లో మగ్గుతున్న తన కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన రికార్డెడ్‌ ‌ప్రూఫ్స్ ఈ ‌కథకు ఆధారమని స్పష్టం చేశారు. కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేసి, ఐఎస్‌ఐఎస్‌లో చేర్చుకునే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని వివరించారు. కేరళ నుంచి 32,000 మంది మహిళలు మతమార్పిడి పాలై  అక్రమ రవాణాకు గురయ్యారని టీజర్‌లోనూ చూపించారు. ఈ చిత్రంలో ఆదాశర్మ కథానాయికగా నటించింది. ఇస్లాంలోకి మారి, వివాహం చేసుకుని, అక్రమ రవాణాకు గురైన షాలిని ఉన్నికృష్ణన్‌ ‌పాత్రను ఆమె పోషించింది.

కమ్యూనిస్టుల ఆందోళలు ఎందుకు?

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌మొదలు కుహన లౌకికవాదశక్తులన్నీ ఈ సినిమా విడుదలైతే లౌకికవాదం మైలపడిపోతుందని గగ్గోలు పెట్టారు. భూతల స్వర్గంగా భావించే కేరళలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సంఘ పరివార్‌ ‌సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయని ముఖ్యమంత్రి పినరయి.. తన పదవికే తలవంపులు తెచ్చేలా, నిరాధారమైన ఆరోపణలు చేశారు. విజయన్‌ ‌పలుకులకు కాంగ్రెస్‌ ‌పార్టీ వంత పాడింది. వాస్తవం ఏమంటే, పినరయి కంటే ముందు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న అదే ఎర్రపార్టీ (సీపీఎం) సీనియర్‌ ‌నాయకుడు, అచ్యుతానందన్‌ ‌కేరళలో లవ్‌ ‌జిహాద్‌ ‌పేరిట మతమార్పిడి జరుగుతోందని, ముఖ్యమంత్రి హోదాలోనే రాష్ట శాసనసభలో ప్రకటించారు. అంతేకాదు, లవ్‌ ‌జిహాద్‌ ఇలాగే మరో 20 ఏళ్లు కొనసాగితే కేరళ ఇస్లామిక్‌ ‌స్టేట్‌గా మారిపోతుందని కూడా హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ ‌చాందీ కూడా ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌నిజమని ఒప్పుకున్నారు. అంతకంటే ముఖ్యంగా కేరళ హైకోర్టు రాష్ట్రంలో ఆరు వేలకు పైగా లవ్‌ ‌జిహాదీ కేసులు తమ దృష్టికి వచ్చాయని స్పష్టం చేసింది. అయినా ఇంతవరకు వంతుల వారీగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్‌లు ఆ విషయాన్ని పట్టించుకోక పోగా లవ్‌ ‌జిహాద్‌ ఉదంతాలను కథగా మలిచి తెరకెక్కిస్తే తప్పంటున్నారు అదే కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్ ‌నాయకులు.

ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? అనేది కాదు. బాధిత మహిళలు 32 వేల మందా? 33 వేల మందా అనేది కూడా ప్రశ్న కాదు. కేరళలో లవ్‌ ‌జిహాద్‌ ‌పేరిట మత మార్పిడులు జరుగు తున్నాయా? లేదా? కేరళ మహిళలు ఐఎస్‌ఐఎస్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారా లేదా? మానవబాంబులుగా మారి మరణిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించుకుంటే వారికే ఈ సినిమా నిజమా? కట్టుకథా తెలిసిపోతుంది. అయితే, కుహన లౌకికవాద ముసుగులో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్ ‌నాయకుల నుంచి అంత నిజాయతీని ఆశించగలమా?

————–

హస్తం పార్టీ వైఖరి స్పష్టం

ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రస్తావించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ ‌పార్టీ నిజరూపాన్ని ప్రజల ముందుంచేందుకు ‘ది కేరళ స్టోరీ’ విషయంలో ఆ పార్టీ వైఖరిని ఉదాహరణగా చూపారు. తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన సినిమాను కాంగ్రెస్‌ ఎం‌దుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్‌ ఉ‌గ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ సినిమా విడుదల కాకుండానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌విమర్శించారు.

—————–

సెన్సార్‌ ‌కత్తిరింపులు

‘ది కేరళ స్టోరీ’ చిత్రం విషయంలో సెన్సార్‌ ‌బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంది. కథావస్తువు అత్యంత సున్నిత అంశం కావడంతో విభిన్న కోణాల్లో వడబోసి అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన పది సీన్లు తొలగించింది. సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌. అచ్యుతానందన్‌తో చేసిన ఇంటర్వ్యూ.. ఈ తొలగించిన సన్నివేశాల్లో ఒకటి. అలాగే మతోన్మాదులు హిందువుల దేవతల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీస్తాయంటూ సెన్సార్‌ ‌కత్తెర వేసింది.

About Author

By editor

Twitter
Instagram