గత కొన్నేళ్లుగా ఈశాన్య భారతంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న భాజపా ఈసారి మణిపూర్‌లో ఘనవిజయం సాధించింది. ఐదేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఈసారి సొంతంగా మెజారిటీ సాధించడం విశేషం. మొత్తం 60 స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 32 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. నేషనల్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (ఎన్‌పీపీ) 7, జనతా దళ్‌ ‌యునైటెడ్‌ 6, ‌నాగా పీపుల్స్ ‌ఫ్రంట్‌ 5 ‌స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు 10 చోట్ల గెలుపొందారు.

2017 ఎన్నికల తర్వాత భాజపా, నేషనల్‌ ‌పీపుల్స్ ‌పార్టీ, నాగా పీపుల్స్ ‌ఫ్రంట్‌, ‌లోక్‌ ‌జనశక్తి పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఎన్‌. ‌బిరెన్‌ ‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. మణిపూర్‌ ‌రాజకీయాల్లో పదిహేను సంవత్సరాల కాంగ్రెస్‌ ఆధిపత్యానికి 2017 చరమగీతం పాడింది. నాడు అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోయింది.

మణిపూర్‌ ‌గత చరిత్రను పరిశీలిస్తే.. ఇది ఒక సంస్థానం. 1949లో భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విలీనమైంది. విచిత్రమేమంటే భారత్‌లో విలీనానికి ముందే 1948లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ సంస్థానానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా, ప్రజాశాంతి అనే ప్రాంతీయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. భారత్‌లో విలీనమైన తర్వాత మణిపూర్‌కు ‘సి’ (సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ ‌స్టేట్‌) ‌స్థాయి కల్పించారు. తర్వాత టెరిటోరియల్‌ ‌కౌన్సిల్‌, ఆ ‌తర్వాత కేంద్రపాలిత ప్రాంత స్థాయిని కల్పించారు. 1972లో రాష్ట్ర హోదా పొందింది.

1948 తర్వాత ఈ రాష్ట్రంలో 1957లో ఎన్నికలు జరిగాయి. 1972 వరకు వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌లెఫ్ట్ ‌పార్టీల ఆధిపత్యమే కొనసాగింది. ఈ కాలంలో ఎవరికీ మెజారిటీ దక్కని పరిస్థితే కొనసాగడంతో సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ కుమ్ములాటలతో స్వల్పకాలమే అధికారంలో మనగలిగే పరిస్థితి నెలకొని ఉండేది. 1972లో రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత 60 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 40 మెయితీ వర్గ ప్రజలు ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు కాగా 20 చుట్టుపక్కల పర్వత ప్రాంత జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మధ్యప్రాంతం అత్యధిక జనసాంద్రత కలిగి ఉండగా, చుట్టూ విస్తరించి ఉన్న పర్వత ప్రాంత జిల్లాల్లో జనసాంద్రత పల్చగా ఉంటుంది. ఈ జిల్లాల విస్తీర్ణం రాష్ట్రం మొత్తం మీద 9/10 శాతం వరకు ఉంది. ఇంఫాల్‌ ‌లోయ ప్రాంతంలో మెయితీ వర్గానికి చెందిన ప్రజల శాతం అధికం కాగా పర్వత ప్రాంత జిల్లాల్లో నాగాలు, కుకీలు ఎక్కువ. ఈ విధంగా భౌగోళికంగా, జాతులపరంగా నెలకొన్న ప్రత్యేకత సహజంగానే ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ కేంద్రం ఇంఫాల్‌లో ఉండటంతో సుదూరంగా, పర్వత ప్రాంతాల్లో నివసించే నాగాలు, కుకీ ప్రజల్లో తాము వెనకబాటుతనానికి గురవుతున్నామన్న భావన ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే 1990 వరకు ఇక్కడ అస్థిర రాజకీయాలే రాజ్యమేలాయి. అసమ్మతులు, పార్టీల్లో చీలికలు, ప్రభుత్వాల కూల్చివేతలు అత్యంత 2017 ఎన్నికల తర్వాత భాజపా, నేషనల్‌ ‌పీపుల్స్ ‌పార్టీ, నాగా పీపుల్స్ ‌ఫ్రంట్‌, ‌లోక్‌ ‌జనశక్తి పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఎన్‌. ‌బిరెన్‌ ‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. మణిపూర్‌ ‌రాజకీయాల్లో పదిహేను సంవత్సరాల కాంగ్రెస్‌ ఆధిపత్యానికి 2017 చరమగీతం పాడింది. నాడు అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోయింది.

మణిపూర్‌ ‌గత చరిత్రను పరిశీలిస్తే.. ఇది ఒక సంస్థానం. 1949లో భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విలీనమైంది. విచిత్రమేమంటే భారత్‌లో విలీనానికి ముందే 1948లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ సంస్థానానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా, ప్రజాశాంతి అనే ప్రాంతీయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. భారత్‌లో విలీనమైన తర్వాత మణిపూర్‌కు ‘సి’ (సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ ‌స్టేట్‌) ‌స్థాయి కల్పించారు. తర్వాత టెరిటోరియల్‌ ‌కౌన్సిల్‌, ఆ ‌తర్వాత కేంద్రపాలిత ప్రాంత స్థాయిని కల్పించారు. 1972లో రాష్ట్ర హోదా పొందింది.

1948 తర్వాత ఈ రాష్ట్రంలో 1957లో ఎన్నికలు జరిగాయి. 1972 వరకు వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌లెఫ్ట్ ‌పార్టీల ఆధిపత్యమే కొనసాగింది. ఈ కాలంలో ఎవరికీ మెజారిటీ దక్కని పరిస్థితే కొనసాగడంతో సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ కుమ్ములాటలతో స్వల్పకాలమే అధికారంలో మనగలిగే పరిస్థితి నెలకొని ఉండేది. 1972లో రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత 60 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 40 మెయితీ వర్గ ప్రజలు ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు కాగా 20 చుట్టుపక్కల పర్వత ప్రాంత జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మధ్యప్రాంతం అత్యధిక జనసాంద్రత కలిగి ఉండగా, చుట్టూ విస్తరించి ఉన్న పర్వత ప్రాంత జిల్లాల్లో జనసాంద్రత పల్చగా ఉంటుంది. ఈ జిల్లాల విస్తీర్ణం రాష్ట్రం మొత్తం మీద 9/10 శాతం వరకు ఉంది. ఇంఫాల్‌ ‌లోయ ప్రాంతంలో మెయితీ వర్గానికి చెందిన ప్రజల శాతం అధికం కాగా పర్వత ప్రాంత జిల్లాల్లో నాగాలు, కుకీలు ఎక్కువ. ఈ విధంగా భౌగోళికంగా, జాతులపరంగా నెలకొన్న ప్రత్యేకత సహజంగానే ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ కేంద్రం ఇంఫాల్‌లో ఉండటంతో సుదూరంగా, పర్వత ప్రాంతాల్లో నివసించే నాగాలు, కుకీ ప్రజల్లో తాము వెనకబాటుతనానికి గురవుతున్నామన్న భావన ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే 1990 వరకు ఇక్కడ అస్థిర రాజకీయాలే రాజ్యమేలాయి. అసమ్మతులు, పార్టీల్లో చీలికలు, ప్రభుత్వాల కూల్చివేతలు అత్యంత సహజ పక్రియగా మారిపోయింది. ఈ పరిణామాలు చివరకు హింసకు దారితీసి 1990లో రాష్ట్రపతి పాలన విధించే వరకు వెళ్లింది.

అప్పటివరకు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్‌కు సవాలు విసురుతూ 1970ల్లో మణిపూర్‌ ‌పీపుల్స్ ‌పార్టీ ఏర్పడింది. విచిత్రమేమంటే ఇందులో సభ్యులంతా కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులే! మణిపూర్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాడిన మణిపూర్‌ ‌పీపుల్స్ ‌పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోలేకపోయింది.

1980 నుంచి 2010 మధ్యకాలాన్ని చొరబాట్ల కాలంగా చెప్పవచ్చు. మణిపూర్‌ ‌విలీనం భారత్‌లో ‘బలవంతంగా’ జరిగిందన్న భావన నేపథ్యం ఈ వేర్పాటువాదానికి మూలం. ఇందుకు ఆద్యంగా 1964లో ‘యునైటెడ్‌ ‌నేషనల్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌యుఎన్‌ఎల్‌ఎఫ్‌) ఏర్పడినప్పటికీ తర్వాతి కాలంలో మణిపూర్‌లో చాలా వేర్పాటువాద పార్టీలు పుట్టుకొచ్చాయి. పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), ‌పీపుల్స్ ‌రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ ‌కాంగ్లీపాక్‌, ‌కాంగ్లీపాక్‌ ‌కమ్యూనిస్టు పార్టీ (కేసీపీ) వంటి వేర్పాటువాద సంస్థలన్నీ స్వతంత్ర మణిపూర్‌ ‌కావాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఇవన్నీ ఒక్కటై ‘కోఆర్డినేటింగ్‌ ‌కమిటీ’గా ఏర్పడ్డాయి. నాగాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌సీఎం-ఐఎం ప్రభావం అధికం. ఇక ఈ ప్రాంతంలో 1990లో కుకీ మిలిటెన్సీ కూడా ప్రారంభమైంది.

కాంగ్రెస్‌ ఆధిపత్యం

2002-2017 వరకు కాంగ్రెస్‌ ‌నేత ఒక్రమ్‌ ఐబొబి సింగ్‌ ‌మణిపూర్‌ ‌రాజకీయాలను శాసించారు. ఆయన వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈయన కాలంలోనే పర్వత ప్రాంతాలు, లోయ ప్రాంతాల మధ్య విభేదాలు బాగా పెరిగిపోయి ఆర్థిక దిగ్బంధనాలకు దారితీశాయి. 2015లో మణిపూర్‌ ‌ప్రభుత్వం మూడు గిరిజన బిల్లులను అమల్లోకి తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా హింస చెలరేగి మరణాలకు దారితీసింది. ఈ బిల్లులు తమ గుర్తింపును ప్రశ్నార్థకం చేస్తాయని పర్వతప్రాంత ప్రజలు భావించడమే ఈ హింసకు కారణం. 2016లో పర్వత ప్రాంతాల్లో కొత్తగా 9 జిల్లాలు ఏర్పాటు చేయడం నిత్యావసర సరుకుల దిగ్బంధనానికి దారితీసింది. తర్వాతి కాలంలో అమల్లోకి తెచ్చిన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌పీఎస్‌ఏ) ‌కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఇరోమ్‌ ‌షర్మిల నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే. మూడోసారి ఇబొబి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ ముఖ్య నేత యుంఖమ్‌ ఎరొబాట్‌ ‌రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆయనతో పాటు ఎన్‌. ‌బిరెన్‌సింగ్‌ ‌కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

2014లో భాజపా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే 2017 ఎన్నికల్లో 21 సీట్లను గెలుచుకొంది. 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో ఎన్‌పీపీ (4), ఎన్‌పీఎఫ్‌ (4), ఇతర పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎన్‌. ‌బిరెన్‌సింగ్‌ ‌లోయ, పర్వత ప్రాంతాల మధ్య సయోధ్యను కల్పించడానికి చాలానే కృషిచేశారు. ఎన్‌. ‌బిరెన్‌సింగ్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవన్నీ విఫలమై, చివరకు 2022 ఎన్నికల్లో 32 స్థానాల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని భాజపా సొంతంగా అధికార పగ్గాలు చేపట్టనున్నది. ముఖ్యంగా చెప్పాలంటే మణిపూర్‌లో ఇప్పటివరకు కొనసాగిన సంకీర్ణ శకానికి ఈ ఎన్నికలు చరమగీతం పాడాయనే చెప్పాలి. ఇక మణిపూర్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇం‌త ఘోరంగా ఎప్పుడూ ఓడిపోలేదు. కేవలం ఐదు స్థానాలకే పరిమితమై గుర్తింపు లేని స్థితికి దిగజారింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న దిగజారుడు రాజకీయాలకు కొత్త ప్రభుత్వం చెక్‌ ‌పెట్టవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

– విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram