స్వతంత్ర దేశంగా భారతావని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఇది గోడ దిగిన కేలండర్‌ల లెక్క మాత్రం కాదు. వేయేళ్ల బానిసత్వం నుంచి బయటపడిన ఒక పురాతన దేశం సాగించిన ప్రస్థానం. ఈ ప్రస్థానం ఎన్నో ప్రమాణాలను ఆవిష్కరించింది. మూలాలను రక్షించుకుంటూనే, నవ్యతనూ  స్వాగతించడానికి వెనుకాడని అద్భుత దృష్టే దారి దీపంగా సాగిన ప్రయాణమది. మానవాళికి విలువైన అనుభవాలను అందించింది. స్వరాజ్యం కోసం భారత్‌ ‌సాగించిన పోరాటం ముమ్మాటికీ చరిత్రాత్మకం. స్వతంత్ర దేశంగా, సర్వసత్తాక రాజ్యంగా ఏడున్నర దశాబ్దాలు సాగించిన ప్రయాణం అనన్య సామాన్యమే. విదేశాల నుంచి ఆహార ధాన్యాలతో వచ్చే ఓడల కోసం ఎదురు చూసిన భారత్‌ ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్‌ ‌వరకూ ప్రయాణించింది.

ఎన్నో మతాలు, ఎన్నెన్నో భాషలు, మరెన్నో సంస్కృతులు… వీటిని మేళవించిందీ, సంఘటితం చేసినదీ భారత స్వాతంత్య్ర పోరాటమే. సాంస్కృతిక ఐక్యతే తప్ప, సామాజిక, రాజకీయ ఐక్యత లేని దేశాన్ని భారతీయత ఛత్రం కిందకు తీసుకు వచ్చినది మన స్వరాజ్య సమరమే. దానిని కొనసాగించినది ఆ తరువాత రచించుకున్న రాజ్యాంగమే. కొన్ని అపశ్రుతులు లేకపోలేదు. అయినా స్వతంత్ర పోరాటయోధులు అందించిన చింతన దేశాన్ని ఐక్యంగా నడిపిస్తున్నది. కాబట్టి స్వతంత్ర భారత 75వ వేడుకల నేపథ్యంలో ఆ మహనీయులను స్మరించుకోవడం జాతి ముందున్న బాధ్యత.

75వ స్వాతంత్య్ర వేడుకలకు జాతి సిద్ధమవుతున్నది. ఇందుకు మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌పేరుతో దేశం నలుమూలలా జరిగే ఈ ఉత్సవాలను ఆ రోజు అహమ్మదాబాద్‌లో ని సబర్మతి ఆశ్రమంలో ప్రధాని ఆరంభించారు. సబర్మతి ఆశ్రమం నుంచి నాడు గాంధీ 78 మంది అనుచరులతో ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టినది ఆ తేదీనే. ఆ సందర్భానికి కూడా 91 ఏళ్లు నిండుతున్నాయి. అమృత్‌ ‌మహోత్సవ్‌ ఆరంభ సూచకంగా సబర్మతి నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌పటేల్‌ ‌నాయకత్వంలో ఒక బృందం 241 కిలోమీటర్ల పాదయాత్రకు బయలుదేరింది. ఏప్రిల్‌ 5‌న ఆ బృందం అరేబియా తీరంలో ఉన్న దండి చేరుతుంది. అమృతోత్సవం ఆగస్ట్ 15, 2022 ‌వరకు జరుగుతుంది. ఆ తరువాత కూడా ఉత్సవాలు సాగే అవకాశం కూడా ఉంది.

ఆగస్ట్ 15, 2047‌కు దిశానిర్దేశం

అమృతోత్సవం స్వాతంత్య్ర సమరయోధులకీ, స్వాతంత్య్రోద్యమానికీ ఘన నివాళి. ప్రధాని మోదీ ఉద్దేశం ప్రకారం అమృతోత్సవం అంటే స్వాతంత్య్ర ఫలాన్ని మన తరం ఒక శక్తిగా మలుచుకోవడం. అంటే నాటి మహనీయుల త్యాగాలను, ఆకాంక్షలను వర్తమాన భారతావనిని ముందుకు నడిపించే శక్తిగా మలుచుకోవడం, కొత్త ఆలోచనలకు స్ఫూర్తిగా స్వీకరించడం. వాటి పునాదిగా 2047 నాటి స్వరాజ్య శత వార్షికోత్సవాలకు దిశా నిర్దేశం చేసుకోవడం కూడా. అందుకే ఈ ఉత్సవాలు మొక్కుబడి తతంగం అనుకోవడానికి వీలులేదు. ఇప్పటికైనా విదేశీ భావనలూ, బానిస జాడలూ విసర్జించి ఆత్మ నిర్భర భారత్‌ ‌దిశగా అడుగులు వేయడమే లక్ష్యం. మన గమ్యం ఏదో స్పష్టత ఉండాలంటే మనం ఎక్కడ బయలుదేరామో తెలిసి ఉండాలి. వందేళ్ల స్వతంత్ర భారత్‌కు ప్రపంచంలో సమున్నత స్థానం కల్పించే ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆ మహనీయులు విదేశీయులతో పోరాడి మనకు స్వేచ్ఛా భారత్‌ను అందించారు. ఆ స్వేచ్ఛాభారత్‌ను సమున్నత స్థితికి తీసుకువెళ్లవలసిన కర్తవ్యం మన తరానిదేనని మోదీ సందేశం. అందుకే మన పోరాట చరిత్రను ఈ తరాలకు తెలియచేసే పనిని అమృతోత్సవంలో కీలకం చేశారు. చరిత్ర స్ఫూర్తితో ఐదు చోదక శక్తులను నిర్ధారించారు. అవి 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకోవడం,  ఆలోచనలు సమీక్షించుకోవడం, విజయాలను అంచనా వేసుకోవడం, తీసుకున్న చర్యల మీద సమీక్ష, తీర్మానాలు. ఈ మహోత్సవాన్ని ప్రజా ఉత్సవంగానే నిర్వహిస్తారు. ప్రజలంతా ఇందులో భాగస్వాములే.

రక్త తర్పణల దగ్గర వివక్ష సమసిపోవాలి

స్వాతంత్య్ర పోరాట చరిత్రను నరేంద్ర మోదీ ఒక్కసారిగా ఎందుకు తెర మీదకు తెచ్చినట్టు? వర్తమానకాలంలో జీవిస్తున్నవారికి ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే అటు గతంలోను, ఇటు భవిష్యత్తులోను కూడా వీరు జీవించవలసిందే. అంటే బాంధవ్యం నెరపవలసిందే. ఇది ప్రఖ్యాత చరిత్రకారుడు ఆక్టన్‌ ‌భావన. ఇలాంటి భావనల పట్ల సంపూర్ణ స్పృహ, గౌరవం ఉన్న వ్యక్తి మోదీ. స్వాతంత్య్ర పోరాటం, పోరాట యోధులు దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయడమే కాదు, స్వతంత్ర భారతం ఎలా ఉండాలో ఒక కల్పన చేయడమూ గొప్ప వాస్తవం. కానీ మన చరిత్రలో కనిపించే త్యాగాలను అంచనా వేయడంలో వివక్ష కనిపిస్తుంది. రక్తతర్పణల దగ్గర జరిగిన వివక్షను కొనసాగించడం చరిత్రకు ద్రోహం చేయడమే. స్వతంత్ర భారత నిర్మాణంలో ఆ వివక్షను నిర్మూలించడమూ ఒక పార్శ్వం కావాలి. చరిత్రలో అన్ని వర్గాలకు చోటు ఉన్నదన్న వాస్తవం బయటకు రావాలి. అంతటి సదాశయం ఈ ఉత్సవాలకు ఉంది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవారు ఎందరో గుర్తింపునకు నోచుకోలేదు. అలాంటి వారి చరిత్రలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం గడచిన ఆరేళ్లుగా  ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో  జరగుతున్నదని ప్రధాని దండియాత్ర ఆరంభోపన్యాసంలో చెప్పారు. స్వతంత్ర భారత చరిత్ర రచనలో ఇదొక మలుపు కావాలి. దండియాత్రతో ముడిపడి ఉన్న ప్రాంతానికీ, నేతాజీ అండమాన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన చోటుకూ గుర్తింపు తెచ్చిన సంగతిని కూడా ఆయన గుర్తు చేశారు. డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌జీవితంతో, చరిత్రతో ముడిపడి ఉన్న ఐదు స్థలాలను పంచతీర్ధాలుగా అభివృద్ధి చేసిన సంగతీ వెల్లడించారు.

ప్రధాని ఆరంభించిన దండి పాదయాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. నవసారిలో ఉన్న దండికి వీరు వెళతారు. నాడు దండియాత్రలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారు. గాంధీ జీవితంతో  ముడిపడి ఉన్న ఆరు చోట్లు- పోర్‌బందర్‌, ‌రాజ్‌కోట్‌, ‌వదోదర, మాండ్వి, దండిలలో ప్రత్యేక  కార్యక్రమాలు జరుగుతాయి. అహమ్మదాబాద్‌ ‌నుంచి అరేబియా సాగర తీరంలోని  దండి వరకు ఉన్న 386 కిలోమీటర్ల దూరంలో మొత్తం 21 స్థలాలను ఎంపిక చేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఏమిటీ ఉప్పు సత్యాగ్రహం?

దండియాత్రకే ఉప్పు సత్యాగ్రహం అని పేరు. ఇది అహింసాయుతంగా సాగిన శాసనోల్లంఘ నోద్యమం. గాంధీ నాయకత్వంలోనే జరిగింది.1929 నాటి లాహోర్‌ ‌జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలలో శాసనోల్లంఘన, పన్నుల నిరాకరణ ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 26,1930న త్రివర్ణ పతాకం ఎగురవేసి స్వతంత్ర దినోత్సవం జరిపారు. దేశబ••క్తి గీతాలు ఆలపిస్తూ దేశంలో చాలాచోట్ల జెండా ఎగురవేశారు. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో సబర్మతి ఆశ్రమంలోనే జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం ఈ ఉద్యమ నిర్వహణకు గాంధీజీకి అన్ని అధికారాలు ఇచ్చింది. స్థలం, సమయం కూడా ఆయన ఇష్టానికే విడిచిపెట్టింది. భారతీయుల కనీస కోర్కెలను ఆమోదించడానికి కూడా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్ల శాసనోల్లంఘన తప్ప మరొక మార్గం లేదని వైస్రాయ్‌ ఇర్విన్‌ (1926-1931)‌కు గాంధీ తుది హెచ్చరిక జారీ చేసి, ఉద్యమంలో దిగారు.

1930 మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 ‌వరకు ఆ యాత్ర జరిగింది. నిత్యావసర వస్తువు ఉప్పు మీద ఆంగ్ల ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని ధిక్కరిస్తూ సాగిన ఉద్యమమిది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సముద్ర జలాల నుంచి ఉప్పు తయారు చేయడానికి ఉద్యుక్తులయ్యారు. దండితో పాటు బొంబాయి, కరాచీ, నాటి అఖండ భారతంలోని అనేక సముద్రతీరాలలో ఈ ఉద్యమం జరిగింది. లక్షలాది మంది భారతీయులు పాల్గొన్నారు. 60,000 మందికి పైగా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. మే 5న గాంధీని కూడా అరెస్టు చేశారు.

మే 21న సరోజినీ నాయుడు 2500 మంది కాంగ్రెస్‌ ‌కార్యకర్తలతో బొంబాయికి ఉత్తరంగా ఉన్న ధరసానాకు వెళ్లారు. ఈ ప్రదర్శన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆంగ్లేయులు భారతదేశంలో అనుసరిస్తున్న విధానాల పట్ల విశ్వవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 1931 జనవరిలో గాంధీని కారాగారం నుంచి విడుదల చేశారు. తరువాత ఆయన నాటి వైస్రాయ్‌ ఇర్విన్‌తో చర్చలు జరిపారు. రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాలలో ఈ అంశం గురించి చర్చించడానికి అంగీకారం కుదరడంతో గాంధీ ఉప్పు సత్యాగ్రహం విరమించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏకైక ప్రతినిధిగా గాంధీ 1931 ఆగస్ట్‌లో జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ నిరాశే ఎదురయింది. కానీ గాంధీ ఇకమీదట ఉపేక్షించడం సాధ్యం కాని శక్తి అని ఆంగ్లేయులు గుర్తించక తప్పలేదు.

స్వాతంత్రోద్యమంలో గాంధీజీ ఒక ప్రబల శక్తిగా ఎదగడంతో పాటు ఇంకొన్ని లాభాలు కూడా ఆ ఉద్యమంతో ఒనగూడాయి. శాసనోల్లంఘన వివిధ రూపాలలో జరిగింది. అందులో విదేశీ వస్తువుల బహిష్కరణ కూడా ఉంది. తూర్పు భారతంలో చౌకీదార్‌ ‌సుంకం చెల్లించడానికి ప్రజలు నిరాకరించారు. బిహార్‌ ఈ ఉద్యమానికి ప్రసిద్ధిగాంచింది. బెంగాల్‌లో జేఎన్‌ ‌సేన్‌గుప్తా ఒక నిషిద్ధ గ్రంథాన్ని బాహాటంగా పఠించి చట్టాలను వ్యతిరేకించారు. మహారాష్ట్రలో అటవీ చట్టాలను ఉల్లంఘించారు. ఉత్తర పరగణాలు, అస్సాం, ఒరిస్సా, మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలలో  బాగా రగడ జరిగింది.

దేశీయ ఉత్పత్తులకు నీరాజనం

ఇంకా ఎలాంటి ప్రాధాన్యం ఉంది? ఇంగ్లండ్‌ ‌నుంచి దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఉదాహరణకి: అక్కడ నుంచి జరిగే వస్త్ర దిగుమతి సగం తగ్గిపోయింది. ఇంతకు ముందు జరిగిన ఉద్యమాల కంటే ఈ ఉద్యమం విస్తృత స్థాయిలో జరిగింది. మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, పట్టణ ప్రాంతాలలో వ్యాపారవేత్తలు, దుకాణదారులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు అఖిల భారత స్థాయి వచ్చింది. పేదలు, నిరక్షరాస్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ప్రజా పునాది విస్తరించింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఈ సంఘటనతోనే ఆరంభమైంది. 1934లో ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ ఉపసంహరించింది. అయితే ఒక వలసదేశానికి వ్యతిరేకంగా, ఒక సామ్రాజ్యవాద శక్తికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది.

 నాడు మహాత్ముడు ఉద్యమానికి సంకేతంగా స్వీకరించిన ఉప్పు ధర ప్రకారం చూస్తే చాలా చౌక. కానీ ధరను బట్టి ఆ వస్తువు విలువ కట్టలేదు బాపూ. భారతీయ జీవనం వరకు ఉప్పు అంటే విశ్వాసానికి ప్రతీక. నమ్మకానికి చిహ్నం. శ్రమకీ, సమానత్వానికీ, స్వయం సమృద్ధికీ కూడా ప్రతీక. భారతీయమైన చాలా విలువలను కబళించినట్టే ఇక్కడి ప్రజల స్వయం సమృద్ధిని కూడా ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది. భారతదేశంలో ఎంతో విరివిగా తయారు చేసుకునే అవకాశం ఉండి, తయారవుతూ ఉన్నా కూడా, చౌకగా లభించే ఉప్పు కోసం కూడా ప్రజలు ఇంగ్లండ్‌ ‌దిగుమతుల వైపు చూడాలన్నదే వాళ్ల ధ్యేయం. ఈ చర్యతో భారతీయులు అనుక్షణం అనుభవిస్తున్న క్షోభను గాంధీ గుర్తించారని మోదీ గుర్తు చేశారు. ఆ క్షోభను ఉద్యమంగా మలిచారని మోదీ విశ్లేషించారు. సబర్మతి వేదికగా మోదీ మన స్వాతంత్య్ర పోరాటంలోని అనేక ఘట్టాలను స్మరించుకున్నారు.

పంథాలు వేరైనా లక్ష్యం స్వాతంత్య్రమే

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారతదేశానికి రావడం, సత్యాగ్రహాయుధం శక్తిని తెలియచేయడం, బాలగంగాధర తిలక్‌ ‌సంపూర్ణ స్వరాజ్య నినాదం, చలో ఢిల్లీ పిలుపు నిచ్చిన ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సాహసం, సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌నాయకత్వం వంటి అంశాలను ప్రధాని స్మరించుకున్నారు. జాతి జనులను నిరంతరం మేల్కొలుపు, స్వాతంత్య్ర జ్వాలను ఆరనివ్వకుండా చేసిన ఎందరో మహనీయులు ఉన్నారని ప్రధాని అన్నారు.

1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. అప్పటికే మహారాష్ట్ర, బెంగాల్‌, ‌మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలలో ఆరంభమైన ప్రజా సంఘాల ఐక్యతతోనే జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడింది. మరొక అంశం- జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించడానికి దాదాపు వందేళ్ల క్రితమే దేశంలోని కొండకోనలు స్వేచ్ఛా నినాదంతో మారుమోగాయి. అక్కడ జరిగిన ఉద్యమాలు అగ్నిశిఖల ఊరేగింపులే. అవి గిరిజనోద్యమాలు, అదే సమయంలో రైతాంగ ఉద్యమాలు. 1885 నుంచి జాతీయ కాంగ్రెస్‌ ‌పంథా వేరు. నాటి నాయకత్వానికి ఈ దేశం నుంచి బ్రిటిష్‌ ‌జాతిని పంపించడం లక్ష్యం కాదు. కానీ ఆ పంథా తప్పు అంటూ పూర్ణ స్వరాజ్యం కోసం నినదించినవారే బాలగంగాధర తిలక్‌. ‌బెంగాల్‌ ‌విభజన వినతులతో కాదు, పిడికిలి బిగిస్తేనే ఆగిందన్న వాస్తవం చెప్పుకోవడానికి  ఇప్పుడు సందేహించనక్కరలేదు. 1919 నాటి జలియన్‌వాలా బాగ్‌ ‌రక్తహోళిని చూసి కూడా ఆంగ్లేయులతో రాజీ ఎందుకని ప్రశ్నించుకుంటూ తీవ్ర జాతీయవాదం జనించిన మాటను కూడా ఇప్పుడు అంగీకరించాలి. చౌరీచౌరాలో 21 మంది పోలీసులు చనిపోతే 170 మంది వరకు భారతీయులకు మరణదండన విధించిన బ్రిటిష్‌ ‌జాత్యహంకారం గురించి చెప్పుకోవడం ఎవరినో ద్వేషించడం కాదు. ఒక చారిత్రక వాస్తవాన్ని సక్రమంగా నమోదు చేసుకోవడం. గతానికీ, వర్తమానానికీ జరిగే అనంత సంభాషణే చరిత్ర అంటాడు ఈహెచ్‌ ‌కార్‌. ‌మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల విషయంలో బ్రిటిష్‌ ‌జోక్యం ఇందుకు నిదర్శనంగానే చెప్పాలి.

గాంధీజీ ఒక పంథాను స్వాతంత్య్ర పోరాటం కోసం తీసుకువచ్చారు. ఆ పంథాను అనుసరించని వారిని ఆ పంథాను వ్యతిరేకించినవారిగానే చూడాలి. భారత స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకులుగా చూస్తూ, ముద్ర వేస్తూ చరిత్రలో చోటు ఇవ్వకపోవడం నేరం. సావర్కర్‌, ‌భగత్‌సింగ్‌, ‌చంద్రశేఖర్‌ అజాద్‌, ‌చిట్టగాంగ్‌ ‌వీరులు, సుభాష్‌బోస్‌ ఇలా ఎందరో…! చరిత్రలో తగిన స్థానం పొందలేకపోయారు. వామపక్ష భావజాలంతో రాసిన చరిత్ర ఇంకా ఘోరమైన అన్యాయం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్‌ ‌రష్యాకు వ్యతిరేకంగా పోరాడిన జపాన్‌, ‌జర్మనీలతో కలసి పని చేసినందుకు సుభాశ్‌బోస్‌ను అత్యంత నీచంగా వామపక్ష చరిత్రకారులు చిత్రించారు. ఇంగ్లండ్‌ ‌నుంచి మాతృభూమికి విముక్తి కల్పించడమే ధ్యేయంగా, ఆ మేరకు ఆ దేశాలకు కొన్ని షరతులు పెట్టిన తరువాతే బోస్‌ ‌వారి సాయం తీసుకున్న మాట నిజం.

ప్రతి ప్రాంతంలో, ప్రతి యుగంలో జాతీయత రక్షణ కోసం అనేక మంది సాధుసంతులు, మహనీయులు చేసిన సంగతిని గుర్తు చేశారు. బంకింబాబు ‘ఆనందమఠం’ సన్యాసుల తిరుగుబాటును వర్ణిస్తుంది. ఇలాంటి నేపథ్యాన్ని నిర్మించడానికి భక్తి ఉద్యమం ఎంతో తోడ్పడిన సంగతిని కూడా ప్రధాని గుర్తు చేశారు. చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, శంకర్‌దేవ్‌ ‌స్వాతంత్య్ర జ్వాలను రగిలించారని ప్రధాని అన్నారు. ఇలాంటి వారిలో గిరిజనులు, ఎస్‌.‌సీ.లు, నిమ్నవర్గాల వారు ఎందరో ఉన్నారు.ఈ దేశ పౌరులు వారిలో మహిళలు, యువకులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారాయన. తమిళ ప్రాంతంలో పుట్టిన కొటి కాతాకుమరన్‌ ‌త్యాగ నిరతిని గుర్తు చేశారు ప్రధాని. తుపాకీ గుండు దిగినా జాతీయ పతాకం నేలకొరిగి పోకుండా కాపాడిన ధన్యజీవి అని చెప్పారు. బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహారాణి వేలు నచియార్‌ను కూడా గుర్తు చేశారు. ఈమె కూడా తమిళనాడుకు చెందిన వారే.

కొండకోనలలో

సర్వశక్తులు ఉన్నప్పటికీ, ప్రపంచ యుద్ధాలు చేసిన ఘనత ఉనప్పటికీ బ్రిటిష్‌ ‌పాలకులను గడగడలాడించిన సాహస గిరిపుత్రుల గురించి కూడా ప్రధాని స్మరించారు. జార్ఖండ్‌కు చెందిన బిర్సా ముండా ఉల్‌ ‌గులాన్‌ ఉద్యమం నడిపాడు. ముర్ము సోదరులు సంథాల్‌ ‌హూల్‌ (ఉద్యమం) నడిపారు. ఒరిస్సాలో చక్ర బిసోయి, లక్ష్మణ్‌ ‌నాయక్‌ ‌పోరాడారు. విశాఖ మన్యం కొండలలో అల్లూరి శ్రీరామరాజు త్యాగం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మిజోరం కొండలలో ఉద్యమించిన పసల్తా ఖుంగ్‌చెరా పోరాట పటిమను కొనియాడారు. అస్సాం, ఈశాన్య భారతంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న గోమ్‌ధార్‌ ‌కొన్వార్‌, ‌లాచిత్‌ ‌బడపుకన్‌, ‌శరత్‌ ‌సింగ్‌ల గురించి చెప్పారు. గుజరాత్‌లోని జంబుఘోడాలోని గిరిజన నాయకులను, మంగధ్‌లో ఊచకోతకు గురైన గిరివీరులను స్మరించారు.

‘చరిత్రను పునర్లిఖించుకుంటూ ఉండడం ప్రతి తరం మీద ఉన్న బాధ్యత’ అంటారు చరిత్ర తత్త్వవేత్త ఈజీ కాలింగ్‌వుడ్‌. ‌మైదానాలో అయినా, కొండలలో అయినా, ఏ సామాజిక వర్గమైనా దేశం కోసం పోరాడినవారందరిని స్మరించుకోవాలి. వారి కృషి చరిత్రకు ఎక్కాలి. మన పోరాట చరిత్ర, త్యాగధనుల చరిత్ర ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో రాసుకోవాలి. ఒకే భారత్‌, ‌శ్రేష్టభారత్‌ ‌గురించి చెప్పాలి. మన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియాలి. ఆంధప్రదేశ్‌, అం‌డమాన్‌ ‌నికోబార్‌, ‌లద్దాఖ్‌, ఈశాన్య భారతం, తెలంగాణలో ఈ ఉత్సవాలు ఇప్పటికే మొదలయ్యాయి. చరిత్ర అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే సమాధానం సమకాలీన సమాజం మీద వారికి ఉన్న దృక్పథం ఎలాంటిదో దానిని బట్టి ఉంటుందట. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కనిపించే ఇన్ని పంథాలలో, ఇన్ని స్రవంతులలోని ఏదో ఒకదానితో మనం మమేకమయ్యే ఉంటాం. మన దేశంతో మన మమేకత్వాన్ని అది మరింత పెంచుతుంది. దేశం కోసం ఆలోచించేలా చేస్తుంది. బాధ్యతను గుర్తెరిగేలా చేయగలదు కూడా.

– జాగృతి డెస్క్

By editor

Twitter
Instagram