‌హద్దులు మరచిన అభిమానం అనర్థ హేతువు!

సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి నిజ ఆశ్వయుజ శుద్ధ దశమి – 26 అక్టోబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అతి సర్వత్ర వర్జయేత్‌ అనే సూక్తి అభిమానానికి కూడా వర్తిస్తుంది. మనల్ని మనం అభిమానించుకోవడం స్వాభిమానం. మితి మీరితే అదే దురుభిమానంగా పరిణమిస్తుంది. కళలను, కళాకారులను, క్రీడలను, క్రీడాకారులను అభిమానించే రసజ్ఞత నాగరిక సమాజంలో సహజం. సహజమైన ఈ అభిమానం హద్దులు దాటినపుడు వాణిజ్య వస్తువుగా మారడం ప్రపంచం అంతటా ఉంది. సినీ ప్రముఖులు, క్రీడాకారులు తదితర సెలబ్రిటీలను వాణిజ్య ప్రకటనలకు ఉపయోగించుకోవడంలోని మర్మం ఇదే. ప్రజా అభిమానాన్ని సొమ్ము చేసుకునే క్రమంలో దేశద్రోహులకు, విచ్ఛిన్నకర శక్తులకు తోడ్పాటు అందివ్వడం కూడా జరగొచ్చని హిందీ సినీ ప్రపంచానికి చెందిన ఓ సంఘటన వెల్లడిస్తోంది.

బాలీవుడ్‌ ‌నటి దీపికా పడుకొనె తన చిత్రం ‘చపాక్‌’ ‌ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీకి వెళ్లారు. దేశద్రోహ, విచ్ఛిన్నకర శక్తులకు ఆలవాలమైన జెయన్‌యుకు ఆమె వెళ్లగానే తుక్డే గ్యాంగు మొత్తం ముందుకు వచ్చి భారత్‌ను ముక్కలు చేస్తా అంటూ నినాదాలిచ్చింది. అక్కడ జరిగిన సంఘటనలు, వినిపించిన నిరసన గళాల వార్తలు ఫొటోలతో సహా జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ వార్తా సంస్థలకు కూడా అందాయి. దీపిక తన సినిమా ప్రచారం కోసమని ఢిల్లీ వెళితే సందట్లో సడే మియా లాగా ఈ సంఘటన ఏదో యాధృచ్చికంగా జరిగిందని ఈ వార్తలను ప్రచురించిన వారు సైతం భ్రమించారు. ఎప్పుడో జనవరిలో జరిగిన ఈ సంఘటన అంతటితో కాలగర్భంలో కలిసిపోయేదే. కాని అక్కడ నిరసన స్వరాలు వినిపించిన విచ్ఛిన్నకర శక్తులు, వేర్పాటువాదుల మద్దతుదారులు అనూహ్యంగా అంతా ఒకేసారి జమకూడారా, లేక ప్రణాళిక ప్రకారమే జరిగిందా అని అనుమానించి, కేంద్ర హోంశాఖ జరిపిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీపిక ముందస్తు ప్రణాళికతోనే జెయన్‌యుకు వెళ్లింది. కనుకనే ఆమెకు చెందిన స్పైస్‌ ‌పిఆర్‌ అనే ప్రచారం సంస్థ అక్కడ జరిగిన సంఘటన తాలూకు చిత్రాలను, వార్తలను తక్షణమే అన్ని మీడియా సంస్థలకు అందించగలిగింది. ఈ పనికోసం దీపిక జెయన్‌యుకు వెళ్లి అక్కడి ఉద్యమకారులకు మద్దతు ప్రకటిస్తే ఐదుకోట్లు ఇస్తామని పాకిస్తాన్‌ ‌మద్దతుదారుడైన లండన్‌కు చెందిన అనిల్‌ ‌మసరత్‌ అనే వ్యాపారి ఆఫరించ్చాడని గూఢచారి వర్గాల కథనం. విచ్ఛిన్నకారుల గళం ప్రపంచం అంతటా వినిపిచాలనుకునే వారి లక్ష్యం నెరవేరింది. అందుకు దీపిక తోడ్పడింది కనుక అనుకున్న ప్రకారం ఆమెకు డబ్బు ముట్టింది. ఇప్పుడు ఈ నగదు బదిలీకి సంబంధించిన లావాదేవీలపై ప్రభుత్వ వర్గాలు విచారణ జరుపుతున్నాయి.

ప్రజాభిమానం రాజకీయ సోపానంగా మారడం, దాని దుష్ఫలితాలను చవిచూడ్డం తెలుగు ప్రజలకు నిత్యనూతన అనుభవం. పాలనా నైపుణ్య, ప్రజాస్వామిక విలువలు, రాజకీయపు ఎత్తులు, జిత్తులు ఏమీ తెలియకపోయినా తెలుగు ప్రజల అభిమానం ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ యన్టీ రామారావును 1983లో ముఖ్యమంత్రిని చేసింది. కాని నాదెండ్ల భాస్కర్రావు దెబ్బకు బొక్క బోర్లా పడిన ఆయనను 1984లో వాజ్‌పేయి, వెంకయ్య కాపాడ గలిగారు. ఆయన బలహీనత కనిపెట్టి అదను కోసం కాచుకు కూచున్న ఇంటల్లుడు మరోసారి 1995లో కొట్టిన దెబ్బనుండి యన్టీఆర్‌ ‌కోలుకోలేదని రాజకీయ చరిత్రకారుల విశ్లేషణ! తెలుగు ప్రజల విపరీత అభిమానం వల్ల హెచ్చిన దురభిమానంతో యన్టీఆర్‌ ‌కథ విషాదాంతమైంది. దాని ఫలితం తెలుగు ప్రజలు కూడా అనుభవించాల్సివచ్చింది. దుష్ట శక్తి నెపంతో స్వార్థశక్తి నడిపిన రాజకీయ చదరంగంలో సిద్ధాంత నిష్టా గరిష్టులతో సహా తెలుగు ప్రజలూ పావులైనారు. హైదరాబాద్‌ ‌నగరం, దాని చుట్టు పక్కల భూములతో సహా తెలుగు నేలను పీల్చి పిప్పి చేసిన స్వార్ధ శక్తులు తమ పంట పండిచుకున్నాయి. అధికార పిపాశువుల దుష్టపాలన ఫలితంగా తెలుగు నేలపై విభజన ఉద్యమం ఊపందుకుని ఫలిచడం, రెడు రాష్ట్రాల్లోను నియంతలను తలపిచే పాలకులు దాపురిచడం కాకతాళీయమేనా!

మత మార్పిళ్లు చేసుకోడి ఎవరడ్డు వస్తారో చూస్తా అని ఒక ప్రభుత్వలో మంత్రే పాస్టర్లకు భరోసా ఇస్తే మరోచోట స్వయంగా ముఖ్యమంత్రే హిదూగాళ్లు బొదూగాళ్లు అని కిచపరచడం విషాదం.

 కళలను, కళాకారులును, క్రీడలను, క్రీడాకారులను రసజ్ఞతతో సహృదయంతో అభిమానిచే మనం అది హద్దులు మీరకుడా జాగ్రత్త పడాలి. ఇతరులను, రాజకీయ నేతలను అభిమానిచడంలో వివేకము, విచక్షణ పాటిచాలి. నిస్వార్థ సేవాభావము, త్యాగనిరతి, దేశభక్తి, మన సంస్కృతి పట్ల అనురక్తి, ప్రజాస్వామిక విలువల పట్ల ఆచరణతో కూడిన విశ్వాసములనే యోగ్యతల పరీక్ష అనంతరమే రాజకీయ అభిమానం పెచుకోవాలి. జాతీయత, దేశభక్తి, సంస్కృతి వంటి మౌలికమైన అశాల్లో ఏ మాత్రం తేడా కనిపిచినా వెటనే అభిమానాన్ని తుచుకోగలగాలి. వ్యక్తి నిష్ఠను విడనాడి, తత్వ నిష్ఠ పెచుకున్నప్పుడే స్వచ్ఛమైన ప్రజాస్వామిక ఫలాలను అనుభవిచగలవని గ్రహిచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram