ప్రజల వివేచన, వివేకమే శ్రీరామరక్ష!

జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ వికారి జ్యేష్ఠ బహుళ దశమి –  15 జూన్‌ 2020, ‌సోమవారం
అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


ఆరోగ్య సమరంలో తలమునకలై ఉన్న సమయంలో భారత్‌కు మరో సవాలు వచ్చి పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశ సరిహద్దు వెంట చైనా యుద్ధ సన్నాహాల వార్తలు పులి మీద పుట్రలా దాపురించి ప్రజలను మరింత కలవరపరుస్తున్నాయి. కోవిడ్‌19 ‌వైరస్‌ను ఎదిరించి కరోనా వ్యాప్తిని అడ్డుకునే ఆరోగ్య సమరం దేశంలో ఇంతదాకా నడిచింది, ఇంకొంత కాలం నడుస్తూనే ఉంటుంది. ఒకరిద్దరు కలిసిరాకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు సమన్వయంతో పని చేసి ప్రజా మద్దతును కూడగట్టిన ఫలితంగా ఆరోగ్య సమరం సజావుగానే నడిచింది. లాక్‌డౌన్‌ ‌నిబంధనలను కొంత మేర సడలిస్తున్న ప్రభుత్వాల తాజా నిర్ణయాన్ని స్వాగతించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు. కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూండగా లాక్‌డౌన్‌ ‌నిబంధనలను సడలించడం ప్రమాదమనే విమర్శలూ వస్తున్నాయి. లాక్‌డౌన్‌ ‌నిబంధనలను బేఖాతరు చేసి రాజధాని నగరం లోని వివిధ ప్రాతాల వారిని ఒకచోట చేర్చి విందు నిర్వహించిన హైదరాబాద్‌ ‌మటన్‌ ‌వ్యాపారి చర్యల ఫలితంగా ఒకే చోట ఇరవై మంది పైగా కరోనా బారిన పడినట్లు వచ్చిన వార్తలు విమర్శకుల వాదనకు ఊతమిస్తున్నాయి. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే చర్యలు చేపట్టాలని జాతీయ పార్టీగా కేంద్రాన్ని ఓ వంక డిమాండు చేస్తూ మరోవంక స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న ద్వంద వైఖరి కాగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతేసే పార్టీల, నేతల మాటలను ఖాతరు చేయక తమకు ఏది శ్రేయస్కరమో ప్రజలే వివేకంతో ఆలోచించి వివేచనతో అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
జలుబు మందులు, మలేరియా మందులు మినహా కరోనాను నివారిచే ఔషధం తమ వద్ద లేదని అలోపతి వైద్యులు చేతులు ఎత్తేసిన నేపధ్యంలో ప్రజల విచక్షణకు మరిత ప్రాధాన్యం ఏర్పడింది. హోమియో, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాలి. ఇంత కాలం నిర్బధంగా ప్రభుత్వం అమలు చేయించిన నియమాలను అలవాటుగా మార్చుకుని ఆరోగ్యాన్ని సంరక్షిచుకునే దిశగా ప్రజల ఆలోచన, ఆచరణ సాగాలి.
కరోనా వైరస్‌ను సృష్టిచి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే చైనా పాలకుల పన్నాగం బెడిసి కొట్టిదన్న ఆరోపణలు ప్రపంచం అతటా వెల్లువెత్తాయి. దానికి తోడు దేశంలో పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకత, బెడిసి కొట్టిన కరోనా ప్రయోగం ఫలితంగా కోల్పోతున్న అతర్జాతీయ విశ్వసనీయతల ముప్పును ఎదుర్కోడానికి చైనా ప్రభుత్వం భారత్‌తో యుద్ధమనే నాటకానికి తెర తీసిందని తెలుస్తోంది. అతర్జాతీయంగాను, దేశ ప్రజల్లోను దెబ్బతిన్న తమ ప్రతిష్ఠను కాపాడుకోడానికి చైనా పాలకులు భారత్‌తో కపట యుద్ధానికి దిగాలని భావిచినా భారత ప్రజలకు మాత్రం అది తీరని ఆర్థిక నష్టాన్ని తెస్తుంది.
సరిహద్దుల్లో సమరం గురించి సైన్యము, కేద్రంలోని మోదీ ప్రభుత్వము చూసుకోగలవు. తమ తప్పిదాలను కప్పిపుచ్చు కోడానికి చైనా పాలకులు భారత ప్రజలపై ఆర్థిక విపత్తు మోపడం అమానవీయ అపరాధం. ఈ రాజకీయ నేరానికి చైనా పాలకులకు మనం తగిన గుణపాఠం నేర్పాలి. వ్యూహ ప్రతివ్యూహాలతో, సైనిక పాటవంతో భారత సైనికులు, ప్రభుత్వం చైనా సైనిక శక్తిని అణచి వేయడానికి చర్యలు చేపడతాయి. అలాగే చైనా ఆర్థిక శక్తిని దెబ్బతీయడానికి మనం స్వదేశీ వస్తు వినియోగ వ్యూహాన్ని అమలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోటానుకోట్ల విలువ చేసే చైనా ఉత్పత్తులు భారత మార్కెట్లను ముచెత్తుతున్నాయి. కారు చౌకగా లభిస్తున్నాయంటూ మనం కొనే చైనా వస్తువుల వల్ల చైనాకు చేరే ప్రతి రూపాయి చైనా సైనికశక్తిని పెంచుతుంది. దానికి విరుగుడుగా మనం చైనా వస్తువుల వినియోగం పట్ల స్వీయ నిషేధాన్ని అమలు చేయాలి. స్వీయ ఆరోగ్య రక్షణ వ్యూహాన్ని ఎత పటిష్టగా నియమ నిష్టలతో ఆచరిస్తామో దేశ ఆర్థిక రక్షణ వ్యూహాలను కూడా అంతే నిష్ఠగా పాటించి దేశభక్తిని చాటాలి.
వివిధ దేవీ, దేవతల ఆధ్యాత్మిక దీక్షల్లో రకరకాల నియమాలు పాటిచడం మనదేశంలో అన్ని వర్గాల వారికి తెలుసు. దైవభక్తితో నిష్ఠగా నియమాలు పాటిచినట్లే దేశభక్తితో మనం కొన్ని నియమాలను శ్రద్ధగా పాటించాలి. లాక్‌డౌన్‌ ‌నిబంధనలను ప్రభుత్వాలు సడలిచినా భౌతిక దూరం పాటిచడం, శానిటైజేషన్‌ ‌చర్యలతో సహా పరిశుభ్రతను పాటిచడం వంటి నియమాలను మనం అలవాటుగా మార్చుకుని కొనసాగించాలి. ప్రపంచీకరణ నేపథ్యలో చైనా ఉత్పత్తులను ప్రభుత్వాలు నిషేధించలేక పోవచ్చు. స్వీయ నియంత్రణతో చైనా వస్తువుల వాడకాన్ని మనం మానేయాలి. చైనా వస్తువుల నిషేధం మన దైనందిన జీవన నిష్ఠ కావాలి. కరోనా వ్యాప్తిని అడ్డుకునే నియమబద్ధ జీవనం మన వ్యక్తిగత, సామాజిక నిష్ఠ కావాలి. వస్తువినియోగ, ఆరోగ్య జీవన నిష్ఠల సాయంతో ఆరోగ్య, ఆర్థిక సమరం సాగించాలి. వివేకము, వివేచనలు ఆయుధాలుగా స్వీయరక్షణ కావించుకుని, దేశ రక్షణలో భారతీయులు విజయం సాధిస్తారని ఆశిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *