జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ వికారి ఆషాడ శుద్ధ పాడ్యమి – 22 జూన్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


ఒక గీతను ముట్టకుడా, చెరపకుడా, ఏమాత్రం మార్చకుడా దాని పక్కన మరో పెద్ద గీత గీస్తే మొదటి గీత చిన్నదవుతుంది. అలాగే ఉన్న కష్టం ఉండగా మరో పెద్ద కష్టం వచ్చి పడితే ముందటి కష్టం చిన్నదవుతుంది. ఈ నిత్యసత్యాలు అన్ని కాలాల్లోను, అందరికీ తెలిసినవి, అనుభవంలోనివే. కరోనా ఉపద్రవం ముంచుకొచ్చే దాకా పలు విషయయాలు మన దేశ ప్రజల మనస్సుల్లో సమస్యలుగా మెదులుతుండేవి. ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా సమస్యలుగా తోచేవి కొనైయితై, మొత్తం జాతి సమస్యలుగా అందరూ భావించేవి ఇంకొన్ని. రోహిగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లు, ఇస్లామిక్‌ ‌తీవ్రవాదం, నక్సలిజం, పాక్‌ ఉ‌గ్రవాదుల చొరబాట్లు, మతమార్పిడులు వంటివి వాటిలో ముఖ్యమైనవి.
కరోనా ముప్పు ముంచుకురాగానే మిగతా సమస్యలన్నీ ప్రాధాన్యం కోల్పోయాయి. ఒక మతం వారు కరోనా వ్యాప్తికి తోడ్పడ్డం వెనుక వారి లక్ష్యం కూడా అదేననే ఆరోపణలు వచ్చాయి. ప్రజలు, ప్రభుత్వ యంత్రాగం కరోనా కట్టడి కార్యక్రమాల్లో తలమునకలైతే తమ మతస్తుల అక్రమ చొరబాట్లు, మతమార్పిడి వంటి కార్యక్రమాలను యథేచ్ఛగా సాగించవచ్చని వారు తలచినట్లు వ్యాఖ్యలు వినిపించాయి. కరోనా వ్యాప్తికి తోడ్పడే క్రమంలో తమ వారి ప్రాణాలకు ముప్పు కలిగినా దైవకార్యలో మరణం త్యాగభరితమైన ఆత్మాహుతితో సమానమని, అట్టి వారికి నేరుగా స్వర్గం లభిస్తుందని నూరిపోసినట్లు కూడా వినికిడి. మర్కజ్‌కు వచ్చిన వారిని త్వరగా సాగనంపమని నిర్వాహకులను కోరిన ప్రభుత్వ అధికారుల ఆదేశాలను లెక్కచేయక, వారిని దేశంలోని వివిధ ప్రాతాలకు రహస్యంగా చేరవేయడం ఈ వార్తా కథనాలను బలపరుస్తోంది. ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా పీడితులకు వైద్యం అందిచాలని వెళ్లిన ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిపై ఉమ్మడం, రాళ్లతో దాడి చేసి తరిమి కొట్టడం లాంటి సంఘటనలకు భాగ్యనగరి ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ఆంధప్రదేశ్‌లో ప్యారిస్‌ ‌నుండి విజయవాడ వచ్చిన ఓ యువకుడు తన ఇంట్లో స్వీయ ఐసొలేషన్‌కు వెళ్లగా అతని తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తిని నివారించారు. అదే విజయవాడలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఆ నగరానికి కరోనా తెగులు చేరిన వైనాన్ని ఈ ఏప్రిల్‌ ‌తొమ్మిదిన నగర పోలీసు కమిషనర్‌ ‌స్వయంగా మీడియా ఎదుట వివరిచడం చరిత్ర. ఇవన్నీ తెలుగు నాట కరోనా వ్యాప్తి కారకులను వేలెత్తి చూపుతూ కుట్రకోణాన్ని బలపరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న వారికి మాత్రం ఈ కుట్ర కోణం కనిపిచకపోగా అలాంటి వారి పట్ల సానుభూతి కురిపించడం విడ్డూరం. తెలుగు పాలకుల ఈ విపరీత ధోరణి పట్ల సామాన్య ప్రజల్లో కొంత విముఖత, నిరసన పొడసూపినా ప్రజల్లో వేళ్లూనుకున్న పార్టీ రాజకీయ రాగద్వేషాల వల్ల పాలకుల వికృత వైఖరిని ఉపేక్షిస్తున్నట్లు తోస్తున్నది. పశ్చిమబెంగాల్ ప్రజలు ఒకప్పుడు చూపిన ఈ ఉపేక్ష, ఉదాసీనత ఫలితాల తీవ్రతను వెల్లడించే రుజువులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమబెంగాల్ పోలీసులు ఇటీవల మగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ వెంటనే బంగ్లాదేశ్‌ ‌పోలీసులు వీరిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ 1971లో జరిగిన బంగ్లా జాతిపిత షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమన్‌ ‌హత్య కేసులో నిందితులు. ముజిబుర్‌ ‌హత్య తరువాత బంగ్లాదేశ్‌లో కనిపించకుండా పోయిన ఈ ముగ్గురు నాలుగు దశాబ్దాలుగా ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ, ముఖ్యంగా బంగ్లాదేశ్‌ ‌పోలీసులకు తెలీదు. బంగ్లాదేశ్‌లో అదృశ్యమైన తరువాత ఈ ముగ్గురూ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. భారత్‌లో వీరికి ఇప్పుడు ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తిపు కార్డులూ ఉన్నాయి. ఒకరికైతే పాస్‌పోర్టు కూడా ఉంది. భారత్‌లోకి వస్తున్న చొరబాటుదారులు ఎలా దర్జాగా భారత పౌరులుగా మారుతున్నారో వెల్లడించే ఉదాహరణల్లో ఇది ఒకటి మాత్రమే. ఈ అక్రమ చొరబాటుదారులను ఓటర్లుగా చూస్తూ మైనారిటీల పేరిట వారికి వత్తాసు పలకడంలో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు పోటీ పడి అనుసరించిన వైఖరినే ఇవాళ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కొనసాగిస్తోంది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో స్థిరపడిన రోహింగ్యాల, బంగ్లా చొరబాటు దారుల పట్ల మజ్లిస్‌, ‌తెరాసలు ఇదే వైఖరిని కొనసాగిచడం గమనార్హం. జాతి సమైక్యత, సమగ్రతలకు చెరుపు చేసే ఈ ఓటుబ్యాంకు రాజకీయాల వికృత క్రీడను చూస్తూ పశ్చిమబెంగాల్‌ ‌హిదువులు మిన్నకుడి పోయారు. ఫలితంగా సరిహద్దుల వెంట సుమారు నూరు కిలోమీటర్ల దాకా విస్తరిచిన వందలాది హిందూ మెజారిటీ గ్రామాలు నేడు ముస్లిం మెజారిటీ గ్రామాలుగా మారి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ రాగద్వేషాలతో పశ్చిమబెంగాల్‌ ‌ప్రజలు ఒకనాడు అనుసరించిన ఉదాసీనత ఫలితాన్ని ఇవాళ అక్కడి హిందువులు చవిస్తున్నారు.
తెలుగు ప్రజలు హంసల్లా క్షీర నీర న్యాయం పాటిచి రాజకీయ అభిమానం, జాతీయ అభిమానం వేర్వేరని గ్రహించి, జాతి భద్రత, సమైక్యత, సమగ్రతలకు చెరుపు చేసే వ్యక్తులను, శక్తులను, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా గమనించి, ఎవరి స్థానం వారికి చూపిస్తారని ఆశిద్దా!

About Author

By editor

Twitter
Instagram