జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ వికారి ఆషాడ శుద్ధ నవమి – 29 జూన్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


కొంత దూరం సైకిలు తొక్కుతూ వెళ్లి వేగం అందుకున్నాక తొక్కడం ఆపేసి రెండు పాదాలనూ పెడల్స్ ‌మీద పెట్టి విశ్రాతిగా కూచున్నా కొంతసేపు ఆగకుడా అది ముందుకు సాగడం సైకిలు తొక్కిన, తొక్కడం చూసిన వారందరికీ అనుభవమే. ముందు కొంతసేపు బలంగా తొక్కడం వల్ల సైకిలు పొందిన చలనశక్తి కాసేపు తొక్కడం ఆపినా కూడా దాన్ని అలాగే మరికొంతసేపు ముందుకు తోస్తుంటుందని భౌతిక శాస్త్రజ్ఞులు చెపుతారు. చెట్టు చేమలతో పాటు మానవులతో సహా సమస్త జీవరాశిలో కూడా ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా ఒక తరం నుండి మరోతరానికి సంక్రమిచడం సహజమని జీవశాస్త్రజ్ఞులు చెపుతారు. బలమైన జీవజాతులను కొనసాగిచడానికి, వృద్ధి చేయడానికి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఎప్పటికప్పుడు మేలైన విధానాలను వెల్లడిస్తూటారు.

కొవిడ్‌19 ‌వైరస్‌ ‌ప్రపంచ దేశాలను చుట్టబెట్టిన ఫలితంగా కరోనా పీడితులు పెద్దఎత్తున మరణిస్తుడడంతో వైద్య, ఆరోగ్య నిపుణుల, పరిశోధకుల దృష్టి ప్రజల రోగనిరోధక శక్తి వైపు మళ్లిది. ఇంగ్లాడు, అమెరికా, ఫ్రాన్సు వంటి సంపన్న దేశాల జీవన ప్రమాణాలు, సౌకర్యాలతో పోల్చితే భారత్‌ ‌చాలా వెనుకబడినట్లు విద్యావంతుల, విశ్లేషకుల అంచనా. కనుక కరోనా భారత్‌ను తాకితే పెను విపత్తు తప్పదని అందరూ భయపడ్డారు. కానీ ప్రముఖుల, అంచనాలు, భయాలు తలక్రిదులయ్యాయి. కరోనా భారత్‌లోకి ప్రవేశించినా అందరూ ఊహించిన స్థాయిలో ముప్పు వాటిల్లలేదు. పైపెచ్చు పలు సంపన్న దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా పీడిత మరణాల రేటు తక్కువగా ఉండటమే కాక కోలుకుంటున్న వారి శాతం కూడా అధికంగా ఉంది. దీంతో ఆరోగ్య విజ్ఞాన ప్రపంచం విస్తుపోతున్నది. ఈ నేపథ్యలో భారత ప్రజల రోగనిరోధక శక్తి వైద్య నిపుణుల చర్చల్లోకి వచ్చింది.

భారతీయుల ఆహారపు అలవాట్లు, వంట దినుసులు.. ఇలా మానవుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పలు అంశాల చుట్టూ వైద్య ఆరోగ్య నిపుణుల శాస్త్రవేత్తల పరిశీలన, విశ్లేషణలు సాగాయి. ఈ పరిశోధన ఎందాక సాగిందంటే అల్లం, వెల్లుల్లి, శొఠి, పిప్పలి, మిరియాల కషాయాలతో కరోనాను ఎదుర్కోవచ్చని తీర్మానిచే దాకా సాగింది. కరోనాకు అల్లోపతిలో స్పష్టమైన మందు లేదని తెలిశాక ఆసుపత్రికి వెళ్లి పడుకోవడం కన్నా ఇంట్లో పడుకుని మిరియాల చారు, శొఠి కషాయం తాగడం మేలని భావించి ఇంట్లోనే ఉండి కోలుకున్న కొందరి అనుభవాలు ఈ తాజా పరిశోధకులకు ఊతమిచ్చాయి. కరోనా చికిత్సకు వాడినవన్నీ భారతీయ వంటింటి దినుసులే! మొత్తం మీద తరతరాలుగా భారతీయులు సాగిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంట దినుసుల కారణంగా భారతీయుల్లో రోగనిరోధక శక్తి అధికమై అది కొనసాగడం వల్లనే ఈ తరం భారతీయులు కరోనా దాడిని తట్టుకు నిలబడ్డారని పలువురు నిర్ధారించారు.

కరోనా పాజిటివ్‌ ‌కేసులకు చికిత్స అందిచిన ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ అల్లోపతి విధానాన్నే అనుసరించాయి. కరోనాను జయించే స్పష్టమైన ఔషధం ఏదీ తమ వద్ద లేకుండానే ఆసుపత్రులు నిర్వహించిన చికిత్స ఏమిటి? రోగికి కేవలం విశ్రాంతి కల్పించి, బలమైన ఆహారం ఇస్తూ పరిసరాల పరిశుభ్రతను కాపాడ్డం మాత్రమే ఆసుపత్రులు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోగిలోని సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తే అతనికి సోకిన కొవిడ్‌ 19 ‌వైరస్‌ను జయించిదని విశ్లేషకుల నిర్ధారణ. పూర్వికుల నుండి అనువంశికంగా సంక్రమిచిన సహజ సిద్ధ రోగనిరోధక శక్తిని కాపాడుకోగలిగిన వారు ఆసుపత్రులకు వెళ్లక పోయినా సాధారణ జలుబు, జ్వరం మాత్రలతో ఆయుర్వేదం సూచించిన కషాయాలతో కరోనా వైరస్‌ ‌సోకినా తట్టుకుని తేలిగ్గా బయట పడడం వెనుక మర్మమిదే.

తాము ఆరోగ్యంగా జీవించి, తదుపరి తరం కూడా ఆరోగ్యంగా జీవించడానికి అనువుగా రోగనిరోధక శక్తిని ప్రోది చేయడంలో పూర్వికులకు తోడ్పడిన ఆహారపు అలవాట్లు, పదార్ధాల గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ ‌సి ది ఎనలేని పాత్ర అని వైద్యులందరూ అంగీకరిస్తారు. ఇటీవలి కాలం వరకూ మన పూర్వికులు సి విటమిన్‌ ‌పుష్కలంగా లభిచే చింత, మామిడి, ఉసిరికాయల ఊరగాయలు ఏడాది పొడవునా నిల్వ చేసేవారని, నిమ్మ, దబ్బ లాంటి పచ్చళ్లను తరచూ తినే వారని తెలిశాక పూర్వికులు అందించిన రోగనిరోధక శక్తి మర్మం తేటతెల్లమవుతోంది. అవసరాలు, వ్యామోహాలు కారణాలు ఏవైనా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి కోల్పోయిన వ్యక్తులు, కుటుబాలు కరోనా కాటుకు బలికావడం కళ్లకు కడుతోది. వారసత్వగా పూర్వికుల నుడి సంక్రమిచిన స్థిర చరాస్థులను భద్రంగా కాపాడి తదుపరి తరాలకు అందజేసినట్లే పూర్వికుల నుండి మనకు సంక్రమిచిన రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని సంరక్షించి తదుపరి తరాలకు అందజేయడం మన కర్తవ్యం, బాధ్యత. వివిధ కారణాల వల్ల మన ఆహారపు అలవాట్లలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వికృతులను పరిహరించి, మేలైన ధోరణులను అనుసరిచి ఆరోగ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం!

About Author

By editor

Twitter
YOUTUBE