అయోధ్య రామజన్మ భూమి స్థలంలో మరొకసారి హిందూ ఆలయ శిథిలాలు బయటపడ్డాయి. ఐదు అడుగుల ఎత్తయిన శివలింగం, పదమూడు స్తంభాలు తవ్వకాలలో వెలుగు చూశాయి. అలాగే దేవుళ్లు, దేవతల శిథిల శిల్పాలు కూడా బయటపడ్డాయి. 2019 నవంబర్‌లో భారత సర్వోన్నత న్యాయస్థానం అయోధ్య రాముడిదేనని తీర్పునిచ్చిన తరువాత ఈ విగ్రహాలు, స్తంభాలు బయటపడడంతో మళ్లీ వార్తలలోకి వచ్చింది. హిందూ ఆలయం మీదనే మసీదు నిర్మాణం జరిగిందన్న లక్షలాది మంది రామభక్తుల వాదన, మసీదు కింద హిందూ మందిర శిథిలాలు ఉన్నాయంటూ 2018లో సర్వేలో పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించి నది సత్యమేనని మరొకసారి రుజువైంది.

అయోధ్యలోని రామజన్మ భూమిగా చెప్పే ప్రాంతంలో కొత్త ఆలయ నిర్మాణానికి నేల చదును చేసే పని జరుగుతుండగా ఇవన్నీ బయటపడినాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ‌ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ఈ ‌విషయం చెప్పారు. ప్రాంగణంలో చదును చేస్తుండగా ఒక శివలింగంతో పాటు అదే ఆకృతిలో ఉన్న మరొక చెక్కడం కూడా కుబేర తీలా దగ్గర దొరికిందని ఆయన చెప్పారు. ఆలయ నిర్మాణానికి జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చిన తరువాత కొద్దిరోజులుగా అక్కడ నేలను చదును చేసే పని చేపట్టారు. మే 11న నిర్మాణం పనులు ఆరంభమై, నేలను చదును చేస్తున్నప్పుడు అనేక ఇలాంటి ఆకృతులు బయటపడుతూనే ఉన్నాయని విశ్వహిందూ పరిషత్‌ ‌కూడా వెల్లడించింది. కలశం, ఆమలక వంటవి ఇక్కడ దొరికాయని పరిషత్‌ అధికార ప్రతినిధి వినోద్‌ ‌బన్సాల్‌ ‌చెప్పారు. చాలా కఠిన నిబంధనలు ఉన్నందున పని ఆలస్యంగా నడుస్తున్నదని ఆయన చెప్పారు. పురాతన హిందూ దేవాలయాలలో ఎనిమిది శుభ చిహ్నాలు ఉంచేవారు. అందులో ఒకటి పూర్ణ కలశం.
రామజన్మభూమి స్థలంలో కొన్ని శతాబ్దాల పాటు ఉన్న మసీదు కింద (బాబ్రీ మసీదు) కింద హిందూ ఆలయ శిథిలాలు ఉన్నాయని 2018లోనే డాక్టర్‌ ‌కెకె మహమ్మద్‌ ‌వెల్లడించిన సంగతి గుర్తు చేసుకోవాలి. ఆయన ఆర్కియ లాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ప్రాంతీయ సంచాలకులు. అయోధ్యలో ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా సర్వే చేసినప్పుడు దాని కింద కొన్ని స్తంభాలు, ఇటుకలు కూడా అక్కడ ఆలయం ఉన్న సంగతిని రుజువు చేశాయని మహమ్మద్‌ ‌చెప్పారు. అయోధ్య తీర్పు వెలువడిన తరువాత కూడా ఆయన ఇదే అంశాన్ని పునరుద్ఘా టించారు. నిజానికి 1992లో మసీదు కూల్చడానికి ముందే అక్కడ కొన్ని స్తంభాలు దొరికాయని కూడా ఆయన ఒక వ్యాసంలో వెల్లడించారు. ఆచార్య బిబి లాల్‌ ‌నాయకత్వంలో అయోధ్యలో తవ్వకాలు జరిపిన ఆర్కియలాజికల్‌ ‌సర్వే బృందంలో డాక్టర్‌ ‌మహమ్మద్‌ ‌కూడా ఒకరు. కానీ లెఫ్ట్ ‌చరిత్ర కారులు చాలామంది ఈ ఆధారాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చి దేశ ప్రజలను పెడతోవ పట్టించడానికి చూశారు. చరిత్రకారుల ఈ ధోరణి మీద సుప్రీంకోర్టు వ్యాఖ్య కూడా చేసింది. లార్సన్‌ అం‌డ్‌ ‌టూర్బో సంస్థ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ నిర్మాణం పనిలో అయోధ్యలోని ప్రజా పనుల శాఖ సహకరిస్తున్నది. ఈ శిథిలాల గురించి ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ఒక ప్రకటన చేయవలసి ఉంది. అలాగే కుహానా మేధావులు ఇంకా గగ్గోలు మొదలు పెట్టవలసి ఉంది.

About Author

By editor

Twitter
Instagram