ప్రస్తుత దేశ పరిస్థితులు – స్వయంసేవకుల పాత్రపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ఉద్బోధ

సమాజ సర్వతోముఖాభివృద్ధి మన లక్ష్యం. సంఘ స్వయంసేవకులు ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని సేవచేయాలి. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలని చేరుకోవడానికి ఇది మంచి అవకాశమని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు. కనివిని ఎరుగని రీతిలో సంభవించిన ఈ విపత్తులో ఇంకా ఎన్ని రోజులు పని చేయాలని అనుకోకూడదు. విసుగు, అలసట చూపకుండా ధైర్యంతో పనిచేస్తూ ముందుకు పోవాలన్నారు. నాగపూర్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రస్తుత దేశ పరిస్థితులు – మన పాత్ర’ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సోషల్‌ ‌మీడియా ద్వారా దేశ స్వయంసేకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచాన్ని తీర్చిదిద్దాలంటే ముందు మనం మంచిగా మారాలని స్వయం సేవకులకు దిశానిర్దేశం చేసారు. జీవితం, సంఘకార్యం ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. ‘ఏకాంత్‌ ‌మే ఆత్మసాధన లోకాంత్‌ ‌మే పరోపకార్‌’. (ఏకాంతంలో వ్యక్తిగత అభ్యాసం – ప్రజల మధ్య ఉన్నప్పుడు పరోపకార భావన) జీవితం అంటే ఇదేనని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ మైదానంలోకాక కుటుంబసభ్యులతో కలసి ఇంట్లో సంఘ ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులను అనుకూలంగా మలచుకుని చేసే విశేష కార్యపద్ధతి సంఘానికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలందరూ గమనిస్తు, ప్రొత్సహిస్తున్నారని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడే వరకు సంఘ స్వయం సేవకులందరూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలన్నారు. ఈ వ్యాధితో పోరాడాలంటే ఎవరి ఇంట్లో వారుండాలి. బయటి పనులన్నీ మానుకుని, ఇంట్లోనే ఉంటూ చేయగలిగే పనులు చేయాలని ఆయన ఉద్భోదించారు. నేడు మైదానంలో శాఖలు జరగడం లేదు. సంఘ శిక్షావర్గలు నిలిచిపోయాయి. సంఘకార్యం ఆగిపోయిందని స్వయంసేవకులు భావించ వలసిన అవసరం లేదన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నా జీవితం గడుస్తోంది. సంఘ కార్యం కూడా అంతే. నిత్య కార్యక్రమాలు ఆగిపోయినా శాఖ జరుగుతోందని, అయితే స్వరూపం మారి సేవగా రూపొందిందని మోహన్‌జీ వివరించారు.
రూపమేదైనా అది సేవయే
ఒక బౌద్ధ భిక్షువు చైనా వెళ్లాడు. మత ప్రచారం చేశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడి వారికి తథాగతుడి జీవిత చరిత్రను ప్రచురించాలను కొన్నారు. పుస్తకం వ్రాతప్రతి తయారైంది. ప్రచురించడానికి అవసరమైన ధనం సేకరించారు. పుస్తకం ప్రచురణాలయానికి వెళ్లే ముందురోజు రాత్రి భూకంపం వచ్చింది. దాంతో పుస్తక ప్రచురణను పక్కనబెట్టి, తాను సేకరించిన ధనాన్ని బాధితుల సేవ కోసం వినియోగించాడు. కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. మళ్లీ పుస్తక ప్రచురణ కోసం ధనం సేకరించాడు. మళ్లీ ప్రచురణకు వెళ్తుందనగా ముందు రోజు వరదలు వచ్చాయి. పుస్తక ప్రచురణ ఆగిపోయింది. ధనమంతా సహాయ కార్యక్రమాలకు ఉపయోగించాడు. మూడవసారి ధనసేకరణ జరిగాక పుస్తకం ప్రచురితమైంది. పుస్తకపు మొదటి పేజీలో తృతీయ ముద్రణ అని ప్రచురించారు. అంటే మొదటి రెండు సార్లు ధనం సేకరించినా, పుస్తకం ప్రచురించక పోయినా, ప్రజలకు మేలు జరిగింది. కాబట్టి ఆ రెండు సందర్భాలూ రెండు ప్రచురణలుగా భావించడం జరిగిందన్నమాట.
సంఘం చేస్తున్న సేవ ఉద్దేశం
ప్రపంచానికి దుఃఖవిముక్తి కోసమే సంఘం తన కార్యక్రమాల స్వరూపం మార్చుకుని సేవాకార్యం చేస్తుందని మోహన్‌జీ తెలిపారు. స్వయంసేవకులకే కాదు సమాజానికి కూడా దీని వెనుకున్న ఉద్దేశ్యం తెలుస్తుందని అన్నారు. పేరు కోసం కాకుండా ఇతరులకు స్ఫూర్తి లభిస్తోందన్న కారణం చేతనే సేవా కార్యక్రమాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారం చేపట్టిందని చెప్పారు. నిరహంకారం, ఆత్మీయతతో దేశానికి, సమాజానికి సేవ చేయా లని స్వయంసేవకులకు ఆయన పిలుపునిచ్చారు. మనవాళ్లు అనే భావనతో, ప్రేమతో, ఉత్తమంగా బాధితులకు సేవ చేయాలని, సేవ పోటీ కోసం చేసేది కాదని మోహన్‌జీ వివరించారు. హనుమంతుడి గురించి వాల్మీకి పేర్కొన్న ధృతి, దృష్టి, మతి, సావధానత్వం అనే గుణాలను గుర్తు చేసుకుంటూ పనిలో నిమగ్నం కావాలని సూచించారు.
సంకట సమయాల్లో ఆత్మవిశ్వాసం అవసరం
కరోనా రోగం కొత్తది. కాని దాని గురించి భయపడాల్సిందేమీ లేదు. ప్రశాంతంగా ఆలోచించి, పనిని యోజన చేసుకోని, ఆత్మ విశ్వాసంతో, భయంలేకుండా పనిచేయాలని భాగవత్‌ అన్నారు. ఈ వ్యాధి ఎన్నిరోజు లుంటుందో తెలియదు. అది ఉన్నన్ని రోజులు బాధితుల కోసం సేవాకార్యం చేయాలి. మధ్యలో వదిలివేయడానికి వీలు లేదు. అలా వదిలేస్తే కరోనా విషయంలో విజయం లభించదని ఆయన తెలిపారు.
ఇటీవల రీడర్స్ ‌డైజెస్ట్‌లో చదివిన ఒక సంఘటన గురించి ఆయన వివరించారు. అది అమెరికాకి చెందిన వ్యక్తిది. దాని శీర్షిక Difference between Success and Failure. ఆ సంఘటన ఇలా ఉంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే తన ఆస్తి అంతా ఖర్చు పెట్టాక ఆ పని చేయాలనుకున్నాడు. డబ్బు త్వరగా ఖర్చు చేయాలంటే జూదం ఆడటమే సరైందనుకుని పట్టణానికి బయల్దేరాడు. దారి మధ్యలో పొలాల్లో ఏవో త్రవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడికెళ్లగా, ఆ పొలాల్లో మాంగనీస్‌ ‌కొరకు త్రవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఎంత పనిచేసినా ఖనిజం బయటపడలేదు అందుకే పొలాన్ని అమ్మేద్దామనుకుంటున్నామని త్రవ్వకాలు జరిపే కంపెనీ యజమానులు చెప్పారు. జూదం కన్నా డబ్బు త్వరగా ఖర్చవుతుందిగదా అని ఈ వ్యక్తి ఆ పొలాలను కొన్నాడు. దాంతో అక్కడ పనిచేసే కార్మికులు తాము ఉండాలా, వెళ్లిపోవాలా అని అడిగారు. ఎలాగూ సాయంత్రం దాకా పనిచేయడానికి వచ్చారు కాబట్టి అప్పటిదాకా పని చేయమన్నాడు. ఆ తర్వాత మూడు అడగుల లోతు త్రవ్వేటప్పటికి మాంగనీస్‌ ‌ఖనిజం బయటపడింది. దాంతో అతడు మరింత ధనవంతుడయ్యాడు. మూడు అడుగుల తేడాతో ఆ కంపెనీలు ఓటమిపాలయ్యాయి. ఈ వ్యక్తి విజయం సాధించాడు. పనిని చేస్తూ అలసి పోరాదు. బాధితులంతా మనవారే అనే భావనతో అందరి కోసం పనిచేయాలని మోహన్‌ ‌జీ పేర్కొన్నారు.
విశ్వమంతా ఒకే కుటుంబం  ఇదీ మన భావన
ఒక ఔషధం ఎగుమతి పట్ల మనం నిషేధం విధించుకున్నా, ప్రపంచానికి అది అవసరమైనపుడు ఆ నిషేధాన్ని ఎత్తేసి అందరికి పంపించాం. ఇది సగటు భారతీయుల మనస్తత్వమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ సొంతవారిగా భావిస్తాం. అందుకే వారి అవసరం కోసం కేంద్రం మందులు పంపిందని చెప్పారు.
మనమే స్ఫూర్తి
కరోనా సమయంలో ఆరోగ్య విభాగం సూచించిన జాగ్రత్తలు, విధించిన నియమాలన్నీ పాటించాలని సూచించారు. స్వయంసేవకులు నియమనిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ అనుమతి తీసుకుని మాత్రమే పనిచేయాలి అని అన్నారు. అప్పుడే ప్రజలకు ఈ విషయాలు తెలిపే అర్హత మనకు లభిస్తోందని స్వయం సేవకులను ఉద్దేశించి అన్నారు. సేవ చేసే సమయంలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఈ సమయంలో పని చేస్తూ అలసిపోరాదు. శక్తి పొందడానికి కషాయం (కాడా) తాగాలి. మాస్క్ ‌పెట్టుకోవాలి. స్వచ్ఛత పాటించాలి. బుద్ధిని భద్రంగా ఉంచుకోవాలి. సాధారణ సూచనలు అందరికీ విశేష పరిస్థితిలో విశేషంగా వివరించాలని మోహన్‌జీ స్వయంసేవకులక• జాగ్రత్తలు చెప్పారు. క్రమశిక్షణతో మెలుగుతూ సేవాకార్యం వల్ల లాభం పొందడానికి వచ్చే వారికి సేవ చేయాలి. ఎవరికి ఏ సహాయం అవసరమో ఆలోచించి అందిస్తూ ఇతరులకు స్ఫూరినివ్వాలని ఆయన కోరారు.
భయమే రోగం
నిద్ర, సోమరితనం, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘ సూత్రం అనే ఆరు దోషాలను దూరం చేసుకోంటే విజయం లభిస్తోందని ఆయన చెప్పారు. ఆలస్యం దీర్ఘ సూత్రం రెండు పనికిరావు, తత్పరత మాత్రమే పనికి వస్తుంది. భారతదేశం తత్పరతను ప్రదర్శించిందని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలను ఆయన అభినందించారు. భయం, క్రోధం కూడా పనికిరావని, కొంతమంది భయంతో కరోనా పరీక్షలకు దూరంగా ఉంటూ, ప్రభుత్వం తమ మీద ఆంక్షలు విధిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భయం, క్రోధం కారణంగానే కొన్ని దేశాలలో కరోనా చాలా వ్యాప్తి చెందిందని మోహన్‌జీ విశ్లేషించారు. ఎల్లప్పుడూ కొన్ని విషయాల నుండి లాభాలను పొందే వాళ్లు ఉంటూనే ఉంటారు. ప్రజల్లో ఈ భయాన్ని తొలగిస్తూ ఆలోచించి పనిచేయాలని ఆయన ఉద్భోదించారు. సానుకూల దృక్పథంతో, నిర్భయంగా ముందుకు వెళ్లాలని, 130 కోట్లమంది మనవాళ్లే అనే ఆలోచనతో పనిచేసి అందరినీ రక్షించాలని స్వయంసేవకులకు పిలుపునిచ్చారు.
అప్రమత్తంగా ఉందాం
కొందరికి కీడు చేయాలనే ఆలోచన ఉంటుంది. వీరి వల్లనే ఈ వైరస్‌ ‌వృద్ధి చెందు తోంది. ఇటువంటి ఆలోచనలకు అందరూ దూరంగా ఉండాలి. ‘భారత్‌ ‌తెరే తుక్‌డే హోంగే’ (భారత దేశం ముక్కలు, ముక్కలు అవుతోంది) అంటూ స్వార్ధప్రయోజనాలకోసం కలతలు రేపేవారు, సమాజంలో భయాన్ని, క్రోధాన్ని పెంచేవాళ్లు ఎప్పుడు ఉంటారు. అలాంటి వారి వల్ల ప్రభావితం కారాదని చెప్పారు. మనం మన పని చేసుకుంటూ పోవాలి. ద్వేషాన్ని పెంచిపోషించే వారిని ఎదుర్కొంటూనే పనిచేయాలి. వారి చర్యలకు స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని సంఘ వ్యతిరేకులను ఉద్దేశించి మోహన్‌జీ మాట్లాడారు.
సాధువుల హత్య అమానుషం ప్రతీకార భావనలు వద్దు
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఇద్దరు సన్యాసుల హత్యను మనసులో పెట్టుకొని బేధభావాలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్వయంసేవకులను కోరారు. దేశమంతా ఒక్కటే అనే భావనతో పనిచేయాలన్నారు. సాధువుల హత్య అందరిలోనూ బాధ కలిగించింది. ప్రస్తుతం అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొని ఉంది. దాన్ని సరి చేయడానికి సమయం పడుతుంది. ఒక సాధారణ మనిషికి మార్గం చూపే వ్యక్తుల అవసరం నేడు ఉందని మోహన్‌ ‌జీ అన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభిస్తారు. తరగతులు ఎలా నిర్వహించాలి. భౌతిక దూరం ఎలా పాటించాలి అనేవి ఆలోచించాలి. క్రమశిక్షణతో ప్రజలు మెలిగేలా ఆలోచించాలి. అందరితో చర్చించాలని ఆయన అన్నారు. స్వీయ నియంత్రణ ఎంతో అవసరం అవుతోందని చెప్పారు.
సరికొత్త గుణపాఠం-స్వావలంబన
ప్రపంచమంతటా ఒకేసారి ఈ రోగం వ్యాపించింది. మనం పోరాడుతున్నాం. దీనివల్ల స్వావలంబన అలవాటవుతుందని ప్రధాని సర్పంచులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ కష్టకాలాన్ని గుణపాఠంగా తీసుకుని, చేయాలనుకొంటున్న కార్యం పూర్తి చేద్దామని మోహన్‌ ‌జీ తెలిపారు. పట్టణాల నుండి ఎందరో స్వంత గ్రామాలకు వెళ్లిపోయారు. వారందరూ తిరిగి వస్తారా? వారికి మళ్లీ ఉద్యోగాలు దొరుకుతాయా? ఆలోచించాలి. అందరికీ స్వావలంబనం అలవాటు చేయాలని ఆయన స్వయంసేవకులకు సూచించారు.
స్వదేశీ జీవన విధానం కావాలి
పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా దేశాభివృద్ధి జరగాలని సర్‌ ‌సంఘచాలక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ ఆర్థిక విధానంతో ఈ కష్టాన్ని ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజమంతా ఇందులో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ తయారైన వస్తువులనే ఉపయోగించే భావన నిత్యజీవితంలో అలవాటు కావాలి. స్వదేశీ ఆచరణ కోసం స్వదేశీ ఉత్పత్తులు, నాణ్యతతో కూడినవి రావాలన్నారు. దిగుమతులు కూడా మన షరుతులపైనే జరగాలని డిమాండ్‌ ‌చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మనమంతా చేయవలసింది ఇదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రకృతిని రక్షించుకుందాం
కరోనా వచ్చిన ఈ సమయంలో నదులను, వాతావరణాన్ని చూస్తే అవి ఎంతో పరిశుభ్రంగా మారిపోయాయి. మళ్లీ మన జీవన కార్యక లాపాలు మామూలు స్థితికి చేరాక వాటిని ఇప్పుడున్నంత పరిశుభ్రంగా ఉండేలా చూసుకో వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ ‌వినియోగం తగ్గించాలి. సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రభుత్వం స్వదేశీ విధానాల కోసం చట్టాలు రూపొందిస్తోంది. కానీ సమాజం అదే బాటలో పయనించేవరకు దాని ప్రభావం ఉండదని మోహన్‌జీ చెప్పారు. లాక్‌డౌన్‌ ‌వల్ల స్వయంసేవకులు కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలోనే కుటుంబంలో సంస్కారయుత వాతావరణం నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. అందరికి ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తినివ్వాలని చెప్పారు. ఇప్పుడు ఇంటి గురించి పట్టించుకునే అలవాటు కలిగింది. ఇదే విధంగా సమాజం పట్ల కూడా స్వయంసేవకులకు బాధ్యత పెరగాలని సూచించారు. ప్రజలు క్రమశిక్షణ పాటిస్తున్న చోట కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. లేనిచోట అది విస్తరిస్తోంది. కనుక ప్రజలంతా క్రమశిక్షణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నూతన భారతావని నిర్మిద్దాం
సమాజంలో సద్భావన, పరస్పర సహకార వాతావరణం, ప్రశాంతత నెలకొనేలా చూడా లని ప్రజలందరికి మోహన్‌ ‌జీ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు స్వార్థప్రయోజనాలు వీడి రాజకీయాలకతీతంగా దేశం గురించి ఆలోచించాల్సిన తరుణమిదని నేతలకు కర్తవ్యం బోధించారు. ఆత్మవిశ్వాసంతో అందరూ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని తమదిగా భావించి పని చేయాలని ఆయన కోరారు. ఇది నేటి అవసరం. ఇదే దేశ ప్రజలందరి బాధ్యత అని గుర్తుచేశారు.
సోదరి నివేదిత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌చెప్పినట్లు అందరూ క్రమశిక్షణను పాటిస్తే ఇటువంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని మోహన్‌జీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉపయోగపడే ఎన్నో సందేశాలను ఈ విపత్తు ఇస్తోందని, భారతదేశాన్ని విశ్వ గురువుగా చేసేందుకు అందరం ఆత్మవిశ్వాసంతో పనిచేద్దా మని ప్రజలను కోరారు. సానుకూలంగా ఆలోచిస్తూ ఈ విపత్తును అవకాశంగా భావించి ముందుకు పయనిద్దాం అని స్వయంసేవకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

About Author

By editor

Twitter
Instagram