ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

తిరుమల నవరాతి బహ్మోమత్సవాల సందర్భంగా…

తిరుమల.

నిత్యకల్యాణం పచ్చతోరణం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో కొండమీద వెలసిన దివ్యక్షేత్రం.

హిందుస్థానం (భారతదేశం) లోని 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో మొదటిది.

ప్రపంచంలోనే ప్రసిద్ధ దేవాలయంగా, పుష్పమండపంగా స్వయంవ్యక్త క్షేత్రంగా పేరుగాంచి, ఏడుకొండలైన అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిలపై వెలసిన కలియుగ మహా పుణ్యక్షేత్రం.

భగవాన్‌ శ్రీ మహావిష్ణువుకు పాన్పు అయిన ఆదిశేషుడు చుట్టచుట్టుకొని తిరుపతిలో ఏడుకొండల ఆకారంగా మారిపోయాడని, శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తజనుల పాపాలు హరించటానికి కేవలం దర్శనం చేసు%