పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు నల్లేరు మీద నడక లాంటిది కాదని ఊహించిందే.అంతా ఊహించినట్టుగానే ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ‌మనోజ్‌ ‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది శుభ పరిణామమే. అలాగే ఈ చట్టం అమలు గురించి కేంద్రం ఇచ్చిన నిబంధనల మీద కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. మొదట పిటిషనర్ల వాదన మీద తమ సమాధానం ఏమిటో తెలియచేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ 236 పిటిషన్లు, అమలుకు సంబంధించిన నిబంధనలను సవాలు చేస్తూ 20 విన్నపాలు దాఖలైనాయని కేంద్రం తరఫున హాజరైన మెహతా తెలియచేశారు. సీఏఏ ఉద్దేశం ఎవరి పౌరసత్వం రద్దు చేయడం కాదని మెహతా మరొకసారి సుప్రీంకోర్టుకు విన్నవించారు. మరొక విషయం- 2014కు ముందు దేశంలో ప్రవేశించినవారికి మాత్రమే పౌరసత్వం ఇస్తామని, కొత్తగా ఏ ఒక్కరికి ఇవ్వడం లేదని కూడా ఆయన తెలియచేశారు. అయినప్పటికి, కోర్టులో తుది నిర్ణయం వెలువడే వరకు ఎవరికీ కొత్తగా పౌరసత్వం ఇవ్వకూడదని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషర్ల తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ‌కోరారు. ముస్లిం లీగ్‌ ‌తరఫున వాదిస్తున్న కపిల్‌ ‌సిబల్‌ ‌కూడా కోర్టును ఇదే విధంగా అభ్యర్థించారు.

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు నల్లేరు మీద నడక లాంటిది కాదని ఊహించిందే.అంతా ఊహించినట్టుగానే ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ‌మనోజ్‌ ‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది శుభ పరిణామమే. అలాగే ఈ చట్టం అమలు గురించి కేంద్రం ఇచ్చిన నిబంధనల మీద కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. మొదట పిటిషనర్ల వాదన మీద తమ సమాధానం ఏమిటో తెలియచేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ 236 పిటిషన్లు, అమలుకు సంబంధించిన నిబంధనలను సవాలు చేస్తూ 20 విన్నపాలు దాఖలైనాయని కేంద్రం తరఫున హాజరైన మెహతా తెలియచేశారు. సీఏఏ ఉద్దేశం ఎవరి పౌరసత్వం రద్దు చేయడం కాదని మెహతా మరొకసారి సుప్రీంకోర్టుకు విన్నవించారు. మరొక విషయం- 2014కు ముందు దేశంలో ప్రవేశించినవారికి మాత్రమే పౌరసత్వం ఇస్తామని, కొత్తగా ఏ ఒక్కరికి ఇవ్వడం లేదని కూడా ఆయన తెలియచేశారు. అయినప్పటికి, కోర్టులో తుది నిర్ణయం వెలువడే వరకు ఎవరికీ కొత్తగా పౌరసత్వం ఇవ్వకూడదని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషర్ల తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ‌కోరారు. ముస్లిం లీగ్‌ ‌తరఫున వాదిస్తున్న కపిల్‌ ‌సిబల్‌ ‌కూడా కోర్టును ఇదే విధంగా అభ్యర్థించారు.

సీఏఏ అమలు ప్రకటన ఆ చట్టం రూపొందిన నాలుగేళ్ల మూడు మాసాలకు వెలువడిందని, ఆనాడు ఈ చట్టం లేదా పౌరసత్వ ప్రదానానికి సంబంధించిన నిబంధనలు మాత్రం పొందుపరచలేదని కపిల్‌ ‌సిబల్‌ ‌వాదించారు. చట్టం ప్రకారం చట్టం చేసిన ఆరు మాసాలలోనే దాని ప్రకటన వెలువడాలని, అలాగే ప్రతి మూడు మాసాలకి ఒకసారి పార్లమెంట్‌ ‌దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. బెలూచిస్తాన్‌ ‌హిందూ పంచాయత్‌ ‌సంస్థ తరఫున కేసు వాదిస్తున్న రంజిత్‌ ‌కుమార్‌ ‌మరొక అంశం కోర్టు ముందుకు తెచ్చారు. డిసెంబర్‌, 2014‌కు ముందు భారత్‌లో ప్రవేశించిన బెలూచిస్తాన్‌ ‌హిందువులకు పౌరసత్వం ఇచ్చారని, ఈ చర్య ఇతరుల హక్కులకు ఎలా భంగకరమవుతుందని ఆయన అన్నారు. బెలూచిస్తాన్‌ ‌నుంచి వచ్చిన హిందువులంతా వివక్షకు గురైన వారేనని కూడా ఆయన తెలియచేశారు. అలా వచ్చిన వారికి ఓటు హక్కు వస్తుంది కాబట్టి, అదే ప్రభావితం చేస్తుందని జైసింగ్‌, ‌సిబల్‌ ‌వాదించినా కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు.

ఎవరి హక్కులకు భంగం కలిగించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం సీఏఏ ఉద్దేశం కాదని కేంద్రం చెప్పింది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌లలో మత వివక్షకు గురైన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు అనే ఆరు మతాలకు చెందిన వారు (అక్కడ మైనారిటీలు, వివక్షకు గురి అవుతున్నవారు) భారత్‌లో పౌరసత్వం తీసుకుని సగౌరవంగా జీవించవచ్చునని భారత్‌ ‌ప్రకటించింది. అదే సీఏఏ ఉద్దేశం. నిజంగానే ఆ దేశాలలో ప్రధానంగా హిందువులు ఎలాంటి అగచాట్లకు గురి అవుతున్నారో తెలుసుకోవడం అవసరం. ఒకరి హక్కులు ఒకరికి భంగం కాకూడదు. అలాగే ఒకరి హక్కులు ఫణంగా పెట్టి వేరొకరు లాభపడకూడదు.

పాకిస్తాన్‌లోని మైనారిటీలు, అంటే హిందువుల దుస్థితి ఎంత ఘోరమో ఈ వాస్తవాలు చెబుతాయి.

  1. అపహరణ, మతమార్పిడి

ఏటా పాకిస్తాన్‌లో 1000 మంది హిందూ, క్రైస్తవ బాలికలు అపహరణకు గురి అవుతున్నారు. తరువాత వారి మతం మారిపోతోంది. ఈ బాలిక లను కుటుంబాల నుంచే తీసుకుపోయి వారి వయసుకు రెండు రెట్లు ఎక్కువ ఉన్న పురుషులకు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. లేదా లైంగిక అత్యాచారం చేసి అక్రమ రవాణా చేస్తారు. అంటే వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారు. అక్కడి కొన్ని సంస్థలు ఏమని ప్రచారం చేస్తాయంటే ఇలా హిందు లేదా ఇతర మతాల బాలికలను అపహరించి తేవడం హజ్‌ ఎ అక్బరీతో సమానం అని. అంటే పెద్ద మత కార్యం. 2004-2018 మధ్య ఇలాంటి అపహరణ కేసులు 7430 నమోదైనాయి. నిజానికి ఇది బయటకు తెలిసిన సంఖ్య. ఇతర మతాలలోని మైనర్‌ ‌బాలికల రక్షణకు పాకిస్తాన్‌లో ఎలాంటి చట్టాలు లేవు. నిజానికి పాకిస్తాన్‌ ‌నుంచి హిందువులు వేలాదిగా తరలి రావడానికి ప్రధాన కారణం వారి బాలికలకు రక్షణ లేకపోవడమే.

  1. తగ్గిపోయిన హిందూ జనాభా

3,000 వేల ఏళ్ల నాటి సింధు నాగరికతకు నిలయాలుగా చెప్పే హరప్పా, మొహెంజదారో ఇప్పుడు పాకిస్తాన్‌గా చెబుతున్న ప్రాంతంలోనే విలసిల్లాయి. కాలక్రమంలో హిందువులను హింసించడం వల్ల ముస్లిం రాజ్యాలుగా మారాయి. 1947లో జరిగిన దేశ విభజన తరువాత హిందువుల జనహననం వేగవంతమైంది. ముస్లింలకో దేశం అన్న ముస్లిం లీగ్‌ ‌పిలుపు తరువాత పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ల నుంచి లక్షలాది మంది హిందువులు ఇవాళ్టి భారతదేశానికి అక్షరాలా ప్రాణాలు అరచేత పెట్టుకుని వచ్చారు. అలా పశ్చిమ పాకిస్తాన్‌లో 1947 నాటికి మిగిలిన 15 శాతం జనాభా 1951 నాటికి 2 శాతానికి పడిపోయింది. 1964లో అక్కడ జరిగిన మత ఘర్షలతో మరికొంతమంది హిందు వులు భారతదేశానికి పారిపోయి వచ్చారు. ప్రస్తుతం పశ్చిమ పాకిస్తాన్‌ (‌బంగ్లా విడిపోగా మిగిలినది)లో మిగిలిన హిందువులు 1.6 శాతం. నేటి పాకిస్తాన్‌ ‌లోని నగరాలన్నీ ఒకప్పుడు హిందూ జనాభాతో నిండి ఉండేవి. ఉదాహరణకు లాహోర్‌. ఇక్కడ 1941నాటి హిందూ/ సిక్కు జనాభా 40 శాతం. ఇప్పుడు అక్కడ ఆ రెండు మతాల వారి జనాభా కేవలం 1 శాతం. ధూపదీప నైవేద్యాలు అందుతున్న ఆలయాలు రెండు.

అలాగే అఫ్ఘానిస్తాన్‌ ‌విషయం. సింధు నాగరికత కాలంలో ఇక్కదంతా హిందువులే. ఇప్పుడు 99.7 శాతం ముస్లింలు. అఫ్ఘాన్‌కు 5వందల ఏళ్ల క్రితం సిక్కులు తరలి వెళ్లడం ఆరంభించారు. అక్కడి జలాలాబాద్‌లో ఉన్న చిస్మా సాహెబ్‌ ‌గురుద్వారా వారికి చాలా పవిత్రం. ఆ గురుద్వారాకు గురు నానక్‌  ‌వెళ్లారు.

సోవియెట్‌-అఫ్ఘాన్‌ ‌యుద్ధం (1979-1989) సమయంలో చాలామంది హిందువులు, సిక్కులు యూరప్‌ ‌తరలిపోయారు. తరువాత అఫ్ఘాన్‌ ‌ముజా హిదీన్ల వశమై ఛాందసవాదంతో నిండిపోయింది. వీళ్ల సృష్టే తాలిబన్‌. అక్కడ 1970 ప్రాంతానికి హిందువులు, సిక్కులు ఏడు లక్షలు ఉండేవారు. 1990 నాటికి అక్కడ మిగిలిన ఆ రెండు మతాల వారు కలపి 15,000 మాత్రమే. మరి ఇప్పుడో కేవలం ఆ రెండు మతాల వారు కలిపి 1350 మంది ఉన్నారు.

  1. మైనారిటీలు ద్వితీయ శ్రేణి పౌరులు

పాకిస్తాన్‌ ‌చట్టాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. దీనితో మైనారిటీలకు అవి రక్షణ కల్పించడంలో విఫలమవుతూ ఉంటాయి. పాక్‌ ‌రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 20-22 అం‌దరి పౌరులకు మత స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. కానీ 1971లో వచ్చిన ముస్లిం చట్టం ప్రకారం ముస్లిమేతరులకు పాకిస్తాన్‌ ‌సమాన హక్కులు ఇవ్వదు. ముస్లింలు మాత్రమే దేశ అధ్యక్షులు కాగలరు. ఉన్నత పదవులలోకి వచ్చిన వారు ఏమతం వారైనా ముస్లిం ప్రార్థన ఆధారంగానే ప్రమాణం చేయాలి. పాకిస్తాన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ (‌సెక్షన్‌లు 295బి, సి, 298 ఎ6 సి) దైవ దూషణ నేరానికి కఠిన శిక్షలు విధిస్తుంది. ముస్లింలలోనే ఒక తెగ కూడా వివక్షను ఎదుర్కొంటున్నది. పాక్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ ‌ప్రకారం వారు కూడా ముస్లింలమని చెప్పుకోవడం నిషిద్ధం. ఇస్లాంలోని ప్రతీకలని, ప్రవచనాలని వారు స్వీకరించ కూడదు. వీటిని ఉల్లంఘిస్తే జైలు శిక్ష నుంచి మరణ దండన దాకా విధించే హక్కు కోర్టులకు ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఒక్క 2019 సంవత్సరంలోనే దైవ దూషణ నేరం కింద 84 మందిని జైళ్లలో పడేశారు. 29 మందికి మరణ దండన విధించారు. కోర్టులు కాకపోతే ప్రజలు కూడా శిక్షలు విధించగలరు. అది కూడా 2019లోనే జరిగింది. ఒక పాఠశాల విద్యార్థి తన ప్రిన్సిపాల్‌ ‌దైవ దూషణకు పాల్పడ్డాడని వచ్చి చెప్పాడు. వెంటనే మూడు హిందూ దేవాలయాలు, కొన్ని దుకాణాలు, కొన్ని పాఠశాలలు వెంటనే దగ్ధమైనాయి. ఘోట్కి అనే పట్టణంలో ఇది జరిగింది.

  1. పాత గుడులు అదృశ్యం, కొత్త వాటిపై దాడి నిత్యకృత్యం. పాత ఆలయాలు మాయమై పోతు న్నాయి. కొత్త వాటికి స్థానమే లేదు. 2020లో ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఒక ఆలయం చుట్టూ కట్టిన గోడను స్థానికులు కూల్చేశారు.
  2. పాకిస్తాన్‌లో జిహాదీలు ఎక్కువ. వీరి తయారీకి బాగా ఉపయోగపడుతున్నవే అక్కడ ప్రస్తుతం ఉన్న 40,000 మదర్సాలు. ఇవి ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ. ఒక పాకిస్తాన్‌ ‌పాఠ్య పుస్తకంలో ఒక హిందువు అంటే అతడు ఎప్పటికీ ఇస్లాంకు శత్రువే అన్న వాక్యం ఉంది. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రధాని పదవి నుంచి కొద్ది వారాలలో దిగిపోతా డనగా ఒక హిందూ ఆలయం కట్టించడానికి ఉద్యుక్తు డయ్యాడు. అప్పుడే టిక్‌టాక్‌ ‌పేరుతో ఒక వీడియో వెలువడింది. ఇస్లామాబాద్‌లో హిందూ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే, తాను ఒక హిందువుని చంపుతానని, అది తన కర్తవ్యమని ఆ వీడియోలో ఒకడు అన్నాడు. ఇంతకీ అతడొక బాలుడు. ముస్లిమేతరులను బెదిరించే ఇలాంటి వీడియో నిత్యం వెలువడతాయి.
  3. ప్రపంచం కొవిడ్‌ 19‌తో పోరాడుతున్న సమయంలోను పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వేతర సంస్థలు హిందువులు, క్రైస్తవులతో వివక్షా పూరిత వైఖరినే అనుసరించాయి. కరాచీలోని పన్నెండు లక్షల మంది దినసరి కూలీలకి సాలనీ ట్రస్ట్ ‌ఫండ్‌ అనే సంస్థ నిత్యావసరాలు సరఫరా చేసింది. వీరంతా ముస్లింలే. అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులకు, క్రైస్తవులకు మొండి చేయి చూపింది. కరాచీలోనే లయారీ అనే చోట హిందువులకు బియ్యం ఇవ్వడం లేదని ఆ సంస్థ బాహాటంగానే ప్రకటించింది. ఆ ప్రాంత హిందూ మహిళ ఒకరు సియాసత్‌ ‌బ్లాగ్‌లో ఈ విషయం వెల్లడించారు.

-(2020 ఒక నివేదిక ఆధారంగా)

About Author

By editor

Twitter
Instagram