– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో పలుకుబడి పెంచుకుంటారు. వాహ నాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.  కళాకారులకు ఊహించని అవకాశాలు. రచయితలు, క్రీడాకారులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. 23,24 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం తగ్గి కొంత గందరగోళానికి గురవుతారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. కళాకారులకు ఒత్తిడులు ఎదురవుతాయి. 22,23 తేదీల్లో శుభ వార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది.. గతంలో చేజారిన డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు. వ్యాపారులు విస్తరణ కార్య క్రమాల పూర్తి చేస్తారు. రాజకీయవేత్తల ప్రయత్నాలు సఫలం. పరిశోధకులు, వైద్యుల ఆశయాలు నెరవేరతాయి. 18,19 తేదీలలో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆత్మీయుల ఆదరణ, సహాయంతో ముందుకు సాగుతారు. అనుకున్న రాబడి సమకూరుతుంది. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. కార్యక్రమాలు కొంత కష్టమైనా సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు సత్తా చాటుకుంటారు. కళాకారులు, పరిశోధకులకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. 23,24 తేదీల్లో బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. సూర్యస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అప్రయత్న కార్యసిద్ధి. ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి సమకూరుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. క్రీడాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.21,22 తేదీల్లో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్తకార్యక్రమాలు చేపడతారు.  ఆస్తులు కొనుగోలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమ ఫలించి విద్యార్థులు ముందుకు సాగుతారు. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.  రచయితలు, క్రీడాకారుల ఆలోచనలు ఫలిస్తాయి. 18,19 తేదీలలో అనుకోని ప్రయాణాలు. వృథా ఖర్చులు. శివస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. కీలక సమావేశాలకు హాజరవుతారు. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులు, రచయితల శ్రమ ఫలిస్తుంది. 19,20 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు, విష్ణుధ్యానం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం మెరుగ్గా ఉండి కొన్ని అప్పులు తీరతాయి.  కార్యక్రమాలలో ఆవాంతరాలు అధిగ మిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలి స్తాయి. ఉద్యోగస్తులకు కీలక సందేశం అందు తుంది.  రచయితలు, క్రీడాకారులకు శుభవర్త మానాలు. 20,21 తేదీల్లో అనారోగ్యం. స్నేహితులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఎంతటి వ్యక్తినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు.  స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. కొన్ని నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. వ్యాపారులు ఒడుదొడుకులను  అధిగిస్తారు.పరిశోధకులు, క్రీడా కారులకు నూతనోత్సాహం. 22,23 తేదీల్లో మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు.  చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు మరింత లాభాలు అందుతాయి. రాజకీయవేత్తలు పదవీయత్నాలు ఫలిస్తాయి.   19,20 తేదీల్లో మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పరిస్థితులు క్రమేపీ చక్కబడతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి.  ఆదాయం కొంత మెరుగుపడే సూచనలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. పారిశ్రామికవేత్తలు సంస్థల విస్తరణలో విజయం పొందుతారు. 18,19 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అనుకున్న కార్యక్రమాలు కొంత నిదానంగా కొనసాగిస్తారు. ఆత్మీయుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు,  తరచూ ప్రయాణాలు సంభవం. ఆదాయ, వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కంపెనీల ఏర్పాటు విజయం. కళాకారులు, వైద్యులకు కొంత అనుకూల స్థితి. 22,23 తేదీల్లో కుటుంబంలో సమస్యలు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
Instagram