– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు  అనుకున్న సమ యానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఊరించే ప్రకటనరావచ్చు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. స్థిరమైన అభిప్రాయాలతో అందర్నీ మెప్పి స్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులు మరింత అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించవచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కీలక సమాచారం అందుతుంది.  11,12 తేదీల్లో బంధు విరోధాలు. ప్రయాణాలు వాయిదా.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఉత్సాహంగా కార్యక్రమాలు సాగుతాయి. సన్నైహితులు, స్నేహితులతో విభేదాలు తొలగి ఊరట చెందుతారు.  ఆప్తుల నుంచి ధన సహాయం పొందు తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. విద్యార్థులు, కళాకారులు లక్ష్యం   సాధిస్తారు. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరిపీల్చుకుంటారు. అపురూపమైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనసౌఖ్యం. వ్యాపారులు లాభాలతో పాటు, పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో మెప్పు. పారిశ్రామికవేత్తలు, కళా కారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. 16,17 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కవచ్చు. గృహనిర్మాణయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తివృద్ధి. దేవాలయాలు సందర్శి స్తారు. శారీరక రుగ్మతలు బాధించవచ్చు. వ్యాపారులు లక్ష్యాల సాధనలో ముందడుగు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. పారిశ్రామికవేత్తల చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం. విద్యార్థులకు అనూహ్యమైన రీతిలో అవ కాశాలు.  11,12 తేదీలలో అనుకోని ఖర్చులు.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రాబడి ఆశాజనకంగా ఉండి రుణ విముక్తులవు తారు. వ్యూహాల అమలులో ఆటంకాలు తొలగు తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. విద్యార్థులకు నూతన అవకాశాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.  ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు  సంతోషకరమైన సమాచారం. . 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో విభేదాలు.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గృహ నిర్మాణాలలో ఆటంకాలు అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు ఆశాజనకంగా ఉండి, మరింత పుంజుకుంటాయి.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు, . 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగు లకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది.  బంధువర్గం నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. భూ, గృహ యోగ సూచనలు. కొత్త పెట్టుబడులు అందుతాయి.  విద్యార్థులకు విదేశీ  విద్యావకాశాలు. 16,17 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిళ్లు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారంతో  ఊరట చెందుతారు. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. దేవా లయాలు సందర్శిస్తారు. వాహనయోగం.  వ్యాపార విస్తరణచేపడతారు.  రాజకీయవేత్తలు, కళా కారులకు సత్కారాలు. 11,12 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కాంట్రాక్టులు సైతం  పొందుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.  వ్యాపారులు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు  ప్రమోషన్లు. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.  చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆత్మీయులనుంచి పిలుపు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారి శ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. కళాకారులకు అవార్డులు దక్కించుకుంటారు. 16,17తేదీల్లో దుబారా వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు తప్పవు. కొన్ని  రుగ్మతలు బాధిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు, తద్వారా  పెట్టుబడు లలో జాప్యం.  పారిశ్రామిక, వైద్య రంగాల వారికి చికాకులు  విద్యార్థులు కొంత నిరాశ. 12,13 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. స్థిరాస్తి వృద్ధి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన కార్య క్రమాలు చేపడతారు. మీపై ఉంచిన బాధ్యతలు కష్ట మైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.  కాంట్రాక్టులు దక్కుతాయి.  దేవాలయ దర్శనాలు. నిరు ద్యోగులకు శుభవార్తలు.  విద్యార్థుల కృషి ఫలిస్తుంది.  వ్యాపా రులు కొద్దిపాటి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో వివాదాలు.

About Author

By editor

Twitter
YOUTUBE